Sunday 30 September 2012

హార్డ్ వేర్ వైఫల్యం in English

translation and definition "హార్డ్ వేర్ వైఫల్యం", Dictionary Telugu-English online

add translationRecord your pronunciation "హార్డ్ వేర్ వైఫల్యం"

Translations into English:

hardware failure

edit
A malfunction of a physical component such as a disk head failure or memory error.

Similar phrases in dictionary Telugu English.

BitLocker డ్రైవ్ ఎన్‌క్రిప్షన్BitLocker Drive Encryption
అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ స్టాండర్డ్Advanced Encryption Standard
ఇంటిగ్రెటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్‌వర్క్Integrated Services Digital Network
ఎలక్ట్రానిక్ వ్యాపార కార్డ్Electronic Business Card
more »

హానికరమైన in English

translation and definition "హానికరమైన", Dictionary Telugu-English online

add translationRecord your pronunciation "హానికరమైన"

Translations into English:

harmful
edit
likely to be damaging

Similar phrases in dictionary Telugu English.

≤ చిహ్నంless than or equal to sign
అంతర్జాతీయ న్యాయస్థానంinternational court of justice
అపరాహ్నంafternoon
అసంతృప్తికరమైనunsatisfactory
more »

హానికర సాఫ్ట్‌వేర్ in English

హానికర సాఫ్ట్‌వేర్ in English

translation and definition "హానికర సాఫ్ట్‌వేర్", Dictionary Telugu-English online

add translationRecord your pronunciation "హానికర సాఫ్ట్‌వేర్"

Translations into English:

malicious software
edit
Software that fulfills the deliberately harmful intent of an attacker when run.

Similar phrases in dictionary Telugu English.

Microsoft సాఫ్ట్ వేర్ లైసెన్స్ షరతులుMicrosoft Software License Terms
Office డేటా అనుసంధాన ఫైల్Office data connection file
Windows నవీకరించు వెబ్ సైట్Windows Update website
Windows రికవరీ ఎన్విరాన్మెంట్Windows Recovery Environment
more »

కొత్త హార్డ్ ‌డిస్క్ కొనడానికి వెళ్తున్నారా?

  కొత్త హార్డ్ ‌డిస్క్ కొనడానికి వెళ్తున్నారా?

మనిషికి గుండె ఎంత ప్రధానమో.. కంప్యూటర్‌కు హార్డ్ డిస్క్ అంతే కీలకం. గుండె ఎంత సామర్థ్యంతో పనిచేస్తే.. అంతబాగా శరీరంలోని రక్తనాళాలన్నింటికీ రక్తం సరఫరా అవుతుంది. అలాగే హార్డ్ డిస్క్ ఎంత సామర్థ్యంతో పనిచేస్తే... కంప్యూటర్ అంత వేగంగా.. మనకు కావలసిన పనులను చక్కబెడుతుంది.

కంప్యూటర్‌‌లో ఇంత కీలక పాత్రను పోషించే హార్డ్ డిస్క్ ఎంచుకనేప్పుడు తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రాసెసర్ ఎంపికతో పాటు కంప్యూటర్‌లో 'రామ్' ఎంత కావాలి ? అలాగే హార్డ్ డిస్క్ ఎంతకావాలి ? అనే అంశాలు కీలకం. ఎందుకంటే.. హార్డ్ డిస్క్ ఎంత డేటా స్టోరేజీని కలిగి ఉండేది అయితే... కంప్యూటర్ అంత సమర్థవంతంగా పనిచేస్తుంది.

పెద్ద పెద్ద ఫైళ్ల స్టోరేజీకి, డేటాబేస్‌లు, సాఫ్ట్‌వేర్‌లు వంటి వాటిని నిర్వహించడంలో సైతం సౌకర్యవంతంగా పనిచేసుకోవాలంటే.. అది హార్డ్ డిస్క్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో.. మెగాబైట్‌ల నుంచి గిగా బైట్‌లకు వచ్చాక.. ప్రాథమిక దశలో మనకు 4జీబీ హార్డ్ డిస్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి.

దాని తర్వాత 8జీబీ, 10జీబీలు వచ్చాయి. కానీ, శరవేగంగా పెరుగుతున్న టెక్నాలజీతో పాటు.. హార్డ్ డిస్క్ సామర్థ్యం కూడా.. ఆ తర్వాత కాలంలో.. 20జీబీ, 40జీబీ, 80జీబీ, 100జీబీ, 160జీబీలు వచ్చాయి. చివరగా నేడు ప్రస్తుతం 250జీబీ హార్డ్‌ డిస్క్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

కానీ, ఎంత డబ్బు వెచ్చిస్తే.. అంత సామర్థ్యం కలిగి హార్డ్‌ డిస్క్‌ను మనం పొందవచ్చు. అయితే.. ఎంత హార్డ్ డిస్క్ మనకు అవసరమవుతుంది? అనేది ఎప్పుడూ మనకు ఎదురయ్యే ప్రశ్న. అదే సమయంలో ఎలాంటి హార్డ్ డిస్క్ మనకు కావాలి? ఎలాంటి అంశాలను చూసి హార్డ్ డిస్క్‌ను కొనుగోలు చేయాలి? అనే విషయాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది.

ఎందుకంటే.. హార్డ్ డిస్క్‌పై విషయావగాహన లేకుంటే.. అంతే సంగతులు. హార్డ్ డిస్క్ కొనాలనుకున్నపుడు.. కొన్ని అంశాలను మనం తప్పకుండా చూడవలసి ఉంటుంది.

1. ముందుగా మార్కెట్లో ఏయే కంపెనీలు.. ఎంత డేటా స్టోరేజీ కలిగిన హార్డ్‌ డిస్క్‌లు.. వీటి ధరలను ముందుగా చూడాలి. దీని తర్వాత..
2. ఇందులో మనకు ఎలాంటి ఇంటర్‌ఫేస్ కావాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలి.
3. మన డేటా స్టోరేజీ అవసరాలు ఎలా ఉన్నాయి. పరిశీలించుకోవాలి.
4. పైన అంశాలతో పాటు డిస్క్ ఆర్‌పీఎం, రైట్ బ్యాక్, బఫర్ సైజు, కెపాసిటీ, సీక్‌టైమ్ వంటి తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
5. చివరగా... హార్డ్ డిస్క్‌కు అవసరమయ్యే విత్యుత్, దాని వారంటీ అనేవి కూడా ప్రధానంగా చూడవలసిన అంశాలు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు.. 'వెబ్‌దునియా ఐటీ' తర్వాతి కథనాల్లో చూడండి.

హార్డ్ డిస్క్ డ్రైవ్ కు లింకున్న పేజీలు

ఇక్కడికి లింకున్న పేజీలు    
వడపోతలు ట్రాన్స్‌క్లూజన్లను దాచు • లింకులను దాచు • దారిమార్పులను దాచు
కింది పేజీలలో ఇక్కడికి లింకులు ఉన్నాయి:
(మునుపటి 50) (తరువాతి 50) (2050100250500) చూపించు. (మునుపటి 50) (తరువాతి 50) (2050100250500) చూపించు.

హార్డ్ డిస్క్ డ్రైవ్


IBMవారు తయారు చేసిన హార్డుడ్రైవుపై తొడుగును తొలగిస్తే లోపట అయస్కాంత రేకులు ఈ విధంగా కనపడతాయి.
హార్డ్ డిస్క్ డ్రైవును (Hard Disk Drive - HDD), సాధారణంగా హార్డుడ్రైవు అనో లేదా హార్డుడిస్కు అనో పిలుస్తూ ఉంటారు. కంప్యూటరులో సమాచారాన్నంతటినీ ఈ హార్డుడిస్కులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో నిక్షిప్తమైన సమాచారం కంప్యూటరుకు విద్యుత్తు సరఫరా నిలిపేసినా చెరిగిపోకుండా ఉంటుంది. హార్డుడిస్కులలో సమాచారాన్ని గుండ్రంగా ఉండే అయస్కాంత రేకులపై భద్రపరుస్తారు. ఈ అయస్కాంత రేకులు వేగంగా తిరగటం వలన అందులో ఉన్న సమాచారాన్ని చదవచ్చు లేదా కొత్త సమాచారాన్ని భద్రపరచవచ్చు. ఒక్కో హార్డు డిస్కు డ్రైవులో ఒకటికంటే ఎక్కువగా అయస్కాంత రేకులు(డిస్కులు) ఉండవచ్చు, అందువలన హార్డుడిస్కులకూ హార్డుడ్రైవులకూ మధ్యన ఉన్న బేధాన్ని గుర్తుంచుకోవాలి. ఒకప్పటి హార్డుడ్రైవులలో ఉండే డిస్కులను మార్చుకోగలిగే సౌకర్యం ఉండేది, ఇప్పుడు వస్తున్న హార్డుడ్రైవులకు అటువంటి సౌకర్యం లేకుండా పూర్తిగా మూసేస్తున్నారు.[1]
హార్డుడ్రైవులను మొదటగా కంప్యూటర్లలో ఉపయోగించటానికి తయారు చేసారు. 21వ శతాబ్దం వచ్చేసరికి హార్డుడ్రైవుల వాడకం కంప్యూటర్లలోనే కాకుండా కెమేరాలలోనూ, వీడియోగేములలోనూ, మొబైలు ఫోనులలోనూ, TVలలోనూ, TiVO వంటి పివిఆర్(PVR)లలోనూ, వీడియో ప్లేయర్లలోనూ(eg: hard disk Players) ఉపయోగించటం మొదలుపెట్టారు. భద్రపరచాల్సిన సమాచారం పెరిగిపోవటం, సమాచారం యొక్క విలువ కూడా పెరుగుతూ ఉండటం వలన హార్డుడ్రైవులను ఉపయోగించి రెయిడ్(RAID), నాస్(NAS), సాన్(SAN) వంటి వ్యవస్తల రూపకల్పనకు బాటలు వేసింది. ఈ వ్యవస్థలలో మామూలు హార్డుడ్రైవులనే సమీష్టిగా ఉపయోగించి ఎంత సమాచారాన్నయినా మరింత మన్నికగా భద్రపరచుకోగలిగే అవకాశం ఉంది.

సాంకేతికాలు

హార్డుడ్రైవు అంతర్భాగాలు
హార్డుడిస్కులలో సమాచారాన్ని భద్రపరచటానికి, అయస్కాంతశక్తి ద్వారా ప్రభావితమైయ్యే ఒక ఇనుప(ferromagnetic) పదార్ధంతో తయారు చేస్తారు. ఈ ఇనుప పదార్ధంపై అయస్కాంత శక్తిని ఒక దిశగా ప్రసరించి ద్వారా దానిని ఆ దిశగా మలచి, 1 లేదా 0గా గుర్తిస్తారు. ఇలా హార్డుడిస్కుపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంఖ్యను భద్రపరచి చివరికి పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేయగలుగుతారు.

వర్గం:కంప్యూటరు హార్డువేర్

ఉపవర్గములు

ఈ వర్గంలో క్రింద చూపిస్తున్న ఒకే ఉపవర్గం ఉంది.

వర్గం "కంప్యూటరు హార్డువేర్" లో వ్యాసాలు

ఈ వర్గంలో ఉన్న మొత్తం 4 పేజీలలో ప్రస్తుతం 4 పేజీలను చూపిస్తున్నాము.

Saturday 29 September 2012

స్మాల్ థింగ్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లు


మెమరీని తరచు క్లీన్ చేయడానికి

మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని Type the location of the item బాక్స్ లో క్రింది కమాండ్ ఉన్నదున్నట్లు టైప్ చేయండి.
%windir%system.32\rundll32.exe advapi32.dll,ProcessIdleTasks ఇప్పుడు Next అని ప్రెస్ చేసి ఆ షార్ట్ కట్ కి Memory Cleaning లేదా మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇకపై సిస్టం స్లో అయిందని భావించినప్పుడల్లా ఈ షార్ట్ కట్ ని ఉపయోగించండి. మెమరీలో మొండిగా కూర్చున్న టాస్క్ లు , త్రేడ్ లు క్లోజ్ చేయబడి మెమరీ ఫ్రీ చేయబడుతుంది.

కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం



మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే ఆప్షన్ ఎంచుకుని Notepad తో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్‍లో 127.0.0.1 local host అనే లైన్ క్రింద.. కొత్తగా 127.0.0.2 అనే అడ్రస్‍ని టైప్ చేసి దాని ఎదురుగా పై చిత్రంలోని విధంగా ఏ సైట్ అయితే ఓపెన్ కాకుండా నిరోధించాలనుకున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేయండి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అలా వేర్వేరు సైట్ల అడ్రస్‍లను టైప్ చేసి ఆ ఫైల్‍ని సేవ్ చేయండి. దీంతో ఇకపై ఆయా వెబ్ సైట్లు ఓపెన్ అవకుండా బ్లాకవుతాయి.

విండోస్ సెటప్ తో పాటే అన్ని ప్రొగ్రాములూ ...


వైరస్ ఇన్ ఫెక్ట్ అయినప్పుడు మనం అందరం వేరే మార్గం లేకపోతే హార్డ్ డిస్క్ ని ఫార్మేట్ చేసి విండోస్‍ని తాజగా ఇన్ స్టాల్ చేస్తుంటాం. విండోస్ ఇన్‍స్టలేషన్ పూర్తయి, మనకు కావలసిన ఫోటోషాప్, ఎం.ఎస్. ఆఫీస్ వంటి అన్ని సాఫ్ట్ వేర్లు, ప్రింటర్, లాన్ కార్డ్ వంటి డివైజ్ డ్రైవర్లు అన్నీ వెదికిపట్టుకుని ఇన్‍స్టాల్ చేసుకునేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. ఈ ఇబ్బందిని Windows Reload అనే సాఫ్ట్ వేర్ సాయంతొ చిటికెలో అధిగమించవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍తోపాటు మీకు రెగ్యూలర్‍గా అవసరపడే ఇతర సాఫ్ట్ వేర్లని , డివైజ్ డ్రైవర్లని ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్ వేర్ సాయంతో ఆయా అంశాలన్నీ ఒకే డిస్క్ లో రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై విండోస్‍ని ఎప్పుడు ఫ్రెష్‍గా ఇన్‍స్టాల్ చేయవలసి వచ్చినా ఆ డిస్క్ ఒకదాన్ని వాడితే విండోస్‍తో పాటు ఆటోమేటిక్‍గా ఇతర సాఫ్ట్ వేర్లూ ఇన్‍స్టాల్ అవుతాయి. గంటల తరబడి అన్నీ వెదికి పట్టుకుని ఇన్‍స్టాల్ చేసుకునే శ్రమ తప్పుతుంది.

Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..


సాంగ్స్, ఫోటోలు, వీడియోలు.. వంటి ఏ కంటెంట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతరుల సిస్టమ్‌లో ఉన్న వారి సిస్టమ్ నుండి నేరుగా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి LimeWire వంటి Peer-to-Peer ప్రోగ్రాములు అవకాశం కల్పిస్తాయి. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మన సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌ని ఇతరులు యాక్సెస్ చెయ్యడానికి అనువుగా స్పెసిఫై చేయాలి. ఇక మనకు కావలసిన Typeని ఎంచుకుని Keyword టైప్ చేసి Search అనే బటన్ క్లిక్ చేసి కుడిచేతి వైపు వెదకబడిన తర్వాత లభించే ఫైళ్ళపై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Download అనే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. అయితే ఇలాంటి సాఫ్ట్ వేర్ల వల్ల అవతలి వ్యక్తుల సిస్టమ్‌లలో ఉన్న ఫైళ్ళతో పాటు వైరస్‌లు కూడా వచ్చేస్తాయి జాగ్రత్త.

సమయం గురించి అన్ని కోణాలలో వివరాలు


ప్రస్తుతం న్యూజెర్సీలో సమయం ఎంత అయిన్దన్నది తెలుసుకోవాలనుకున్తున్నారు, లేదా ఎ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అయినా చూదాలనుకున్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు ? నెట్ లో కుస్తీపడతారు కదూ. ఆయితే టైం కి సంబంధించిన ప్రతీ పనికి వేర్వేరు వెబ్ సైట్లని వెదికి పట్టుకోవలసిన పని లేకుండా నేరుగా టైం తెలుసుకోవచ్చు. ఇందులో టైం జోన్ క్యాలిక్యు లెటర్ , మీటింగ్ ప్లానర్, సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలు ... ఇలా అన్నీ ఒకే చోట లభిస్తాయి. చాలా చక్కని వెబ్ సైట్ ఇది.

వేర్వేరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్లు వాడాలా ??


మీరు IE 5.5,IE6, IE7 వంటి వేర్వేరు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్లలో ఏదో ఒకదానిని మాత్రమే ఒకేసారి ఉపయోగించడానికి వీలుపడుతుంది. ఒకవేళ ఒకే వెబ్‌సైట్‌ని IE3,4.01, 5.01,5.5, 6.0వంటి వేర్వేరు వెర్షన్లలో ఏ విధంగా కనిపిస్తుందో తనిఖీ చేయాలంటే Multiple IE Installer అనే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేయండి. Vista ఆపరేటింగ్ సిస్టం మినహాయించి ఇతర అన్ని వెర్షన్లలో ఇది బాగా పని చేస్తుంది. ఏ వెర్షన్ కావాలో ముందే ఎంపిక చేసుకోవచ్చు.

ఎ కలర్ పేరేమిటో మీకు తెలుసా ?



చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా అనే భారతీయుడు రూపొందించాడు ఈ సదుపాయాన్ని.

ఎ వెబ్ సైట్లో ఎ టెక్నాలజీ వాడబడింది


వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి.

అన్ని రకాల కాలిక్యులేషన్స్ చేయాలంటే


ఒక అంగుళానికి ఎన్ని మిల్లిమీటర్లు, ఎన్ని సెంటిమీటర్లు, ఒక మైలుకి ఎన్ని సెంటిమీటర్లు, అంగుళాలు ఉంటాయి వంటి ధర్మసందేహాలు వస్తే మీ వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే వెంటనే worldwide metric అనే వెబ్ పేజిని ఓపెన్ చేయండి. ఇందులో నిడివి, బరువు, వత్తిడి, పరిమాణం, ఉష్ణోగ్రత వంటి వేర్వేరు అంశాలను వేర్వేరు ప్రమాణాల్లో కొలిచే సదుపాయం లభిస్తోంది. ఏదైనా బాక్శ్ లో మీకు కావలసిన విలువని టైప్ చేసి Calculate అనే బటన్‍ని ప్రెస్ చేసారంటే, వెంటనే ఇతర ప్రమాణాల్లో అది ఎంత విలువ అవుతుందో కనిపిస్తుంది.

గూగుల్లో సురక్షితంగా సెర్చ్ చేయడానికి


గుగుల్ సెర్చ్ ఇంజిన్‍లో మీరు ఏ పదం వెదికినా మీకు తెలియకుండానే మీ IP అడ్రస్, ఏ పదం కోసం వెదికారు, సమయం తదితర వివరాలు గూగుల్ యొక్క డేటాబేస్‍లో భద్రపరచబడతాయి. దీనివల్ల మీ ప్రవసీకి ఇబ్బంది కలగవచ్చు. మీ వివరాలు రికార్డ్ చేయబడకుండా నిరోధించడానికి googlonymous ద్వారా వెదకండి. గూగుల్ లోనే మీ వివరాలేమీ రికార్డ్ అవకుండా ఇది సెర్చ్ చేసి పెడుతుంది.

Dual Core కి Core2Duo కి తేడా ఏమిటి??


చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రెండు సిపియులతో కూడిన ఏ ప్రాసెసర్‍నైనా Dual Core శ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. అంటే Dual Core అనేది ప్రాసెసర్ మోడల్ కాదు. ప్రాసెసర్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అన్నమాట. Pentium D, Core Duo, Core2Duo, Athlon X2 వంటి వివిధ రకాల ప్రాసెసర్లు ఈ డ్యూయల్ కోర్ టెక్నాలజీని అనుసరించి రూపొందించబడుతున్నాయి. వీటిలో Core Duo అనేది మొదటి తరం ప్రాసెసర్ కాగా Core2Duo అనేది దానికన్నా అడ్వాన్స్ డ్‍గా ఉండే రెండవ తరం ప్రాసెసర్. Core Duoలో 2MB Cache మెమరీ ఉంటే Core2Duoలో 4 MB ఉంటుంది. అంతే తప్ప DualCoreకి Core2Duoకి ముడిపెట్టి గందరగోళపడవలసిన అవసరం లేదు. డ్యూయల్ కోర్‍కి చెందినదే Core2Duo మోడల్.

మ్యూజిక్‍కి కంటెంట్ ప్రొటెక్షన్ వద్దనుకుంటే…



WInXP తో పాటు పొందుపరచబడిన విండోస్ మీడియా ప్లేయర్‍లో మ్యూజిక్ సిడిలను కాపీ చేసుకునే సదుపాయం కూడా అందించబడింది. అయితే ఎవరు బడితే వారు ఆ సిడిలోని మ్యూజిక్‍ని కాపీ చేయడానికి వీల్లేకుండా ’లైసెన్సింగ్’సదుపాయం సైతం అందించబడింది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు మీడియాప్లేయర్ Tools మెనూలో ఉండే Copy Music అనే విభాగంలో Copy Settings క్రింద Protect Content అనే బటన్‍ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

Read - only ఫైళ్ళుగా మారితే సేవ్ చేయడం…

హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళని ఎప్పుడైనా నిరభ్యంతరంగా వివిధ అప్లికేషన్ ప్రోగ్రాముల ద్వారా ఓపెన్ చేసుకుని ఎడిట్/సేవ్ చేసుకోవచ్చు. అయితే హార్డ్ డిస్క్ స్పేస్ ని ఆదా చేసుకునే ఉద్దేశ్యంతో డిస్క్ లోని ఫైళ్లని సిడి రైటర్ ద్వారా సిడిల్లోకి రికార్డ్ చేసినప్పుడు ఆ ఫైళ్లని తిరిగి సిడి నుండి సిస్టమ్ లోకి కాపీ చేసుకుని ఎడిట్ చేసి సేవ్ చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు cannot save అని ఎర్రర్ చూపించబడుతుంది. దీనికి కారణం. CD_ROM డిస్క్ అనేది రీడ్ ఓన్లీ మెమరీ మాత్రమే. దానినుండి కాపీ చేశాం కనుకే ఆ ఫైళ్ళని సేవ్ చెయ్యలేము. ఈ నేపధ్యంలో సిడి నుండి హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకున్న వెంటనే ఫైల్‍పై రైట్‍క్లిక్ చేసి Propertiesలో Read-only ఆప్షన్‍ని డిసేబుల్ చేసుకున్న తర్వాతే ఆ ఫైల్‍ని ఎడిట్ చేయండి.

Hibernation అవసరం లేదనుకుంటే..



ప్రస్తుతం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ స్థితిలొ ఉందో ( ఏయే ప్రోగ్రాములు, సర్వీసులు రన్ అవుతున్నాయన్నది) ఆ స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే Hibernation అనే సదుపాయం పెద్దగా ఉపయోగించనివారు దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్‍లో C డ్రైవ్‍లో hiberfil.sys అనే హిడెన్ ఫైల్ గనుక ఉన్నట్లయితే మీ సిస్టమ్‍లో Hibernation ఎనేబుల్ చేసి ఉన్నట్లు భావించాలి. దీన్ని డిసేబుల్ చెయ్యడానికి Control Panel>Performance and Maintainance ఆప్షన్‍ని ఎంచుకుని అందులో Power Options> Hibernate అనే విభాగంలోకి వెళ్ళి Enable hibernation అనే ఆప్శన్ వద్ద ఉన్న టిక్ తీసేయాలి. సహజంగా మన సిస్టమ్‍లో ఎంత RAM ఉందో అంత స్థలాన్ని hibernate ఆక్రమించుకుంటుంది.

ప్రాసెసర్ ఎంత మేరకు వేడెక్కవచ్చు?


కంప్యూటర్‍ని ఆన్ చేసిన వెంటనే Delకీని ప్రెస్ చేసి BIOS లోకి వెళితే అందులో
ప్రస్తుతం ప్రాసెసర్ ఎంత ఉష్ణోగ్రతలో పనిచేస్తోందీ వివరాలు కనిపిస్తుంటాయి.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ప్రాసెసర్లు గరిష్టంగా 75 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ
నిక్షేపంగా పనిచెయ్యగలవు. ప్రాసెసర్ Core లోని Thermal Diode
ఆధారంగా ప్రస్తుతమ్ ఉన్న టెంపరేచర్‍ని BIOS తెలియజేస్తుంటుంది. ఇతర
బెంచ్ మార్కింగ్ సాఫ్ట్ వేర్లు ప్రాసెసర్‍లోని వేరే ప్రదేశం వద్ద టెంపరేచర్ వివరాలకూ,
ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ల వివరాలకూ వృత్యాసం ఉంటుంది. ఏదేమైనా 75 డిగ్రీల
సెంటిగ్రేడ్ దాటినట్లయితే ప్రాసెసర్ కూలింగ్‍పై దృష్టి సారించవలసి ఉంటుంది.

ఫొటోషాప్ క్రాష్ అవుతోందా?


Adobe Photoshop 7, CS2 వంటి వెర్షన్లని ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ముఖ్యంగా ఫైల్ ని సేవ్ చేసేటప్పుడు ఒక్కసారిగా స్ర్కీన్ పై Kernel32 ఎర్రర్ మెసేజ్ చూపించబడి సిస్టమ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నట్లయితే సాధ్యమైనంత వరకూ తక్కువ అప్లికేషన్లు రన్ అవుతుండగా మాత్రమే ఫొటోషాప్ ని ఉపయోగించండి. RAM తక్కువగా ఉండి ఫొటోషాప్ తో పాటు PageMaker, InDesign, Acrobat వంటి ఇతర అడోబ్ ప్రోడక్టులు, MS-Office సాఫ్ట్ వేర్లు సైతం ఓపెన్ చేయబడి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యమైన అప్లికేషన్ ప్రోగ్రాములను మాత్రమే ఉంచుకుని మిగిలిన వాటిని క్లోజ్ చేసి ఫొటోషాప్ పై పనిచేయండి. అలాగే వేర్వేరు వెర్షన్ల ఫొటోషాప్ లను ఒకే సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసి వాడడం (ఉదా.కు.. ఓ వైపు ఫొటోషాప్ 7 ఉండగా, ఫొటోషాప్ CS2 వంటివి వాడడం), మీరు ఇన్ స్టాల్ చేసుకున్న ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ లో ముఖ్యమైన ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, అడోబ్ షేర్డ్ ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, వేర్వేరు అడోబ్ ఉత్పత్తులు కామన్ ఫైళ్లని ఉపయోగించుకోవడంలో ఇబ్బందుల వల్ల కూడా ఇలా ఫొటోషాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కారణం విశ్లేషించి తెలుసుకుని తగిన చర్యలు తీసుకోండి.

లింకులు ఓపెన్ అవకుండా ఖాళీ బాక్స్ వస్తోందా?


ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా వెబ్ పేజీలోని లింక్ ని క్లిక్ చేసిన వెంటనే "ప్రస్తుతం ఉన్న పేజీ నుండి ఆ లింక్ ఉన్న పేజీ ఎలా లోడ్ చేయబడుతోంది" అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా Internet Explorer బ్రౌజర్ లో మనం లింకులను క్లిక్ చేసినప్పుడు ఆ లింకులు ఉన్న వెబ్ సైట్ అడ్రస్ ని టెంపరరీగా మెమరీలో భద్రపరుచుకుని IE విండోలోకి ఆ లింక్ యొక్క పేజీని ఓపెన్ చేయడానికి URLMON.DLL అనే ఫైల్ పనిచేస్తుంటుంది. ఈ ఫైల్ Windows\System ఫోల్డర్ లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ ఫైల్ యొక్క రిఫరెన్స్ గనుక విండోస్ రిజిస్ట్రీలో మిస్ అయినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ లో మనం ఏ లింక్ ని క్లిక్ చేసినా వెంటనే ఖాళీ విండో మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. మీరూ ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే Start>Run కమాండ్ బాక్స్ లో కానీ, DOS విండోలో కమాండ్ ప్రామ్ట్ వద్దకు గానీ వెళ్లి REGSVR32 URLMON.DLL అనే కమాండ్ ని టైప్ చేసి Enter బటన్ ప్రెస్ చేయండి. దీనితో రిజిస్ట్రీలో మిస్ అయిన ఈ ఫైల్ రిఫరెన్స్ మళ్లీ కొత్తగా సృష్టించబడి లింకులు సక్రమంగా పనిచేయనారంభిస్తాయి.

బూటబుల్ సిడిలో ఏమీ కనిపించవు ఎందుకు?

98,Me బూటబుల్ ఫ్లాపీల ఆధారంగా బూటబుల్ సిడిలని క్రియేట్ చేసుకున్నప్పుడు ఫ్లాపీలో కనిపించే FDISK, FORMAT వంటి ప్రోగ్రాములు కూడ CDలో కనిపించవు. కానీ అవి పనిచేస్తుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం... బూటబుల్ ఫ్లాపీ ఆధారంగా సిడి క్రియేట్ చేయబడేటప్పుడు ఫ్లాపీలోని అన్ని ఫైళ్ళూ BOOTIMG.BIN అనే ఫైల్‌లో ప్యాక్ చేయబడతాయి. దీనితోపాటు BOOTCAT>BIN అనే మరో కేటలాగ్ ఫైల్ బూటబుల్ సిడిలో సృష్టించబడుతుంది. సో... బూటింగ్‌కి సంబంధించిన సకల సమాచారం ఈ రెండు ఫైళ్ళలోనే అంతర్గతంగా ఉండడం వల్ల Windows Explorer ద్వారా చూసినప్పుడు Format, Fdisk వంటి ఫైళ్ళు విడిగా కనిపించవు.

XPS ఫార్మేట్ గురించి తెలుసా?


XML Paper Specification అనే ఫార్మేట్ ని క్లుప్తంగా XPS అంటారు. ఇది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి పరిచిన XML ఆధారిత డాక్యుమెంట్ ఫార్మేట్. ఇప్పటివరకూ Enhanced Metafile (EMF)గా వాడుకలో ఉన్న ఫార్మేట్ స్థానంలో ఈ కొత్త ఫార్మేట్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రవేశపెట్టింది. మనం ఫొటోషాప్, వర్డ్, ఎక్సెస్ వంటి వివిధ రకాల ప్రోగ్రాములతో అనేక డాక్యుమెంట్లని డిజైన్ చేస్తుంటాం. అయితే ఆయా ఫైళ్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్ తీయాలన్నా దాని ఒరిజినల్ అప్లికేషన్ కావలసిందే కదా! అయితే XPS ఫార్మేట్ కి చెందిన డాక్యుమెంట్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్ తీయాలన్నా అవి ఏ అప్లికేషన్ తో క్రియేట్ చేయబడ్డాయో ఆ అప్లికేషన్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయనవసరం లేదు. Microsoft XPS Document Writer సాయంతో క్రియేట్ చేసుకున్న XPS డాక్యుమెంట్లని ఏ థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేకుండానే నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. Windows, Mac, Solaris, Unix వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టం ల మధ్య సమాచారాన్ని బదిలీ చేయడానికి ఈ ఫార్మేట్ ఉపయుక్తంగా ఉంటుంది. భవిష్యత్లో విడుదల చేయబడే అన్ని ప్రింటర్లూ XPS ఫార్మేట్ ని సపోర్ట్ చేసేవిగా రూపొందించబడతాయి. Windows Vista ఆపరేటింగ్ సిస్టంలో XPS Viewer ప్రోగ్రాం ఆల్రెడీ పొందుపరచబడి ఉంటుంది. Windows XP, Server 2003 లకు ఇది కావాలంటే http://download.microsoft.com/download/4/d/a/4da3a5fa-ee6a-42b8-8bfa-ea5c4a458a7d/dotnetfx3setup.exe అనే లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కీబోర్డ్ పై టైప్ చేసేవాటిని రికార్డ్ చేసే డివైజ్


Golden Eye వంటి సాఫ్ట్ వేర్ల సహాయంతో మీ కంప్యూటర్ పై ఏమి టైప్ చేస్తున్నారు అన్నది మీ కంప్యూటర్ పై కూర్చున్న వారికి తెలియకుండానే రికార్డ్ చేయవచ్చని మీకు తెలిసే ఉంటుంది. అయితే సిస్టమ్ ని ఫార్మేట్ చేస్తే ఆ సాఫ్ట్ వేర్లు పనిచేయకుండా పోతాయి. అలా కాకుండా పై చిత్రంలో విధంగా నేరుగా మీ PS/2 కీబోర్డ్ పిన్ కే గుచ్చగలిగే కీషార్క్ అనే ఓ డివైజ్ ని ఉపయోగిస్తే కీబోర్డ్ ద్వారా మీరు గానీ, మీ కంప్యూటర్ పై కూర్చున్న ఎవరైనా ఏమి టైప్ చేసినా ఇది తన మెమరీలో రికార్డ్ చేసుకుంటూ వెళుతుంది. ఎప్పుడైనా దానిని తిరిగి చదువుకోవచ్చు. అవసరం లేదనుకుంటే దానిని కేబుల్ నుండి తొలగించి దాచిపెట్టుకోవచ్చు. పై చిత్రంలో నల్ల రంగులో ఉన్న భాగమే ఆ డివైజ్. దీని ధర రూ. 2500/-.

MOBILE INFORMATION & etc.........

ఫోన్ నీళ్ళలొ తడిచిందా. ఇలా చేయండి !..



జేబులో పెట్టుకున్న ఫోన్ క్రిందికి వంగినప్పుడు నీళ్ళలో పడడం వంటి సంఘటనలు అనేకసార్లు
జరుగుతుంటాయి. మీ విషయంలోనూ ఇలా జరిగినట్లయితే వీలైనంత వరకూ ఒక నిముషం
లోపలే వేగంగా బ్యాటరిని తీసేయండి. బ్యాటరీకి తేమ కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే
ప్రమాదం ఉంది ఆ తర్వాత మీ దగ్గరలొ ఉన్న సెల్‍ఫోన్ టెక్నిషియన్ ఎవరైనా ఉన్నట్లయితే
మీ ఫోన్‍ని అతని వద్దకు తీసుకువెళ్ళి దానిని పూర్తిగా డీ అసెంబుల్ చేయించి లోపలి భాగాలు
ఆరేవరకు వేచి ఉండాలి. ఒకవేళ మీరే డీఅసెంబుల్ చేయగలిగిన నైపుణ్యం ఉన్నట్లయితే అలాగే
డీఅసెంబుల్ చేసి 60W లైట్ కాంతి నేరుగా ఆయా అంతర్గత భాగాలపై ప్రసరించేలా కొద్దిసేపు
ఉంచండి. దీంతో చిప్‍ల క్రిందకు చేరిన తేమ ఏదైనా ఉంటే ఆవిరైపోతుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని
భాగలను అసెంబుల్ చేసి బ్యాటరీని యధాస్థానంలో ఉంచేయవచ్చు.


మీ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోవాలంటే..


ఆనందకరమైన సందర్భాలను కెమెరాలో బంధించుకుని విదేశాల్లో
, సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులతో షేర్ చేసుకోవాలనిపించడం సహజం. దీనికి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదు. ముందు మీ డిజిటల్ కెమెరాని మీ పిసికి కనెక్ట్ చేసి మీ కెమెరాలోని ఫోటోలన్నింటిని పిసిలోకి బదిలీ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్‍కి అప్‍లోడ్ చేయడం చాలా సులభం. ఇంటర్నెట్‍లో అనేక ఫోటోషేరింగ్ వెబ్‍సైట్లు లభిస్తున్నాయి. flickr అనే సైట్‍ని ఓపెన్ చేయండి. అందులోకి ప్రవేశించగానే Create your account అనే బటన్ ఉంటుంది . దాన్ని క్లిక్ చేయండి. ఈ వ్యాసం మొదట్లొ చెప్పిన ప్రకారం మీరు ఇప్పటికే యాహూ మెయిల్ అకౌంట్‍ని క్రియేట్ చేసుకున్నారు కదా ! ఆ యాహూ అకౌంట్‍తొ నేరుగా Flickr లో ఉచిత అకౌంట్ సృష్టించుకోవచ్చు. తర్వాత మీ కంఫ్యూటర్లో ఉన్న ఫోటోలను ఆ సైట్‍లోకి అప్‍లోడ్ చేసుకుని Send an invite to Flickr అనే బటన్‍ని ఉపయోగించి మీ ఆత్మీయులకు వారి మెయిల్ అడ్రస్‍కి ఇన్విటేషన్ పంపించవచ్చు. వారు మీ ఫోటోలను Flickr లోకి వచ్చి చూడగలుగుతారు. Flickr మాదిరిగానే Photobucket, Zommr, Phanfare, Snapfish, Webshots, Smugmug, Woophy వంటి అనేక ఫోటొ షేరింగ్ సర్వీసులు లభిస్తున్నాయి.


ఒక ఫార్మేట్‍ నుండి మరో ఫార్మేట్‍కి చాలా ఈజీ



VOB ఫైళ్లని 3GP ఫైళ్లుగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ సాఫ్ట్ వేర్ వాడాలి, MOV to AVI కన్వర్షన్‍కి ఏమి వాడాలి అంటూ అందరికీ సందేహాలు వస్తుంటాయి. మీరు కన్వర్ట్ చేసుకోవలసిన ప్రతీదానికి వేర్వేరు సాఫ్ట్ వేర్లని ఇన్‍స్టాల్ చేసుకోవలసిన అవసరం లేకుండా zamzar అనే వెబ్‍సైట్‍లో మీరు ఒక ఫార్మేట్ నుండు మరో ఫార్మేట్‍కి మీ ఫైళ్ళు ఉచితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఫైళ్ళని అప్‍లోడ్ చేయాలి. అవి కన్వర్ట్ చేయబడి మన e-మెయిల్ అడ్రస్‍కి పంపబడతాయి. అయితే 100MB ఫైల్ సైజ్ దాటకూడదు. అదే ప్రీమియమ్ యూజర్లు 1GB సైజ్ గల ఫైళ్లని సైతం కన్వర్ట్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. ఓసారి మీరూ ప్రయత్నించండి.



పిసి నుండే ఫోన్‍ని నియంత్రించడానికి..


Nokia సంస్థ ఇటీవల Nokia PC Phone అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.Symbian S60 శ్రేణికి చెందిన Nokia ఫోన్ మీవద్ద ఉన్నట్లయితే దాన్ని USB డేటా కేబుల్ ద్వారా గానీ, బ్లూటూత్ ద్వారా గానీ పిసికి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు.. Internet Explorer, FireFox వంటి బ్రౌజర్ ద్వారా ఆ ఫోన్‌ని నియంత్రించుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ని FireFox 2.x లేదా IE 7.x బ్రౌజర్ల యొక్క బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్‌ని మీ పిసికి కనెక్ట్ చేసిన వెంటనే మీ ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఈ సాఫ్ట్‌వేర్ పిసిలోకి స్వీకరించడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఇప్పటివరకు స్టోర్ చెయ్యబడి ఉన్న SMSలు, Call list లో వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలు సైతం పిసిలోకి స్వీకరించబడతాయి. అలాగే SMS మేసేజ్‌లను పంపించదలుచుకున్నప్పుడు ఫోన్ యొక్క చిన్న కీ ప్యాడ్ ద్వారా ఇబ్బందులు పడే బదులు, నేరుగా పిసి యొక్క కీబోర్డ్ నుండే టైప్ చేసి మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అలాగే నేరుగా మీ పిసినుండే ఫోన్ కాల్స్‌ని చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్ లిస్టులొ కొత్త మెంబర్లని జతచేయాలంటే నేరుగా పిసి నుండే సులభంగా జత చేయవచ్చు. మీ ఫోన్‌కి వచ్చిన కాల్స్‌ని, పిసి నుండే లిఫ్ట్ చేయవచ్చు. కట్ చేయనూవచ్చు.




MP 3 పాటలన్నింటి జాబితాను పొందడానికి


మీ హార్డ్ డిస్క్ లో వేర్వేరు సినిమాలకు సంబంధించి వందలకొద్దీ MP3 పాటలు ఉన్నాయనుకోండి. వాటన్నింటి పేర్లతో జాబితా కావాలంటే ప్రతీ సాంగ్ టైటిల్ ని కష్టపడి మళ్ళీ టైప్ చేసుకునే అవసరం లేకుండా MP3 ListMaker అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించండి. ఇది మనం ఎంచుకున్న డ్రైవ్ ని తనిఖీ చేసి వెదికి పట్టుకున్న MP3 ఫైళ్ళని టెక్స్ట్ ఫైలుగా, లేదంటే వెబ్ పేజీగా రూపొందిస్తుంది. ఒకవేళ ఆ వెబ్ పేజీలో రిజినల్ ఫైలు లొకేషన్ కి లింకులు సైతం పొందుపరచ బడాలన్నా వీలవుతుంది. లేదా వెదికి పట్టుకున్న ఫైళ్ళతో Play List నీ క్రియేట్ చేసుకోవచ్చు.

నోకియాని మింగేస్తున్న NOKIA


ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ Nokia ఫోన్లకు ఇప్పుడు Nokla పేరిట చైనాలో తయారవుతున్న నకిలీ ఫోన్లు వచ్చేసాయి. అచ్చం ఒరిజినల్ మోడళ్ళని తలపించే మాదిరిగానే ఉండే ఈ Nokla ఫోన్లలో నిశితంగా పరిశీలించి చూస్తే కొద్దిపాటి వృత్యాసాలు కనిపిస్తాయి. ఉదా.కు.. Nokia N 95 ఒరిజినల్ ఫోన్‌లో Menu/Multimedia Keys ఉండే ప్రదేశంలో నకిలీ ఫోన్‌లో ఒకవైపు Play బటన్, మరోవైపు Stop బటన్ ఉంటాయి. అలాగే ఒరిజినల్ నోకియా ఫోన్లు 5 megapixel కెమెరాని కలిగి ఉంటుంటే, నకిలీ ఫోన్ 2megapixel కెమెరాని కలిగి ఉంటున్నాయి.ఇలా తెలియకుండా అనేక వృత్యాసాలు ఉన్నాయి. అయితే ఒరిజినల్ N95 ధర 40 వేలవరకు ఉంటే Nokla N95 మాత్రం కేవలం రూ.7,500లకే లభిస్తుంది. ఎంత చవకో చూడండి. దాదాపు అన్ని నోకియా మోడళ్ళకు అతి తక్కువ ధర కలిగిన నకిలీలు లభిస్తున్నాయి.