Thursday 11 October 2012

అమ్మ, నాన్న – మమ్మీ, డాడి


ముంగిలి > జిడ్డు ప్రశ్నలు, పిచ్చాపాటి > అమ్మ, నాన్న – మమ్మీ, డాడి

అమ్మ, నాన్న – మమ్మీ, డాడి



సున్నితమైన విషయం. నిజానికి ఓ ప్రశ్న. సాధారణంగా పిల్లలు, ఈ కాలం పెద్దలు కూడా, తమ తల్లి తండ్రుల్ని ‘మమ్మీ’, ‘డాడీ’ అని సంభోదిస్తుంటారు. సంబోధన ఏదైనా, అనుబంధం ముఖ్యం; కాదనను. నా ప్రశ్నల్లా తల్లి తండ్రులు అమ్మా-నాన్న అనే పిలుపులకు బదులుగా, ‘మమ్మీ-డాడీ’ అనే సంబోధననే ఎందుకు ఇష్టపడుతుంటారు? చాలా అరుదుగా మాత్రమే, ‘అమ్మా-నాన్న’ అనే పిలుపు వినిపిస్తుంటుంది. వీటిలో ‘నాన్న’ అనే సంబోధన మరీ తక్కువ. ఎందుకలా?
ఈ ప్రశ్న సమాధానం భాషలతో ముడి పడి ఉందా? తెలుగు అంటే అయిష్టం అనే కన్నా ఆంగ్లభాషలో పట్టు సంపాదించాలనే తపన దీనికి కారణమా?
అతిసాధారణ విషయం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టిచ్చుకోరుగానీ, నిజానికి అత్యధికశాతం పిల్లలు రెంటినీ తప్పుగా ఉచ్ఛరిస్తుంటారు. ఠక్కున చెప్పండి తల్లిని ‘మమ్మీ’ అని పిలిచే ఆంగ్ల పద స్పెల్లింగ్ ఏంటో? ఒక్కసారిగా అడిగితే ఎక్కువ శాతం ”Mummy” అని చెప్పారు. ఉచ్ఛారణకూడా అలాగే ఉంటుంది. 
సరైన స్పెల్లింగ్  “Mommy”. మరి ఉచ్ఛారణో?
ఇక ‘డాడి’ విషయానికి వస్తే అది ‘డాడీ’ అంటున్నారో లేక ‘దాడీ’ అంటున్నారో లేక రెంటికి మధ్యలోలానా అన్నట్టు ఉంటుంది పిలుపు. కాదు?
అనుబంధాలు, ఆప్యాయతల విషయాలు స్పెల్లింగులు-భాషలతో పెద్దగా సంబంధం లేనివి. ఎలా పిలిచినా ఓ బిడ్డడి పిలుపు ఆ తల్లికే తెలుసు; తన కూతురి పిలుపులోని మాధుర్యం ఆ తండ్రే ఆస్వాదించగలడు.   కానీ, మన మాతృభాషని ఓ మాతృస్వరూపంగా భావిస్తే, పాపం తనకు కూడా తన శైలిలో తన పిల్లలు సంబోధిస్తే బాగుటుందనిపిస్తుందేమో? ఏఁవంటారు?


అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!

 
 
 
 
 
 
Rate This

అమ్మ నాన్న నేర్పిన నీతులు పాటించేనా….బ్రతికేనా??!!

అమ్మ నాన్న నేర్పిన నీతులు,
నేటి కాలంలో నడుచుకుంటే బ్రతకగలమా?

అబద్ధమాడరాదని ఊహతెలిసిన నాటి నుంచీ అమ్మ నేర్పిందే,
అన్నీ నిజాలు చెపుతుంటే చిక్కుల్లో చిక్కుకుంటున్నానే?!!

ఎవరికీ అన్యాయం చెయ్యరాదని నాన్న నేర్పించారే,
న్యాయం న్యాయం అంటుంటే నేను అన్యాయం అయిపోతున్నానే?!!

ఎవరికీ అపకారం తలపెట్టకూడదని అమ్మ చెప్పిందే,
అందరికీ ఉపకారం చేస్తుంటే నన్నొక వెర్రివాడిలా చూస్తుందే ఈ లోకం?!!

నలుగురికీ చేతనైన సాయం చెయ్యి అని నాన్న చెప్పారే,
సాయం చేస్తుంటే నలుగురి సహకారం నాకు లేదే?!!

నీ సంపాదనలో కొంత దానం చెయ్యి  అని అమ్మ చెప్పిందే,
దానం అపాత్రదానంగా అయిపోతుందే ?!!

శుమతీ శతకాలు, వేమన పద్యాలు వల్లె వేయిస్తూ పెంచారే నన్ను,
మరి నేటి సమాజంలో ఎలా బతకాలో నేర్పించలేదే??
ఈ లోకంలో మనగలిగే  లౌక్యం నేర్పలేదే??
మనిషి రక్తంలో జీర్నించుకుపోవల్సిన విలవలు,
సందర్భానుసారం, కాలానుసారం మారిపోతాయని నేర్పలేదే??
ఈ జీవన మార్గాన్ని  అంగీకరించలేను, సర్దుకుపోలేను
సతమతమైపోతున్నాను…….







No comments:

Post a Comment