Thursday, 11 October 2012

జీవితం అంటే ఏమిటి ?

జీవితం అంటే ఏమిటి ?

మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు మధ్యలో సాగించే ప్రయాణమే జీవితం
 


ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రధానమైనది తమయొక్క జీవితం. జీవితంలో అన్ని సవ్యంగా సాగాలనే అనుకుంటారు. మరి ఎందుకు సాగడంలేదు? జీవితంలో అందరూ గొప్పవారు కావాలనుకుంటారు. కొందరే ఎందుకు గొప్పవారు అవుతారు? కారణమేమిటి? జీవితంలో అన్నీ కచ్చితమైన ప్రణాలికలు వేసుకొని చేస్తారు. కాని మొత్తం జీవితం గురించి ప్రణాళిక వేసుకోన్నారా?
ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ దుఖాలు, గెలుపు ఓటములు, లాభనష్టాలు ఇమిడివుంటాయి. ప్రతి ఒక్కరి జీవితం ఎవరికి వారిది ప్రత్యేకమైనదే, ప్రతి పరిస్థితి ప్రత్యేకమైనదే కాబట్టి అన్ని వేళలలో అన్నింటికీ సిద్దంగాఉండాలి.
 


" జీవితం ఒక ఆట – ఆడి గెలువు
జీవితం ఒక ప్రయాణం – కొనసాగించు
జీవితం ఒక యుద్ధం – పోరాడి గెలువు
జీవితం ఒక బహుమానం – స్వీకరించు
జీవితం ఒక రహస్యం – పరిశోధించు
జీవితం ఒక నాటకం – నీ పాత్రను ప్రదర్శించు
జీవితం ఒక చాలెంజ్ – ధైర్యంగా ఎదుర్కో
”జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది”
వెనకడుగు వేయకు – ముందడుగేసి ఆగకు  "

Tuesday, 9 October 2012


బెల్లం - Anakapalli Famous of Andhra Pradesh

 
బెల్లం (Jaggery)  ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు.

బాగ పక్కానికి వచ్చిన చెరుకును నరికి గానుగ వద్దకు చేరుస్తారు: చెరకు పైనున్న ఆకులను తీసేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు.
చెరకు రసం తీయడానికి గానుగ యంత్రంలో చెరుకులను పెట్టే దృశ్యం






                                              ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. ఈ చెరకు పాలు కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అనగా పొంగు రావడానికి తొలి దశ అన్నమాట. అలా రెండో దశ చీమల పొంగు, ఇది పెనంలో సుమారు రెండడుగుల ఎత్తు వస్తుంది. ఆ తర్వాతది పెద్ద పొంగు. ఇది చీమల పొంగు కన్నా ఎత్తుగా వస్తుంది. అది రాను రాను తగ్గుతూ సుమారు ఆరు అంగుళాల లోతులో వుంటుండి. దాన్నే పాకం అంటారు.అప్పుడు దీనిని గోర (తెడ్డు లాంటిది) కలుపుతారు. అదను చూసి పెనాన్ని పొయ్యి మీదనుండి పైకి లేపి ప్రక్కనే భూమిలో పాతిన ఒక ఇనుప అరేకుల దోనె మీద పోస్తారు. పోసిన తర్వాత దాన్ని తిరిగి గోరతో బాగ కలుపుతారు. ఆ పాకం మెల్ల మెల్ల గా గట్టి పడుతుంది. అది పూర్తిగా గట్టి పడక ముందే దోకుడు పార తో తిరగేసి వేడిగ వున్నప్పుడే దాన్ని ముద్దలుగా చేసి పక్కన ఆర బెడతారు. ఆ విధంగా బెల్లం తయారు అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ బెల్లాన్ని పొడిగా చేసి గోతాలలో నింపడం, లేదా అచ్చుల్లో పోసి ఆర బెట్టడమో చేస్తారు. చెరుకు గానుగ సమయంలో తయారు చేసె ఇతర పదార్థాలు చెక్కల బెల్లం దీని తయారికి తక్కువ లోతు గల పళ్లాలను తీసుకొని, దాని అడుగున నెయ్యి పోసి, అందులొ బెల్లం పాకం పోసి దానితో పాటు వేరుశనగ పప్పులు, పుట్నాల పప్పులు, మిరియాల పొడి వేసి బాగ కలియ బెట్టి పూర్తిగా గట్టి పడక ముందె దాన్ని బిళ్లలుగా కోసి బాగ గట్టి పడిన తర్వాత బద్ర పరుచు కుంటారు. వరంటు బెల్లం దీని తయారికి బెల్లం పాకం పెనంలో నుండి దోనిలో పోసె టప్పుడు పెనంలోనె కొంత పాకాన్ని అలాగె వుంచి దాన్ని బాగా అదే పనిగా చాల సేపు రుద్దితే అది కొంత తెల్లబడు తుంది. దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆర బెట్టి ఇంటి కొరకు దాచి పెట్టు కుంటారు.
బెల్లం పాకం.
పక్వానికొచ్చిన చెరుకు తోట. కొట్టిన చెరుకును ఎద్దులతో రవాణాకు సిద్దం:,


 

ఉపయోగాలు, విశేషాలు

    పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.
    భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.
    ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.
    గానుగను శుబ్రంగా కడిగి చెరుకులతోబాడు మిరపకాయలు, అల్లం, నిమ్మకాయలు పెట్టి ఆ వచ్చిన రసాన్ని వచ్చిన వారికి ఇస్తారు. కాని రైతులు ఎక్కువగా తాగరు. అది అనారోగ్య కారకమని వారి నమ్మకం: వంకాయలను, మామిడి కాయలకు గాట్లు పెట్టి పెనంలో వేలాడ దీస్టే అవి చెరుకు పాల పొంగులో బాగ ఉడికి తినడానికి బలే రుచిగా వుంటాయి.
    నక్కిళ్లు పాకాన్ని దోనిలో పోసె టప్పుడు కొంత పాకాన్ని నీళ్లున్న గిన్నెలో పోస్తే అది చల్లబడి సాగుతూ తినడానికి అదొక రుచిగా వుంటుంది. చిన్న పిల్లలు దీన్ని బాగ తింటారు.
    కండ చెక్కెర పఖ్వానికి రాని పాకాన్ని కొత్త కుండలో సగానికి నింపి,కుండ మూతికి గుడ్డ కట్టి దాన్ని ఇంటిలో వుట్టి లో పెడితే సుమారు మూడు నెలల తర్వాత ఆ పాకం పై భాగాన సుమారు రెండంగుళాల మందంతో గట్టి పడి వుంటుండి. ఇది బజారులో దొరికే కలకండ లాగానె వుంటుంది కాని రంగు తక్కువ. ఇది తినడానికి బాగ వుంటుంది. మిగిలిన పాకం చాల చిక్కబడి తేనె లాగ వుంటుంది. ఇది కూడ తినడానికి చాల బాగ వుంటుంది.

Monday, 1 October 2012

పిసి చిట్కాలు, వీడియోలు, సాఫ్ట్ వేర్లు


వీడియో లింక్ ఇది: http://bit.ly/sriscreenplay
కాస్తో, కూస్తో క్రియేటివిటీ ఉన్న వాళ్లంతా కెమెరా పట్టుకుని షార్ట్ ఫిల్మ్‌లు, సినిమాలు తీసేస్తున్నారు.
డైరెక్షన్ అనేది మంచి స్టోరీ, దాన్ని ఎలా విజువలైజ్ చేయాలన్న ఐడియా ఉన్నంత మాత్రాన వచ్చే కళ కాదు.
చాలా వర్క్ చేయాలి.. సినిమాలోని సీన్లన్నీ రాసుకోవాలి, ఏ సీన్‌లో హీరోహీరోయిన్, ఇతర పాత్రలు ఏవుంటాయో రాసుకోవాలి, ప్రతీ క్యారెక్టర్ లక్షణాల్నీ సినిమా మొత్తం ఒకేలా మెయింటైన్ చేయాలి.. షూటింగ్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకూ ఉంటుంది అన్నదీ, కాల్షీట్లూ గట్రా మేనేజ్ చేసుకోవాలి.
ఇంత కష్టమైన వ్యవహారం మొత్తాన్నీ చాలా సింపుల్‌గా మీ కంప్యూటర్లోనే డాక్యుమెంటేషన్ చేసిపెట్టుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను.
డైరెక్షన్ చేస్తున్న/ చేయబోయే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/sriscreenplay
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

ఫొటోలు ఏ అవసరానికి తగ్గట్లు అలా (ఫొటోషాప్ డిజిటల్ క్లాస్ రూమ్)

ఫొటోషాప్ మొదటి లెసన్ ఇక్కడ చూసేయండి.. http://bit.ly/photoshopclass1
ఫొటోషాప్‌లో మీకు నచ్చినట్లు ఫొటోల్ని ఎడిట్ చేయడం అస్సలు కష్టమైన పని కాదు. దీని కోసం ఎక్కడా ట్రైనింగ్ తీసుకోవలసిన పనిలేదు.
ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ లేని వారికి కూడా ఫొటోషాప్ వాడడం చాలా సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ లెసన్స్ అందిస్తున్నాను. సో మీరు ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవలసిన పనిలేకుండానే ఈ సిరీస్‌లో నేను అందించే వీడియోల్ని మిస్ అవకుండా చూడడం ద్వారా ఈజీగా ఫొటోషాప్ నేర్చుకోవచ్చు.
ఫొటోషాప్ మొదటి లెసన్ ఇక్కడ చూసేయండి.. http://bit.ly/photoshopclass1

ఇక పెన్ డ్రైవ్ లంటే భయం ఉండదు :)

పెన్ డ్రైవ్‌లు వాడాలంటేనే భయపడుతుంటారు దాదాపు అందరూ!
వీడియో లింక్ ఇది: http://bit.ly/srivirusfree
ఎన్ని రకాల వైరస్‌లో Folder Options పనిచేయనీయవు, Task Manager పనిచేయదు.. చాలా సమస్యలు వచ్చేస్తుంటాయి.
ఫ్రెండ్స్ పిసి నుండి సినిమాలూ etc కాపీ చేసుకొచ్చినా, బయట నెట్ సెంటర్‌లో పెన్ డ్రైవ్ వాడేసి వచ్చినా వెంటబడి వచ్చే వైరస్‌ల ద్వారా వచ్చే అనేక సమస్యల్ని ఎంత సులువుగా సాల్వ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు.
గమనిక: పెన్‌డ్రైవ్‌లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయడం ద్వారా వారూ సమస్యల బారిన పడకుండా కాపాడండి.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srivirusfree
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

విండోస్ 8 క్లాస్‌రూమ్ 3rd Lesson – మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయో తెలుసా?


ఈ తాజా Part 3 వీడియోని ఇక్కడ చూడవచ్చు:  http://bit.ly/sriwin8class3
రోజూ మనం వాడే MS Word వంటి అప్లికేషన్లకీ, Windows 8లోని Modern Appsకీ తేడా ఏమిటి, Modern అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి, వాటిని వాడేటప్పుడు ఎలాంటి ఆప్షన్లు లభిస్తాయి, అస్సలు ఈ కొత్త కాన్సెప్ట్ వెనుక వాడబడుతున్న టెక్నాలజీ ఏమిటి వంటి విషయాలు తెలుసుకోకుండా Windows 8ని గుడ్డిగా వాడేయడం సబబేనా :)
అందుకే ఈ వీడియోలో విండోస్ 8 మోడ్రన్ అప్లికేషన్లని ఎలా వాడాలి అన్న విషయం మొదలుకుని అనేక ఆసక్తికరమైన విషయాల్ని చర్చించడం జరిగింది.
ఈ వీడియో మీరు చూడడానికి పట్టే టైమ్: 4.44 సెకండ్లు
Windows 8 Classroom Part 1 Here: http://bit.ly/sriwin8class1
Windows 8 Classroom Part 2 Here: http://bit.ly/sriwin8class2
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, విండోస్ 8లలో ఇంకా వేసుకోలేకపోతున్నారా? :)


వీడియో లింక్ ఇది: http://bit.ly/srianu7
టివిలు, ప్రింట్, మీడియా రంగాల్లోని వారూ అనూని Windows 7లో వాడలేకపోతున్నామని టెక్నికల్‌గా వెనుకబడి గడిపేస్తున్నారు.
అలాగే “కంప్యూటర్ ఎరా” రీడర్స్‌ నుండి నాకు తరచూ వచ్చే కంప్లయింట్ కూడా ఇదే.2009 నుండి Windows 7లో నేను అనూలోనే మన మేగజైన్ ప్రిపేర్ చేస్తున్నాను.
ఇన్‌స్టాల్ చేయాల్సిన పద్ధతిలో చేస్తే ఎందుకు పనిచేయదు? సొల్యూషన్లు తెలుసుకోకుండా పాతకాలం Windows XPతోనే ఆగిపోవడం టెక్నికల్‌గా వెనుకబాటుతనం కదా :)
అందరికీ ఎదురవుతున్న ఈ సమస్యని దృష్టిలో ఉంచుకుని అటూ Windows 7లోనూ, ఇటు తాజాగా విడుదలైన Windows 8లోనూ “అనూ 7″ తెలుగు ఫాంట్లు ఇన్‌స్టాల్ చేయడం ఎలాగో ఈ వీడియోలో వివరంగా చూపించాను.
కొన్ని వేల మంది తెలుగు వాళ్లకు చాలా చాలా అవసరం అయిన, ఉపయోగపడే వీడియో ఇది. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో నిజంగా అవసరం అయిన వారికి ఉపయోగపడే ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేసుకోగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
వీడియో లింక్ ఇది: http://bit.ly/srianu7

విండోస్ 8 క్లాస్‌రూమ్ 2nd Lesson – ప్రోగ్రాముల్ని ఎలా వెదికి పట్టుకోవాలి?

2వ లెసన్ వీడియో లింక్ ఇది: http://bit.ly/sriwin8class2
విండోస్ 8లో Modern UI గురించి 1st లెసన్‌లో ఇక్కడ ( http://bit.ly/sriwin8class1 ) తెలుసుకున్నాం కదా.
మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయి ఉన్న ప్రోగ్రాముల్ని అందులో వెదికి పట్టుకోవడం ఆ tilesలో సులభమే.
అయితే Desktop ఇంటర్‌ఫేస్ గనుక మీరు వాడుతుంటే మీరు రెగ్యులర్‌గా వాడే ప్రోగ్రాముల్ని వెదికి పట్టుకోవడం మొదట్లో కొద్దిగా కష్టమన్పిస్తుంది.
మీరూ ఈ ఇబ్బందిని ఫేస్ చేస్తుంటే ఈ 2వ లెసన్‌ని తప్పక చూడాల్సిందే. మన కంప్యూటర్లో అందుబాటులో ఉన్న ప్రోగ్రాములు, వివిధ సెట్టింగులు, ఫైళ్లని వెదికి పట్టుకోవడం ఎలాగో ఈ లెసన్ లో చూపించడం జరిగింది.
దీనికోసం మీరు వెచ్చించవలసిన మీ విలువైన సమయం: 2 నిముషాల్లోపు!
Next లెసన్స్ కోసం stay tuned..
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

పెన్‌డ్రైన్‌ని మళ్లీ ఎందుకు గుచ్చాలి?



వీడియో లింక్: http://bit.ly/sriusbfact
Safely Remove Hardware ఆప్షన్ క్లిక్ చేశాక కూడా వాస్తవానికి పెన్‌డ్రైవ్ మన పిసి యొక్క USB పోర్టుకి గుచ్చే ఉంటుంది కదా! కానీ తిరిగి దాన్ని యూసేజ్‌లోకి తీసుకు రావాలంటే ఎందుకు దాన్ని పీకి మళ్లీ గుచ్చాలి? దాన్ని అలాగే యూసేజ్‌లోకి తీసుకురాలేమా? ఈ వీడియో చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
వీడియో లింక్: http://bit.ly/sriusbfact

అటాచ్‌మెంట్లు అటు నుండి అటే (వీడియో డెమో)


వీడియో లింక్ ఇది: http://bit.ly/sritips1
మీ ఫ్రెండ్స్ పంపిన మెయిల్స్ లో ముఖ్యమైన ఫైళ్లు attach చెయ్యబడి ఉన్నాయనుకుందాం.
వాటిని కంప్యూటర్లోకి డౌన్ లోడ్ చేసుకోవడమే కాకుండా ఇంటర్నెట్‌లోనూ Google Drive, Dropbox, SkyDrive, Box.net వంటి సర్వీసుల్లోకి ఎంత ఈజీగా అప్‌లోడ్ చేసుకోవచ్చో.. తద్వారా మీ ఫైళ్లని సేఫ్‌గా ఎలా ఉంచుకోవచ్చో ఈ వీడియోలో చూడొచ్చు.
అలాగే ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్న మీ ఫైళ్లని నేరుగా attachmentsగా సేవ్ చేసుకోవడం కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు.
ముఖ్యమైన డేటాని సేఫ్‌గా ఉంచే ఈ టెక్నిక్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
థాంక్యూ
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
వీడియో లింక్ ఇది: http://bit.ly/sritips1

టివి ట్యూనర్ కార్డ్ ని ఎంచుకోవడం ఎలా?



http://goo.gl/kOzx8
చాలామంది పిసి యూజర్లు ఎక్స్ టర్నల్ టివి ట్యూనర్ కార్డులతో టివి ప్రోగ్రాములను రికార్డ్ చేసుకోలేమని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెండు టివి ట్యూనర్ కార్డులను చూడండి. వీటి సహాయంతో వివిధ ఛానెళ్లలో వచ్చే టివి ప్రసారాలను ఎంచక్కా రికార్డ్ చేసుకోచవచ్చు. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
http://goo.gl/kOzx8

మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా.. కారణాలు ఇవి (వీడియో డెమో)

ముఖ్యమైన ఫైల్ కరప్ట్ అయిందా? కారణాలు ఇవి.. Must Watchఆ ఒక్క ఫైల్ లో మీ జీవితం ముడిపడి ఉందనుకుందాం.. లేదా ఎన్నో గంటలు కష్టపడి ఆ ఫైల్ ని తయారు చేసుకున్నారనుకుందాం.
ఓ ఫైన్ మార్నింగ్ అవసరం పడి ఆ ఫైల్ ని ఓపెన్ చేయబోతే File Corrupted.. మాదిరి మెసేజ్ వస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పటివరకూ మీకు ఇలాంటి సమస్యలేమీ రాకపోయినా మున్ముందు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోతే ఫైళ్లు కరప్ట్ అవడం చాలా మామూలు విషయం.
అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే Share ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ కీ ఈ updateని షేర్ చేయండి.. నాలెడ్జ్ ఎంత షేర్ చేసుకుంటే అంత పెరుగుతుంది.
http://computerera.co.in/link/filecorruption

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ


       శ్రీధర్ ని కాన్ఫరెన్స్ రూం లో కి పిలిచి ఆశ్చర్యం గా అడిగాడు వాళ్ళ మానేజర్ ఆనంద్, ” టాస్క్ నంబర్ 18, పాతిక లైనులు ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. దానికి ఏడు రోజులు ఎందు కు కావాలి?”
శ్రీధర్ స్థిరం గా అన్నాడు, “ఆనంద్, మనకి ఉన్నది ఒక పేజీ ఉన్న రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఇన్ ఫర్మేషన్ చాలా తక్కువ. ఈ టాస్క్ కి పాతిక లైన్ల కోడ్ మాత్రమే ఉండవచ్చు గానీ, ఆ కోడ్  రాయటం చాలా కష్టం. రియల్ టైం ప్రోగ్రామింగ్ లో టైమింగూ, సింక్రొనైజషన్ వంటి విషయాలు గమనించాలి. మన టీం మెంబర్స్ అంతా కొత్త వాళ్ళు. ఎవరికీ రియల్ టైం ప్రోగ్రామింగ్ లో పని చేసిన అనుభవం లేదు.”
ఆనంద్ శ్రీధర్ ముందుకి ఒక ఎక్సెల్ షీట్ ప్రింట్ ఔట్ తోశాడు,” ఇది మనీషా వేసిన ఎస్టిమేట్, అదే టాస్క్ కి.  ఆమె చాలా తక్కువ ఇచ్చింది”.
“ఆమె ఇచ్చింది కరెక్ట్ అని నీకెలా తెలుసు?”.
“ఆమె ఇచ్చింది కరెక్టో కాదో తరవాత సంగతి. నువ్విచ్చిన ఎస్టిమేట్ తో కస్టమర్ మనకి ప్రాజెక్ట్ ఇవ్వడు”, అన్నాడు ఆనంద్.
శ్రీధర్ సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనీషా ఎస్టిమేట్ తో ఆనంద్ కస్టమర్ కి పంపించిన మెయిల్ ఇన్ బాక్స్ లో ఉంది. “మరి అలాంటప్పుడు నన్నెందుకు ఎస్టిమేట్ అడిగాడు? అసలు ఆనందే ఎస్టిమేట్ చేసి కస్టమర్ కి పంపించాల్సింది. ఈ ఎస్టిమేట్ తో ఇప్పుడు జనాలు రాత్రింబవళ్ళు పని చేయాలి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి”.
ఈ లోపు రూపాలి వచ్చింది, ఆమె కేదో జావా డౌటు.
” రూపాలీ, నేను ఈ స్పెసిఫికేషన్ తో బిజీ గా ఉన్నాను. శరత్ కి ఇదే విషయం ఎక్స్ ప్లెయిన్ చేశాను. శరత్ ని అడుగు”.
రూపాలి పెదాలు బిగించి, “శరత్ కి నాకు చెప్పాలంటే ఇష్టం లేదు. అతను సాయంత్రం తొందర గా ఇంటికి వెళ్ళిపోతాడు. అదేమంటే “నేనూ పెళ్ళైన వాడిని, ఇంటి దగ్గర పిల్లలున్నారు” అంటాడు. నేనూ చెప్ప వచ్చు, “నేను అడ పిల్లని, రాత్రి ఎనిమిది తరవాత ఆఫీస్ లో ఉండకూడదు, గవర్న్మెంట్ రూల్స్ ప్రకారం”, అంది రూపాలి.
శ్రీధర్,”సరే నేను అతని తో తరవాత మాట్లాడతాను”,అని ఆమె కి ఆ డౌట్ క్లియర్ చేశాడు.
శరత్ కి రూపాలి కంటే ఎక్స్ పీరియన్స్ ఎక్కువ. అతను త్వరగా నేర్చుకొంటాడు కూడా. కాసేపటికి శ్రీధర్ శరత్ ని మీటింగ్ రూం లోకి పిలిచి అడిగాడు,”శరత్, నువ్వు దీపాలి కి ఎందుకు ఎక్స్ ప్లైన్ చెయ్యలేదు?”
“ఆమె నన్ను అడగ లేదు ఎక్స్ ప్లైన్ చెయ్యమని. అడిగితే ఎక్స్ ప్లైన్ చేసేవాడిని”
“నీకు తెలుసు రూపాలికి ఒక డౌట్ ఉందని. నువ్వు సీనియర్ వి.నువ్వే చొరవతీసుకొని ఎక్స్ ప్లైన్ చెయ్యాల్సింది కదా? ఇక నుంచీ నువ్వే ఈ టాస్క్ కి ఓనర్ వి. నీదే బాధ్యత”
తరవాత రోజు రూపాలి ని పిలిచి చెప్పాడు,”రూపాలి నీ పెర్ఫార్మన్స్ బాగుంది.అయాం హాపీ. నీకు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకొంటున్నాను. ఇక నుంచీ శరత్ నీకు చెప్పినా చెప్పక పోయినా, బాధ్యత నీదే అవుతుంది”,
రూపాలి అలానే అని, తలూపి వెళ్ళిపోయింది. ఈలోగా సంతోష్ రెడ్డి వచ్చాడు. “ఏమప్పా శ్రీధరూ.లంచికి పోదామా?” అన్నాడు సంతోష్. క్యాంటీన్ కి వెళ్ళే దారి లో, “నేను పేపర్లు పెట్టేసినానబ్బా. మా పులివెందుల బావ హైదరాబాదు లో ఒక పదెకరాలు కొనినాడు. రియల్ ఎస్టేట్ చేసుకుందాం రమ్మంటున్నాడు. వైఎస్సార్ గవుర్నమెంటు లో బాగా పలుకుబడి ఉంది లే మా బావ కి”, అంటున్నాడు సంతోష్.

*********************

ప్రాజెక్ట్ మంచి ఊపు లో ఉంది. శ్రీధర్ పది నెలలకి ఎస్టిమేట్ ఇస్తే, ఆనంద్ దానిని ఐదు నెలలు చేసి కస్టమర్ నుంచీ ప్రాజెక్ట్ తెచ్చాడు. శ్రీధర్  జనాలందరికీ పని ఇవ్వటం మొదలుపెట్టాడు. కస్టమర్ కి “వీక్లీ స్టేటస్ రిపోర్ట్” పంపించేటపుడు శ్రీధర్ ఇది గమనించాడు…… రూపాలి కీ శరత్ కీ ఉమ్మడి గా ఇచ్చిన టాస్కు ముందుకి కదల లేదు. శ్రీధర్ ఇద్దరినీ పిలిచి కారణం అడిగాడు. రూపాలి శరత్ ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొన్నారు.
రూపాలి అంది,”శరత్ నాదగ్గరికి వచ్చి తనే ఓనర్ని అని చెప్పాడు. సో,నేను అతను చేస్తున్నాడు అనుకొన్నాను”
శరత్ అన్నాడు,” నువ్వు తరవాత రూపాలి కి తనే ఓనర్ అని చెప్పటం విన్నాను.నీ డెసిషన్ మార్చుకొన్నవేమోలే అని నేనూరుకొన్నాను. నేను వేరే టాస్క్ లు చూసుకొంటున్నాను”
శ్రీధర్ తనలో తను పెద్దగా అరుచుకొన్నాడు,” భగవంతుడా,నన్ను నువ్వే రక్షించు!”. తరవాత వాళ్ళిద్దరికీ వేరే వేరే టాస్కులు ఇచ్చాడు శ్రీధర్.
అప్రైజల్స్ స్టార్ట్ అయ్యాయి. రూపాలి కోపం గా ఉంది. ఆమె కిచ్చిన రేటింగ్స్ వలన ఆమె కి చాలా అసంతృప్తి కలిగింది. ఆమె శ్రీధర్ తో అంటూంది, “నేను రాత్రి పూట కూడా పని చేశాను. వీకెండ్స్ పని చేశాను. శరత్ ఎప్పుడూ యెర్లీ గా వెళ్ళిపోతాడు. అయినా అతనికి  నాకంటే  మంచి  రేటింగ్స్ వచ్చాయి. అప్రైజల్ నిష్పక్షపాతం గా లేదు.”
శ్రీఎధర్ అన్నాడు, “అప్రైజల్ అనేది,ఒకమనిషి ఎంత పని చేశాడు అనో లేదా, ఆ మనిషి నో, అప్రైజ్ చెయ్యటం కాదు. చివరి గా ఆ మనిషి కంపెనీ కి తన వంతు గా ఎంత ఉపయోగ పడ్డడా అని చూడాలి. అయినా ఒకరి రేటింగ్స్ తో పోల్చుకోవద్దు”.
శ్రీధర్ సమాధానం రూపాలి కి తృప్తినివ్వలా. తరవాత ఓ వారం రోజులు అప్పుడప్పుడూ రూపాలి కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తన సెల్ లో నెమ్మది గా మాట్లాడటం విన్నాడు శ్రీధర్. ఓ నెల రోజుల తరువాత రూపాలి నుంచీ శ్రీధర్ కి రెజిగ్నేషన్ లెటర్ వచ్చింది.

***************


కిందటి వారం స్పెసిఫికేషల డాక్యుమెంట్ కస్టమర్ కి పంపించారు. కస్టమర్ చాలా రోజులు జవాబు ఇవ్వలా. చివరికి, ఓ రోజు “ఆక్సెప్టెడ్” అని ఒక ముక్క మెయిల్ ఇచ్చాడు. స్పెసిఫికేషల ఆధారం గా హై లెవెల్ డిసైన్ మొదల్య్యింది. ఇది ప్రణాళికాసామాగ్రి (సాఫ్ట్వేర్ ప్రొగ్రాం)  తయారీ లో చాలా ముఖ్యమైన ఘట్టం.  ఇప్పుడు తీసుకొనేనిర్ణయాలు సరి గా లేక పోతే తరవాత చాలా ఇబ్బందులు పడాలి.
కస్టమర్  తో ఒక టెలిఫోన్ సమావేశం జరిగింది. ఆనందూ శ్రీధరూ ఇంకా జట్టు మొత్తం అటెండ్ అయ్యింది ఆ మీటింగ్ కి. శ్రీధర్ కి మీటింగుల్లో ఆనంద్ మాట్లాడే విధం నచ్చదు. ఒక యాంత్రిక మైన లయ (మెకానికల్ రిథం) తో మాట్లాడుతాడతను. అతను మాట్లాడటం చూస్తే చిన్నప్పుడు బందరు హోటల్లో సర్వర్ చదివిన టిఫిన్ల దండకం గుర్తుకు వస్తుంది శ్రీధర్ కి.
వినియోగదారుడు (కస్టమర్) డాటా ఫ్లో డయాగ్రం లో ఒక విషయం గురించి అడిగాడు. కానీ టీం లో ఎవరికీ దానిని గురించి తెలితదు. ఎవరైనా తెలియని విషయం అడిగినప్పుడు, దానికి సమాధానం ఇవ్వటానికి చాలా మార్గాలున్నాయి. శ్రీధర్ అయితే రిస్కు తీసుకొని, తనకి తోచిన ఒక సమాధానం చెప్పి ఉండే వాడు. ఆ సమాధానం సరైనదైతే అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ వివరణ తప్పు ఐతే కస్టమర్ కి శ్రీధర్ టీం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. “మేము తరవాత నీకు సమాధానం చెబుతాం”, అని చెప్పవచ్చు. కానీ అప్పటికే ఆ ట్రిక్ శ్రీధర్ చాలా సార్లు ఉపయోగించాడు. చివరికి శ్రీధర్, “దీనికి సమాధానం మాకు తెలియదు”,అని చెప్పాడు.
మీటింగ్ అయ్యిన తరువాత ఆనంద్, శ్రీధర్ నీ టీం నీ బయటకు పంపి కస్టమర్ తో ఒక్కడే మాట్లాడాడు. ఓ పది నిమిషాల తరవాత ఆనంద్ శ్రీధర్ ని తన రూం లోకి పిలిచాడు.
” కస్టమర్ కి నువ్వు చెప్పింది నచ్చలేదు.ఇక నుంచీ జాగ్రత్త గా ఉండు”, అన్నాడు.
శ్రీధర్ ఆనంద్ ని అడిగాడు, ” నేను ఏమి చెప్పి ఉండాల్సింది?”
శ్రీధర్ ప్రశ్న ఆనంద్ కి నచ్చలేదు. అయినా తనను తాను నియంత్రించుకొని (కంట్రోల్ చేసుకొని) చెప్పాడు ఆనంద్,”కస్టమర్ కి మనం చెప్పే సమాధానం, అతనికి మనమీద ఉన్న మంచి అభిప్రాయాని తగ్గించేది గా ఉండ కూడదు”
శ్రీధరేమీ మాట్లాడ లేదు కానీ ఇలా అనుకొన్నాడు,” కస్టమర్ మైండ్ లోఏముందో మనకేమి తెలుసు. ప్రాబ్లెం తెలియదు అని ముందే చెప్తే మంచిది. చివరి నిమిషం లో చెప్తే దీని వలన నష్టం ఎక్కువ అవుతుంది.బాస్ అనేవాడు సబార్డినేట్స్ చేసిన తెలివైన తప్పులని,కాలిక్యులేటెడ్ రిస్క్ నీ సపోర్ట్ చెయ్యాలి.లేక పోతే బాస్ సాదా సీదా ఫలితాలతో సరి పెట్టుకోవాలి”.
డిజైన్ డాక్యుమెంట్ పూర్తి అయ్యింది. కస్టమర్ కి ఆ డాక్యుమెంట్ పంపించుదామను కొంటుండగా శ్రీధర్ కి ఆనంద్ నుంచీ మెయిల్ వచ్చింది. కస్టమర్ రిక్వైర్మెంట్ మార్చాడు. ఇప్పుడు డిజైన్ డాక్యుమెంట్ మళ్ళీ మొదటి నుంచీ ప్రిపేర్ చెయ్యాలి. శ్రీధర్ కి వళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆనంద్ దగ్గరికి వెళ్ళి, “రెక్వైర్మెంట్  మారింది.దీని వలన షెడ్యూల్ మారుతుంది. ఇది చేంజ్ రిక్వెస్ట్. కాబట్టీ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది” అన్నాడు.
” కాస్ట్ విషయం నాకు వదిలెయ్. షెడ్యూల్ మాత్రం పాతదే ఉంటుంది.నేను కస్టమర్ కి కమిట్ చేశాను.”
శ్రీధర్ కోపం కంట్రోల్ చేసుకొని, ప్రశాంతం గా అడిగాడు ఆనంద్ ని,” నువ్వు కస్టమర్ కి కమిట్ అయ్యే ముందు టీం తో డిస్కస్ చెయ్యాలి అనిపించలేదా?”
“శ్రీధర్, నేను ఏం చెయ్యాలి అనేది, నీకు సంబంధించిన విషయం కాదు. నీకు కావాలంటే ఇంకా ఎక్కువ మందిని ఇస్తాను.కానీ షెడ్యూల్ మారదు”.
“ఆనంద్, ఈ లెక్కలు అన్నిసార్లూ పని చెయ్యవ్. నువ్వు నాకు తొంభై రెట్లు జనాలను ఇస్తే ప్రాజెక్ట్ ను ఒక్క రోజులో అవ్వగొట్టగలమా?”
“చూడు శ్రీధర్, నేను పదిహేను సంవత్సరాల నుంచీ చూస్తున్నాను. ప్రాజెక్టులు పేపర్ మీద ఎలా నడిచినా, నిజ జీవితం లో ఇలానే నడుస్తాయి. టీం ని ఎక్కువ సేపు పని చెయ్యమను.  మళ్ళీ ఎక్కువ సేపు పనిచెయ్యటం సరి కాదు అనవద్దు.  జనాలు లేటు గా ఉండి చేసిన పనే సాఫ్ట్ వేర్ కంపెనీ ల లాభాలు గా మారుతుంది”.


***********


ఫణి శ్రీధర్ దగ్గరికి వచ్చి మళ్ళీ మొదలెట్టాడు. “నేను జావా లో పని చేశాను.జావా లో ఏమన్నా వర్క్ ఉంటే ఇవ్వు.లేకపోతే, పక్కన ఓ జావా ప్రాజెక్టు జరుగుతోంది. దానికి పంపించు”
ఆనంద్ తో మాట్లడితే అన్నాడు,” శ్రీ, వీళ్ళు ఇలానే అంటూ ఉంటారు. పని చేసే వాడికి  జావా ఐనా ఒక్కటే, సీఎ ప్లస్ ప్లస్ అయినా ఒక్కటే. మనం ఫణి ని ఒక్కసారి పంపిస్తే, టీం లో మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారు, మార్చమని…అప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ చెయ్యటమే కష్టం అవుతుంది”  కానీ శ్రీధర్ కి ఈ మాటలు నచ్చలా.
శ్రీధర్ కి సేల్స్ టీం పధ్ధతి కూడా నచ్చలా. కస్టమర్ హఠాత్తు గా పెర్ఫార్మన్స్ గురించి గొంతెమ్మ కోరికలు కోరటం మొదలు పెట్టాడు. ఏంటా అని ఆరా తీస్తే శ్రీధర్ కి తెలిసింది, శ్రీధర్ వాళ్ళ కంపెనీ సేల్స్ టీం వాళ్ళు కస్టమర్ కి, “మా వాళ్ళు వీరులూ, శూరులూ” అని చెప్పారని.
శ్రీధర్ “టీం అంతా ఒక పిక్నిక్ కి వెళ్దాం”, అని ప్రతిపాదించాడు. ఆనంద్ మూడ్ బాగున్నట్లుంది, వెంటనే ఓకే చేశాడు. ట్రెక్కింగ్ కి రామానగరం వెళ్ళారంతా. టీం లో వాళ్ళు చాలా వరకూ సిటీ జనాలవటం వలన, వాళ్ళ కి అదో వెరైటీ గా ఉంది. శ్రీధర్ ఇటువంటి ట్రెక్కింగ్ లు చాలానేచేశాడు చిన్నప్పుడు. కానీ ఈ మొత్తం విషయం లో ఒక సర్ ప్రైజ్ మనీషా. ఆమె శ్రీధర్ టీం లో లేదు. అయితే ఆనంద్ అడిగినట్లున్నాడు ఆమెను కూడా జాయిన్ అవ్వమని.


*************
 


కస్టమర్ హార్డ్ వేర్ పంపించాలి. కానీ అది రావటం ఓ రెండు వారాలు లేట్ అయ్యింది. ఈ విషయం శ్రీధర్ వీక్లీ స్టేటస్ రిపోర్ట్ లో రాశాడు. కస్టమర్ మానేజర్ పేరు లూసీ. ఆమె సాధారణం గా వీక్లీ స్తేటస్ రిపోర్ట్లు చదవదు. కానీ ఈ రిపోర్ట్ చదివింది. ఆమె ఆనంద్ కి కాల్ చేసింది. తరవాత ఆనంద్ శ్రీధర్ ని కాల్ చేశాడు. “చూడు శ్రీధర్, కస్టమర్ నీ గురించీ, ప్రాజెక్ట్ గురించీ హాపీ గా లేడు(దు). ఇలా అయితే కస్టమర్ కమ్మ్యూనికేషన్ విషయం లో ఒక కొత్త లీడ్ ని పెట్టాలి”
“ఏమిటి ప్రాబ్లం? నేను నా పని చేస్తున్నాను కదా?”
” ఏ కస్టమరూ తన వెండర్ యొక్క లీడ్ పనిమంతుడైతే వదులు కోవాలని అనుకోడు”.
ఆనంద్ మాటలు శ్రీధర్ లో ఆందోళన పెంచాయి. లూసీ చెడు గా చెప్పి ఉంటుందా తన గురించి?  లేక పోతే నా మీద ఒత్తిడి పెంచి పని చేయించుకొనేటందుకు ఆనందే ఇలా చెప్తున్నాడా?”
కస్టమర్ కి ఒక ఇంటర్మీడీయేట్ వర్షన్ ని రెలీజ్ చేశారు. తరవాత లూసీ ఆనంద్ కి ఇలా ఇంగ్లీష్ లో మెయిల్ చేసింది, “ఈ వర్షన్ దిక్కుమాలినట్లుంది. మీరు మా సమయాన్నీ, దబ్బునీ వృధా చెయ్యటం లేదని ఆశిస్తాను”



మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

ఫైర్ వాల్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..?

ఫైర్ వాల్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..?


 ఈ రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది అలాగే దానితో పాటు ప్రతి ఒక్కరిలో తన డేటా ను తన సిస్టం ని ఎలా కాపాడుకోవాలి అనే (భద్రతా ఎలా కల్పిచాలి అనే ఆలోచన పెరిగింది).  వీటి అన్నిటికి ఒకటే జవాబు అదే ఫైర్ వాల్ అంటే మనలో చాల మంది వేనె ఉంటాం "ఫైర్ వాల్  మన కంప్యూటర్ ని వెబ్ అటాక్స్ నుండి మరియు హకెర్స్ నుంచి రక్షణ కలిపిస్తుంది.

ఫైర్ వాల్  అంటే ఏమిటి ?
 
ఫైర్ వాల్ అనేది ఒక device  లేదా అప్లికేషను.  కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ద్వార జరిగే డేటా transfer నిలువరిస్తుంది అసలు ఫైర్ వాల్ అనేది మన అనుమతి లేకుండా మన కంప్యూటర్ లోకి ఇంటర్నెట్ ద్వార ప్రవేసించే వాటిని నిలువరిస్తుంది.  సాదారణంగా ఫైర్ వాల్ అనేది 
 
రెండు రకాలు.
1 . హార్డువేర్ ఫైర్ వాల్ 
2 . సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్ 
 
 
హార్డువేర్ ఫైర్ వాల్  అనేది ఒక Device అది కంప్యూటర్ కి Modemకి మద్య అనుసందానం చేయబడి ఉంటుంది.  అంతే కాక కొన్ని Router ల లో ఇంటర్నల్ గా ఫైర్ వాల్ అనుసందానం చేయబడి ఉంటుంది.  ఇది ఇంటర్నెట్ ని షేర్ చేయడమే కాకా ఫైర్ వాల్ గా కుడా పని చేస్తుంది.
సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్  అనేది ఒక అప్లికేషను మన కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేయబడే అంటే ఇంటర్నెట్ ఏ సిస్టం కి అయితే Connect చేయబడి  ఉందొ ఆ సిస్టం లో ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది.  కొన్ని సందర్బాలలో ఇంటర్నెట్ మన నెట్ వర్క్  లోకి షేర్ చేసుకోవడానికి Router అందుబాటులో లేనపుడు ఈ కంప్యూటర్ ని Router మరియు ఫైర్ వాల్ గా ఉపయోగించ వచ్చు. 
టూకిగా చెప్పాలి అంటే హార్డువేర్ ఫైర్ వాల్  అనేది ఇంటర్నెట్ కి మన నెట్ వర్క్ కి రక్షణ కవచంలా ఉంటుంది.  అదే సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్  అయితే కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కి మద్య రక్షణ కవచంలా ఉంటుంది.  ఎందుకు అంటే ఇంటర్నెట్ Modem నేరుగా కంప్యూటర్ కి అనుసందానం చేయబడి ఉంటుంది.  ఈ చిత్రం లో అది క్లియర్ గా చూడొచ్చు.


ఫైర్ వాల్ టెక్నాలజీస్ :

మనకి మార్కెట్లో చాలా రకాల ఫైర్ వాల్ Devices,  ఫైర్ వాల్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి.  వాటిని రెండు రకాలుగా (Technically ) అంటే అవి పని చేసే విధానం పరంగా చూడటం జరుగుతుంది. 

a) ప్యాకెట్ ఫిల్టరింగ్ (Packet Filtering)
b) అప్లికేషను / Proxy ఫిల్టరింగ్ (Application/Proxy Filtering)

a) ప్యాకెట్ ఫిల్టరింగ్  
ఈ విదానం లో మన నెట్ వర్క్ ప్రతి ప్యాకెట్ Analyze  చేసి అప్పుడు Send/ Receive  చేయబడుతుంది.  ప్రతి ప్యాకెట్ ప్రేత్యేకంగా Analyze అంటే  ఆ ప్రోటోకాల్, సోర్సు మరియు destination ports మరియు Direction  అన్నిటిని తన దగ్గర ఉన్న access కంట్రోల్ లిస్టు తో compare చేస్తుంది.  ఈ Access List అనేది కొన్ని ప్రత్యెక మయిన నిబందనలు (Rules ) తో ఉంటుంది.  అవి Firewall Configure చేసేటపుడు ఆ నిబందనలు(Rules) ఇవ్వబడతాయి.  కాబట్టి ఏ ప్యాకెట్ అయితే ఆ నిబంధనలు అన్నింటిని ఒప్పిచగలుగు తుందో ఆ ప్యాకెట్ మాత్రమే అనుమతించబడుతుంది.  ఇది కేవలం Receiving కి మాత్రమే కాదు Sending కి కూడా ఇదే విధానం వర్తిస్తుంది.
ఉదాహరణకు: మనం Default బ్రౌజరు గా Internet Explorer ని Configure చేసామనుకొండి ఒక వేళ Hacking జరిగితే ఆ అప్లికేషన్ బ్లాక్ చేస్తుంది. 
ఈ విధానం వల్ల సెక్యురిటీ లాభాలు ఉన్నప్పటికీ Performance ప్రకారం కొన్ని లోపాలు ఉన్నాయి.  ఎందువల్ల అంటే మన కంప్యూటర్ లోకి వచ్చి వెళ్ళే ప్రతి ప్యాకెట్ సోదా చేయడం వల్ల Send/Receive చాలా ఆలస్యం అవుతుంది. అంతే కాక సామర్ధ్యం గల హాకెర్స్ చాలా సులువుగా హక్ చేసే అవకాశం ఉంటుంది.  అది ఎలా అంటే అతను పంపించే ప్రతి ప్యాకెట్ మాస్క్ చేసి పంపిస్తే చాల సులభంగా ఫైర్ వాల్ ని తప్పుపట్టించే అవకాశం ఉంది.

b) అప్లికేషను / Proxy ఫిల్టరింగ్
ఇంతకు ముందు చెప్పుకున్న విధానం లో మనం Packets Filtering ఎలా పని చేస్తుందో తెలుసుకున్నాము.  కాని ఈ విధానంలో Filtering అనేది అది పని చేసే విధానంలో కొంచెం మార్పులు ఉంటాయి.  ఇక్కడ ఫైర్ వాల్ అనేది ఒక స్టోరేజ్ యూనిట్ లా పని చేస్తుంది అంటే మన నెట్ వర్క్ లో ఏ ఒక్క కంప్యూటర్ కూడా నేరుగా ఇంటర్నెట్ తో నేరుగా సంభాదాలు కలిగి ఉండదు.  ఏది కావాలి అన్న మనం Proxy కి Request చేస్తే అది ఇంటర్నెట్ తో నేరుగా అనుసంధానించబడి మనకు కావలిసిన ఇన్ఫర్మేషన్ అందిస్తుంది.  దీని వల్ల Proxy Server ఏ డేటా ని ప్రాసెస్ చేయాలి ఏది చేయకోడదు అనేది అని నిర్ణయిస్తుంది దాని వల్ల మనకు అవసరం లేని డేటా ని బ్లాక్ చేస్తుంది. 

ఫైర్ వాల్ చేయలేని పనులు
 
ఫైర్ వాల్ అనేది ఎంత గొప్పగా చెప్పుకున్న Security పరంగానూదాని లో కొన్ని లోపాలు ఉన్నాయి.
1.       Software Bugs: ఒక వేళ Security పరంగా సాఫ్ట్ వేర్ లో కొన్ని బగ్స్ ఉంటే దానిని ఫైర్ వాల్ ఏమి చేయలేదు.
2.       Human Error : మెషిన్ అనేది మనం Instuctions అనేవి కరెక్ట్ గా ఇవ్వక పోతే దానిని పూర్తి సామర్ధ్యంతో మనం ఉపయోగించుకోలేము.  ఉదాహరణకు: ఫైర్ వాల్ మనం సరిగ్గా Configure చేయక పోతే ఏమి చేయలేము.
3.       Virus : ఒకవేళ కంప్యూటర్ లో వైరస్ ఉన్నట్లయితే దానిని ఫైర్ వాల్ ఏమి చేయలేదు.  కాని కొన్ని సాఫ్ట్ వారే ఫైర్ వాల్ల్స్ Antivirus తో కలిపి వస్తున్నాయి.
4.       Inside Jobs : నెట్ వర్క్ లో internal గా జరిగే డేటా ఫ్లో కి ఫైర్ వాల్ కి సభంధం లేదు.

హార్డ్ వేర్ ఫైర్ వాల్ వలన ఉపయోగాలు:
1.       Security అధికం.
2.       System Resources చాలా తక్కువగా ఉపయోగించుకుంటుంది.
3.       అదనపు భద్రత కల్పిస్తుంది.
4.       హార్డ్ వేర్ ఫైర్ వాల్ చాలా నమ్మదగింది.
5.       Disable చేయడం Remove చేయడం చాల సులభం.
6.       వేరే కంప్యూటర్ మిద ఆధారపడదు స్వతంత్రంగా పని చేస్తుంది.

హార్డ్ వేర్ ఫైర్ వాల్ లోపాలు:
1.       Install చేయడం Configure చేయడం కొంచెం కష్టం తో కూడుకున్న పని.
2.       Physical గా స్థలం ఆక్రమిస్తుంది.
3.       కొంచెం ఖర్చుతో కూడుకున్న పని.
4.       Upgrade చేయడం కాని Repair చేయడం కొంచెం కష్టం.

సాఫ్ట్  వేర్ ఫైర్ వాల్ వలన ఉపయోగాలు:
1.       హార్డ్ వేర్ ఫైర్ వాల్ తో పోల్చుకుంటే చవకగా లభిస్తుంది.  కొన్ని సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్స్ ఉచితం గా కుడా లభిస్తున్నాయి.
2.       చాలా సులభంగా Upgrade చేసుకోవచ్చు.
3.       Physical గా కంప్యూటర్ లో కాని  నెట్ వర్క్ లో కాని ఏమి మార్పులు చేయలిసిన అవసరం లేదు.
4.       ఏది గృహ వినుయోగాదారులికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సాఫ్ట్ వేర్ ఫైర్ వాల్ లోపాలు:
 
1.       Software Crash అవవచ్చు లేదా మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం కి Compatible కాకపోవచ్చు.
2.       Software bugs వలన కొన్ని సందర్భాలలో Security లోపించవచ్చు.
3.       సిస్టం Resources ఎక్కువగా ఉపయోగించుకుంటుంది కాబట్టి కంప్యూటర్ Performance తగ్గవచ్చు.
 
ఏ ఫైర్ వాల్ ఎంపిక చేసుకోవాలి అనేది వినియోగదారుని యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది.  గృహ వినియోగదారులు అయిన, వాణిజ్య అవసరాలికి అయిన ఫైర్ వాల్ ఉపయోగించడం చాలా ఉపయోగకరమయిన విషయం. అలాగే ఇంటర్నెట్ షేరింగ్ కోసం ఉపయోగించే కొన్ని router   లలో కుడా Hardware Firewall  అనుసంధానించబడి ఉంటుంది.  కాబట్టి అవి చూసి ఎంపిక చేసుకోగలిగితే హార్డ్ వారే ఫైర్ వాల్ కోసం పెట్టె ఖర్చుఅదా అవుతుంది.  ఇక సాఫ్ట్ వారే ఫైర్ వాల్ అయిన Zone Alarm వంటి కొన్ని ఫైర్ వాల్స్ ఉచితంగా లభిస్తున్నాయి.

హార్డ్ డిస్క్ పై ఐదో భాగం - ఫైల్ రికవరీ



పొరపాటున మనకు కావాల్సిన ముఖ్యమైన ఫైల్ పోగొట్టుకుంటే ఉందే బాధ అంతా ఇంతా కాదు! ఈ పాఠ్యాంశంలో అలా డిలీట్ చేసిన ఫైల్ ని మళ్ళీ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం.

                   లినక్సు లో ఫోటోరెక్ అని ఒక అద్భుతమైన ఉపకరణం ఉంది. అది టెస్ట్-డిస్క్ అనే ప్యాకేజ్ లో భాగంగా వస్తుంది. మీరు ఫైల్ డిలీట్ చేసిన పార్టిషన్ డామేజ్ అయినా, ఫార్మటు చేసిన పర్వాలేదు. ఫోటోరెక్ ఫైల్ సిస్టంని ఆధారంగా చేస్కోక, సరాసరి అందులో ఉన్న డేటానే వెలికి తీస్తుంది. పైగా ఇది వాడేది లినక్సు లో అయినా, విండోస్ పార్టిషన్ల మీద డిలీట్ చేసిన డేటాని అయినా రికవర్ చెయ్యొచ్చు. కాబట్టి చాలా సందర్భాల్లో మీ ఫైల్ భద్రంగా బయటికి వస్తుంది అని చెప్పొచ్చు. 
దాన్ని ఇన్స్టాల్ చేస్కోవాలంటే, ఈ క్రింది కమాండ్ లు కొట్టండి. (విండోస్ వారు ఇక్కడి నుండి దించుకోవచ్చు)
ఫెడోరా వారు,
yum -y install testdisk
ఉబుంటు వారు,
sudo apt-get install testdisk
స్టెప్ 1(౧): ఈ క్రింది కమాండ్ కొట్టి ప్రోగ్రాం ప్రారంభించాలి
స్టెప్ 2(౨): టెర్మినల్ లోనే అంతా జరుగుతుంది. కాబట్టి మీ మౌస్ పని చేయదు ఇక్కడ, అంతా కీ బోర్డు తోనే ఉంటుంది. ఆ పైన చెప్పిన కమాండ్ కొట్టగా కనబడే స్క్రీన్ లో, మీకున్న హార్డ్ డిస్క్ లను చూపిస్తుంది, ఎందులో ఫైల్ డిలీట్ చేసారో అది ఎంచుకోండి. అంటే, బాణం గుర్తుల కీ-లతో, ఒక డిస్క్ మీదకు వెళ్లి ఎంటర్ కొట్టడం అన్నమాట - ఇది గుర్తు పెట్టుకోండి. నేను ఎంచుకోమన్నప్పుడల్లా ఆ ఆప్షన్ మీదకు వెళ్లి ఎంటర్ కొట్టాలి.


స్టెప్ : ఈ స్క్రీన్ లో పార్టిషన్ ఏ టైపు అన్నది ఎంచుకోవాలి. (మనవి విండోస్/లినక్సు సిస్టం లు అయ్యుంటే, Intel అని ఎంచుకోండి).
స్టెప్ 4(౪): ఇప్పుడు ఫైల్ రకం ఎంచుకోవాలి. దీనికి క్రింద కనిపించే [FileOpt] ని ఎంచుకుని ఆ వచ్చిన స్క్రీన్ లో మనకు డిలీట్ చేసిన ఫైల్ ఏ రకమో ఆ రకాన్ని మాత్రం టిక్ chesi ఉంచాలి. ముంగు annee టిక్ చేసేసి ఉంటాయి, annee ఒకేసారి తీసేయ్యాలి అంటే s కొట్టండి. ఇప్పుడు మీకు కావాల్సిన దాని మీదకు వెళ్లి స్పేస్ నొక్కితే సరి. అంటా అయ్యాక ఎంటర్ కొట్టండి, ముందు స్క్రీన్ కి వచ్చేస్తారు.

 


స్టెప్5(౫): కావాలనుకుంటే ఎక్స్ట్రా ఆప్షన్లు కూడా పెట్టుకోవచ్చు, కానీ చాలా సందర్బాలలో ఆ అవసరం రాదు. పెట్టుకోవాలనుకుంటే [Options] ఎంచుకుని ఆ వచ్చిన స్క్రీన్ లో మనకు కావలసినట్టుగా అమర్చుకోవచ్చు.
స్టెప్ 6(౬): ఇప్పుడు పార్టిషన్ ఎంచుకోవాలి. అంటే, ఏ పార్టిషన్ నుండి మనం ఫైల్ డిలీట్ చేసేశామో అది! ఎంచుకున్నాక క్రింద [Search] ని ఎంచుకుని ఎంటర్ కొట్టండి.

 స్టెప్7(౭): ఆ ఎంచుకున్న పార్టిషన్ ఏ ఫైల్ సిస్టం టైపో ఎంచుకోవాలి.

స్టెప్ 8(౮): ఈ స్క్రీన్ లో మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి, Free అని,  Whole అని. ఒకవేళ మీరు ఫైల్ డిలీట్ చేసిన పార్టిషన్‌ బాగానే పనిచేస్తున్నట్టైతే (అంటే, డామేజ్ లేకపోతే), Free ఎంచుకోండి. అనుమానంగా ఉంటే Whole ఎంచుకోండి.

స్టెప్ 9(౯): రికవర్ చేసిన ఫైళ్లు పెట్టడానికి ఒక ఫోల్డర్ ఎంచుకోండి. ".." అని ఉన్న దాన్ని ఎంచుకుంటే పై ఫోల్డర్ కి తీస్కెలుతుంది. మీరు కావాల్సిన ఫోల్డర్ ఎంచుకున్నాక, Y కొట్టండి.

ఆ చివరి స్క్రీన్ లో ఎన్ని ఫైళ్లు రికవర్ చేసింది, ఎంత టైం అయ్యింది, ఇంకా ఎంత టైం పడుతుంది లాంటివి చూపిస్తుంది. ఆ ఫోల్డర్ తెరిచి, మీరు వెతుకుతున్న ఫైల్ ఉందేమో చూస్కోండి, చాలావరకు ఉండే తీరాలి :)
  
పాఠ్యాంశ మూలాలు: టెస్ట్‌డిస్క్‌ & గోఫెడోరా