Tuesday, 9 October 2012


బెల్లం - Anakapalli Famous of Andhra Pradesh

 
బెల్లం (Jaggery)  ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. చెరకు కొట్టి ఆ పొలంలోనె ఏర్పాటు చేసుకొన్న గానుగ వద్దకు చేర్చి అందులో నుండి రసం తీసు దాన్ని పెద్ద పెనంలో కాగ బెట్టి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. గట్టి దనాన్ని రైతు పరి భాషలో రాపు లేదా జేడు అంటారు.

బాగ పక్కానికి వచ్చిన చెరుకును నరికి గానుగ వద్దకు చేరుస్తారు: చెరకు పైనున్న ఆకులను తీసేసి వాటిని గానుగలో పెట్టి రసం తీస్తారు.
చెరకు రసం తీయడానికి గానుగ యంత్రంలో చెరుకులను పెట్టే దృశ్యం






                                              ఆ రసాన్ని పెద్ద ఇనుప రేకుతో చేసిన పెనంలో సేకరించి దాన్ని బాగా కాగ బెడతారు. ఈ చెరకు పాలు కాగేటప్పుడు మొదటగా బుడ్డ పగలడం అంటారు. అనగా పొంగు రావడానికి తొలి దశ అన్నమాట. అలా రెండో దశ చీమల పొంగు, ఇది పెనంలో సుమారు రెండడుగుల ఎత్తు వస్తుంది. ఆ తర్వాతది పెద్ద పొంగు. ఇది చీమల పొంగు కన్నా ఎత్తుగా వస్తుంది. అది రాను రాను తగ్గుతూ సుమారు ఆరు అంగుళాల లోతులో వుంటుండి. దాన్నే పాకం అంటారు.అప్పుడు దీనిని గోర (తెడ్డు లాంటిది) కలుపుతారు. అదను చూసి పెనాన్ని పొయ్యి మీదనుండి పైకి లేపి ప్రక్కనే భూమిలో పాతిన ఒక ఇనుప అరేకుల దోనె మీద పోస్తారు. పోసిన తర్వాత దాన్ని తిరిగి గోరతో బాగ కలుపుతారు. ఆ పాకం మెల్ల మెల్ల గా గట్టి పడుతుంది. అది పూర్తిగా గట్టి పడక ముందే దోకుడు పార తో తిరగేసి వేడిగ వున్నప్పుడే దాన్ని ముద్దలుగా చేసి పక్కన ఆర బెడతారు. ఆ విధంగా బెల్లం తయారు అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ బెల్లాన్ని పొడిగా చేసి గోతాలలో నింపడం, లేదా అచ్చుల్లో పోసి ఆర బెట్టడమో చేస్తారు. చెరుకు గానుగ సమయంలో తయారు చేసె ఇతర పదార్థాలు చెక్కల బెల్లం దీని తయారికి తక్కువ లోతు గల పళ్లాలను తీసుకొని, దాని అడుగున నెయ్యి పోసి, అందులొ బెల్లం పాకం పోసి దానితో పాటు వేరుశనగ పప్పులు, పుట్నాల పప్పులు, మిరియాల పొడి వేసి బాగ కలియ బెట్టి పూర్తిగా గట్టి పడక ముందె దాన్ని బిళ్లలుగా కోసి బాగ గట్టి పడిన తర్వాత బద్ర పరుచు కుంటారు. వరంటు బెల్లం దీని తయారికి బెల్లం పాకం పెనంలో నుండి దోనిలో పోసె టప్పుడు పెనంలోనె కొంత పాకాన్ని అలాగె వుంచి దాన్ని బాగా అదే పనిగా చాల సేపు రుద్దితే అది కొంత తెల్లబడు తుంది. దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆర బెట్టి ఇంటి కొరకు దాచి పెట్టు కుంటారు.
బెల్లం పాకం.
పక్వానికొచ్చిన చెరుకు తోట. కొట్టిన చెరుకును ఎద్దులతో రవాణాకు సిద్దం:,


 

ఉపయోగాలు, విశేషాలు

    పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.
    భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.
    ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.
    గానుగను శుబ్రంగా కడిగి చెరుకులతోబాడు మిరపకాయలు, అల్లం, నిమ్మకాయలు పెట్టి ఆ వచ్చిన రసాన్ని వచ్చిన వారికి ఇస్తారు. కాని రైతులు ఎక్కువగా తాగరు. అది అనారోగ్య కారకమని వారి నమ్మకం: వంకాయలను, మామిడి కాయలకు గాట్లు పెట్టి పెనంలో వేలాడ దీస్టే అవి చెరుకు పాల పొంగులో బాగ ఉడికి తినడానికి బలే రుచిగా వుంటాయి.
    నక్కిళ్లు పాకాన్ని దోనిలో పోసె టప్పుడు కొంత పాకాన్ని నీళ్లున్న గిన్నెలో పోస్తే అది చల్లబడి సాగుతూ తినడానికి అదొక రుచిగా వుంటుంది. చిన్న పిల్లలు దీన్ని బాగ తింటారు.
    కండ చెక్కెర పఖ్వానికి రాని పాకాన్ని కొత్త కుండలో సగానికి నింపి,కుండ మూతికి గుడ్డ కట్టి దాన్ని ఇంటిలో వుట్టి లో పెడితే సుమారు మూడు నెలల తర్వాత ఆ పాకం పై భాగాన సుమారు రెండంగుళాల మందంతో గట్టి పడి వుంటుండి. ఇది బజారులో దొరికే కలకండ లాగానె వుంటుంది కాని రంగు తక్కువ. ఇది తినడానికి బాగ వుంటుంది. మిగిలిన పాకం చాల చిక్కబడి తేనె లాగ వుంటుంది. ఇది కూడ తినడానికి చాల బాగ వుంటుంది.

No comments:

Post a Comment