Monday, 1 October 2012

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ


       శ్రీధర్ ని కాన్ఫరెన్స్ రూం లో కి పిలిచి ఆశ్చర్యం గా అడిగాడు వాళ్ళ మానేజర్ ఆనంద్, ” టాస్క్ నంబర్ 18, పాతిక లైనులు ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. దానికి ఏడు రోజులు ఎందు కు కావాలి?”
శ్రీధర్ స్థిరం గా అన్నాడు, “ఆనంద్, మనకి ఉన్నది ఒక పేజీ ఉన్న రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఇన్ ఫర్మేషన్ చాలా తక్కువ. ఈ టాస్క్ కి పాతిక లైన్ల కోడ్ మాత్రమే ఉండవచ్చు గానీ, ఆ కోడ్  రాయటం చాలా కష్టం. రియల్ టైం ప్రోగ్రామింగ్ లో టైమింగూ, సింక్రొనైజషన్ వంటి విషయాలు గమనించాలి. మన టీం మెంబర్స్ అంతా కొత్త వాళ్ళు. ఎవరికీ రియల్ టైం ప్రోగ్రామింగ్ లో పని చేసిన అనుభవం లేదు.”
ఆనంద్ శ్రీధర్ ముందుకి ఒక ఎక్సెల్ షీట్ ప్రింట్ ఔట్ తోశాడు,” ఇది మనీషా వేసిన ఎస్టిమేట్, అదే టాస్క్ కి.  ఆమె చాలా తక్కువ ఇచ్చింది”.
“ఆమె ఇచ్చింది కరెక్ట్ అని నీకెలా తెలుసు?”.
“ఆమె ఇచ్చింది కరెక్టో కాదో తరవాత సంగతి. నువ్విచ్చిన ఎస్టిమేట్ తో కస్టమర్ మనకి ప్రాజెక్ట్ ఇవ్వడు”, అన్నాడు ఆనంద్.
శ్రీధర్ సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనీషా ఎస్టిమేట్ తో ఆనంద్ కస్టమర్ కి పంపించిన మెయిల్ ఇన్ బాక్స్ లో ఉంది. “మరి అలాంటప్పుడు నన్నెందుకు ఎస్టిమేట్ అడిగాడు? అసలు ఆనందే ఎస్టిమేట్ చేసి కస్టమర్ కి పంపించాల్సింది. ఈ ఎస్టిమేట్ తో ఇప్పుడు జనాలు రాత్రింబవళ్ళు పని చేయాలి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి”.
ఈ లోపు రూపాలి వచ్చింది, ఆమె కేదో జావా డౌటు.
” రూపాలీ, నేను ఈ స్పెసిఫికేషన్ తో బిజీ గా ఉన్నాను. శరత్ కి ఇదే విషయం ఎక్స్ ప్లెయిన్ చేశాను. శరత్ ని అడుగు”.
రూపాలి పెదాలు బిగించి, “శరత్ కి నాకు చెప్పాలంటే ఇష్టం లేదు. అతను సాయంత్రం తొందర గా ఇంటికి వెళ్ళిపోతాడు. అదేమంటే “నేనూ పెళ్ళైన వాడిని, ఇంటి దగ్గర పిల్లలున్నారు” అంటాడు. నేనూ చెప్ప వచ్చు, “నేను అడ పిల్లని, రాత్రి ఎనిమిది తరవాత ఆఫీస్ లో ఉండకూడదు, గవర్న్మెంట్ రూల్స్ ప్రకారం”, అంది రూపాలి.
శ్రీధర్,”సరే నేను అతని తో తరవాత మాట్లాడతాను”,అని ఆమె కి ఆ డౌట్ క్లియర్ చేశాడు.
శరత్ కి రూపాలి కంటే ఎక్స్ పీరియన్స్ ఎక్కువ. అతను త్వరగా నేర్చుకొంటాడు కూడా. కాసేపటికి శ్రీధర్ శరత్ ని మీటింగ్ రూం లోకి పిలిచి అడిగాడు,”శరత్, నువ్వు దీపాలి కి ఎందుకు ఎక్స్ ప్లైన్ చెయ్యలేదు?”
“ఆమె నన్ను అడగ లేదు ఎక్స్ ప్లైన్ చెయ్యమని. అడిగితే ఎక్స్ ప్లైన్ చేసేవాడిని”
“నీకు తెలుసు రూపాలికి ఒక డౌట్ ఉందని. నువ్వు సీనియర్ వి.నువ్వే చొరవతీసుకొని ఎక్స్ ప్లైన్ చెయ్యాల్సింది కదా? ఇక నుంచీ నువ్వే ఈ టాస్క్ కి ఓనర్ వి. నీదే బాధ్యత”
తరవాత రోజు రూపాలి ని పిలిచి చెప్పాడు,”రూపాలి నీ పెర్ఫార్మన్స్ బాగుంది.అయాం హాపీ. నీకు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకొంటున్నాను. ఇక నుంచీ శరత్ నీకు చెప్పినా చెప్పక పోయినా, బాధ్యత నీదే అవుతుంది”,
రూపాలి అలానే అని, తలూపి వెళ్ళిపోయింది. ఈలోగా సంతోష్ రెడ్డి వచ్చాడు. “ఏమప్పా శ్రీధరూ.లంచికి పోదామా?” అన్నాడు సంతోష్. క్యాంటీన్ కి వెళ్ళే దారి లో, “నేను పేపర్లు పెట్టేసినానబ్బా. మా పులివెందుల బావ హైదరాబాదు లో ఒక పదెకరాలు కొనినాడు. రియల్ ఎస్టేట్ చేసుకుందాం రమ్మంటున్నాడు. వైఎస్సార్ గవుర్నమెంటు లో బాగా పలుకుబడి ఉంది లే మా బావ కి”, అంటున్నాడు సంతోష్.

*********************

ప్రాజెక్ట్ మంచి ఊపు లో ఉంది. శ్రీధర్ పది నెలలకి ఎస్టిమేట్ ఇస్తే, ఆనంద్ దానిని ఐదు నెలలు చేసి కస్టమర్ నుంచీ ప్రాజెక్ట్ తెచ్చాడు. శ్రీధర్  జనాలందరికీ పని ఇవ్వటం మొదలుపెట్టాడు. కస్టమర్ కి “వీక్లీ స్టేటస్ రిపోర్ట్” పంపించేటపుడు శ్రీధర్ ఇది గమనించాడు…… రూపాలి కీ శరత్ కీ ఉమ్మడి గా ఇచ్చిన టాస్కు ముందుకి కదల లేదు. శ్రీధర్ ఇద్దరినీ పిలిచి కారణం అడిగాడు. రూపాలి శరత్ ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొన్నారు.
రూపాలి అంది,”శరత్ నాదగ్గరికి వచ్చి తనే ఓనర్ని అని చెప్పాడు. సో,నేను అతను చేస్తున్నాడు అనుకొన్నాను”
శరత్ అన్నాడు,” నువ్వు తరవాత రూపాలి కి తనే ఓనర్ అని చెప్పటం విన్నాను.నీ డెసిషన్ మార్చుకొన్నవేమోలే అని నేనూరుకొన్నాను. నేను వేరే టాస్క్ లు చూసుకొంటున్నాను”
శ్రీధర్ తనలో తను పెద్దగా అరుచుకొన్నాడు,” భగవంతుడా,నన్ను నువ్వే రక్షించు!”. తరవాత వాళ్ళిద్దరికీ వేరే వేరే టాస్కులు ఇచ్చాడు శ్రీధర్.
అప్రైజల్స్ స్టార్ట్ అయ్యాయి. రూపాలి కోపం గా ఉంది. ఆమె కిచ్చిన రేటింగ్స్ వలన ఆమె కి చాలా అసంతృప్తి కలిగింది. ఆమె శ్రీధర్ తో అంటూంది, “నేను రాత్రి పూట కూడా పని చేశాను. వీకెండ్స్ పని చేశాను. శరత్ ఎప్పుడూ యెర్లీ గా వెళ్ళిపోతాడు. అయినా అతనికి  నాకంటే  మంచి  రేటింగ్స్ వచ్చాయి. అప్రైజల్ నిష్పక్షపాతం గా లేదు.”
శ్రీఎధర్ అన్నాడు, “అప్రైజల్ అనేది,ఒకమనిషి ఎంత పని చేశాడు అనో లేదా, ఆ మనిషి నో, అప్రైజ్ చెయ్యటం కాదు. చివరి గా ఆ మనిషి కంపెనీ కి తన వంతు గా ఎంత ఉపయోగ పడ్డడా అని చూడాలి. అయినా ఒకరి రేటింగ్స్ తో పోల్చుకోవద్దు”.
శ్రీధర్ సమాధానం రూపాలి కి తృప్తినివ్వలా. తరవాత ఓ వారం రోజులు అప్పుడప్పుడూ రూపాలి కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తన సెల్ లో నెమ్మది గా మాట్లాడటం విన్నాడు శ్రీధర్. ఓ నెల రోజుల తరువాత రూపాలి నుంచీ శ్రీధర్ కి రెజిగ్నేషన్ లెటర్ వచ్చింది.

***************


కిందటి వారం స్పెసిఫికేషల డాక్యుమెంట్ కస్టమర్ కి పంపించారు. కస్టమర్ చాలా రోజులు జవాబు ఇవ్వలా. చివరికి, ఓ రోజు “ఆక్సెప్టెడ్” అని ఒక ముక్క మెయిల్ ఇచ్చాడు. స్పెసిఫికేషల ఆధారం గా హై లెవెల్ డిసైన్ మొదల్య్యింది. ఇది ప్రణాళికాసామాగ్రి (సాఫ్ట్వేర్ ప్రొగ్రాం)  తయారీ లో చాలా ముఖ్యమైన ఘట్టం.  ఇప్పుడు తీసుకొనేనిర్ణయాలు సరి గా లేక పోతే తరవాత చాలా ఇబ్బందులు పడాలి.
కస్టమర్  తో ఒక టెలిఫోన్ సమావేశం జరిగింది. ఆనందూ శ్రీధరూ ఇంకా జట్టు మొత్తం అటెండ్ అయ్యింది ఆ మీటింగ్ కి. శ్రీధర్ కి మీటింగుల్లో ఆనంద్ మాట్లాడే విధం నచ్చదు. ఒక యాంత్రిక మైన లయ (మెకానికల్ రిథం) తో మాట్లాడుతాడతను. అతను మాట్లాడటం చూస్తే చిన్నప్పుడు బందరు హోటల్లో సర్వర్ చదివిన టిఫిన్ల దండకం గుర్తుకు వస్తుంది శ్రీధర్ కి.
వినియోగదారుడు (కస్టమర్) డాటా ఫ్లో డయాగ్రం లో ఒక విషయం గురించి అడిగాడు. కానీ టీం లో ఎవరికీ దానిని గురించి తెలితదు. ఎవరైనా తెలియని విషయం అడిగినప్పుడు, దానికి సమాధానం ఇవ్వటానికి చాలా మార్గాలున్నాయి. శ్రీధర్ అయితే రిస్కు తీసుకొని, తనకి తోచిన ఒక సమాధానం చెప్పి ఉండే వాడు. ఆ సమాధానం సరైనదైతే అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ వివరణ తప్పు ఐతే కస్టమర్ కి శ్రీధర్ టీం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. “మేము తరవాత నీకు సమాధానం చెబుతాం”, అని చెప్పవచ్చు. కానీ అప్పటికే ఆ ట్రిక్ శ్రీధర్ చాలా సార్లు ఉపయోగించాడు. చివరికి శ్రీధర్, “దీనికి సమాధానం మాకు తెలియదు”,అని చెప్పాడు.
మీటింగ్ అయ్యిన తరువాత ఆనంద్, శ్రీధర్ నీ టీం నీ బయటకు పంపి కస్టమర్ తో ఒక్కడే మాట్లాడాడు. ఓ పది నిమిషాల తరవాత ఆనంద్ శ్రీధర్ ని తన రూం లోకి పిలిచాడు.
” కస్టమర్ కి నువ్వు చెప్పింది నచ్చలేదు.ఇక నుంచీ జాగ్రత్త గా ఉండు”, అన్నాడు.
శ్రీధర్ ఆనంద్ ని అడిగాడు, ” నేను ఏమి చెప్పి ఉండాల్సింది?”
శ్రీధర్ ప్రశ్న ఆనంద్ కి నచ్చలేదు. అయినా తనను తాను నియంత్రించుకొని (కంట్రోల్ చేసుకొని) చెప్పాడు ఆనంద్,”కస్టమర్ కి మనం చెప్పే సమాధానం, అతనికి మనమీద ఉన్న మంచి అభిప్రాయాని తగ్గించేది గా ఉండ కూడదు”
శ్రీధరేమీ మాట్లాడ లేదు కానీ ఇలా అనుకొన్నాడు,” కస్టమర్ మైండ్ లోఏముందో మనకేమి తెలుసు. ప్రాబ్లెం తెలియదు అని ముందే చెప్తే మంచిది. చివరి నిమిషం లో చెప్తే దీని వలన నష్టం ఎక్కువ అవుతుంది.బాస్ అనేవాడు సబార్డినేట్స్ చేసిన తెలివైన తప్పులని,కాలిక్యులేటెడ్ రిస్క్ నీ సపోర్ట్ చెయ్యాలి.లేక పోతే బాస్ సాదా సీదా ఫలితాలతో సరి పెట్టుకోవాలి”.
డిజైన్ డాక్యుమెంట్ పూర్తి అయ్యింది. కస్టమర్ కి ఆ డాక్యుమెంట్ పంపించుదామను కొంటుండగా శ్రీధర్ కి ఆనంద్ నుంచీ మెయిల్ వచ్చింది. కస్టమర్ రిక్వైర్మెంట్ మార్చాడు. ఇప్పుడు డిజైన్ డాక్యుమెంట్ మళ్ళీ మొదటి నుంచీ ప్రిపేర్ చెయ్యాలి. శ్రీధర్ కి వళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆనంద్ దగ్గరికి వెళ్ళి, “రెక్వైర్మెంట్  మారింది.దీని వలన షెడ్యూల్ మారుతుంది. ఇది చేంజ్ రిక్వెస్ట్. కాబట్టీ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది” అన్నాడు.
” కాస్ట్ విషయం నాకు వదిలెయ్. షెడ్యూల్ మాత్రం పాతదే ఉంటుంది.నేను కస్టమర్ కి కమిట్ చేశాను.”
శ్రీధర్ కోపం కంట్రోల్ చేసుకొని, ప్రశాంతం గా అడిగాడు ఆనంద్ ని,” నువ్వు కస్టమర్ కి కమిట్ అయ్యే ముందు టీం తో డిస్కస్ చెయ్యాలి అనిపించలేదా?”
“శ్రీధర్, నేను ఏం చెయ్యాలి అనేది, నీకు సంబంధించిన విషయం కాదు. నీకు కావాలంటే ఇంకా ఎక్కువ మందిని ఇస్తాను.కానీ షెడ్యూల్ మారదు”.
“ఆనంద్, ఈ లెక్కలు అన్నిసార్లూ పని చెయ్యవ్. నువ్వు నాకు తొంభై రెట్లు జనాలను ఇస్తే ప్రాజెక్ట్ ను ఒక్క రోజులో అవ్వగొట్టగలమా?”
“చూడు శ్రీధర్, నేను పదిహేను సంవత్సరాల నుంచీ చూస్తున్నాను. ప్రాజెక్టులు పేపర్ మీద ఎలా నడిచినా, నిజ జీవితం లో ఇలానే నడుస్తాయి. టీం ని ఎక్కువ సేపు పని చెయ్యమను.  మళ్ళీ ఎక్కువ సేపు పనిచెయ్యటం సరి కాదు అనవద్దు.  జనాలు లేటు గా ఉండి చేసిన పనే సాఫ్ట్ వేర్ కంపెనీ ల లాభాలు గా మారుతుంది”.


***********


ఫణి శ్రీధర్ దగ్గరికి వచ్చి మళ్ళీ మొదలెట్టాడు. “నేను జావా లో పని చేశాను.జావా లో ఏమన్నా వర్క్ ఉంటే ఇవ్వు.లేకపోతే, పక్కన ఓ జావా ప్రాజెక్టు జరుగుతోంది. దానికి పంపించు”
ఆనంద్ తో మాట్లడితే అన్నాడు,” శ్రీ, వీళ్ళు ఇలానే అంటూ ఉంటారు. పని చేసే వాడికి  జావా ఐనా ఒక్కటే, సీఎ ప్లస్ ప్లస్ అయినా ఒక్కటే. మనం ఫణి ని ఒక్కసారి పంపిస్తే, టీం లో మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారు, మార్చమని…అప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ చెయ్యటమే కష్టం అవుతుంది”  కానీ శ్రీధర్ కి ఈ మాటలు నచ్చలా.
శ్రీధర్ కి సేల్స్ టీం పధ్ధతి కూడా నచ్చలా. కస్టమర్ హఠాత్తు గా పెర్ఫార్మన్స్ గురించి గొంతెమ్మ కోరికలు కోరటం మొదలు పెట్టాడు. ఏంటా అని ఆరా తీస్తే శ్రీధర్ కి తెలిసింది, శ్రీధర్ వాళ్ళ కంపెనీ సేల్స్ టీం వాళ్ళు కస్టమర్ కి, “మా వాళ్ళు వీరులూ, శూరులూ” అని చెప్పారని.
శ్రీధర్ “టీం అంతా ఒక పిక్నిక్ కి వెళ్దాం”, అని ప్రతిపాదించాడు. ఆనంద్ మూడ్ బాగున్నట్లుంది, వెంటనే ఓకే చేశాడు. ట్రెక్కింగ్ కి రామానగరం వెళ్ళారంతా. టీం లో వాళ్ళు చాలా వరకూ సిటీ జనాలవటం వలన, వాళ్ళ కి అదో వెరైటీ గా ఉంది. శ్రీధర్ ఇటువంటి ట్రెక్కింగ్ లు చాలానేచేశాడు చిన్నప్పుడు. కానీ ఈ మొత్తం విషయం లో ఒక సర్ ప్రైజ్ మనీషా. ఆమె శ్రీధర్ టీం లో లేదు. అయితే ఆనంద్ అడిగినట్లున్నాడు ఆమెను కూడా జాయిన్ అవ్వమని.


*************
 


కస్టమర్ హార్డ్ వేర్ పంపించాలి. కానీ అది రావటం ఓ రెండు వారాలు లేట్ అయ్యింది. ఈ విషయం శ్రీధర్ వీక్లీ స్టేటస్ రిపోర్ట్ లో రాశాడు. కస్టమర్ మానేజర్ పేరు లూసీ. ఆమె సాధారణం గా వీక్లీ స్తేటస్ రిపోర్ట్లు చదవదు. కానీ ఈ రిపోర్ట్ చదివింది. ఆమె ఆనంద్ కి కాల్ చేసింది. తరవాత ఆనంద్ శ్రీధర్ ని కాల్ చేశాడు. “చూడు శ్రీధర్, కస్టమర్ నీ గురించీ, ప్రాజెక్ట్ గురించీ హాపీ గా లేడు(దు). ఇలా అయితే కస్టమర్ కమ్మ్యూనికేషన్ విషయం లో ఒక కొత్త లీడ్ ని పెట్టాలి”
“ఏమిటి ప్రాబ్లం? నేను నా పని చేస్తున్నాను కదా?”
” ఏ కస్టమరూ తన వెండర్ యొక్క లీడ్ పనిమంతుడైతే వదులు కోవాలని అనుకోడు”.
ఆనంద్ మాటలు శ్రీధర్ లో ఆందోళన పెంచాయి. లూసీ చెడు గా చెప్పి ఉంటుందా తన గురించి?  లేక పోతే నా మీద ఒత్తిడి పెంచి పని చేయించుకొనేటందుకు ఆనందే ఇలా చెప్తున్నాడా?”
కస్టమర్ కి ఒక ఇంటర్మీడీయేట్ వర్షన్ ని రెలీజ్ చేశారు. తరవాత లూసీ ఆనంద్ కి ఇలా ఇంగ్లీష్ లో మెయిల్ చేసింది, “ఈ వర్షన్ దిక్కుమాలినట్లుంది. మీరు మా సమయాన్నీ, దబ్బునీ వృధా చెయ్యటం లేదని ఆశిస్తాను”



మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456

ఇంకా ఉంది…

No comments:

Post a Comment