Tuesday 7 August 2012

గ్రూప్-2 సందేహ ప్రశ్నలకు... వివరణాత్మక సమాధానాలు

02- 08- 2012 : గ్రూప్-2 సందేహ ప్రశ్నలకు... వివరణాత్మక సమాధానాలు
గ్రూప్-2 పరీక్షలు ముగిసినప్పటికీ అభ్యర్థుల్లో ఆందోళన తగ్గలేదు. ఎందుకంటే.. సాక్షితో పాటు ఇతర పత్రికలు, వివిధ కోచింగ్ సంస్థలు, వెబ్‌సైట్‌లు గ్రూప్ 2 కీ రూపొందించి అందించాయి. మొత్తం మూడు పేపర్లూ కలుపుకొని 450 ప్రశ్నల్లో సుమారు 75 ప్రశ్నలకు సమాధానాల్లో పొంతన కుదరడం లేదు. దాంతో అభ్యర్థుల్లో ఆందోళన తొలగించడానికి సాక్షి నిర్ణయించింది.

ఆయా కీల్లో పొంతనకుదరని ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వకుండా.. ఆ సమాధానానికి వివరణతోపాటు సరైన, ప్రామాణిక ఆధారాన్ని కూడా జతచేశాం. లక్షల మంది విద్యార్థులకు
ప్రయోజనం చేకూరాలనే లక్ష్యంతో సాక్షి నిపుణుల బృందం రూపొందించిన ప్రశ్నపత్రాల వారీ సమాధానాలు, ప్రామాణిక ఆధారాలు మీ కోసం అందిస్తున్నాం...

పేపర్ 1

ప్రశ్న: మానవుల్లో భాగమైనది(అంశీభూతమైనది) వయస్సుతో పాటు మారనది ఏది? సమాధానం: డీఎన్‌ఏ
వివరణ: వయసుతోపాటు శరీర ధర్మ సంబంధ మైన క్రమాల్లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మూత్ర సంఘటనాల్లో మార్పులు సంభవి స్తాయి. అలాగే ఎముకల సాంద్రత, గుండె పరిమాణంలో కూడా మార్పులుంటాయి. కానీ వయసుతోపాటు డీఎన్‌ఏ మారదు కాబట్టి డీఎన్‌ఏ సరైన సమాధానం.

ప్రశ్న: మానవత్వ ప్రాతిపదికన అశోకుడు ఏ దిన మున కొంతమంది ఖైదీలను విడుదల చేసారు?
సమాధానం: పట్టాభిషేకం రోజున
వివరణ: అశోకుడు తన పట్టాభిషేకం రోజున మానవత్వ ప్రాతిపదికన కొందరు ఖైదీలను విడుదల చేశాడు.
మూలం: ది కేంబ్రిడ్జి షార్టర్ హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్‌లో పేజీ నెం. 49.

ప్రశ్న: వ్యవసాయ పన్నుల పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాను?

సమాధానం: మహ్మద్ బిన్ తుగ్లక్
వివరణ: సిస్టమ్ ఆఫ్ ఫార్మింగ్ టాక్సెస్ (దళారీ పన్నులు వసూలు చేయడం)ను రద్దు చేసింది అల్లా ఉద్దీన్ ఖిల్జీ, మహ్మద్ బిన్ తుగ్లక్. ఇచ్చిన సమాధానాల్లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ లేదు. కాబట్టి మహ్మద్ బిన్ తుగ్లక్ సరైన సమాధానం.

ప్రశ్న: సున్నా జనాభా పెరుగుదల రేటు దగ్గర వరకు వస్తున్న దేశం? సమాధానం: ఫ్రాన్స్
మూలం: టాటా మెక్‌గ్రాహిల్స్ పబ్లికేషన్స్ జాగ్రఫీ బుక్ బై సురేందర్ సింగ్, పేజీ నెంబర్: 12, ప్రశ్న: 280

ప్రశ్న: కింది సంఖ్యల అవరోహణ క్రమం?

ఎ) వందవేలు బి) ఒక మిలియన్
సి) ఒక అరబ్ డి) ఒక కోటి
ఇ) ఇరవై లక్షలు
సమాధానం: సి, డి, ఇ, బి, ఎ
వివరణ: ఒక అరబ్ అంటే 100 కోట్లు, ఒక మిలియన్ అంటే పది లక్షలు కాబట్టి ఇచ్చిన వాటిని అవరోహణ క్రమంలో రాస్తే.. అరబ్, కోటి, 20 లక్షలు, మిలియన్(పది లక్షలు), వంద వేలు(లక్ష) అవుతుంది.

ప్రశ్న: బ్రిటిష్ ఇండియాకి మొట్ట మొదటి గవర్నర్ జనరల్?
సమాధానం: వారన్ హేస్టింగ్స్
మూలం: ది యూనివర్సిటీ డిక్షనరీ ఆఫ్ బయో గ్రఫీ అండ్ మైథాలజీ -వాల్యూమ్-2, బై జె. థామస్. పేజీ నంబరు: 142

ప్రశ్న: భూకంపంలో నుంచి వదలబడేది?
సమాధానం: ప్రకంపనాలు
వివరణ: భూకంపం సంభవించినప్పుడు అధిక శక్తితో కూడిన తరంగాలు విడుదలవుతాయి. వాటినే ప్రక ంపన తరంగాలు అంటారు. కాబట్టి సరైన సమాధానం ప్రకంపనాలు.

ప్రశ్న: వేవల్ ప్రణాళికను ప్రకటించిన సంవత్సరం? సమాధానం: 1945
మూలం: ది పియర్‌సన్ సీశాట్ మాన్యువల్ 2011. పేజీ నంబరు: 203

ప్రశ్న: సింధు నాగరికత, కాలంనాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకవంటిది ఏది?
సమాధానం: వ్యవసాయం
మూలం: ఇండస్ సివిలైజేషన్ బై ఆర్‌కే పృథి. పేజీ నంబరు: 13

ప్రశ్న: వాల్కానిక్ బారెన్ ద్వీపం ఏ భాగపు ఇండియాలో ఉంది?
సమాధానం: దక్షిణ అండమాన్
మూలం: అండమాన్ అండ్ నికోబార్ ఐలాం డ్స్- ఎ జియో పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ బై ఆర్వీఆర్ మూర్తి. పేజీ నంబరు: 24

ప్రశ్న: స్టేట్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు? సమాధానం: ముఖ్య కార్యదర్శి
మూలం: ఎమర్జన్సీ మెడికల్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బై డేవ్, గుప్తా, పరమర్, కాంత్. పేజీ నంబరు: 284

ప్రశ్న: అనుమకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు? సమాధానం: రుద్రదేవుడు
మూలం: బీఎస్‌ఎల్ హనుమంతరావు రాసిన ఆంధ్రుల చరిత్ర పుస్తకం పేజీ నంబరు: 235

ప్రశ్న: క్రమపద్ధతిలో యోగాభ్యాసాలను అవ లంబించిన సూఫీ మత శాఖ? సమాధానం: చిష్టీ
వివరణ: చిష్టీ సూఫీ మత శాఖ గురువు హజ్రత్ నిజాముద్దీన్ యోగాభ్యాసాలను అవలంబిం చారు. అందువల్ల సైరె న సమాధానం చిష్టీ.

ప్రశ్న: కింది రాష్ట్రాల్లో ఎక్కడ తీవ్ర హిమప్రవాహములు సంభవిస్తాయి?
 సమాధానం: పైవన్నీ
వివరణ: జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్త రాఖండ్‌లో తీవ్ర హిమప్రవాహాలు సంభవిస్తా యి. కాబట్టి నాలుగో ఆప్షన్ సరైన సమాధానం.
మూలం: సార్క్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెబ్‌సైట్ (http:// saarcsdmc.nic.in)లోని పబ్లి కేషన్‌లో ‘ఎస్‌డీఆర్ 2008 అవలాం చెస్’(6వ చాప్టర్, పేజీ నంబరు 83)

ప్రశ్న: ఏప్రిల్ 2012లో ఇండో-టిబెటన్ బార్డరు పోలీసు స్థానిక హెడ్ క్వార్టర్సు ఇండియాలో ఎక్కడ ప్రారంభించారు? సమాధానం: బీహార్
వివరణ: ఐటీబీపీ సెక్టార్ హెడ్‌క్వార్టర్స్‌ను 2012 ఏప్రిల్ 2న పాట్నాలో ప్రారంభించారు. కాబట్టి బీహార్ సరైన సమాధానం. ఈ వార్త ఏప్రిల్ 3, 2012న టైమ్స్ ఆఫ్ ఇండియాతోపాటు వివిధ ఆంగ్ల పత్రికల్లో ప్రచురితమైంది.

ప్రశ్న: రాజ్యసభ మెంబర్లుగా 2012లో ఎంత మందికి పదవీ స్వీకరణ శపథమును చేయిం చారు?
సమాధానం: 50 మంది వ్యక్తులు
వివరణ:
వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది రాజ్యసభ సభ్యులు 2012లో ప్రమాణ స్వీకారం చేశారు.

పేపర్-2
ప్రశ్న: ఆంధ్రలో దాస సమాజాన్ని ఏర్పరచిన వారు? సమాధానం: బ్రహ్మనాయుడు
మూలం: ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర పుస్తకంలో పేజీ నం 88

ప్రశ్న: కాయస్థ అనేది ఎవరి కులం?
సమాధానం: లేఖ్య రక్షకులు(రికార్డ్ కీపర్స్)
మూలం: ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర పుస్తకంలో పేజీ నం 91

ప్రశ్న: తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనల్ని తెలియజేసే శాసనం?
సమాధానం: పాఖాల శాసనం
మూలం: ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర పుస్తకంలో పేజీ నం 89

ప్రశ్న: నానా సాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు రేపిందెవరు?
సమాధానం: కోరుకొండ సుబ్బారెడ్డి
మూలం: ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర పుస్తకంలో పేజీ నం 126

ప్రశ్న: రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపా లనా విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం? సమాధానం: 1794
మూలం:
ఆంధ్రుల చరిత్ర పుస్తకంలో పేజీ నం 511

ప్రశ్న: జాషువాను మధురకవిగా వర్ణించిన వాడు? సమాధానం: త్రిపురనేని రామస్వామి
మూలం: ఆంధ్రుల చరిత్ర పుస్తకం(బి.ఎస్.ఎల్ హనుమంతరావు)

ప్రశ్న: కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
సమాధానం: గుంటూరు
మూలం: హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్- పి.రఘునాథరావు పేజీ నం. 219

ప్రశ్న: ‘బ్రహ్మ ప్రకాశిక’ అనే పత్రికకు సంపాదకత్వం వహించింది?
సమాధానం: రఘుపతి వెంకటరత్నం నాయుడు
మూలం: ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర పుస్తకంలో పేజీ నం 131

ప్రశ్న: ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌ను నెలకొల్పిన వాడు?
సమాధానం: కేశవరావ్ కోరాట్కర్
మూలం: ఆంధ్రుల చరిత్ర (బి. ఎస్.ఎల్ హనుమంతరావు) పుస్తకం ఆధారంగా
ప్రశ్న: కంకిపాడులో 1939లో ‘రాజకీయ పాఠశాల’ను ఏర్పాటు చేసింది?
సమాధానం: పుచ్చలపల్లి సుందరయ్య
మూలం: ఆంధ్రుల చరిత్ర (బి.ఎస్.ఎల్ హనుమంతరావు)

ప్రశ్న: ‘హాస్యవర్థిని’ అనే పత్రికను నెలకొ ల్పినది? సమాధానం: కందుకూరి వీరేశలింగం
మూలం: హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఆంధ్ర ప్రదేశ్
(పి.రఘునాథరావు)పుస్తకం పేజీనం.216

ప్రశ్న: L.I.C of india v. Consumer Education and Research case పీఠికను గురించి సుప్రీం కోర్టు ఏవిధంగా పేర్కొంది? సమాధానం: రాజ్యాంగంలో భాగం
మూలం: కాన్‌స్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా
(జె.ఎన్. పాండే) పుస్తకంలో పేజీ నం. 237

ప్రశ్న: Excel Wear v. Union of indiaకేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను ఏ విధంగా పేర్కొంది?

సమాధానం: జాతీయీకరణ, ఇండస్ట్రీలను ప్రభుత్వపరం చేయడం.
మూలం: కాన్‌స్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా (జె.ఎన్. పాండే) పుస్తకంలో పేజీ నం. 32.

ప్రశ్న: అన్ని మతాలను (సమానంగా) గౌరవిం చడం మంచిదని తెలిపే సుప్రీంకోర్టు కేసు?

సమాధానం: అరుణ్ రాయ్ కేసు
మూలం: కాన్‌స్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా (జె.ఎన్. పాండే) పుస్తకంలో పేజీ నం. 33.

ప్రశ్న: ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ ఏ సవరణ కలగజేసింది?
సమాధానం: ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం లేదు
వివరణ: రాజ్యాంగంలోని 93వ సవరణ ద్వారా ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో రిజర్వే షన్ కల్పించారు.

ప్రశ్న: ప్రాథమిక హక్కులు నేరుగా ఎవరికి వర్తించవు?
సమాధానం: ఆర్మీలో పని చేసేవారికి
మూలం: ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
(పీ. ఎం. భక్షీ ) పుస్తకంలో పేజీ నం.85, 86.

ప్రశ్న: సుప్రీం కోర్టు 50 శాతానికి మించి రిజర్వే షన్లు కల్పించకూడదని ఏ కేసులో తెలిపింది?
సమాధానం: ఇంద్రా సహాని కేసు
మూలం: భారత రాజ్యాంగం (పడాల రామి రెడ్డి) పుస్తకంలో పేజీ నం. 141

ప్రశ్న: రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబం ధించి పార్లమెంటుకు చట్టం చేసే అధికారం కల్పించే అధికరణ?
సమాధానం: ఆర్టికల్ 249
మూలం: చాప్టర్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
(డి.డి. బసు) పుస్తకంలో పేజీ నం. 80
ప్రశ్న: అధికరణ 105 ఎవరి అధికారాలు, విశేష అధికారాలకు సంబంధించింది?
సమాధానం: పార్లమెంట్ సభ్యులు
మూలం: చాప్టర్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా
(డి.డి. బసు) పుస్తకంలో పేజీ నం. 348, 349

ప్రశ్న: స్టేట్ ఆఫ్ గుజరాత్ ఠిట. శ్రీ అంబికా మిల్స్ కేసులో సుప్రీం కోర్టు గ్రహణ సిద్ధాంతం ఎవరికి సంబంధించి రూపొందించారు?
సమాధానం: పోస్టు కాన్‌స్టిట్యూషన్ చట్టాలు
మూలం: కాన్‌స్టిట్యూషనల్ లా ఆఫ్ ఇండియా
(జె.ఎన్. పాండే) పుస్తకంలో పేజీ నం. 70

పేపర్-3

ప్రశ్న: వనరుల కేటాయింపు, ఉపయోగాలనుద్దేశించే ఆర్థిక ప్రణాళికను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థను పిలిచేది?
సమాధానం: సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
వివరణ: Economic planning refers to any directing or planning of econo-mic activity outside mechanism of the market.

మార్కెట్ యంత్రాంగం బయట ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రణాళిక రచన ఆర్థిక ప్రణాళిక. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉన్న అనేక దేశాల ఉత్పాదితాలు ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికా రచనలో మార్కెట్ యంత్రాంగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. సంప్రదాయ ఆర్థిక వేత్తలు, మార్క్స్ లాంటివారు ఆర్థిక ప్రణాళికను సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఫండమెంటల్ ఎలిమెంట్‌గా పేర్కొన్నారు.
ఆధారం:en.wikipedia.org/wiki/ Economic_Planning

ప్రశ్న: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్మూలిస్తూ, హెచ్చు ఆదాయం, ఉద్యోగితను సాధించాలనే ప్రణాళిక?
సమాధానం: మానవ శక్తి ప్రణాళిక

వివరణ: ఒక వ్యక్తి, సంస్థ లేదా సమాచారం ఇచ్చిన నిర్ణీత కాలంలో లక్ష్యాలను వ్యూహాత్మకంగా సాధించడాన్ని అభివృద్ధి ప్రణాళిక అంటారు. కాలం ఆధారిత ప్రమేయం ఈ ప్రణాళికలో ఇమిడి ఉంటుంది. మూలధన కొరత ఎదుర్కొనే దేశాలకు ఈ ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వదు. మరోవైపు ఒక సంస్థ లేదా దేశానికి మానవ శక్తి ప్రణాళిక అవసరం. త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించడానికి, భౌగోళికంగా శ్రామికుల గమన శీలతను శిక్షణ ద్వారా పెంపొందించి వారిలో ఆదాయం, ఉపాధి పెంపొందించాలంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు మానవ శక్తి ప్రణాళిక ఆవశ్యకత ఉంది. ఆయా దేశాల్లో నిరుపయోగంగా ఉన్న వనరుల అభిలషణీయ వినియోగం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే...ఎక్కువ శాతంగా ఉన్న తక్కువ నైపుణ్యం గల శ్రామిక శక్తి ద్వారా ఉత్పాదకత పెంచి ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఈ ప్రణాళిక అవసరం.


కొన్ని ప్రశ్నలకు ఒక్కో పుస్తకంలో ఒక్కో సమాధానం ఉంది. దీంతో ప్రామాణిక పుస్తకం చదవని అభ్యర్థులు నష్టపోతున్నారు. అందుకే ఏపీపీఎస్‌సీ సూచించిన ప్రామాణిక పుస్తకాన్ని ఎంపిక
చేసుకోవడం శ్రేయస్కరం. భవిష్యత్తులో ఏపీపీఎస్‌సీ పరీక్షలు రాసేవారు స్టడీ మెటీరియల్
ఎంపికలో జాగ్రత్త వహించాలి.

ప్రశ్న: సంస్కరణల అనంతర ఇరవై సంవత్సరాల కాలంలో భారత దేశ వాస్తవ తలసరి ఆదాయ పెరుగుదల?
సమాధానం: 2.5 రెట్లు
ఆధారం: ఇండియా ఎకనమిక్ సర్వే 2011-12లో చాప్టర్1 పేజ్ నెంబర్ 6లో 1.13 పాయింట్లలో చివరి రెండు లైన్లు

ప్రశ్న: విదేశీ మారక చెల్లింపుల శేషంలోని మూలధన ఖాతాలో వర్గీకరించిన డెట్ లేదా ఈక్విటీ, స్వల్ప లేదా దీర్ఘకాల అంశాలు?

సమాధానం: మూలధన ప్రవేశ ప్రవాహాలు
ఆధారం:
ఇండియన్ ఎకనమిక్ సర్వే చాప్టర్-6లో 6.4 పాయింట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రశ్న: భారతదేశ విదేశీ మారక చెల్లింపుల అసమానతల పెరుగుదలకు కారణం జాతీయ స్థూల ఉత్పత్తి శాతంలో పెరుగుతున్న వ్యాపార లోటు, పెరుగుతున్న?
సమాధానం: కరంట్ ఖాతా లోటు
ఆధారం:
ఇండియా ఎకనమిక్ సర్వే చాప్టర్-6లో 6.74 పాయింట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ప్రశ్న: భారతదేశం స్వాతంత్య్రం పొందిన సమయంలో మందకొడి ఆర్థికాభివృద్ధి అనుభవాన్ని పొందడానికి కారణం?
సమాధానం: మూలధన కొరత
వివరణ: బ్రిటిష్ కాలంలో హోంచార్జీల రూపంలో భారత సంపద విదేశాలకు తరలి వెళ్లినందువల్ల మూలధన కొరత ప్రధాన సమస్యగా ఉంది. ఆర్థికాభివృద్ధికి అవసరమైన మూలధన వస్తు పరిశ్రమలపై ఆశించిన స్థాయిలో పెట్టుబడులు జరగలేదు. బ్రిటిష్ కాలంలో ఆర్థికాభివృద్ధికి కుల వ్యవస్థ ప్రతిబంధకం కాలేదు. కుల వ్యవస్థ శ్రమ విభజనకు దారితీసింది.
ఆధారం: భారత ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడెమీ చాప్టర్-1

ప్రశ్న: బ్రిటిష్ పాలన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ అల్ప వృద్ధి, ఆధారిత వ్యవస్థగా ఉండటానికి కారణాలు విదేశీ వర్తకంలో మార్పులు మరియు?

సమాధానం: హస్తకళలు అంతరించడం
వివరణ: బ్రిటిష్ కాలంలో హస్తకళలు అంతరించిన కారణంగా ఈ రంగంపై ఆధారపడిన శ్రామికులు వ్యవ సాయరంగ శ్రామికులుగా మిగిలిపోయారు. 1947మ నాటికి వ్యవసాయ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తి 72 శాతంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత తక్కువగా ఉన్న నేపథ్యంలో భారత్ అల్పాభివృద్ధి దేశంగా మిగిలిపోయింది. మరోవైపు పారిశ్రామికంగా కూడా భారత్ వెనుకబడింది.
ఆధారం: ఎంఏ-ఎకనామిక్స్ రెండో సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ చాప్టర్-1, నాగార్జున యూనివర్సిటీ

ప్రశ్న: భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు కస్టమర్ డిపాజిట్లు, డిస్కౌంటు బిల్లుల మధ్య నిర్వహించే నిష్పత్తిని పిలిచేది?
సమాధానం: కనిష్ట రిజర్వు నిష్పత్తి
వివరణ: వాణిజ్య బ్యాంకు ఒక వ్యక్తి నుంచి డిపాజిట్ స్వీకరించినప్పుడు దానిలో కొంత భాగాన్ని కనిష్ట రిజర్వ్‌గా తనవద్ద ఉంచుకొని, మిగతా మొత్తాన్ని బిల్లుల డిస్కౌంట్‌కు వినియోగిస్తుంది. డిపాజిట్లు, డిస్కౌంట్ బిల్లుల మధ్య నిర్వహించే నిష్పత్తిని కనిష్ట రిజర్వ్ నిష్పత్తి అంటారు.
ఆధారం: బీఏ- రెండో సంవత్సరం, స్థూల అర్థశాస్త్రం పాఠ్యపుస్తకం, తెలుగు అకాడెమీ ప్రచురణ, పేజీ నెంబర్-212

ప్రశ్న: విస్తారమైన టాక్స్‌బేస్, ఎక్సైజ్ సుంకాల సుసంబద్ధీక రణ రూపంలో పరోక్ష పన్నుల్లో వచ్చిన పెద్ద వ్యవస్థాపరమైన మార్పునకు కారణం దీన్ని ప్రవేశపెట్టడం?
సమాధానం: వాల్యూ ఆడెడ్ టాక్స్
వివరణ: ఎక్సైజ్ పన్నును అమ్మకం కోసం ఉత్పత్తై వస్తువుపై విధిస్తారు. ఈ పన్ను ద్వారా కేంద్రానికి 2007-08 కంటే ముందు కాలంలో రాబడి ఎక్కువగా ఉండేది. ఈ పన్ను మాదిరి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విస్తారమైన టేక్స్ బేస్‌ను కలిగి ఉంది. రాష్ట్రాలకు అధిక ఆదాయాన్ని ఇస్తుంది. వ్యాట్‌ను వస్తు ఉత్పత్తి దశ ముందు ప్రతి దశలోనూ కలిపిన విలువపై విధిస్తారు.

ప్రశ్న: గతంలోని ప్రవర్తనా తీరు, పొదుపు ప్రవృత్తి, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని పన్నుల విధానం కలిసి దీని సమీకరణను ప్రభావితం చేస్తాయి?
సమాధానం: దేశీయ పొదుపు
వివరణ: వ్యక్తుల గత ప్రవర్తనా తీరు, పొదుపు ప్రవృత్తి, పన్నుల విధానం ఆ దేశ దేశీయ పొదుపును నిర్ణయిస్తాయి.

ప్రశ్న: బడ్జెట్‌లోని రుణాలు, ఇతర అప్పులు అంశంలోని కేంద్ర ప్రభుత్వ క్యాష్ బ్యాలెన్స్‌లో ఉండే రిసీప్టులు దేనికి సంబంధించిన రిసీప్టులు?

సమాధానం: దేశీయ రుణ బైబ్యాక్ పథకం
వివరణ: బడ్జెట్‌లోని రుణాలు మార్కెట్ స్థిరీకరణ పథకంలో భాగంగా ఉండవు.
ఆధారం: ఎకనామిక్ సర్వే 2010-11 చాప్టర్ 3 టేబుల్ 3.6

ప్రశ్న: ధరల విధానం ఆశించేది ఆర్థిక వ్యవస్థ మొత్తం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక సంతులిత, సమగ్ర ధరల వ్యవస్థను తయారుచేయడానికి ప్రభుత్వం ప్రకటించేది?
సమాధానం: కనీస మద్దతు ధరలు
ఆధారం: ఇండియా ఎకనమిక్ సర్వే 2011-12 చాప్టర్-8 పేజీ 188 పార్ట్ 8.34
ప్రశ్న: భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి, విభాగ న్యాయం, ధరల స్థిరీకరణ అంశాలు లక్ష్యాలుగా గల విధానం?
సమాధానం: కోశ విధానం
వివరణ: ద్రవ్య విధానాల లక్ష్యాలుగా ధరల స్థిరత్వం, వినిమయ రేటు స్థిరత్వం, ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం ఇమిడి ఉంటాయి. కోశ విధానం ప్రభుత్వం అవలంబించే విధానం. కాబట్టి విభాగ న్యాయం ప్రాధాన్యం పొందుతుంది. విభాగ న్యాయంలో భాగంగా ఆదాయ సంపదలో వ్యత్యాసాల తొలగింపు, ఉపాధి పెంపు, వనరుల సమర్థ పంపిణీ లాంటి అంశాలు కోశ విధాన లక్ష్యాలుగా ఉంటాయి. వీటితోపాటు ఆర్థిక వృద్ధి, ధరల స్థిరీకరణ కోశ విధాన లక్ష్యాలుగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నకు కోశ విధానం సరైన సమాధానమవుతుంది.

ఆధారం: Economic Environment of business- Veena Keshab Pailwar page 155, 291
పశ్న: అసంతులిత వృద్ధి సిద్ధాంతంలోని ప్రమేయం (assumption)ఆర్థిక వ్యవస్థలోని చురుకైన రంగం ఉత్తేజపరచేది?
సమాధానం: వేరొక చురుకైన రంగాన్ని
వివరణ:
అసంతులిత వృద్ధి సిద్ధాంతం ప్రకారం ఆర్థిక వృద్ధి నేపథ్యంలో వివిధ రంగాల మధ్య ఇంటర్ లింకేజ్ ప్రాధాన్యం పొందింది. చురుకైన రంగం ఫార్వార్డ్, బ్యాక్‌వార్డ్ లింకేజ్‌లు కలిగి ఉంటుంది. ఈ రంగం వినియోగించే ముడి సరకు వేరొక పరిశ్రమ తయారుచేసి ఉండాలి. దీనిద్వారా వేరొక పరిశ్రమకు డిమాండ్ పెరుగుతంది (బ్యాక్‌వర్డ్ లింకేజ్). ఈ పరిశ్రమ ఉత్పత్తిని వేరే పరిశ్రమలు ముడి సరకుగా వినియోగించుకునే విధంగా ఉండాలి (ఫార్వార్డ్ లింకేజెస్).
ఆధారం: http://cms.gcg11.org/attachments/article/79/Theory%20of%20Unbalanced%20Growth.pdf

ప్రశ్న: హారడ్-డోమార్ వివరించిన వృద్ధి సిద్ధాంతంలో ప్రధాన అంశం వైవిధ్య పొదుపు?
సమాధానం: ప్రవృత్తి
వివరణ: మూలధన ఉత్పత్తి నిష్పత్తి స్వల్ప కాలంలో స్థిరంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి పొదుపు రేటుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పొదుపు స్థాయి పొదుపు ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుంది.
ఆధారం: Modern Economic Theory-Sampath Mukharjee, Page-943

ప్రశ్న: భారతదేశంలో పెరుగుతున్న జనాభా ఒత్తిడి ఒక ముఖ్యాంశమై దీన్ని పెంపొందించాలంటే ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తుంది?
సమాధానం: మానవ మూలధనంలో పెట్టుబడి
వివరణ:
మానవ మూలధనంలో అధిక పెట్టుబడికి జనాభా పెరుగుదల ప్రభుత్వానికి ఆటంకంగా ఉంటుంది. ప్రశ్నపత్రంలో మిగిలిన మూడు ఆప్షన్లు ఒకే కోవకు చెందినవి.

ప్రశ్న: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి భారతదేశంలో ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నప్పుడు మూలధన ఉత్పత్తి నిష్పత్తి?
సమాధానం: నిరంతరం తగ్గుతూ ఉంటుంది
వివరణ:
అభివృద్ధి చెందుతున్న వ్యవస్థల్లో ఆర్థికాభివృద్ధి జరిగేటప్పుడు మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గుతుంది. ఇటీవల ప్రణాళికల్లో మూలధన ఉత్పత్తి తగ్గుదలను గమనించొచ్చు. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైన మూలధ నాన్ని ‘మూలధన-ఉత్పత్తి నిష్పత్తి’ తెలుపుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి తగ్గుతుంది.

ప్రశ్న: సూచీ సంఖ్యలు కొలిచేది దీనిలోని సంయుక్త హెచ్చు తగ్గులు?
సమాధానం: శ్రేణుల సమూహం
ఆధారం:www.emathzone.com

ప్రశ్న: ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో కలిపిన స్థూల విలువ సమానమయ్యేది ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల విలువ నుంచి దీన్ని తగ్గించినప్పుడు?
సమాధానం: ఉత్పాదకాల విలువ
వివరణ:
ఉత్పత్తై వస్తు విలువ నుంచి దాని వస్తు ఉత్పత్తికి ఉపయోగించిన ఉత్పాదకాల విలువను మినహాయిస్తే ఆ ఉత్పాదక ప్రక్రియ ద్వారా కలిపిన అంతిమ విలువ పద్దతిలో ఒక సంవత్సరంలో కలిపిన స్థూల విలువ తెలుస్తుంది.
ఆధారం:
బీఏ-రెండో సంవత్సరం, స్థూల అర్థశాస్త్రం పాఠ్యపుస్తకం, తెలుగు అకాడెమీ ప్రచురణ, పేజీ నెంబర్-12; ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి, తెలుగు అకాడెమీ, పేజీ నెంబర్-53

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనివారు ఒక పని నుంచి మరొక పనికి మారుతూ ఉన్నప్పుడు ఏర్పడే నిరుద్యోగం?
సమాధానం:
రుతు సంబంధ నిరుద్యోగం
వివరణ:
అభివృద్ధి చెందిన వ్యవస్థల్లోనే సంఘృష్టి లేదా ఘర్షిత నిరుద్యోగం ఉంటుంది. ఈ దేశాల్లో సార్దక డిమాండ్ లోపించడం వల్ల ఘర్షిత నిరుద్యోగం ఉంటుందని కీన్స్ అభిప్రాయపడ్డారు. ఇది తాత్కాలికమేనని కీన్స్ భావన.

ఆంధ్రప్రదేశ్ లాంటి అభివృద్ధి చెందుతోన్న వ్యవస్థల్లో రుతుసంబంధ నిరుద్యోగం ఉంటుంది. ఎక్కువ మంది శ్రామికులు రుతువులతో ముడిపడిన వ్యవసాయ రంగంపై ఆధారపడినవారే. వ్యవసాయ రంగంలో రుతుసంబంధ నిరుద్యోగం ఉన్నందువల్ల మిగిలిన రుతువుల్లో వీరు వ్యవసాయేత ఉపాధి కోసం ప్రయత్నిస్తారు.

No comments:

Post a Comment