Wednesday 1 August 2012

కేంద్ర బడ్జెట్ 2012-13ను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి 16న పార్లమెంటుకు సమర్పించారు. భారీగా పెరిగిన ఆర్థిక లోటును అదుపు చే యటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. ఇందుకు సబ్సిడీల కోత, పన్నుల పెంపు తప్పనిసరైందని తెలిపారు.

బడ్జెట్ విధాన పత్రం

యూరప్‌లో రుణ సంక్షోభం, మధ్య ప్రాచ్యంలో రాజకీయ అనిశ్చితి, పెరిగిన చమురు ధరలు, జపాన్‌లో భూకంపం భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావాన్ని చూపాయి. వీటి వల్ల పెరిగిన ద్రవ్యలోటును తక్షణం సరిదిద్దాల్సిన అవసరం ఏర్పడింది.
గత రెండేళ్ల కాలంలో వృద్ధిరేటు 8.4 శాతానికి చేరుకున్నప్పటికీ... 2011-12 లో వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంటుంది.
ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోతోంది.
గత రెండేళ్లు దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా ద్రవ్య విధానాలను అమలు చేస్తూ వచ్చాము.
కఠినమైన ద్రవ్య విధానం, పెరిగిపోయిన కేటాయింపుల వల్ల వృద్ధి మందగించి, ద్రవ్య సమతుల్యత దెబ్బతింది.
ప్రధాన రంగాలు, తయారీ రంగం కోలుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పడుతున్నట్టు సంకేతాలు తెలుపుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశ స్థూల ఆర్థిక వాతావరణాన్ని మెరుగుపరచి, దేశీయ వృద్ధి కారకాలను పటిష్టం చేయాలి.
12వ పంచవర్ష ప్రణాళికను ‘వేగవంతమైన, పటిష్టమైన, సమ్మిళిత వృద్ధి’ ధ్యేయంగా అమలు చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంపిక చేసిన ఐదు లక్ష్యాలను చేరటానికి గట్టి కృషి జరుగుతుంది.
భారత దేశం ఆర్థికంగా పుంజుకుంటే... అతలాకుతలంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఒక చోదక శక్తిగా మారగలదు. భద్రమైన ప్రపంచ ఆర్థిక రాజధానిగా రూపొందగల అవకాశం ఉంది.

వ్యవస్థ... స్వరూపం

2011-12లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతంగా ఉంటుందని అంచనా. గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే... జీడీపీ తగ్గడానికి పారిశ్రామిక వృద్ది మందగించటమే ప్రధాన కారణం.
వచ్చే కొద్ది నెలల కాలం ద్రవ్యోల్బణం పెరుగుదల స్వల్పంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి స్థిరత్వం సాధిస్తుంది.
పంపిణీ, నిల్వ, సరఫరా వ్యవస్థల మధ్య అంతరాలను తగ్గించటానికి తీసుకున్న చర్యలు ద్ర వ్యోల్బణ నియంత్రణకు దోహదం చేశాయి.
ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధభాగంలో విదేశీ వాణిజ్యంలో అభివృద్ధి ప్రోత్సాహకరంగా ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో కొత్త మార్కెట్లను సాధించాం.
2011-12 జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 3.6 శాతంగా ఉంది. ఇందువల్ల నికర పెట్టుబడుల రాక మొదటి రెండు, మూడు త్రైమాసికాల్లో తగ్గి ఎక్స్‌ఛేంజి రేటుపై ఒత్తిడి పెరిగింది.
2012-13లో భారత వృద్ధి రేటు 7.6 శాతానికి ఒక పావు శాతం హెచ్చుతగ్గులు ఉంటుందని అంచనా.
పత్యక్ష పన్నుల వసూళ్లు తగ్గడం, సబ్సిడీలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల 2011-12 లో ద్రవ్యలోటులో తగ్గుదల కనిపించింది.

ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం

ఆర్థిక బిల్లు-2012లో భాగంగా ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) చట్టానికి సవరణలు
‘ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్’, ‘ మీడియం టర్మ్ ఎక్స్‌పెండిచర్ ఫ్రేం వర్క్’ ప్రధానాంశాలుగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో వ్యయానికి సంబంధించి సంస్కరణలు.
ఎఫెక్టెవ్ రెవెన్యూ డిఫిసిట్ అంటే రెవెన్యూలోటుకు, క్యాపిటల్ అసెట్స్ కల్పనకు మంజూరు చేసే గ్రాంట్లకు మధ్య తేడాగా పేర్కొంటారు. ఇది రెవెన్యూ లోటులోని వినియోగాంశాలను తగ్గించి, పెట్టుబడుల వ్యయాన్ని పెంచటానికి దోహదం చేస్తుంది.
అలాగే ‘మీడియం టర్మ్ ఎక్స్‌పెండిచర్ ఫ్రేం వర్క్ స్టేట్‌మెంట్’ వరుసగా మూడు సంవత్సరాలపాటు వ్యయసూచికలకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది.
కేంద్ర స్పాన్స్‌ర్డ్ పథకాలు తగ్గింపునకు, మెరుగుపరచటానికి, అలాగే ప్రణాళిక, ప్రణాళికేతర విభజనను సాధించడానికి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను 12వ ప్రణాళిక అమలు సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు.
నిధుల సక్రమ వినియోగానికి ప్రస్తుతం పనిచేస్తున్న ‘సెంట్రల్ ప్లాన్ స్కీమ్ మానిటరింగ్ సిస్టమ్’ను మరింత విస్తరిస్తారు.

సబ్సిడీలు

కొన్ని సబ్సిడీలు తప్పనిసరి అయినప్పటికీ స్థూల ఆర్థిక సూత్రాలకు లోబడి విశ్లేషిస్తే అవి ఎంతమాత్రం అభిలషణీయం కాదు.
ఆహార భద్రత చట్టం అమలుకు సంబంధించిన సబ్సిడీలన్నిటికీ పూర్తి మద్దతు లభిస్తుంది.
2012-13 సంవత్సరానికి కేంద్ర సబ్సిడీలను జీడీపీలో 2 శాతానికి, అలాగే వచ్చే మూడు సంవత్సరాల కాలంలో 1.75 శాతానికి తగ్గింపు.
నందన్ నీలేకని కమిటీ సిఫార్సుల మేరకు ఎరువులు, సబ్సిడీలు లబ్దిదారునికి అందే వరకు వివిధ దశల్లో వాటి కదలికలపై నిరంతర సమాచారం అందే విధంగా చర్యలు.
వంటగ్యాస్ సరఫరాలో లీకేజీలను నిరోధించి, వినియోగదారులకు మరింత సేవను అందించేందుకు మూడు ప్రభుత్వ రంగ చమురు సరఫరా కంపెనీలు ‘ఎల్‌పీజీ ట్రాన్స్‌పెరెన్సీ పోర్టల్స్’ను ప్రారంభించాయి.
వచ్చే ఆరు నెలల కాలంలో దేశంలో కనీసం 50 జిల్లాల్లో ఆధార్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలకు చెల్లింపులు జరిగేలా కృషి.

పన్నుల సంస్కరణలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి డీటీసీ (డెరైక్ట్ టాక్సెస్ కోడ్) బిల్లును వీలైనంత త్వరగా చట్ట రూపంలోకి తీసుకువస్తారు.
రాష్ట్రాలతో సంప్రదించి ‘సెంటర్, స్టేట్ గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్’ (జీఎస్‌టీ) కోసం ఒక నమూనా చట్టం రూప కల్పన చురుకుగా సాగుతోంది.
నేషనల్ ఇన్ఫర్మేషన్ యుటిలిటీగా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతారు. ఇది ఈ ఏడాది (2012) ఆగస్టు నుంచి పని ప్రారంభిస్తుంది.

పెట్టుబడులు (నిధులు) ఉపసంహరణ విధానం

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఆయా సంస్థలకు బైబ్యాక్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసుకునే పద్ధతులకు ఆమోదం.
2012-13లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.30,000 కోట్లు సేకరించాలన్నది లక్ష్యం. 51 శాతం నిర్వహణ, యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దనే ఉంటాయి.

పెట్టుబడులకు ఊతం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి:

మల్టీ బ్రాండ్ రిటైల్ మార్కెట్‌లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించేందుకు తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో విశాల ప్రాతిపదికన ఒక అంగీకారానికి వచ్చేందుకు కృషి.

అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్:

ఆర్థిక బిల్లు, 2012లో అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్‌ను అమలు అంశాన్ని కూడా చేరుస్తారు.

ఆర్థిక రంగం:

కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీమ్ ద్వారా రూ.50 వేల వరకు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టి 50 శాతం అదాయం పన్ను రాయతీని పొందేందుకు అనుమతిచ్చారు. మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌రియాడ్ కలిగిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారి వార్షిక ఆదాయం రూ.10 లక్షల లోపు ఉండాలి.

క్యాపిటల్ మార్కెట్:

క్యాపిటల్ మార్కెట్ రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం. ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) పద్ధతుల్లోను, ఇండియన్ బాండ్ మార్కెట్లో క్యూఎఫ్‌ఐ (క్వాలిఫైడ్ ఫారిన్ ఇన్వెస్టర్)లు ప్రవేశించేందుకు మార్గాలను సులువు చేసేందుకు కృషి.

శాసన సంస్కరణలు:

‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్లు-2011’, ‘బ్యాంకింగ్ లాస్ (సవరణ) బిల్లు-2011’, ‘ఇన్సూరెన్స్ లా (సవరణ) బిల్లు-2011’ సవరణ బిల్లులను ప్రస్తుత సమావే శాల్లోనే ప్రవేశపెడతారు.
ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించిన వివిధ బిల్లులు ఆర్థిక రంగంలో చట్టపరమైన సంస్కరణల కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి దోహదపడతాయి.

బ్యాంకులకు పెట్టుబడి నిధులు:

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆర్థిక ఆరోగ్య రక్షణకు భారీగా రూ.15,888 కోట్లు నిధులు సమకూర్చడానికి ప్రతిపాదించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడి అవసరాలకు తగిన నిధులు సమీకరించేందుకు ఒక ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసే యోచన ఉంది.
పలుమార్లు రిజిస్ట్రేషన్, డేటా భద్రపరచడం వంటి పనులను నివారించటానికి ‘నో యువర్ కస్టమర్’ నినాదంతో ఒక సెంట్రల్ డిపాజిటరీని 2012-13లో అభివృద్ధి చేస్తారు.

ప్రాధాన్యతా రంగ రుణాలు:

ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరుకు సంబంధించి స్టేక్ హోల్డర్స్‌తో సంప్రదించి మార్గదర్శకాలను తదనుగుణంగా సవరిస్తారు.

ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్:

స్వాభిమాన్ పథకం కింద బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ఇప్పటి వరకు 73 వేల హేబిటేషన్స్ (జీవన సమూహాలను) గుర్తించారు. వీటిలో 70 వేల హేబిటేషన్స్‌లో 2012, మార్చి కల్లా పథకాన్ని వర్తింపచేశారు.
రెండో దశలో భాగం ప్రతి హేబిటేట్‌లో అల్ట్రా స్మాల్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తారు.
ఇక 2012-13లో స్వాభిమాన్ పథకాన్ని మరిన్ని హేబిటేషన్లకు విస్తరిస్తారు.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు:
దేశంలోని మొత్తం 82 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 81 గ్రామీణ బ్యాంకులు ప్రధాన బ్యాంకింగ్ సౌకర్యాలను అందించటంలో విజయం సాధించాయి. ఇవి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థలో కూడా భాగస్వాములయ్యాయి.

బలహీన గ్రామీణ బ్యాంకులకు నిధులు (క్యాపిటల్) అందించే పథకాన్ని (స్కీమ్ ఆఫ్ క్యాపిటలైజేషన్) మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తారు.

మౌలిక నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగం అభివృద్ధి

12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక నిర్మాణ రంగంలో పెట్టుబడులు 50 లక్షల రూపాయలకు పెరుగుతాయి. ఇందులో సగం ప్రైవేటు రంగం నుంచే ఆశిస్తున్నారు.
మౌలిక రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పోత్సాహ పథకం కిందకు మరిన్ని రంగాలను తేనున్నారు.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో డిఫెన్స్ పీఎస్‌యూలు జాయింట్ వెంచర్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఆమోదించింది.
రూ.8,000 కోట్లతో మొదటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్‌ను ఈ నెల (మార్చి)లోనే ప్రారంభమయ్యింది.
2012-13లో మౌలికరంగ ప్రాజెక్టులకు పెట్టుబడులు సమకూర్చడానికి రూ. 60,000 కోట్లు మేరకు ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేయటానికి అనుమతి ఇచ్చారు.
మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాల లభ్యత మరింత సులువు చేసేందుకు ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్)లో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

జాతీయ తయారీ విధానం :

వచ్చే పదేళ్లలో దేశ జీడీపీలో తయారీ రంగం వాటా 25 శాతానికి చేరటానికి అలాగే ఆ రంగంలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో జాతీయ తయారీ విధానం ప్రకటన.

విద్యుత్, బొగ్గు:

విద్యుత్ కర్మాగారాలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకోవాల్సిందిగా ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు సలహా ఇచ్చారు. ఇందుకు డిస్కమ్‌లతో దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో 2015, మార్చి 31లో ఒప్పందాలు చేసుకోవాలని సూచన.
ప్రస్తుతం నడుస్తున్న విద్యుత్ కర్మాగారాలు తమ ద్రవ్యలోటును పూడ్చుకొనేందుకు ‘ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్’ (ఈసీబీ)కు అనుమతి ఇచ్చారు.

రవాణా: రోడ్లు, సివిల్ ఏవియేషన్:

నేషనల్ హైవేస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎన్‌హెచ్‌డీపీ) కింద వచ్చే ఏడాదిలోపు 8,800 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు రూ. 25,360 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 14 శాతం ఎక్కువ.
రోడ్లు, జాతీయ రహదారుల్లో టోల్ గేట్ వ్యవస్థ నిర్వహణ కోసం ‘ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్’ (ఈసీబీ)కు అనుమతికి ప్రతిపాదించారు.
నేరుగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను దిగుమతి చేసుకోవటానికి భారత విమాన రవాణా సంస్థలకు అనుమతి ఇచ్చారు.
ఏవియేషన్ ఇండస్ట్రీ తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈసీబీ పద్ధతిలో వనరుల సమీకరణ చేసుకోవటానికి ఒక ఏడాది కాలానికి అనమతి ఇచ్చారు. ఈసీబీ ద్వారా నిధుల సమీకరణ 1 బిలియన్ అమెరికా డాలర్లు మించకూడదని సీలింగ్ విధించారు.
దేశీయ విమాన రవాణా సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం ఈక్విటీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తోంది.

ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్:

ఢీల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి ఐదేళ్ల కాలంలో రూ.18500 కోట్లు కేటాయించటానికి 2011, సెప్టెంబర్‌లో అనుమతి ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో జపాన్ 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోంది.

గృహనిర్మాణరంగం:

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అల్పదాయ వర్గాలకు ఏర్పడిన గృహ కొరత తీర్చేందుకు అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో లోకాస్ట్ హౌసింగ్ ప్రాజెక్టులకు ఈసీబీ అనుమతితో పాటు క్రె డిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

ఎరువులు:

యూరియా ధరల నిర్ణయం, పెట్టుబడుల విధానాలకు తుది రూపం ఇవ్వడానికి ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటోంది. తద్వారా యూరియా కోసం దిగుమతులపై ఆధారపడే పరిస్థితులను నివారించడానికి వీలవుతుంది.

టెక్స్‌టైల్స్:

చేనేత కార్మికులు వారి సహకార సంఘాల రుణాలు మాఫీ చేయటానికి రూ.3,884 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
మరో రెండు మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ల ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒకటి ప్రకాశం, గుంటూరు జిల్లాలను కవర్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, మరొకటి గొడ్డా దాని పరిసర జిల్లాలను కవర్ చేస్తూ జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేస్తారు.
ఈశాన్య ప్రాంతంలో జియో టెక్స్‌టైల్స్ ప్రోత్సాహానికి, అభివృద్ధికి రూ. 500 కోట్ల పైలట్ ప్రాజెక్టు ప్రకటన.
రూ. 70 కోట్లతో మహారాష్ట్రలోని ఇచల్కారాంజిలో ఒక పవర్‌లూమ్ మెగాక్లస్టర్ ఏర్పాటు.

మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్:

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి సిడ్బీ సాయంతో రూ. 500 కోట్ల ఇండియా ఆపర్చునిటీస్ వెంచర్ ఫండ్ ఏర్పాటు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఇటీవలే ముంబైలో రెండు ఎస్‌ఎంఈ (స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ మంత్రిత్వ శాఖలు తమ వార్షిక కొనుగోళ్లలో కనీసం 20 శాతం ఎంఎస్‌ఈ లనుంచి చేయాలని, ఇందులో 4 శాతం ఎస్‌సీ/ఎస్‌టీ లు ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఈల నుంచి కొనుగోలు చేయాలన్న విధాన నిర్ణయానికి శ్రీకారం.

వ్యవసాయం రంగం

వ్యవసాయ, సహకార శాఖకు ప్రణాళిక కేటాయంపు 18 శాతం పెంచారు.
2012-13లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై)కు కేటాయంపులు రూ.9,217 కోట్లకు పెంచారు.
‘ఇనీషియేటివ్ ఆఫ్ బ్రింగింగ్ గ్రీన్ రివల్యూషన్ టు ఈస్ట్రన్ ఇండియా’ (బీజీఆర్‌ఈటీ) పథకానికి 2011-12లో రూ 400 కోట్లు కేటాయించగా ప్రస్తుత సంవత్సరం (2012-13)లో రూ.1000 కోట్లకు పెంచారు. ఈ పథకం తూర్పు భారత దేశంలో ధాన్యం దిగుబడిని గణనీయంగా పెంచింది.
ఆర్‌కేవీవై పథకం కింద విదర్భ ఇంటెన్సిఫైడ్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంకు రూ.300 కేట్లు కేటాయింపు.
మిగతా అంశాలను 12వ ప్రణాళికలో కింది పథకాలలో చేర్చారు అవి
నేషనల్ సెక్యూరిటీ మిషన్
నేషనల్ మిషన్ అన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇన్‌క్లూడింగ్ మైక్రో ఇరిగేషన్
నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్
నేషనల్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ అండ్ టెక్నాలజీ
నేషనల్ హార్టికల్చరల్ మిషన్

షనల్ మిషన్ ఫర్ ప్రొటీన్ సప్లిమెంట్:

పాడిపరిశ్రమ (డెయిరీ)రంగం ఉత్పాదకతను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు సాయంతో రూ. 2,242 కోట్లతో పథకం. చేపల ఉత్పత్తిని పెంచేందుకు కోస్టల్ అక్వాకల్చర్‌కు రూ. 500 కోట్లు కేటాయింపు.

వ్యవసాయ రుణం:

2012-13లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.1,00,000 కోట్ల నుంచి రూ.5,75,000 కోట్లకు పెంపు.
రైతులకు 7 శాతం వార్షిక రుణంపై ఇచ్చే పంట రుణాల పథకాన్ని ఈ ఏడాది (2012-13)కూడా కొనసాగిస్తారు.
చిన్న, సన్నకారు రైతులకు స్పల్వకాలిక పంట రుణాలను అందచేయటానికి వీలుగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్థిక సామర్ధ్యాన్ని పెంచేందుకు ‘షార్ట్ టర్మ్ ఆర్‌ఆర్‌బీ క్రెడిట్ రీఫైనాన్స్ ఫండ్’ ఏర్పాటు.
ఎటీఎం లలో ఉపయోగించేందుకు వీలుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)స్కీమ్‌ను కేసీసీ స్మార్ట్ కార్డ్‌గా మార్పు.

వ్యవసాయ పరిశోధన:

వ్యవసాయ రంగంలో పరిశోధనలను తగిన రివార్డులతో ప్రోత్సహించేందుకు రూ. 200 కోట్లు

నీటి పారుదల:

నీటి పారుదల ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు తగిన ప్రయోజనాలను గణనీయంగా పెంచటానికి ‘ఏక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ’ (ఏఐబీపీ)లో నిర్మాణాత్మక మార్పులు.
2012-13 ఏఐబీపీ పథకానికి 13 శాతం పెంచుతూ రూ.14,242 కోట్లు కేటాయింపు.
నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కోసం భారీ వనరులను సమీకరించేందుకు ‘ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్స్ ఫైనాన్స్ కంపెనీ’ ఏర్పాటు.
ముర్షిదాబాద్ జిల్లా కంది సబ్ డివిజన్‌లో రూ.439 కోట్లతో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ప్రతిపాదనకు గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్ ఆమోదం.

నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్:
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ పథకం ‘నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్’కు శ్రీకారం.

దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు.

ఇంక్లూజన్
షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్:

షెడ్యూల్డ్ క్యాస్ట్స్ సబ్ ప్లాన్‌కు ప్రస్తుత బడ్జెట్ (2012-13)లో రూ. 37.113 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కంటే 18 శాతం ఎక్కువ.
ట్రైబల్ సబ్ ప్లాన్‌కు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.21,710 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయింపుల కంటే 17.6 శాతం ఎక్కువ.

ఆహార భద్రత:

పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనలో జాతీయ ఆహార భద్రత బిల్లు-2011.
ప్రజా పంపిణీ వ్యవస్థలో జాతీయ సమాచార ప్రయోజనం సిద్ధించే విధంగా కంప్యూటరీకరణను చేపట్టారు. ఇది 2012 డిసెంబర్ నుంచి పని చేయడం ప్రారంభిస్తుంది.

మల్టీ సెక్టొరల్ న్యూట్రిషన్ అగ్మెంటేషన్ ప్రోగ్రామ్:

ఆహార లోపంతో బాధపడుతున్న తల్లీ పిల్లలు అత్యధికంగా కలిగిన 200 (ఎంపిక చేసిన) జిల్లాల్లో ఈ లోపాన్ని సరిచేసేందుకు వివిధ విభాగాలతోకూడిన (మల్టీ సెక్టొరల్) పథకాన్ని 2012-13 నుంచి అమలు చేస్తారు.
సమగ్ర శిశు అభివృద్ధి సేవా (ఐసీడీఎస్) పథకానికి రూ.15,850 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 58 శాతం ఎక్కువ.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రూ. 11,937 కోట్లు కేటాయింపు.
సబల (రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఎడొలసెంట్ గర్ల్స్) పథకానికి రూ.750 కోట్లు ప్రతిపాదన.

గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్:

తాగునీరు, పారిశుద్ధ్య కల్పనకు కేటాయింపులు రూ.11,000 కోట్ల నుంచి రూ.14,000 కోట్లకు పెంచారు. ఇది గత బడ్జెట్ కంటే 27 శాతం ఎక్కువ.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎమ్‌జీఎస్‌వై) పథకానికి 20 శాతం పెంచుతూ రూ.24,000 కోట్లు కేటాయింపు.
పంచాయతీల పటిష్టతకు రాజీవ్ గాంధీ పంచయత్ శ శక్తీకరణ్ అభియాన్ పథకం ద్వారా కృషి
బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్ స్కీమ్‌ను 12వ ప్రణాళికలో కూడా కొనసాగిస్తారు. ఈ పథకానికి 22 శాతం పెంచుతూ రూ.12,040 కోట్లు కేటాయింపు.

రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌ఐడీఎఫ్):

గ్రామీణప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పథకం కింద కేటాయింపులను రూ.20,000 కోట్లకు పెంచారు. ఇందులో రూ. 5,000 కోట్లు కేవలం గిడ్డంగి సౌకర్యాల కల్పనకే కేటాయించారు.

విద్యా రంగం

రైట్ టు ఎడ్యుకేషన్-సర్వ శిక్షా అభియాన్ (ఆర్‌టీఈ-ఎస్‌ఎస్‌ఈ) కు ఈ ఏడాది (2012-13) రూ.25,555 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 21.7 శాతం ఎక్కువ.
12వ పంచవర్ష ప్రణాళికలో బ్లాకు స్థాయిలో 6 వేల పాఠశాలలను నమూనా పాఠశాలలుగా ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ)కు రూ.3,124 కోట్లు కేటాయింపు. ఇది గత ఏడాది బడ్జెట్ కంటే 29 శాతం ఎక్కువ.
విద్యార్ధులకు రుణ సహాయం నిరంతరాయంగా అందేందుకు ఒక ‘క్రెడిట్ గ్యారంటీ ఫండ్’ ఏర్పాటు.

ఆరోగ్యం

గత ఒక సంవత్సర కాలంలో ఒక కొత్త పోలియో కేసు కూడా నమోదు కాలేదు.
ప్రస్తుతం పనిచేస్తున్న వ్యాక్సిన్ తయారీ యూనిట్లను నవీకరిస్తారు. ఒక కొత్త సమగ్ర వ్యాక్సిన్ యూనిట్‌ను చెన్నైలో ఏర్పాటు చేస్తారు.
‘యాక్సిలరేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్’ (అషా) పథకాన్ని విస్తరిస్తారు. ఇందులో భాగంగా వారి రెమ్యునరేషన్‌ను కూడా పెంచుతారు.
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్) పథకానికి కేటాయింపులు రూ.18,115 కోట్ల నుంచి రూ.20,882 కోట్ల పెంపునకు ప్రతిపాదన.
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పథకం ప్రారంభం
ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకాన్ని విస్తరిస్తూ ఈ పథకం కింద మరో ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయి పెంపు.

ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్

మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ .జీవన భద్రత కల్పనలో మంచి ఫలితాలనిచ్చింది.
ఈ పథకాన్ని వ్యవసాయం రంగం దాని అనుబంధ గ్రామీణ ఉపాధి రంగాల్లో మమేకం చేయటానికి గట్టి కృషి .
నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్‌కు రూ.3915 కోట్లు కేటాయింపు. ఇది గతేడాది బడ్జెట్ కంటే 34 శాతం ఎక్కువ.
మహిళా స్వయం సేవక్ గ్రూపులకు బ్యాంకు రుణాలు మరింత సులువుగా లభించేందుకు ‘ఉమన్స్ ఎస్‌హెచ్‌జీస్ డెవలప్‌మెంట్ ఫండ్’కు కార్పస్ నిధులు పెంపు.
అజీవకా స్కీమ్ ద్వారా ‘భారత్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటుకు ప్రతిపాదన.
2012-13లో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్‌కు రూ.1,276 కోట్లు కేటాయింపు. ఇది గత ఏడాది కంటే 23 శాతం ఎక్కువ.

స్కిల్ డెవలప్‌మెంట్:

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆమోదించిన ప్రాజెక్టుల వల్ల వచ్చే పదేళ్ల కాలంలో 6.2 కోట్ల మందికి వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందుతుంది.
2012-13లో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఫండ్‌కు రూ. 1,000 కోట్లు కేటాయింపు.
వృత్తి నైపుణ్యాల అభివృద్ధికి సంస్థాగత రుణాలు నిరంతరాయంగా అందేందుకు ఒక ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం.
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే ఐదేళ్ల కాలంలో లక్షమంది యువతకు నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ‘హిమయత్’ పథకం. ఇందుకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

సామాజిక భద్రత, బలహీన వర్గాల అవసరాలు

నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ ఎస్‌ఏపీ)కు నిధులను 37 శాతం పెంచుతూ రూ.8,447 కోట్లు కేటాయించారు.
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వితంతువులు, వికలాంగులకు ఇచ్చే నెలవారి పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.500 కు పెంపు.
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబ పెద్ద (వయసు 18 నుంచి 64 లోపు ఉండాలి) మరణిస్తే అందించే ఏకమొత్త ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తూ రూ.20 వేలకు పెంచారు.
స్వావలంబన్ పథకం మరింత అందుబాటులోకి వచ్చేందుకు ఎల్‌ఐసీని ఆగ్రిగేటర్‌గాను, ప్రభుత్వ రంగ బ్యాంకులను పాయింట్స్ ఆఫ్ ప్రజెన్స్, అగ్రిగేటర్లగాను నియమించారు.
వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు స్పెషల్ గ్రాంట్ మంజూరు.

భద్రత:

రక్షణ రంగం సేవలకు క్యాపిటల్ వ్యయం రూ.79,599 కోట్లతో కలుపుకుని మొత్తం రూ.1,97,403 కోట్లు కేటాయించారు. ఇంకా అదనంగా అవసరమైతే అందుకు కూడా సంసిద్ధతను ప్రకటించారు.
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు 4 వేల రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మించటానికి రూ.1,185 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదన.
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.3,280 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదన.
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ రూప కల్పన కార్యక్రమం వచ్చే రెండేళ్ల కాలంలో పూర్తవుతుంది.

గవర్నెన్స్
యూఐడీ-ఆధార్:

యూఐడీ (యునిక్ ఐడెంటిఫికేషన్) పథకం కింద 20 కోట్ల మంది పేర్లు నమోదు పూర్తయ్యింది. మరో 40 కోట్ల మంది నమోదు కార్యక్రమం పూరిక్తి అవసరమయ్యే నిధులు సమకూర్చవలసి ఉంది.

నల్లధనం:

నల్లధనంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే శ్వేత పత్రం ప్రవేశపెడతారు.

పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ లెజిస్లేషన్:

ప్రస్తు బడ్జెట్ సమావేశాల్లో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ లెజిస్లేషన్ బిల్లును ప్రవేశపెడతారు.
అవినీతి వ్యతిరేక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చట్టం తీసుకురానున్నారు. ఇందుకు అవసరమైన శాసన చర్యలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి.

బడ్జెట్ అంచనాలు 2012-13

పన్నుల రూపేణ లభించే స్థూల ఆదాయం రూ. 10,77,612 కోట్లు.
పన్నుల ద్వారా నికరాదాయం రూ.7,71,071 కోట్లు
పన్నేతర రెవెన్యూ ఆదాయం రూ.1,64,614 కోట్లు
రుణేతర మూలధన ఆదాయం రూ.41,650 కోట్లు
పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా లభ్యమయ్యే నిధులను సామాజిక పథకాల నిర్వహణకు అయ్యే ప్రధాన ఖర్చుగా వినియోగించటానికి అమలు చేస్తున్న తాత్కాలిక సర్దుబాటును మరో సంవత్సరం కొనసాగింపు.
2012-13 బడ్జెట్ మొత్తం వ్యయం రూ.14,90,925 కోట్లు.
2012-13 ప్రణాళిక వ్యయం రూ.5,21,025 కోట్లు. ఇది గత 2011-12 బడ్జెట్ కంటే 18 శాతం అధికం. అలాగే ఇది 12 వ ప్రణాళిక ముందుస్తు అంచనాల కంటే 15 శాతం ఎక్కువ.
ప్రణాళికేతర వ్యయం రూ.9,69,900 కోట్లుగా అంచనా.
రాష్ట్రాలకు రూ.3,65,216 కోట్లు బదిలీ.(ఇందులో ప్రత్యక్ష బదిలీలు, జిల్లా స్థాయిలో పనిచేసే ఏజన్సీలకు అందించే నిధులు కలిసి ఉంటాయి)
సబ్సిడీల మొత్తం అంతా నిధుల రూపంలోనే అందిస్తారు.
2011-12 ద్రవ్య లోటు 5.9 శాతంగా సవరించిన అంచనా
2012-13 ద్రవ్యలోటు 5.1 శాతంగా అంచనా
2012-13లో ద్రవ్యలోటును పూరించటానికి మార్కెట్ రుణ సేకరణ ద్వారా నికరంగా అవసరమయ్యేది రూ.4.79 లక్షల కోట్లు.
2012-13లో కేంద్ర ప్రభుత్వ అప్పు జీడీపీలో 45.5 శాతం

పార్ట్ బి - పన్ను ప్రతిపాదనలు

ప్రత్యక్ష పన్నులు

2012-13 పన్నుల ప్రతిపాదనలను డైరక్ట్ ట్యాక్స్ కోడ్ (డీటీసీ), గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)లకు అనుగుణంగా తయారు చేశారు.
డీటీసీ రేట్లను వ్యక్తిగత ఆదాయ పన్ను కోసం ప్రవేశపెడుతున్నారు.
ఆదాయపు పన్ను మినహాయింపు రూ.2లక్షల వరకూ పెంపు.
రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ పన్ను 10 శాతం
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పన్ను 20 శాతం
సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో రూ. 10 వేలు మదుపు వరకు పన్ను మినహాయింపు.
ముందస్తు వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులో రూ.5 వేల వరకు పన్ను మినహాయింపు.
వ్యాపారాల ద్వారా ఆదాయం లేని సీనియర్ సిటిజన్లు అడ్వాన్స్ పన్నును చెల్లించనవసరం లేదు.
షేర్ల లావాదేవీలు నిర్వహించేవారికి సెక్యూరిటీస్ ట్రాన్‌సాక్షన్ పన్ను వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది 0.125 ఉంది. దీన్ని 0.1 శాతానికి తగ్గించారు.
2005 బడ్జెట్‌లో తొలగించిన సెక్షన్ 80 ఎల్ మినహాయింపును తిరిగా ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్ కింద బ్యాంకులు, పొస్టాఫీసు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్ల మీద రూ.10 వేల వరకు లభించే వడ్డీపై పన్ను మినహాయింపు.
వార్షిక విక్రయాలు రూ.60 లక్షల లోపు ఉన్న వ్యాపారులు ఎలాంటి పుస్తకాలు నిర్వహించాల్సిన అవసరం లేదని గత బడ్జెట్‌లో ప్రకటించారు. అంచనా పద్ధతిలో ఆదాయాన్ని ప్రకటించే వెసులుబాటు కల్పించారు. క్రమేణా పెరుగుతున్న విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.కోటికి పెంచారు. వృత్తి కార్యకలాపాలు నిర్వహించే వారికి ప్రస్తుతమున్న రూ. 15 లక్షల పరిమితిని రూ. 25 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదించారు.
ప్రవాస భారతీయుల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఇక్కడి పెట్టుబడులపై ఆర్జించే ఆదాయంపై 5 శాతం మాత్రమే పన్ను వసూలు చేయాలని ప్రతిపాదించారు.
విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు ఇక ఆదాయ పరిమితితో నిమిత్తం లేకుండా రిటర్నులు దాఖలు చేయాలి.
నల్లధనం ఆదాయంగా చూపించి రిటర్నులు దాఖలు చేసినా, ఆదాయపు పన్ను శాఖ నల్లధనాన్ని గుర్తించినా, ఇకపై గరిష్ట స్లాబులో పన్ను వసూలు చేస్తారు.
ఇన్వెస్ట్‌మెంట్ లింక్డ్ డిడక్షన్ పరిధిలోకి కొత్త రంగాలను చేర్చేందుకు ప్రతిపాదించారు.
వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ తొమ్మిది నిర్దేశిత రంగాలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనను తొలగించనున్నారు.
ఇకపై నగరాలు, పట్టణాలలో అమ్మే స్థిరాస్తుల (వ్యవసాయ భూమి కాకుండా) విలువ రూ. 50 లక్షల పైన ఉంటే.. కొనుగోలు దారు 1 శాతం పన్ను వసూలు చేసి, ప్రభుత్వానికి జమ చేయాలి.రిజిస్ట్రేషన్ సమయంలో పన్ను జమ రశీదును సబ్ రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. మిగిలిన ప్రాంతాలకు ఈ పరిమితిని రూ.20 లక్షలుగా ప్రతిపాదించారు.
క్యాష్ డెలివరీ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్‌సాక్షన్ పన్నును 20 శాతం తగ్గించారు.
ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనల వల్ల రూ.4,500 కోట్లు నికర నష్టంగా అంచనా వేశారు.
త్వరలో ప్రత్యక్ష పన్నుల కోడ్ బిల్లు

పరోక్ష పన్నులు
సేవా పన్ను:

సేవా పన్ను విషయంలో సామర్ధ్యం కంటే తక్కువగా ఈ పన్ను వసూళ్లు సాగుతున్నాయి. పన్ను చట్టంలో క్లిస్టత వల్ల ఇలా జరుగుతున్నందున దీన్ని సరి చేసి సెంట్రల్ ఎక్సైజ్ చట్టానికి దగ్గరగా తీసుకురావాలని ప్రతిపాదించారు.
నెగిటివ్ జాబితా ప్రాతిపదికగా సర్వీసులపై పన్ను విధింపు నిర్ణయానికి మంచి స్పందన.
నెగిటివ్ జాబితాలోని 17 విభాగాలు తప్పించి మిగిలిన అన్ని సర్వీసులపై పన్నులు వసూలుకు ప్రతిపాదన.
కొన్ని రంగాలకు సేవా పన్ను తొలగింపు.
వివాదాల పరిష్కారానికి సర్వీసు ట్యాక్సులో రివిజన్ అప్లికేషన్ అధారిటీ, సెటిల్‌మెంట్ కమిషన్‌లు ఏర్పాటు.
సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్సులకు కామన్ ట్యాక్స్ కోడ్‌ను వర్తింపచేయటానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు.
రిఫండ్స్‌ను సరళీకరించటానికి నూతన పథకం.
పాయింట్ ఆఫ్ ట్యాక్సేషన్‌కు సంబంధించిన నిబంధనలను హేతుబద్దీకరిస్తారు.
ఆర్థిక రంగంలో ఆరోగ్యకర ధోరణిని కొనసాగించేందుకు సర్వీస్ ట్యాక్స్ రేటును 10 నుంచి 12 శాతానికి పెంపు.
వివిధ సేవా పన్నుల ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి రూ.18,600 కోట్లు అదనపు రె వెన్యూ లభిస్తుంది.

పరోక్ష పన్నులు- ఇతర ప్రతిపాదనలు:

తప్పనిసరి ఆర్థిక సర్దుబాట్ల కోసం ఎక్సైజ్ సుంకం స్టాండర్డ్ రేటును 10 శాతం నుంచి 12 శాతానికి , మెరిట్ రేటును 5 శాతం నుంచి 6 శాతానికి, లోయర్ మెరిట్ రేట్‌ను 1 శాతం నుంచి 2 శాతానికి (కొన్ని మినహాయింపులను ఇస్తూ) పెంచాలని ప్రతిపాదించారు.
విలాసవంతమైన పెద్ద కార్లపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని మరింత పెంచాలని ప్రతిపాదన.
వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం కస్టమ్స్ సుంకం పీక్‌రేటులో ఎటువంటి మార్పు చేయటం లేదు.

వ్యవసాయం, అనుంబంధ రంగాలు:

కొన్ని వ్యవసాయ పరికరాలు వాటి విడి భాగాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారు.
ఎరువుల ఫ్యాక్టరీల ఏర్పాటు లేదా విస్తరణ నిమిత్తం దిగుమతి చేసుకునే పరికరాలపై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తారు. ఈ తొలగింపు 2015, మార్చి 31 వరకు అమలులో ఉంటుంది.

మౌలిక వసతులు:

స్టీమ్ కోల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకం పూర్తి తొలగిస్తారు. ఇది 2014, మార్చి 31దాకా అమలులో ఉంటుంది.
విద్యుదుత్పత్తి కి వినియోగించే నిర్ధారిత ఇంధనాలకు బేసిక్ సుంకం పూర్తిగా మినహాయింపు.

మైనింగ్:

కోల్ మైనింగ్ ప్రాజెక్టు దిగుమతులకు కస్టమ్స్ సుంకం పూర్తిగా మినహాయింపు
ఖనిజాల అన్వేషణకు, సర్వేకు వినియోగించే యంత్రాలు, పరికరాలపై బేసిక్ కస్టమ్స్ సుంకాలు తగ్గింపు.

రైల్వేలు:

రైల్వేల రక్షణ-హెచ్చరిక వ్యవస్థల నిర్మాణానికి, హైస్పీడ్ రైళ్ల ట్రాక్ నిర్మాణం కోసం అవసరమయ్యే పరికరాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.

రోడ్లు:

రోడ్ల నిర్మాణానికి, సొరంగాలను డ్రిల్లింగ్ చేయటానికి అవసమయ్యే కొన్ని ప్రత్యేక యంత్రాలు వాటి పరికరాలపై దిగుమతి సుంకం పూర్తిగా మినహాయింపు.

సివిల్ ఏవియేషన్:

పౌర విమానాల రిపేరు, సర్వీసుల నిమిత్తం అవసరమయ్యే విమాన పరికరాలు, టెస్టింగ్ పరికరాలపై పన్ను రాయితీ.

తయారీ రంగం:

పన్ను రాయితీలను ఉక్కు, టెక్స్‌టెల్స్, బ్రాండెండ్ రేడీమేడ్ దుస్తులు, తక్కువ ఖరీదు వైద్య పరికరాలు, సెమీ మెకనైజ్డ్ యూనిట్లు ఉత్పత్తి చేసే అగ్గిపెట్టెలకు విస్తరిస్తారు.

హెల్త్ అండ్ న్యూట్రిషన్:

ఆరు నిర్ధేశిత ప్రాణాధార మందులు/వ్యాక్సిన్లపై 5 శాతం కస్టమ్స్ సుంకం రాయితీ.
పోషకాహార (ప్రోటీన్)లోపంతో బాధ పడే మహిళలు/పిల్లల నిమిత్తం దిగుమతి చేసుకునే సోయా ఉత్పత్తులపై బేసిక్ కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు
అయోడిన్ పై కస్టమ్, ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు
ప్రొబయోటిక్స్‌పై కస్టమ్, ఎక్సైజ్ సుంకాలు తగ్గింపు.

ఎన్విరాన్‌మెంట్:

ఇంధన పొదుపు పరికరాలు, సోలార్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే పరికరాలపై పన్ను రాయితీలు
హెబ్రిడ్ లేదా ఎలక్ట్రికల్ వాహనాల తయారీకి, వాటికి అవసరమయ్యే బ్యాటరీ ప్యాక్‌లకు కావాల్సిన పరికరాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాలు తగ్గింపు.
బంగారం ఇంకా ఇతర విలువైన లోహాల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం పెంపునకు ప్రతిపాదన.

అదనపు వనరుల సమీకరణ:

కొన్ని రకాల సిగరెట్లు, చేతితో తయారు చేసిన బీడీలు, పాన్ మసాలా, గుట్కా, చ్యూయింగ్ టుబాకో, ముడి పొగాకు, జర్దా, సెంటెడ్ టొబాకోలపై ఎక్సైజ్ సుంకాన్ని మరింత పెంచాలని ప్రతిపాదించారు.
దేశంలో ఉత్పత్తి అయ్యే మడి పెట్రోలియం చమురుపై సెస్సును మెట్రిక్ టన్నుకు రూ.4500గా సవరించారు.
పూర్తిగా నిర్మించిన పెద్దకార్లు/మల్టి యుటిలీటీ వెహికల్స్/స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పెంచుతారు.

హేతుబద్ధీకరణ చర్యలు:

ప్యాకేజ్డ్ సిమెంటుపై ఎక్సైజ్ సుంకాన్ని సరిచేస్తారు.
విలువైన బ్రాండెడ్ మెటల్ జ్యుయలరీపై విధిస్తున్న 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని అన్ బ్రాండెడ్ జ్యూయలరీ వస్తువులకు కూడా విస్తరిస్తారు.
బ్రాండెడ్ వెండి వస్తువులను ఎక్సైజ్ సుంకం నుంచి పూర్తిగా మినహాయించారు.
వాణిజ్య వాహనాల నిర్మాణానికి అవసరమయ్యే ఛాసిస్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతం ఉన్న మిశ్రమ రేట్‌పై కాకుండా యాడ్ వెలోరం రేటుపై విధిస్తారు.
ఫారిన్ గోయింగ్ వెసల్స్ దిగుమతిపై కౌంటర్‌వాలింగ్ డ్యూటీ (సీవీడీ)ని 5 శాతం తగ్గిస్తారు.
కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల ప్రతిపాదనల వల్ల రూ 27,280 కోట్లు నికర ఆదాయం సమకూరుతుందని అంచనా.
పరోక్ష పన్నుల ద్వారా రూ. 45,940 కోట్లు నికరాదాయం లభిస్తుందని అంచనా.
వివిధ పన్నుల ప్రతిపాదనల ద్వారా ప్రస్తుత బడ్జెట్‌లో నికరంగా రూ.41,440 కోట్లు లభిస్తుందని అంచనా.

No comments:

Post a Comment