మార్కులు: 150 సమయం: 2½ గం
1. భారత రాజ్యాంగ రూపశిల్పి?
1) నెహ్రు 2) అంబేద్కర్
3) బి.ఎన్. రావు 4) రాజేంద్రప్రసాద్
2. పౌరసత్వం పొందడానికి కావల్సిన అర్హతలు ఎవరు నిర్ణయిస్తారు?
1) ఎన్నికల సంఘం 2) పార్లమెంట్
3) రాష్ట్రపతి
4) పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు సంయుక్తంగా
3. కింది అధికరణాల్లో సరికానిది?
1) 14 -చట్ట సమానత్వం
2) 16-సమాన అవకాశాలు
3) 17 - బిరుదుల రద్దు
4) 24-బాలకార్మిక వ్యవస్థ నిషేధం
4. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు?
1) {పజలే ప్రత్యక్షంగా
2) ఉభయసభల సంయుక్త సమావేశం
3) పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్
4) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు
5. హంగ్ పార్లమెంట్‌కు సంబంధించి సరైంది?
1) పార్లమెంట్‌లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడం
2) {పధాని రాజీనామా చేస్తే పార్లమెంట్ రద్దు కాదు
3) పార్లమెంటు వ్యవహారాల నిర్వహణకు కావల్సిన కోరంను కోల్పోవడం
4) పార్లమెంట్ సరిగా పనిచేయకపోవడం
6. రాజ్యసభ కంటే లోక్‌సభ ఎందుకు అత్యుత్తమం
1) ప్రత్యక్షంగా ఎన్నికవుతుంది
2) ఈ సభ మాత్రమే ఆర్థిక విషయాలను నియంత్రణ చేస్తుంది
3) అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రిమండలిని నియంత్రిస్తుంది 4) పైవన్నీ
7. కొత్త రాష్ట్రం ఎలా ఏర్పాటవుతుంది?
1) పార్లమెంట్ సాధారణ మెజార్టీతో
2) పార్లమెంట్ సాధారణ మెజార్టీ, మెజార్టీ రాష్ట్ర శాసనసభల ఆమోదం
3) పార్లమెంట్ 2/3వ వంతు మెజార్టీతో
4) పార్లమెంట్ ఉభయసభల్లో 2/3వ వంతు, మెజార్టీ రాష్ట్రాల ఆమోదం
8. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలుగు సాహితీవేత్త?
1) విశ్వనాథ సత్యనారాయణ
2) దేవులపల్లి కృష్ణశాస్త్రి
3) పానుగంటి లక్ష్మీనరసింహం
4) కట్టమంచి రామలింగారెడ్డి
9. ‘మల్కిభరాముడు’గా పేరొందిన కుతుబ్‌షాహీ పాలకుడు?
1) సుల్తాన్ కుతుబ్‌షా
2) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
10. సహాయ నిరాకరణోద్యమ కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గీతాన్ని రాసినవారు?
1) కల్లూరి సుబ్బారావు
2) గరిమెళ్ల సత్యనారాయణ
3) గాడిచర్ల 4) వెంకటరమణ శాస్త్రి
11. ‘రాష్ట్రాలు, అవి ఏర్పాటైన సంవత్సరాలతో జతపర్చండి?
1) త్రిపుర ఎ) 1987
2) హిమాచల్‌ప్రదేశ్ బి) 1972
3) హర్యానా సి) 1966
4) అరుణాచల్‌ప్రదేశ్ డి) 1971
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
12. లోక్‌సభ, రాజ్యసభల్లో ఒకే ఒక స్థానం ఉన్న రాష్ట్రాలు?
1) సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్
2) సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ
3) సిక్కిం, నాగాలాండ్, మిజోరం
4) సిక్కిం, నాగాలాండ్, గోవా
13. ‘73వ రాజ్యాంగ సవరణ చట్టం-1993’ వర్తించని రాష్ట్రాలు?
1) నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, సిక్కిం
2) సిక్కిం, పశ్చిమబెంగాల్, నాగాలాండ్, గోవా
3) నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, జమ్ము-కాశ్మీర్
4) మిజోరం, మణిపూర్, ఒరిస్సా, జార్ఖండ్
14. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయం నిర్మించిన మొదటి రాజు?
1) రుద్ర పురుషదత్తుడు
2) ఎహువల శాంతమూలుడు
3) మొదటి వీర పురుషదత్తుడు
4) వాశిష్టీ పుత్ర శాంతమూలుడు
15. పాలెగాళ్లను అణచి, దత్త మండలంలో రైత్వారీ విధానం ప్రవేశపెట్టిన బ్రిటిష్ కలెక్టర్?
1) క్యాంప్‌బెల్ 2) థామస్ మన్రో
3) సి.పి. బ్రౌన్ 4) సర్ ఆర్థర్ కాటన్
16. ఆంధ్రలో హోంరూల్ ఉద్యమ నాయకుడు?
1) బి.ఎన్. శర్మ 2) న్యాపతి సుబ్బారావు
3) జి.హరిసర్వోత్తమరావు 4) ఎ.కాళేశ్వరరావు
17. ‘శ్రీభాగ్ ఒప్పందం’ ఎవరి మధ్య జరిగింది?
1) ఆంధ్ర-తమిళ 2) ఆంధ్ర-రాయలసీమ
3) రాయలసీమ-తమిళ
4) తమిళ-తెలంగాణ
18. అధికరణ-352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితులు ఎప్పుడు విధించారు?
ఎ) 1962 బి) 1965 సి) 1971 డి) 1975
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
19. చంద్రుడి కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం?
1)8 ని॥ 2) 8 సె॥3) 1.3 ని॥ 4)1.3 సె॥
20. ఏ జిల్లా గిరిజనులు ‘థింసా’ నృత్యం చేస్తారు?
1) శ్రీకాకుళం 2) విశాఖపట్నం
3) విజయనగరం 4) తూర్పుగోదావరి
21. భారత్‌లో తొలిసారిగా వర్షపాతం పొందే ప్రాంతం?
1) పశ్చిమ కనుమలు 2) తూర్పు కనుమలు
3) కర్ణాటక తీరప్రాంతం
4) అండమాన్, నికోబార్
22. అండమాన్ నికోబార్ దీవుల పిన్‌కోడ్?
1) 5 2) 6 3) 7 4) 8
23. ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం? (2011 జనగణన ప్రకారం)
1) రాజస్తాన్ 2) అరుణాచల్‌ప్రదేశ్
3) బీహార్ 4) పైవన్నీ
24. సముద్ర కలుపు నుంచి లభించేది?
1) సల్ఫర్ (గంధకం) 2) ఫాస్ఫరస్
3) అయోడిన్ 4) బెరీలియం
25. పుట్టే బిడ్డ లింగ నిర్ధారణ దేని ద్వారా తెలుసుకోవచ్చు?
1) తండ్రి క్రోమోజోమ్‌లు
2) తల్లి క్రోమోజోమ్‌లు
3) తల్లిదండ్రుల ఆర్.హెచ్. కారకాలు
4) తండ్రి రక్త గ్రూపు
26. ఆకుపచ్చని ఆకు భారం ఏ సమయంలో ఎక్కువ?
1) సాయంకాలం 2) మధ్యాహ్నం
3) అర్ధరాత్రి 4) ఉదయం
27. లోహాన్ని కలిగిన విటమిన్?
1) A 2) D 3) B12 4)C
28. జతపర్చండి.
i) పొడవు a) ఆంపియర్
ii) ద్రవ్యరాశి b) మీటరు
iii) కాలం c) కిలోగ్రాం
iv) విద్యుత్ ప్రవాహం d) సెకన్
i) ii) iii iv)
1) a b c d
2) b c d a
3) b c a d
4) d a b c
29. మయోసిన్ ప్రొటీన్ కండరాల్లో, కెసిన్ పాలలో, సిరిసిన్/ఫైబ్రోయిన్
పట్టుదారంలో, హీమోగ్లోబిన్ రక్తంలో ఉంటాయి. కెరాటిన్ ఎక్కడ ఉంటుంది?
1) చర్మం 2) వెంట్రుకలు, రోమాలు
3) గోర్లు, గిట్టలు, కొమ్ములు 4) పైవన్నీ
30. జన్యు సంబంధ వ్యాధి కానిది?
1) హీమోఫీలియా 2) వర్ణాంధత్వం
3) ఆల్బినిజం 4) అథ్లెట్‌ఫుట్
31. రెండు గోడల మధ్య ఉన్న మనిషికి, తన ముం దు ఉన్న గోడకు ఎంత పరిమాణంలో
ఉన్న దర్పణాన్ని తగిలిస్తే, ఆ దర్పణంలో అతడి వెనుక గోడ మొత్తం ప్రతిబింబం
కనిపిస్తుంది?
1) 1/4 2) 2/3 3) 1/2 4) 1/3
32. ఆవిరి ద్రవంగా మారినప్పుడు?
1) ఉష్ణాన్ని శోషించుకుంటుంది
2) ఉష్ణాన్ని విడుదల చేస్తుంది
3) దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది
4) దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది
33. సాధారణంగా ఏ దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు డ్రైవింగ్ లెసైన్స్ ఇవ్వరు?
1) వర్ణాత్మక అంధత్వం 2) హ్రస్వదృష్టి
3) దూరదృష్టి 4) పైవన్నీ
34. విద్యుత్ సరఫరా చేయడానికి ఉపయోగించే లోహాలు?
1) అల్యూమినియం, నిక్రోమ్
2) అల్యూమినియం, రాగి
3) రాగి, నిక్రోమ్ 4) నిక్రోమ్, వెండి
35. వీటిలో శక్తి జనకాలు?
1) సూర్యుడు, నీరు, కేంద్రక శక్తి
2) సూర్యుడు, గాలి, నీరు, బయోశక్తి
3) సూర్యుడు, గాలి, నీరు, కేంద్రక శక్తి
4) సూర్యుడు, గాలి, నీరు, బయోశక్తి, కేంద్రక శక్తి
36. ఏ అంశాన్ని వివరించినందుకు 1983లో చంద్రశేఖర్‌కు నోబెల్ బహుమతి లభించింది?
1) క్వాంటం సిద్ధాంతం 2) కాంప్టన్ విక్షేపణం
3) విశ్వం 4) x- కిరణ వికిరణం
37. ఏది ఉండకపోవడం వల్ల చంద్రుడిపై ఆకాశం నల్లగా కనిపిస్తుంది?
1) కాంతి 2) కాంతి పరావర్తనం
3) కాంతి పరిక్షేపణం 4) కాంతి వివర్తనం
38. విద్యుత్ బల్బు పగిలినప్పుడు శబ్దం రావడానికి కారణం?
1) బల్బు గాజుతో తయారు చేయడం
2) బల్బు గాజుతో చేయడం, పల్చగా ఉండటం
3) బల్బులోని విద్యుత్ తీగ వల్ల
4) పాక్షికంగా శూన్య ప్రదేశం వల్ల బల్బు పగిలిన గాలి లోపలికి ప్రవేశించడం
39. మూత్ర విసర్జనతో వాసన రానప్పటికీ కొద్ది సమయం తర్వాత భరించలేని దుర్వాసన రావడానికి కారణం?
1) మూత్రంలోని యూరియా యూరికామ్లంగా మారడం
2) మూత్రంలోని యూరికామ్లం యూరియాగా మారడం
3) యూరియాను బ్యాక్టీరియా అమ్మోనియాగా మార్చడం
4) యూరికామ్లాన్ని బ్యాక్టీరియా క్రీట్‌నైన్‌గా మార్చడం
40. పెట్రోలు వల్ల వచ్చే మంటలను నీరు ఎందుకు ఆర్పలేదు?
1) నీరు చల్లార్చలేనంతగా మంటలు ఉంటాయి
2) నీరు, పెట్రోలు రసాయన చర్య జరుపుతాయి
3) నీరు, పెట్రోలు ఒకదానితో ఒకటి మిశ్రణీయమవుతాయి
4) నీరు, పెట్రోలు ఒకదానితో ఒకటి మిశ్రణీయత చెందవు
41. వీటిలో రసాయన మార్పు జరిగే ప్రక్రియ?
1) నీటిలో సాధారణ ఉప్పు కరగడం
2) అంశిక స్వేదనం ద్వారా పెట్రోలియం శుద్ధి చేయడం
3) కార్లలో పెట్రోలు దహనం కావడం
4) పెట్రోలు, ఇథైల్ ఆల్కహాల్‌ను కలపడం
42. హెల్మెట్‌ల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహం?
1) మాంగనీస్ స్టీల్ 2) టంగ్‌స్టన్ స్టీల్
3) క్రోమ్‌స్టీల్ 4) నిక్రోమ్
43. కంటి పరికరాల తయారీకి ఉపయోగించే గాజు
1) సోడా 2) ప్లింట్ 3) సీసా 4) పెరైక్స్
44. థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి ఎలాంటి ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు?
1) కోబాల్టు (Co40) 2) సోడియం (Na23)
3) అయోడిన్ (I131) 4) పైవన్నీ
45. జి-8లో సభ్యత్వం ఉన్న ఏకైక ఆసియా దేశం?
1) చైనా 2) భారత్ 3)జపాన్ 4) పాకిస్తాన్
46. అతి పొడవైన జాతీయ రహదారి?
1) కలకత్తా-చెన్నై 2) ఢిల్లీ-ముంబై
3) కలకత్తా-హాజీరా 4) ముంబై-చెన్నై
47. మిస్సిసిపి నది ఏ సముద్రంలో కలుస్తుంది?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) కరేబియన్ సముద్రం
4) మెక్సికో సింధుశాఖ
48. రంజిత్‌సింగ్, ఆంగ్లేయుల మధ్య అమృత్‌సర్ ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
1) 1807 2) 1809 3) 1811 4) 1813
49. వీటిలో ఉత్తరంగా ప్రవహించే నది?
1) గండక్ 2) కోసి 3) సోన్ 4) రామ్‌గంగా
50. గోదావరిలో కలిసే చివరి ఉపనది?
1) ఇంద్రావతి 2) శబరి
3) మానేరు 4) సీలేరు
51. సముద్రగుప్తుడు 18 ఆటవిక రాజ్యాలను జయించినట్టు పేర్కొనే శాసనం?
1) అలహాబాద్ 2) ఎరాన్
3) ఎరండపల్లి 4) వేంగి
52. ఎడారుల్లో వర్షం ఎక్కువగా కురవకపోవడానికి కారణం?
1) అధిక ఉష్ణోగ్రత
2) సముద్రానికి దూరంగా ఉండటం
3) అధిక పీడన మేఖలలో ఉండటం
4) ఉష్ణోగ్రత వల్ల పడే వర్షం ఆవిరి కావడం
53. గాంధీజీ తొలిసారిగా ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టారు?
1) ఖిలాఫత్ ఉద్యమం
2) అహ్మదాబాద్ మిల్ కార్మికుల సమ్మె
3) ఖేదా ఉద్యమం
4) సహాయ నిరాకరణోద్యమం
54. డంకన్ జలసంధి ఏ రెండు దీవులను వేరు చేస్తోంది?
1) దక్షిణ అండమాన్ - లిటిల్ అండమాన్
2) లిటిల్ అండమాన్ - కార్‌నికోబార్
3) దక్షిణ అండమాన్ - ఉత్తర అండమాన్
4) లిటిల్ అండమాన్ - గ్రేట్ కార్‌నికోబార్
55. 1857 తిరుగుబాటును ‘భారత ప్రథమ స్వాతంత్య్ర యుద్ధం’ అని వర్ణించినవారు?
1) అరబిందఘోష్ 2) వి.డి. సావర్కర్
3) దాదాభాయ్ నౌరోజి 4) రాజ్‌బిహారీ ఘోష్
56. సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) హైగ్రోమీటర్ 2) బారోమీటర్
3) ఫాతోమీటర్ 4) మాల్టోమీటర్
57. వీటిలో సరికానిది?
1) ఆస్కార్బికామ్లం - విటమిన్ ‘సి’ ఉన్న పదార్థాలు 2) ఫార్మిక్ ఆమ్లం - చీమలు
3) లాక్టిక్ ఆమ్లం - పాలు
4) టార్టారిక్ ఆమ్లం - ప్రోటీన్లు
58. మురుగునీరు నలుపు రంగులో ఉండటానికి కారణం?
1) కలుషిత రసాయనాలు
2) కార్బన్‌డైసల్ఫైడ్ కరిగి ఉండటం 3) 1, 2
4) మెర్క్యురిక్ సల్ఫైడ్ కరిగి ఉండటం
59. కపిల్‌దేవ్ సారథ్యంలో తొలిసారి ప్రపంచ క్రికెట్ కప్ సాధించిన భారత్ ఎన్నేళ్ల తర్వాత 2011-వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది?
1) 30 2) 27 3) 29 4) 28
60. దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే?
1) పేదలకు సరైన తిండి, వసతి కల్పించాలి
2) {పత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి
3) ధనికుల డబ్బు స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి
4) పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు వారికి చేరేలా చర్యలు తీసుకొని, పేదరి కాన్ని తగ్గించేలా ఆర్థిక ప్రణాళిక జరగాలి
61. భారత్-పాకిస్తాన్ విషయంలో సరైన జత?
1) 1965 2) ఎల్.బి. శాస్త్రి - ఆయూబ్‌ఖాన్
3) ఇందిరాగాంధీ - అలీభుట్టో
4) వాజ్‌పేయి - నవాజ్ షరీఫ్
a) లాహోర్ డిక్లరేషన్
b) సిమ్లా ఒప్పందం
c) తాష్కెంట్ ఒప్పందం
d) ఇండో-పాక్ ఒప్పందం
1) 1-a,2-b,3-c,4-d 2) 1-b,2-a,3-d,4-c
3) 1-c,2-a,3-b,4-d 4) 1-d,2-c,3-b,4-a
62. కింది సంఘటనల కాలం ఆధారంగా వరుస క్రమంలో?
1) లక్నో ఒప్పందం
2) ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడం
3) శాసనోల్లంఘన ఉద్యమం
4) బెంగాల్ విభజన
1) 4, 1, 2, 3 2) 1, 2, 3, 4
3) 2, 3, 1, 4 4) 4, 3, 2, 1
63. మానవుడి కన్ను పనితీరు, కెమెరా పనితీరు ఒకేలా ఉంటుంది కాబట్టి మనిషి
కంటిని తరచుగా కెమెరాతో పోలుస్తారు. ఈ రెండింటి మధ్య పోలికల విషయంలో
అవాస్తవం?
1) కంటిలోని కనుపాప, కెమెరాలోని తలుపుల్లా పని చేస్తాయి
2) కనుగుడ్డు కాంతి చొరబడటానికి వీలులేని గదిలా ఉంటుంది
3) కంటిలోని రెటినా, కెమెరాలోని ఫిల్మ్‌లా పని చేస్తుంది
4) కంటి కటకం, కెమెరాలోని కుంభాకార దర్పణంలా పని చేస్తుంది
64. వీటిలో సరికానిది?
1) భారతదేశానికి వచ్చిన తొలి విదేశీయులు - ఆర్యులు
2) ఆంధ్ర దేశానికి వచ్చిన తొలి యూరోపియన్లు - డచ్‌వారు
3) భారతదేశం వదలివెళ్లిన చివరి ఐరోపావారు - పోర్చుగీసులు
4) భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు - ప్రకాశం పంతులు
65. వీటిలో సరికానిది?
1) ఆంధ్రరాష్ట్రం అవతరణ-1956 అక్టోబర్ 1
2) హైదరాబాద్ రాష్ట్రం అవతరణ -1948 సెప్టెంబర్ 17
3) హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో విలీనం- 1956 నవంబర్ 1
4) ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి
66. వీటిలో సరైన సంఘటనల క్రమం?
1) కాంగ్రెస్ పార్టీ స్థాపన - సిపాయిల తిరుగుబాటు-వందేమాతర ఉద్యమం - హోంరూల్ ఉద్యమం
2) వందేమాతర ఉద్యమం - సహాయ నిరాకరణోద్యమం - హోంరూల్ ఉద్యమం - ఖిలాఫత్ ఉద్యమం
3) స్వదేశీ ఉద్యమం - హోంరూల్ ఉద్యమం - రెగ్యులేటింగ్ చట్టం - సహాయ నిరాకరణోద్యమం
4) వందేమాతర ఉద్యమం - రెగ్యులేటింగ్ చట్టం - హోంరూల్ ఉద్యమం - క్విట్ ఇండియా ఉద్యమం
67. ప్రణాళికా విరామ కాలం?
1) 1960-65 2) 1966-69 3) 1975-77 4) 1977-79
68. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఏ వ్యూహాత్మక క్షిపణిని భారతీయ సైన్యం మా ర్చి 4, 2012న విజయవంతంగా పరీక్షించింది?
1) బ్రహ్మాస్ 2) అగ్ని 3) పృథ్వీ 4) వరుణ
69. భారత పార్లమెంట్ తొలి సమావేశం జరిగి మే 12, 2012 నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఐతే మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
1) ఆగస్ట్ 15, 1950 2) జూన్ 16, 1952
3) మే 13, 1952 4) జూలై 18, 1953
70. దేశంలో తలసరి ఆదాయంలో రాష్ట్ర స్థానం?
1) 7వ 2) 10వ 3) 4వ 4) 12వ
71. ఏప్రిల్ 5, 2012న ప్రకృతి విపత్తుల నిర్వహణ, మానవతా సాయంపై సదస్సు ఏ దేశంలో నిర్వహించారు?
1) భూటాన్ 2) టిబెట్ 3) భారత్ 4)నేపాల్
72. ఏప్రిల్ 28, 2012న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన భారత స్వదేశీ పరిజ్ఞాన ఉపగ్రహ రాకెట్?
1) పీఎస్‌ఎల్‌వీ-సీ 19 2) ఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 19
3) ఎస్‌ఎస్‌ఎల్‌వీ-సీ19
4) పీఎల్‌ఎస్‌వీ-ఏ19
73. 61వ భారత గణతంత్ర దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు?
1) 2010 2) 2009 3) 2008 4) 2011
74. 2011 ఏప్రిల్ 1న ప్రారంభించిన ‘స్వావలంబన’ పథకం ఉద్దేశం?
1) వికలాంగులకు ఆర్థిక సహాయం
2) వృద్ధాప్యంలో చేయూత
3) నిరుద్యోగులకు ఉపాధి కల్పన
4) మహిళల సాధికారత
75. ‘హింద్ స్వరాజ్’ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహిస్తున్నవారు?
1) బాబా రాందేవ్ 2) అన్నా హజారే
3) రవిశంకర్ 4) సత్యసాయిబాబా
76. ‘అభయహస్తం’ పథకం ద్వారా 60 ఏళ్ల వయసు నిండిన వారికి గరిష్టంగా లభించే పింఛన్? (రూ. ల్లో)
1) 2000 2) 2200 3) 2500 4) 1800
77. ఏప్రిల్ 15, 2011న ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘సబల’ పథకం ఎన్నేళ్ల వయసు వారికి ఉద్దేశించింది?
1) 6-4 2) 7-12 3) 11-18 4) 15-20
78. సాధారణ శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలకు తొలి అధికారం అందించిన రాష్ట్రం?
1) కేరళ 2) పశ్చిమబెంగాల్
3) త్రిపుర 4) చండీఘడ్
79. 12వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యం?
1) సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి
2) సంక్షేమ ఆర్థిక ప్రజాస్వామ్యం
3) సత్వర, సుస్థిర ప్రగతి, సమ్మిళిత అభివృద్ధి
4) ఆర్థిక అసమానతల తగ్గింపు
80. విపత్తు నిర్వహణ కార్యకలాపాలు ఎప్పుడు జరుగుతాయి?
1) విపత్తుకు ముందు
2) విపత్తు సమయంలో
3) విపత్తు తర్వాత 4) పైవన్నీ
81. 2011లో ఏ పరిశోధనకు నోబెల్ వైద్యశాస్త్ర బహుమతి లభించింది?
1) ‘తలసేమియా’ వ్యాధి నిర్మూలన
2) గుండె కవాటాల కృత్రిమ రూపకల్పన
3) శరీర రోగ నిరోధక వ్యవస్థ గుట్టు తెలుసుకోవడం
4) మెదడు కణాల చలనరహిత శక్తిని ఎదుర్కోవడం
82. ‘ఆకాశ్’ అంటే?
1) {పపంచంలోనే చౌకైన ట్యాబ్లెట్ ‘పీసీ’
2) భారతీయ తొలి పైలట్ రహిత విమానం
3) క్లోనింగ్ అతి పొట్టి మనిషి
4) భారతలో వాతావరణ మ్యాప్‌లను రూపొందించే శాటిలైట్
83. జనవరి 8, 2012న నిర్వహించిన పదో భారతీయ దివస్‌కు ముఖ్య అతిథి కమలా పర్సాద్ బిస్సేసర్ ఏ దేశ అధ్యక్షురాలు?
1) మయన్మార్ 2) ట్రినిడాడ్, టిబాగో
3) బెలారస్ 4) థాయ్‌లాండ్
84. 2011 లెక్కల ప్రకారం దేశంలోని లక్ష జనాభా దాటిన 468 నగరాల్లో రాష్ట్రంలోని నగరాలు ఎన్ని?
1) 44 2) 40 3) 38 4) 64
85. జాతీయ విపత్తుల నిర్వహణ వ్యవస్థకు ఎవరు నేతృత్వం వహిస్తారు?
1) ప్రధానమంత్రి 2) రాష్ట్రపతి
3) హోంమంత్రి
4) శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి
86. విపత్తు అనే పదానికి ఫ్రెంచ్ భాషలో అర్థం?
1) చెడ్డ నక్షత్రం 2) చెడ్డ గాలి
3) సహజ వినాశనం 4) సహజ సంక్షోభం
87. విపత్తులు సంభవించినప్పుడు పరిగణనలోకి తీసుకొనే అంశం?
1) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
2) దేశీయ టెక్నాలజీ
3) స్థానిక ప్రజల సంప్రదాయ విధానం
4) పైవన్నీ
88. భారతదేశంలో విపత్తులు సంభవించడానికి కారణం?
1) భూభౌతిక పరిస్థితులు
2) వాతావరణ పరిస్థితులు
3) జనాభా పెరుగుదల 4) పైవన్నీ
89. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) డిసెంబర్ 23, 2005
2) డిసెంబర్ 23, 2006
3) ఆగస్ట్ 10, 2005
4) మార్చి 23, 2009
90. దేశంలో ఏ ప్రాంతంలో ఇప్పటివరకు అత్యధికంగా 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది?
1) అరుణాచల్‌ప్రదేశ్ - చైనా సరిహద్దు
2) మణిపూర్ - మయన్మార్ సరిహద్దు
3) బీహార్ - నేపాల్ సరిహద్దు
4) లాతూర్ - మహారాష్ట్ర
91. చైనా, జపాన్‌ల్లో సంభవించే తీవ్ర ఉష్ణమండల తుఫాన్‌లను ఏమంటారు?
1) హరికేన్‌లు 2) టోర్నడోలు
3) టైఫూన్‌లు 4) విల్లీ-విల్లీలు
92. భారతదేశంలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా?
1) 55.5 2) 59.8 3) 58.6 4) 63.6
93. ఆహార బ్యాంకును ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు?
1) చెన్నై 2) కోల్‌కతా 3) ముంబై 4) ఢిల్లీ
94. 12వ ప్రణాళికా కాలం?
1) 2011-16 2) 2012-17
3) 2013-18 4) 2010-15
95. ‘ఆవాక్స్’ను విస్తరించండి?
1) ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం
2) ఎయిర్‌లెస్ వాషింగ్ అండ్ కంట్రోల్ సిస్టం
3) ఎయిర్‌లెస్ వాటర్ అండ్ కంట్రోల్ సిస్టం
4) ఎర్త్, వాటర్ అండ్ కంట్రోల్ సిస్టం
96. 2012 యూరో కప్ విజేత?
1) ఇటలీ 2) బ్రెజిల్ 3) స్పెయిన్ 4) పోర్చుగల్
97. మే 13, 2012 నాటికి పార్లమెంట్ 60 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా
రిషాంగ్ కేషింగ్, రేషమ్ కుల్ జాంగ్డే, కందళ సుబ్రమణ్య తిలక్‌లను
సత్కరించారు. ఐతే వీరు వరుసగా ఏ రాష్ట్రాలకు చెందినవారు?
1) మణిపూర్, చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్
2) చత్తీస్‌ఘడ్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్
3) జార్ఖండ్, అసోం, ఆంధ్రప్రదేశ్
4) మిజోరం, అసోం, తమిళనాడు
98. {పపంచంలో అతిశీతల ప్రాంతం?
1) వెర్కోయానస్క్ 2) ఇర్‌కుట్స్క్
3) ఆర్కెంజల్ 4) జవోస్టాక్
99. ఉష్ణమండల ఎడారులు లేని ఖండం?
1) ఉత్తర అమెరికా 2) ఆస్ట్రేలియా
3) ఐరోపా 4) దక్షిణ అమెరికా
100. అత్యధిక సముద్ర తీరరేఖ ఉన్న దేశం?
1) చిలీ 2) కెనడా 3) అమెరికా 4) రష్యా
101. మేరియానా అగాధం ఏ మహాసముద్రంలో ఉంది?
1) పసిఫిక్ 2) అట్లాంటిక్
3) హిందూ 4) ఆర్కిటిక్
102. నగర ఖండం?
1) ఆఫ్రికా 2) ఆస్ట్రేలియా
3) ఉత్తర అమెరికా 4) ఐరోపా
103. జతపర్చండి?
ఎ) సుపీరియర్ సరస్సు
బి) కాస్పియన్ సముద్రం
సి) టిటికాక డి) బైకాల్
1) లోతైన సరస్సు
2) పెద్ద మంచినీటి సరస్సు
3) పెద్ద సరస్సు 4) ఎత్తై సరస్సు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-3, సి-1, డి-4
104. నూనెగింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) గుజరాత్
3) కర్ణాటక 4) తమిళనాడు
105. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది?
1) అక్షరాస్యత 2) వ్యవసాయం
3) పాడి పరిశ్రమ 4) నూనెగింజలు
106. భారతదేశంలో ఏకైక క్రియాశీలతా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
1) అండమాన్ 2) లక్షదీవులు
3) బారెన్ 4) నార్కొండం
107. భారతదేశంలో ఎత్తై శిఖరం?
1) గాడ్విన్ ఆస్టిన్ 2) కాంచనగంగ
3) మన్‌స్లూ 4) మౌంట్ ఎవరెస్ట్
108. బ్రహ్మపుత్రా నది జన్మస్థానం?
1) నాసిక్ త్రయంబకం 2) గంగోత్రి
3) షమ్‌యంగ్‌డంగ్ 4) అమర్‌కంటక్
109. జతపరచండి.
విమానాశ్రయం రాష్ట్రం
ఎ) నెడుంబస్సేరి 1) మధ్యప్రదేశ్
బి) దేవి అహల్య 2) గుజరాత్
సి) సంగనేశ్వర్ 3) కేరళ
డి) సర్దార్ వల్లభాయ్ పటేల్ 4) రాజస్తాన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
110. వైశాల్యంలో అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
1) మిజోరం 2) జార్ఖండ్
3) అరుణాచల్‌ప్రదేశ్ 4) మధ్యప్రదేశ్
111. కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం?
1) జమ్మూకాశ్మీర్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) అసోం 4) అరుణాచల్‌ప్రదేశ్
112. వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) ఖేత్రి 2) ఝరియా 3) పన్నా 4) తాల్చేర్
113. సముద్రాల్లో 1000 గ్రాముల నీటికి ఎన్ని గ్రా ముల ఉప్పు ఉంటే అది సాధారణ లవణీయత?
1) 25 2) 30 3) 35 4) 40
114. ‘నేలపట్టు పక్షుల కేంద్రం’ ఉన్న జిల్లా?
1) వరంగల్ 2) నెల్లూరు
3) ఖమ్మం 4) ఆదిలాబాద్
115. ఆర్యులు మొదట స్థిరపడిన ప్రాంతం?
1) గోదావరి ప్రాంతం 2) పంజాబ్
3) గంగానది డెల్టా 4) బెంగాల్ ప్రాంతం
116. భారత జాతీయ చిహ్నాన్ని ఎక్కడ నుంచి స్వీకరించారు?
1) సాంచీ స్థూపం 2) సారనాథ్ స్తంభం
3) గయలోని బోధి వృక్షం
4) ఢిల్లీలోని కుతుబ్‌మినార్
117. అలెగ్జాండర్ మరణానంతరం ఇండియాపై దాడి చేసిన గ్రీకు సేనాని?
1) సెల్యూకస్ నికేటర్ 2) మెగస్తనీస్
3) సైరస్ 4) నికిటన్
118. గుప్తుల పాలనను తెలిపే ‘నీతిశాస్త్రం’ గ్రంథం రాసినవారు?
1) కౌటిల్యుడు 2) కమందుకుడు
3) విశాఖదత్తుడు 4) శూద్రకుడు
119. విరూపాక్ష దేవాలయాలు నిర్మించినవారు?
1) వేంగి చాళుక్యులు
2) బాదామి చాళుక్యులు
3) పల్లవులు 4) కళ్యాణి చాళుక్యులు
120. మంగోలుల దాడులను నివారించడానికి శాశ్వత చర్యలు చేపట్టిన మొదటి ఢిల్లీ సుల్తాను?
1) ఇల్‌టుట్‌మిష్ 2) బాల్బన్
3) మహ్మద్‌బిన్ తుగ్లక్ 4) అల్లావుద్దీన్ ఖిల్జీ
121. క్రీ.శ. 1323లో ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ రాజ్యాన్ని విలీనం చేసుకున్న ఢిల్లీ సుల్తాన్?
1) మాలిక్ కపూర్ 2) జునాఖాన్
3) ఫిరోజ్ షా తుగ్లక్ 4) మాలిక్ ఫకృద్దీన్
122. విజయనగర రాజ్యాన్ని పాలించిన వంశాల క్రమం?
1) సాళువ, సంగమ, తుళువ, అరవీటి
2) తుళువ, సాళువ, సంగమ, అరవీటి
3) సంగమ, సాళువ, తుళువ, అరవీటి
4) సంగమ, తుళువ, సాళువ, అరవీటి
123. శ్రీకృష్ణదేవరాయలు గజపతులను ఓడించి, విజయస్తంభం స్థాపించిన ప్రదేశం?
1) శ్రీకాకుళం 2) కటక్
3) సింహాచలం 4) ఉదయగిరి
124. భారతదేశంలో మొగలుల పాలనా కాలం?
1) క్రీ.శ. 1206-1526
2) క్రీ.శ. 1526-1857
3) క్రీ.శ. 1556-1707
4) క్రీ.శ. 1605-1857
125. ‘పచ్చ బంగారం’ అని దేన్ని పిలుస్తారు?
1) కాఫీ 2) గోధుమ 3) వరి 4) టీ
126. శివాజీ చేతిలో ఓడి, పలాయనం చిత్తగించిన మొగలు సేనాని?
1) ఆఫ్జల్‌ఖాన్ 2) రాజా జైసింగ్
3) రాజా మాన్‌సింగ్ 4) షయిస్తాఖాన్
127. భారతదేశంలో ఆంగ్లేయులు మొదటి వర్తక స్థావరాన్ని క్రీ.శ. 1611లో ఎక్కడ స్థాపిం చారు
1) సూరత్ 2) మచిలీపట్నం
3) మద్రాస్ 4) ముంబై
128. బాలగంగాధర్ తిలక్‌కు సంబంధించి సరైంది?
1) కేసరి, మరాఠా పత్రికలు స్థాపించాడు
2) శివాజీ, గణపతి ఉత్సవాలు నిర్వహించాడు
3) బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం తర్వాత హోంరూల్ ఉద్యమాలు నిర్వహించాడు
4) పైవన్నీ
129. ముస్లింలీగ్ స్థాపించిన సంవత్సరం?
1) 1916 2) 1885 3) 1906 4) 1905
130. గాంధీజీ భారతదేశంలో చేసిన మొదటి ఉద్యమం?
1) అహ్మదాబాద్ 2) ఖైదా
3) చంపారన్ 4) బార్దోలీ
131. సహాయనిరాకరణోద్యమం స్ఫూర్తితో ఆంధ్రలో జరిగిన ఉద్యమం?
1) పెదనందిపాడు పన్నుల నిరాకరణ
2) చీరాల-పేరాల ఉద్యమం
3) పల్నాడులో రైతుల పన్నుల నిరాకరణ
4) పైవన్నీ
132. కాంగ్రెస్ పూర్ణస్వరాజ్ తీర్మానం ఎక్కడ ఆమోదించింది?
1) కలకత్తా 2) న్యూఢిల్లీ
3) లాహోర్ 4) అమృత్‌సర్
133. స్వాతంత్య్రానంతరం భారత యూనియన్‌లో చేరడానికి నిరాకరించిన సంస్థానాలు?
1) కాశ్మీర్ 2) హైదరాబాద్
3) జునాఘడ్ 4) పైవన్నీ
134. భారతదేశం నుంచి చివరిగా వెళ్లిన యూరోపియన్లు?
1) డచ్ 2) పోర్చుగీస్
3) ఫ్రెంచి 4) ఆంగ్లేయులు
135. భారత్‌లో ఆసియా క్రీడలు ఎన్నిసార్లు నిర్వహించారు?
1) 3 2) 4 3) 1 4) 2
136. రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో గరిష్టంగా ఎంతకాలం విధించొచ్చు?
1) ఏడాది 2) మూడేళ్లు 3) 6 నెలలు 4) రెండేళ్లు
137. భారతదేశంలో ఉచిత, నిర్భంధ విద్యాహక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) మార్చి 1, 2010 2) మే 1, 2010
3) సెప్టెంబర్ 1, 2010 4) ఏప్రిల్ 1, 2010
138. 2012లో సమ్మర్ ఒలింపిక్స్ వేదిక?
1) సింగపూర్ 2) సిడ్నీ
3) లండన్ 4) రోమ్
139. భారతదేశం దేనిలో సభ్యురాలు కాదు?
1) G-15 2) G-20 3) G-4 4) ASEAN
140. 99వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ జనవరి 2012లో ఎక్కడ నిర్వహించారు?
1) చెన్నై 2) ముంబై
3) బెంగళూరు 4) భువనేశ్వర్
141. భారతదేశంలో సముద్ర తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలెన్ని?
1) 7 2) 8 3) 9 4) 10
142. ఆగ్రా నగర స్థాపకుడు?
1) ఫిరోజ్ తుగ్లక్ 2) మహ్మద్ బిన్ తుగ్లక్
3) అల్లాఉద్దీన్ ఖిల్జీ 4) సికిందర్ లోడి
143. వీటిలో అతి తక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) హిమాచల్‌ప్రదేశ్
3) హర్యానా 4) జమ్మూకాశ్మీర్
144. ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ సంస్థకు ఏ ఖండంలోని సమస్యలను తీర్చే బాధ్యత ఉంది?
1) ఆఫ్రికా 2) ఆసియా
3) ఆస్ట్రేలియా 4) అన్ని ఖండాలు
145. లక్షద్వీపాలు ప్రాదేశిక అధికార పరిధి ఏ అత్యున్నత న్యాయస్థానానికి ఉంది?
1) తమిళనాడు 2) ముంబై
3) కేరళ 4) కర్ణాటక
146. వీటిలో శాసనమండలి లేని రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) మహారాష్ట్ర
147. {పస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు?
1) ఫ్రాంకోయిస్ హోలాండే
2) నికోలస్ సర్కోజి
3) ఫ్రాంక్లిన్ జార్జ్ 4) రాబర్ట్ పెరేరా
148. 20వ కామన్‌వెల్త్ క్రీడలు ‘గ్లాస్గో’ (స్కాట్లాండ్) నగరంలో ఎప్పుడు నిర్వహిస్తారు?
1) 2011 2) 2014 3) 2012 4) 2013
149. 2012 జూలైలో మరణించిన లక్ష్మీసెహగల్ ప్రముఖ?
1) సంఘ సంస్కర్త
2) స్వాతంత్య్ర సమరయోధురాలు
3) సాహితీవేత్త 4) మాజీ ఉపరాష్ట్రపతి
150. దేశంలో అత్యధిక కాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసినవారు?
1) మాయావతి 2) గెగాంగ్ అపాంగ్
3) చంద్రబాబునాయుడు 4) జ్యోతిబసు
ఈ ప్రశ్న పత్రం రూపొందించిన వారు ఎస్‌వీఆర్ కోచింగ్ సెంటర్, కర్నూలు
No comments:
Post a Comment