Wednesday, 29 August 2012

సమాచార హక్కు చట్టం

సమాచార హక్కు చట్టం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

1. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చింది?
అక్టోబర్‌ 12వ తేది,2005 న ఇది అమలులోనికి వచ్చింది (జూన్‌15, 2005న చట్టబద్ధమైన నాటి నుండి 120 వ రోజున) వచ్చింది. కొన్ని ఏర్పాట్లు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు ప్రభుత్వ అధికారుల బాధ్యతలు [ఎస్‌.4(1)], పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార ఆధికారులు [ఎస్‌.5(1) మరియు 5(2)], కేంద్ర సమాచార కమీషన్‌ ఏర్పాటు (ఎస్‌12 మరియు 13), రాష్ట్ర సమాచార కమీషన్‌ ఏర్పాటు (ఎస్‌.15 మరియు 16). రహస్య సమాచార, భద్రతా వ్యవస్థలకు (ఎస్‌.24) ఇది వర్తించదు. చట్టనియమాలను పొందుపరచే ఏర్పాటు జరిగింది (ఎస్‌.27మరియు 28).


2. ఎవరికి వర్తిస్తుంది?
జమ్మూ కాశ్మీరు రాష్ట్రమునకు తప్ప భారత దేశప్రజలందరికి ఈ చట్టం వర్తిస్తుంది [ఎస్‌.(12)].


3. సమాచారం అనగానేమి?
సమాచారం అనగా రికార్డులు, దస్తావేజులు (డాక్యుమెంట్లు), మెమోలు, ఇ-మెయిల్స్‌, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, అందరికీ తెల్పే పత్రం (సర్క్యులర్లు), ఉత్తర్వులు, దినచర్య పుస్తకాలు (లాగ్‌ బుక్స్‌), ఒప్పందాలు(కాంట్రాక్టులు), నివేదికలు(రిపోర్టులు), పత్రాలు, నమునాలు, ఏదేనా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉండే దత్తాంశాల (డేటా మెటీరియల్‌)తో సహా ఏ రూపంలోనైనా ఉండే ఏదేని అంశాలు, ఆ సమయంలో అమలులోఉన్న ఏదైనా ఇతర శాసనం క్రింద ప్రభుత్వ అధికార వర్గం తెలుసుకొనదగినట్టి ఏదైనా ప్రవేటు సంస్థకు చెందిన సమాచారం, ఫైలు వివరణలు (ఫైల్‌ నోటింగ్‌ లు) ఇందులో చేరవు [ఎస్‌.2(ఎఫ్‌) ].


4. సమాచారహక్కు అనగానేమి?
ఇందులో ఈ దిగువ హక్కులు చేరి ఉన్నాయి-
  • పనులను, దస్తావేజు(డాక్యుమెంట్లు)లను, లిఖిత నమోదు(రికార్డు)లను తనిఖీచేసే హక్కు.
  • డాక్యుమెంట్లు లేదా రికార్డుల నుండి కావలసిన అంశాలను నోట్‌ చేసుకోవడం, ఉదాహరణ భాగాలను రాబట్టుకోవడం, ధృవీకృత నకళ్ళను తీసుకొనే హక్కు.
  • సామగ్రి యొక్క ధృవీకృత మాదిరీలను తీసుకొనేహక్కు.
  • ముద్రిత ప్రతుల, డిస్కెట్స్‌, ఫ్లాపీలు, టేపులు, వీడియో కేసెట్ల రూపంలో లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్‌ విధానంలో లేదా ముద్రిత ప్రతుల ద్వారా సమాచారం పొందవచ్చు. [ఎస్‌.2( j )]


5. అధికారులు వారి విధులు
ప్రభుత్వ(పౌర) అధికార వర్గం యొక్క విధులేమిటి?
ఈచట్టం అమలులోకి వచ్చిన120 రోజులలోపల ఈక్రింది వాటిని ప్రచురించాలిః-
1.  ఆ అధికారవ్యవస్థ యొక్క కార్యక్రమాలు మరియు విధులు;
2.  అధికారులు, ఉద్యోగస్థుల అధికారాలు మరియు విధులు;
3.  పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతోబాటు నిర్ణయాత్మక ప్రక్రియతో అనుసరించే విధానాలు;
4.  వ్యవస్థ యొక్క కార్యక్రమ నిర్వహణలో నిర్వర్తించే సూత్రాలు;
5.  దీనిలో గల ఉద్యోగుల కార్యక్రమం అమలులో వినియోగించే నియమాలు, నిబంధనలు, సూచనలు, నియమ సంపుటులు ( మేన్యుయళ్ళు), రికార్డులు;
6.  దాని దగ్గర లేదా అజమాయిషీలో ఉన్న దస్తావేజుల లేదా పత్రాల రకాలకు సంబంధించిన ప్రకటన;
7.  దాని విధానాల రూపకల్పన కోసం ,లేక వాటి అమలు కోసం పౌర సభ్యులతో సంప్రదింపులు జరిపేటందుకు లేక వారి ప్రాతినిధ్యం స్వీకరించేటందుకు  ఏదైనా పద్ధతి ఉన్నట్లయితే దాని వివరాలు;
8.   దానిలో భాగంగా గాని, లేక సలహాలు ఇచ్చేటందుకు గాని, ఇద్దరులేక అంతకన్నా ఎక్కువ  సభ్యుల తో మండళ్ళు(బోర్డులు), పరిషత్తులు(కౌన్సిళ్ళు), సమితులు(కమిటీలు),ఇతర సంస్థలు ఏర్పాటై ఉంటే వాటి వివరాల ప్రకటన. ఆయా సమావేశాలగురించి ప్రజలకు తెలుస్తున్నదీ  లేనిది సమావేశపు వివరణలు అందుబాటులో ఉన్న విషయం;
9.  అధికారుల, ఉద్యోగ దర్శిని;
10. అధికారులు, ఉద్యోగులలో ప్రతి ఒక్కరు తీసుకునే నెలవారి వేతనము, నిబంధనల ప్రకారం  చెల్లించే పరిహార విధానం;
11.  అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యెయాలు, జరిపిన పంపిణీలకు సంబంధించిన నివేదికల వివరాలను సూచిస్తూ ఆ యంత్రాంగంయొక్క ప్రతినిధి సంస్థలు ప్రతీదానికి కేటాయించిన బడ్జెట్‌ వివరాలు;
12.  ఆర్ధిక సహాయ (సబ్సిడీ )కార్యక్రమాల అమలుతీరు, ఆయా కార్యక్రమాలకు కేటాయించిన సొమ్ము మొత్తం, లబ్ధిదారుల వివరాలు;
13.  అది మంజూరు చేసిన రాయితీలు, అనుమతులు, అధికారికనిధులను పొందుతున్న గ్రహీతల వివరాలు;
14.  ఎలక్ట్రానిక్‌ రూపంలోకి కుదించిన అందుబాటులోను, ఆధీనంలోఉన్నసమాచారం;
15.  ప్రజా వినియోగం కోసం గనుక నిర్వహిస్తే గ్రంధాలయం, పఠనాలయం యొక్క పని గంటలతోబాటు పౌరులకు అందేసమాచారం కొరకు అందుబాటులోగల సౌకర్యాల వివరాలు;
16. పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతరవివరాలు. [ ఎస్‌.4(1)(బి) ]


ప్రభుత్వ అధికార వర్గం అనగానేమి?
ఏ అధికార వర్గమైనా, స్వపరిపాలన మండలి లేదా సంస్థను ఏర్పరచడం లేదా నెలకొల్పడాన్నే ప్రభుత్వ అధికార వర్గం అంటారు. [ఎస్‌.2(హెచ్‌) ]
  • రాజ్యాంగం ద్వారా లేదా దాని ఆధీనంలో;
  • పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఇతర శాసనం;
  • రాష్ట్ర శాసన సభ లో చేసిన ఏదైనా ఇతరశాసనం;
  • ప్రభుత్వం జారీ చేసిన సముచితమైన ప్రకటన లేదా ఉత్తరువు మరియు ఇంకేదేని చేరి ఉంటాయి-
ఎ. స్వంత, నియంత్రణ లేదా గణనీయమైన ఆర్ధికసహాయాన్ని పొందిన సంస్థ.
బి.సంబంధిత ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయమైన ఆర్ధిక సహాయాన్ని పొందిన ప్రభుత్వేతర సంస్థ.


ప్రభుత్వ సమాచార అధికారులెవరు(పిఐఒలు)?
అన్నిపరిపాలనా విభాగాలు, లేదా చట్టం క్రింద కోరే సమాచారాన్ని ప్రజలకు అందించే కార్యాలయాలలో పనిచేసే అధికారులను ప్రభుత్వ (పౌర) సమాచార అధికారులుగా ప్రభుత్వ అధికార వర్గం ద్వారా పేర్కొనబడింది. ప్రభుత్వ (పౌర) సమాచార అధికారి తన అతను/ఆమె యొక్క కర్తవ్య నిర్వహణలో ఏ అధికారి సహాయమైన కావాలనుకున్నప్పుడు అన్ని విధాల సహాయాన్ని పొందే ఉద్దేశంతో చట్టాన్ని అనుసరించి శాసన నిబంధనకు లోబడి యేర్పరిస్తే అతను/ఆమెను సహాయ ప్రభుత్వ(పౌర) సమాచార అధికారిగా చెప్పవచ్చును.


పౌరసమాచార అధికారియొక్క విధులేమిటి?
  • సమాచారం కోసం వ్రాత పూర్వక విజ్ఞప్తినివ్వలేకపోతే ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని లిఖితరూపంలో గ్రహించడానికి తగు సహాయాన్ని తీసుకోవాలి.
  • మరో ప్రభుత్వాధికార వర్గం వద్దఉన్న లేదా  విషయాంశానికి సన్నిహిత సంబంధంకల్గి ఉన్న సమాచార విజ్ఞప్తిని (5) రోజుల లోపల సముచిత సమాచారాన్ని పొంద వలసిన వేరొక ప్రభుత్వాధికార వర్గమునకు తగిన అభ్యర్ధనతో బదిలీచేసి పౌర సమాచార అధికారి ఆ విషయాన్ని వెనువెంటనే దరఖాస్తుదారునికి తెలియజేయాలి.
  • ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి తనకు సహాయం కావాలనుకున్నప్పుడు ఏ ఇతర అధికారికైన అతడు/ఆమె కర్తవ్య నిర్వహణను అప్పగించవచ్చును.
  • విజ్ఞప్తి అందిన వెంటనే వీలయినంత వేగంగా, మరియు విజ్ఞప్తి అందిన (30) రోజుల లోపల సమాచారాన్ని ఇవ్వడం, సూచించిన రుసుమును చెల్లించే సమాచారాన్నివ్వడం, ఎస్‌.8 లేదా ఎస్‌.9 లోతెల్పిన విధంగా తగిన కారణాన్ని చెబ్తూ నిరాకరించడం ప్రభుత్వ (పౌర) సమాచార అధికారి చేయాలి.
  • ఒక వ్యక్తి యొక్క జీవితానికి లేదా స్వఛ్ఛకు సంబంధించిన అభ్యర్ధన అందిన (48)గంటల లోపల  సమాచారాన్ని ఇవ్వాలి.
  • సూచించిన కాలపరిమితిలోపల అభ్యర్ధనకు తగిన నిర్ణయాన్ని ఇవ్వలేనప్పుడు విజ్ఞప్తిని తిరస్కరించినట్లుగా భావించవచ్చును.
  • విజ్ఞప్తిని గనుక తిరస్కరిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి, విజ్ఞప్తిదారునికి (1)  నిరాకరించడానికి గల కారణాలు,
  • (2) తిరస్కరించిన అభ్యర్ధనకు ఎప్పటిలోగా అపీలు చేసుకోవచ్చునో దానికి తగిన నిర్ణీత కాలవ్యవధిని చెప్పడం, (3)విచారణాధికారి వివరాలు తెలియజేయాలి.
  • ప్రభుత్వ అధికార వనరులను సరిపోల్చలేని విధంగా మళ్ళించవలసి రావటం రికార్దుల పరిరక్షణ, భద్రతకు హానీకరమైనదయితే తప్ప కోరిన సమాచారాన్ని సాధారణంగా అందజేయడమౌతుంది.
  • పాక్షికంగా సమాచారాన్ని అంద జేయాల్సినప్పుడు , ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి దరఖాస్తుదారునికి ప్రకటనద్వారా తెలియజేయడం ;
ఎ. రికార్డులోని కొంత భాగాన్ని అభ్యర్దించినప్పుడు పంపకానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లైతే మినహాయించి వెల్లడిచేయవచ్చును;
బి. వాస్తవాంశాల పరిశీలనలను కలుపుకొని, నిర్దేశితవిషయానికి సంబంధించిన ఆయా పరిశీలనల ఆధారంగా నిర్ణయానికి కారణాలను తెల్పాలి;
సి. నిర్ణయమిచ్చిన వ్యక్తి యొక్క  పేరు ,హోదా;
డి.అతడు/ఆమెకు గణనచేసిన రుసుము,దరఖాస్తుదారుడు జమచేయవలసిన మొత్తం రుసుము  వివరాలు;మరియు
ఇ. అతను/ఆమె హక్కులను గౌరవిస్తూ వెల్లడి చేయలేని సమాచార భాగ నిర్ణయాన్ని సమీక్షించి,      రుసుము మొత్తాన్ని విధించడం లేదా పొందవలసిన మేరకు సమాచారాన్ని అందించాలి.
  • తృతీయ పక్షానికిచెందిన లేదా అందించిన సమాచారం , అతి రహస్యమైనదిగా తృతీయ పక్షం  భావించినట్లయితే ప్రభుత్వ(పౌర) సమాచార అధికారి సమాచారం అందిన (5)రోజులలోగా సదరు తృతీయ పక్షానికి వ్రాతపూర్వక ప్రకటనను ఇవ్వాలి. వారి విన్నపాన్ని పరిగణనలోకి తేసుకోవాలి.
  • ప్రకటన అందిన (10) రోజులలోగా సమాచార వెల్లడి ప్రతిపాదనపై తృతీయ పక్షానికి అవకాశం ఇవ్వాలి.




6. అందుబాటులో గల సమాచారం ఏముంది?
1. బహిరంగ వెల్లడికి మినహాయింపులేమిటి?
వెల్లడిచేయడంలో ఈ క్రింది మినహాయింపులు ఇవ్వబడినవి.(ఎస్‌.8)
1. భారతీయ ఐక్యతకు, సార్వభౌమత్వానికి ప్రతికూల పరిణామాలను కల్గించే సమాచారం, దేశ భద్రతకు,        కీలకమైన,   రాష్ట్రవైజ్ఞానిక లేదా ఆర్ధిక ప్రయోజనాల, విదేశీ రాజ్య సంబంధంలేదా నేరాలను                     ప్రేరేపించడంలో త్రోవకల్పించే సమాచారం, వెల్లడికి మినహాయింపులు.
2 ఏదైనా న్యాయ స్థానం లేదా ట్రిబ్యునల్‌ (అధికరణస్థానం) ప్రచురించ కూడదని నిరోధించిన, లేదా           చట్టంనిషేధించిన  విషయం న్యాయస్థానాల  ధిక్కారం లోకి వస్తుందనుకుంటే అ సమాచారం.
3. కేంద్ర శాసనమండలి (పార్లమెంట్‌) లేదా రాష్ట్ర శాసనసభల ప్రత్యేక హక్కుల  ఉల్లంఘనకు కారణమయ్యే సమాచారం;
4. వాణిజ్య విశ్వసనీయత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన , వెల్లడిచేసే సమాచారం   పోటీ రంగంలో తృతీయ పక్షానికి హానీ కల్గుతుందనుకుంటే ఆ సమాచారం. విస్తృత ప్రజాప్రయోజనాల అధిపత్రం (వారంట్‌) దృష్ట్యా సమర్ధమైన అధికార వర్గం వెల్లడి చేయాల్సిందేనని భావించినట్లైతే  అటువంటి సమాచారాన్ని  వెల్లడించవచ్చును;
5.విశ్వాసబద్ధమైన సంబంధరీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం  విస్తృత          ప్రజా    ప్రయోజనాల అధిపత్రం (వారంట్‌) దృష్ట్యా సమర్ధమైన అధికార వర్గం వెల్లడి చేయాల్సిందేనని         భావించినట్లైతే అటువంటి సమాచారాన్ని  వెల్లడించవచ్చును;
6. విదేశీ ప్రభుత్వం నుంచి  అందిన రహస్య సమాచారం;
7. ఏదైన సమాచారం వెల్లడి వల్ల ఏ వ్యక్తి ప్రాణానికైనా లేక భౌతిక భద్రత కైనా హానీ కల్గుతుందనుకుంటే  
   అలాంటి సమాచారం. చట్టాల అమలు, భద్రతా ప్రయోజనాల కొరకు రహస్య  సమాచారం అందించిన లేక సహాయపడిన వారిగుర్తింపునకు దారితీసే సమాచారం;
8. దర్యాప్తు ప్రక్రియను, నేరస్తులను పట్టుకునేందుకు అభియోగం నడపడానికి అవరోధాలు కల్పించే                సమాచారం;
9.మంత్రి మండలి , కార్యదర్శులు , ఇతర అధికారుల సమాలోచనలతో సహా మంత్రి మండలి(క్యాబినెట్‌)      పత్రాలు;
10.ప్రజా కార్యకలాపాలకు, ప్రయోజనాలతో నిమిత్తంలేని వ్యక్తిగత సమాచారం, లేదా వ్యక్తిగత జీవితాలలోకి      నిష్కారణంగా తొంగిచూసే  అవకాశం కల్పించే సమాచారం;
11. పై మినహాయింపు జాబితాతో నిమిత్తమలేకుండ రక్షిత ప్రయోజనాలకు కల్గే హానికన్నా ప్రజా                   ప్రయోజనాల దృష్ట్యా మేలు ఎక్కువనుకుంటే సమర్ధమైన అధికార వర్గం సమాచారాన్ని         అందించవచ్చును;


2. కొంతభాగాన్ని మాత్రమే వెల్లడిచేసే అనుమతి ఉందా?
కోరిన రికార్డులో  వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగాన్ని సమాచారాన్ని అందించడం. (ఎస్‌.10)


3. సమాచార చట్టంనుండి మినహాయింపు గల వారెవరు?
 కేం ద్ర రహస్య సమచార, భద్రాతా సంస్థలు రెండవ షెడ్యూల్‌ లో నిర్దిష్టంగా ఉన్నటు వంటి ఐబి.ఆర్‌  అండ్‌ఎడబ్ల్యు, ఆదాయ సంపత్తి కార్యకేంద్రం    (రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌) ,కేంద్ర ఆర్ధిక ప్రజ్ఞా సంపత్తి కార్య కేంద్రం  (సెంట్రల్‌ ఎకనామిక్స్‌     ఇంటెలిజెన్స్‌ బ్యూరొ ) ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, మాదకద్రవ్యాల నియంత్రణ కార్యకేంద్రం (నార్కోటిక్స్‌   కంట్రోల్‌ బ్యూరొ), ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ , ప్రత్యేక సరిహద్దు దళం (స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌),   సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్‌.ఎఫ్‌), కేంద్ర ప్రత్యేక భద్రతా దళం  (సి.ఆర.పి.ఎఫ్‌), ఐ.టి.బి.పి,   సి.ఐ.ఎస్‌.ఎఫ్‌, ఎన్‌.ఎస్‌.జి, అస్సామ్‌ రైఫిల్స్‌ , ప్రత్యేక సేవా కార్యకేంద్రం( స్పెషల్‌ సర్వీస్‌ బ్యూరొ), ప్రత్యేక   విభాగం- కేంద్ర రహస్య సమాచార సంచాలక కార్యాలయం (సిఐడి), అండమాన్‌ అండ్‌ నికోబార్‌ ,  నేరవిభాగం- కేంద్ర రహస్య సమాచార సంచాలక కార్యాలయం - కేంద్రవిభాగం, దాద్ర అండ్‌ నాగర్‌  హవేలి  మరియు ప్రత్యేకశాఖ, లక్షద్వీప్‌  పోలీస్‌. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రకటింపబడిన ప్రత్యేక సంస్థలను మినహాయించడమౌతుంది. అవినీతి ఆరోపణలు,  మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి  ఉంటే   ఆయా సంస్థల సమాచారాన్ని అందించడంలో మినహయింపు ఉన్నప్పటికి అది వర్తించదు. ఇంకను కేంద్ర లేదా రాష్ట్ర సమాచార కమీషన్‌ ఆమోదమైన తర్వాతనే మానవ హక్కుల మూల్యాంకనానికి సంబంధించిన ఆరోపణల వ్యవహారం ఉన్నట్లయితే ఆ  సమాచారాన్ని ఇవ్వాలి. (ఎస్‌.24)



7. సమాచారం కోసం అభ్యర్ధించే విధానం
      1. సమాచారం కొరకు అభ్యర్ధిస్తూ చేసే దరఖాస్తు విధానమేమిటి?
          లిఖిత పూర్వకంగా గానీ , లేదా  ఎలక్ట్రానిక్‌ రూపంలో గానీ ఇంగ్లీష్‌ , హిందీ లేదా స్థానిక అధికార                       భాషలో గానీ ,  ప్రభుత్వ సమాచార అధికారికి వివరాలను దరఖాస్తు చేస్తూ సమాచారాన్ని కోరడం,
       2. సమాచారం కోరడానికి గల కారణాలను తెలియజేయవలసిన అవసరంలేదు;
       3. నిర్ణీత రుసుమును చెల్లించవలెను (దారిద్ర్య రేఖకు దిగువగల వర్గం వారుతప్ప).
     2. సమాచారాన్ని పొందడానికి గల కాల పరిమితి ఏమిటి?
       1. దరఖాస్తు చేరిన (30) రోజుల లోగా సమాచారమివ్వాలి.
       2. ఒక వ్యక్తి జీవితం లేదా స్వేచ్చకు సంబంధించిన విషయంలో (48)గంటలలోపల సమాచారమివ్వాలి.
       3. సహాయ సమాచార అధికారికి సమాచారం కోసం ఇచ్చిన దరఖాస్తు విషయంలో సమాధానం
         చెప్పడానికి (5)రోజుల వ్యవధిని కలుపుకోవాలి.
      4. తృతీయ పక్షం గనుక సమాచారాన్ని ఉన్నట్లయితే (40) రోజుల కాలవ్యవధిని (గరిష్ట కాలవ్యవధి,
        తృతీయ పక్షానికి ఇచ్చిన సమయం కలుపుకొని) ఇవ్వాలి
    5. కేటాయించిన వ్యవధిలో సమాచారాన్ని అందించకపోతే గనుక అభ్యర్ధనను తిరస్కరించినట్లుగా            భావించవచ్చు.
      3. చెల్లించవలసిన రుసుము ఎంత?
      1. సముచిత మైన నిర్దిష్ట రుసుమును దరఖాస్తు కొరకు ఉండాలి.
      2. ఇంకను ఎక్కువ రుసుము చెల్లించాలంటే వ్రాతపూర్వకంగా, లెక్కించిన వివరాలతో బాటు ఎంత మొత్తం         చెల్లించాలో తెలియజేయాలి.
      3. అభ్యర్ధిదారుడు నిర్ణయంపై పునర్విచారణ కోరితే ప్రభుత్వ సమాచార అధికారి విధించిన రుసుముతో         సరియగు విచారణాధికారికి దరఖాస్తు చేయాలి.
      4. దారిద్ర్య రేఖకు దిగువగల వర్గం వారు ఎలాంటి రుసుమును చెల్లించవలసినవసరంలేదు.
      5. కాల వ్యవధిలోగా ప్రభుత్వ సమాచార అధికారి , దరఖాస్తుదారునికి సమాచారాన్ని ఇవ్వలేని పక్షంలో         ఉచితంగానే సమాచారాన్ని ఇవ్వాలి.
    
 4.సమాచారాన్ని  ఇవ్వడంలో తిరస్కరణకు గల కారణాలేమిటి?
      1. మినహాయింపులోగల సమాచారాన్ని వెల్లడించరాదు. (S.8)
      2. ఇతర రాష్ట్రం లోగల ఏ వ్యక్తి కాపీరైటుగల వాటి సమాచారం (S.9)  

No comments:

Post a Comment