Tuesday, 7 August 2012

సోషల్ స్టడీస్ - భారత రాజ్యాంగం

 
04- 08- 2012 : తొలి లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన దేశం?
సోషల్ స్టడీస్ - భారత రాజ్యాంగం

1. ఏయే సంవత్సరాల్లో అమెరికా, ఫ్రాన్‌‌సలు రాజ్యాంగాలు రచించుకున్నాయి?
ఎ) 1784, 1787 బి) 1787,1789
సి) 1789, 1792 డి) 1792,1796

2. ‘ప్రభుత్వ స్వరూపం, అది పనిచేసే విధా నాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం’ అని నిర్వచించినవారు?
ఎ) లార్‌‌డ బ్రైస్ బి) ప్రొఫెసర్ లీకాక్
సి) ప్రొఫెసర్ గిల్‌క్రైస్ట్ డి) డి.వూల్సీ

3. రాజ్యాంగం అంటే?
ఎ) నియమ నిబంధనల సంపుటి
బి) ప్రభుత్వం ఏం చేయాలో, ఏం చేయ కూడదో పేర్కొనే గ్రంథం
సి) రాజకీయ వ్యవస్థ విధులు, ప్రభుత్వ యంత్రాంగ అధికారాలను నిర్వచించే చట్టం
డి) రాజకీయ కార్యకలాపాలను క్రమ బద్ధం చేసే ముఖ్య నియమాల సముదాయ పత్రం

4. వివిధ రాజ్యాంగాలను వర్గీకరించి ఉత్తమ రాజ్యాంగ లక్షణాలను వివరించినవారు?
ఎ) ప్లేటో బి) అరిస్టాటిల్
సి) ఉడ్రోవిల్సన్ డి) బి.ఆర్.అంబేద్కర్

5. ఉత్తమ రాజ్యాంగానికి ఉండకూడని లక్షణం?
ఎ) సరళత బి) ప్రజాసమ్మతి
సి) వివరణాత్మకత డి) స్పష్టత

6. కాలక్రమేణ అభివృద్ధి చెందుతూ ఉండే రాజ్యాంగం?
ఎ) తాత్విక బి) పరిమాణాత్మక
సి) లిఖిత, దృఢ డి) లిఖిత, అదృఢ

7. అదృఢ రాజ్యాంగ ప్రాథమిక భావన?
ఎ) పటిష్ట రాజ్యాంగ నియమ నిబంధనలు లేనిది
బి) వివరణాత్మక సూచనలతో నిర్దిష్టంగా ఉండేది
సి) ప్రభుత్వ అధికారాలు, విధులను స్పష్టంగా వివరించలేనిది
డి) సాధారణ, రాజ్యాంగ చట్టాలను ఒకే ర కంగా సవరించడానికి వీలుగా ఉండేది

8. తొలి లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిన దేశం?
ఎ) అమెరికా బి) బ్రిటన్
సి) రష్యా డి) భారతదేశం

9. వీటిలో సరికానిది?
i)లిఖిత రాజ్యాంగం
- ప్రయత్నపూర్వక రాజ్యాంగం
ii)లిఖిత రాజ్యాంగం
- పరిణామాత్మక రాజ్యాంగం
iii)ధృఢ రాజ్యాంగం - అమెరికా
iv) అధృడ రాజ్యాంగం - బ్రిటన్ ఎ) iii, iv- బి) i, iii
సి) i, ii, iii, iv డి) పైవేవీ కావు

10. కాలానుగుణ మార్పులకు వీలులేని రాజ్యాంగంతో విప్లవాలు చెలరేగుతాయని భావించినవారు?
ఎ) కారల్ మార్‌‌క్స బి) అరిస్టాటిల్
సి) లార్‌‌ట మెకాలే
డి) జవహర్‌లాల్ నెహ్రూ

11. ఏక కేంద్ర ప్రభుత్వం ఉన్న దేశం?
ఎ) ఇండియా బి) న్యూజిలాండ్
సి) కెనడా డి) స్విట్జర్లాండ్

12. ‘జాతీయ సమైక్యత, రాష్ట్రాల హక్కులను సమన్వయ పర్చే రాజకీయ సాధనమే సమాఖ్య’ అని నిర్వచించినవారు?
ఎ) ఎ.వి.డైసీ బి) కె.సి. వేర్
సి) గార్నర్ డి) హామిల్టన్

13. సమాఖ్య వ్యవస్థ ప్రాథమిక లక్షణాల్లో లేనిది?
ఎ) లిఖిత రాజ్యాంగం
బి) రాజ్యాంగ ఆధిక్యత
సి) ఏక పౌరసత్వం
డి) స్వతంత్ర న్యాయ వ్యవస్థ

14. భారతదేశంలో అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. అమెరికాలో ఎవరికున్నాయి?
ఎ) కేంద్ర ప్రభుత్వం బి) రాష్ర్ట ప్రభుత్వం
సి) కేంద్ర- రాష్ట్రాలకు డి) అధ్యక్షుడు

15. ఏ వ్యవస్థ ద్వారా భిన్నత్వంలో ఏకత్వం సాధించొచ్చు?
ఎ) ఏకకేంద్ర బి) అధ్యక్ష తరహా
సి) సమాఖ్య డి) పార్లమెంటరీ

16. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ‘బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ మోడల్’గా పిలవడానికి కారణం?
ఎ) పార్లమెంటరీ విధానాన్ని మొదట బ్రిటిష్ ప్రభుత్వ మంత్రులు సూచించడం
బి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానా న్ని బ్రిటిష్ ప్రభుత్వంలోని వెస్ట్ అనే మంత్రి రూపొందించడం
సి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మొ దట బ్రిటన్ పశ్చిమ భాగంలో ఏర్పర్చడం
డి) బ్రిటన్ పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఉండటం

17. పార్లమెంటరీ విధానంలో వాస్తవ అధికారం ఎవరిది?
ఎ) రాష్ర్టపతి బి) సుప్రీంకోర్టు
సి) మంత్రిమండలి డి) పార్లమెంట్

18. ‘ప్రధానమంత్రి పార్లమెంట్‌లో సభ్యులై ఉండాలి’ ఈ వాక్యం?
ఎ) వాస్తవం బి) పూర్తిగా అసత్యం
సి) పాక్షికంగా వాస్తవం
డి) రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనలేదు

19. ‘రాజు తప్పు చేయలేడు’ అనే నానుడి ఎప్పుడు నిజమవుతుంది?
ఎ) రాజ్యాధినేత నామమాత్ర కార్యనిర్వాహక వర్గంగా ఉన్నప్పుడు
బి) రాజ్యాధినేత వాస్తవ కార్యనిర్వాహక వర్గంగా ఉన్నప్పుడు
సి) రాజ్యాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నప్పుడు
డి) రాజ్యాధినేతను పరోక్షంగా ఎన్నుకున్న ప్పుడు

20. మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
ఎ) పార్లమెంట్ బి) లోక్‌సభ
సి) రాష్ర్టపతి డి) ప్రధానమంత్రి

21. హక్కుల గూరించి ప్రస్తావించిన తొలి రాజ్యాంగం?
ఎ) భారత్ బి) బ్రిటన్
సి) స్వీడన్ డి) అమెరికా

22. హక్కులు రాజ్యాంగ అంతరాత్మ అని పేర్కొన్నవారు?
ఎ) అంబేద్కర్ బి) గాంధీజీ
సి) నెహ్రూ డి) రాజేంద్రప్రసాద్

23. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్థిహక్కును తొలగించినప్పుడు ప్రధానమంత్రి?
ఎ) ఇందిరాగాంధీ బి) రాజీవ్ గాంధీ
సి) మొరార్జీదేశాయ్ డి) వి.పి.సింగ్

24. ప్రాథమిక హక్కులపై పరిమితులను విధించే అధికారం ఎవరికుంది?
ఎ) ప్రధానమంత్రి బి) మంత్రిమండలి
సి) సుప్రీంకోర్టు డి) పార్లమెంట్

25. హక్కులను పరిరక్షించుకునే హక్కు?
ఎ) సహజ బి) రాజకీయ
సి) పౌర డి) నైతిక

26. రాజ్యాంగంలోని 32వ అధికరణ ఎన్ని రకాల రిట్ల గురించి తెలుపుతుంది?
ఎ) 5 బి) 4 సి) 6 డి) 3

27. మన ముఖ్య విధి?
ఎ) స్వేచ్ఛగా జీవించడం
బి) దేశానికి విధేయుడిగా ఉండటం
సి) ఇతరులు స్వేచ్ఛగా జీవించేలా ప్రవర్తించడం
డి) ప్రభుత్వ చట్టాలను గౌరవించడం

28. ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ఏ రకమైన విధి?
ఎ) నైతిక బి) సామాజిక
సి) సంవర్థక డి) సంరక్షక

29. సంరక్షక విధులు అంటే?
ఎ) ఇతరుల హక్కులను గౌరవిస్తూ తమ పనులను చేసుకోవడం
బి) చట్టం నిషేధించిన వాటిని ప్రజలు నిర్వర్తించకుండా ఉండటం
సి) ప్రభుత్వ ఆస్తులను ప్రజలు రక్షించు కోవడం
డి) పైవన్నీ

30. ఏ కమిటీ సూచనల ప్రకారం రాజ్యాం గంలో ప్రాథమిక విధులను చేర్చారు?
ఎ) సర్కారియా బి) పటేల్
సి) మండల్ డి) స్వరణ్ సింగ్

31. 86వ రాజ్యాంగ సవరణ(2002) ద్వారా ప్రాథమిక విధుల్లో చేర్చిన అంశం?
ఎ) ఆరేళ్లలోపు బాలబాలికలకు శిశువిద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది
బి) 6 -14 ఏళ్ల పిల్లలకు తగిన విద్యా సదుపాయాలను తల్లిదండ్రులు కల్పించాలి
సి) 6-14 ఏళ్ల పిల్లలకు నిర్భంధ ఉచిత విద్యను తల్లిదండ్రులు అందించాలి
డి) 6-14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్భంధ విద్యను ప్రభుత్వం అందించాలి

32. వివిధ దేశాల నుంచి భారత రాజ్యాంగం గ్రహించిన వాటిలో సరైన జత?
i) పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక హక్కులు- ఆస్ట్రేలియా
ii) కేంద్ర, రాష్ర్ట సంబంధాలు- కెనడా
iii) అత్యవసర అధికరణలు- జర్మనీ
iv) రాష్ర్టపతిపై మహాభియోగ తీర్మాన ప్రతిపాదన- అమెరికా
v) సమన్యాయ పాలన-బ్రిటన్
ఎ) ii, iii,v బి) i, iii, iv, v
సి) ii, iv- డి) పైవన్నీ

33. రాజ్యాంగ పరిషత్తు సమావేశంలో లక్ష్యాల తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు ప్రతిపాదించారు?
ఎ) జనవరి 26, 1947
బి) జనవరి 24, 1947
సి) జనవరి 22, 1947
డి) జనవరి 20, 1947

34. ‘రాజ్యాంగాన్ని భారతీయులమైన మేము మా కోసం సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనడంలో ఇమి డి ఉన్న స్వభావం?
ఎ) సామ్యవాదం బి) ప్రజాస్వామ్యం
సి) లౌకికత్వం డి) సౌభ్రాతృత్వం

35. ‘రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం ప్రవేశిక’ అని వర్ణించినవారు?
ఎ) కె.సి. వేర్ బి) జస్టిస్ హిదయతుల్లా
సి) జస్టిస్ మథోల్కార్ డి) కె.ఎం.మున్షీ

36. ప్రారంభంలో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్లు ఉండేవి?
ఎ) 6 బి) 8 సి) 10 డి) 12

37. వీటిలో సరళ రీతిలో సవరించడానికి వీలులేని అంశం?
ఎ) భారత రాష్ర్టపతి అధికారాలు
బి) రాష్ట్రాల విభజన
సి) షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన
డి) కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభల ఏర్పాటు

38. ‘భారత రాజ్యాంగం ఏకకేంద్ర రాజ్య వ్యవస్థ వైపు మొగ్గుతోన్న సమాఖ్య విధానం’గా వర్ణించినవారు?
ఎ) నెహ్రూ బి) అంబేద్కర్
సి) గాంధీ డి) సర్దార్‌వల్లభాయ్ పటేల్

39. ప్రాథమిక హక్కుల గురించి తెలిపే అధికర ణలు?
ఎ) 10 నుంచి 25 బి) 12 నుంచి 32
సి) 12 నుంచి 35 డి) 14 నుంచి 35

40. ఓటర్ల కనీస వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు ఎప్పుడు తగ్గించారు?
ఎ) 1986 బి) 1987
సి) 1988 డి) 1989

41. రాజ్యాంగం ప్రకారం లోక్‌సభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?
ఎ) 545 బి) 543 సి) 550 డి) 552

42. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది?
ఎ) 1991 బి) 1992 సి) 1993 డి) 1994

43. మన దేశంలో సర్వసత్తాకాధికారం ఎవరికి ఉంది?
ఎ) ప్రజలు బి) రాష్ర్టపతి
సి) సుప్రీంకోర్టు డి) పార్లమెంట్

44. కేంద్రంలో పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం?
ఎ)UPA-I బి) UPA-II
సి) NDA డి) యునెటైడ్ ఫ్రంట్

45. భారత రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన ఎన్నికల్లో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య?
ఎ) 12 బి) 8 సి) 6 డి) 4

46. ఏ గవర్నర్ జనరల్ సూచన ప్రకారం రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం న్యూఢిల్లీలో నిర్వహించారు?
ఎ) లార్‌‌ట మౌంట్ బాటన్
బి) లార్‌‌డ వేవెల్ సి) స్టాన్‌ఫర్‌‌డ క్రిప్స్
డి) లార్‌‌ట మేయో

47. భారత రాజ్యాంగ పరిషత్తు కార్యదర్శిగా నియమితులైనవారు?
ఎ) సచ్చిదానంద సిన్హా
బి) ఎస్.ఎన్. ముఖర్జీ సి) బి.ఎన్.రావు
డి) హెచ్.వి.ఆర్. అయ్యంగార్

48. ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని సవర ణల అనంతరం తుది రాజ్యాంగాన్ని ఆమో దించారు?
ఎ) 5643 బి) 4876
సి) 2473 డి) 3824

49. రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన కాలం?
ఎ) రెండేళ్ల 11 నెలల 18 రోజులు
బి) మూడేళ్ల 2 నెలల 19 రోజులు
సి) రెండేళ్ల 9 నెలల 11 రోజులు
డి) రెండేళ్ల 10 నెలల 21 రోజులు

50. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి ప్రాతిపదిక ఐన నివేదికను ఎక్కడ నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రూపొందించారు?
ఎ) లాహోర్ బి) కరాచీ
సి) బొంబాయి డి) న్యూఢిల్లీ

51. భారత రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ఉపసంఘానికి అధ్యక్షులు?
ఎ) నెహ్రూ బి) అంబేద్కర్
సి) రాజేంద్రప్రసాద్
డి) సర్దార్ వల్లభాయ్ పటేల్

52. భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాథ మిక హక్కులు ప్రాతిపదికగా ఉంటాయని పేర్కొన్నవారు?
ఎ) కె.సీ. వేర్ బి) బి.ఆర్.అంబేద్కర్
సి) ఎం.వి. షైలీ డి) ఎస్.పి. ముఖర్జీ

53. ప్రాథమిక హక్కుల్లో మొదటిది?
ఎ) సమానత్వ బి) స్వాతంత్ర
సి) పీడనాన్ని నిరోధించే
డి) రాజ్యాంగ పరిహార

54. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్.సి. ఎస్.టి. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు?
ఎ) 86 (2002) బి) 85 (2001)
సి) 84 (2001) డి) 88 (2002)

55. భారత పౌరులు విదేశీ ప్రభుత్వాలు ప్రకటించే బిరుదులను స్వీకరించాలంటే ఎవరి అనుమతి అవసరం?
ఎ) రాష్ర్టపతి బి) భారత విదేశాంగ శాఖ
సి) పార్లమెంట్
డి) కేంద్ర మంత్రిమండలి

56. 19వ అధికరణం ప్రకారం ప్రతిపౌరుడికి ఎన్నిరకాల స్వాతంత్య్రాలు ఉన్నాయి?
ఎ) 5 బి) 6 సి) 7 డి) 8

57. ఏ అధికరణం ప్రకారం ప్రతి భారతీయుడికి దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతం త్య్రం ఉంది?
ఎ) 19 (i) బి) 19 (ii)
సి) 19 (iii) డి) 19 (iv)

58. వీటిలో జీవించే హక్కులో భాగంగా చేర్చిన హక్కు?
ఎ) ఆహార బి) పని
సి) విద్యా డి) న్యాయాన్ని కోరే

59. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో మతపరమైన బో ధనలు నిషేధించిన అధికరణ?
ఎ) 26వ బి) 27వ సి) 28వ డి) 29వ

60. సాంస్కృతిక విద్యాహక్కులు ఎవరికి వర్తిస్తాయి?
ఎ) అల్పసంఖ్యాకులకు
బి) అధిక సంఖ్యాకులకు
సి) భారత పౌరులందరికీ
డి) ఎవరికీ వర్తించవు

సమాధానాలు
1) బి 2) ఎ 3) డి 4) బి 5) సి
6) బి 7) డి 8) ఎ 9) డి 10) సి
11) బి 12) ఎ 13) సి 14) బి 15) సి
16) డి 17) సి 18) సి 19) ఎ 20) బి
21) డి 22) సి 23) ఎ 24) డి 25) బి
26) ఎ 27) సి 28) సి 29) బి 30) డి
31) బి 32) డి 33) సి 34) బి 35) సి
36) బి 37) ఎ 38) బి 39) సి 40) సి
41) డి42) సి 43) ఎ 44) సి 45) డి46) బి
47) డి 48) సి 49) ఎ 50) బి 51) డి 52) సి
53) ఎ54) బి55) ఎ56) బి57) డి58) సి59) సి 60) సి

No comments:

Post a Comment