ప్ర: ఎంసెట్‌లో టాప్ ర్యాంకర్‌గా నిలిచినందుకు మీరెలా ఫీలవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది. మొదటి ర్యాంకు వస్తుంది అనుకున్నాను. సెకెండ్ ర్యాంకు వచ్చింది.
ప్ర: మీ కుటుంబ నేపథ్యమేంటి?
మాది ఛత్తీస్‌గఢ్‌లోని సర్జాపూర్, అమ్మ, నాన్న మరణించారు. మామయ్య స్కూల్ టీచర్. విశాఖపట్నంలోనే చదువుకుంటున్నాను.
ప్ర: ఇంజనీరింగ్ ఏ క ళాశాలలో చేరాలనుకుంటున్నారు?
నాకు ఆల్‌ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(ఏఐఈఈఈ)లో
ఆల్‌ఇండియా 544వ ర్యాంకు వచ్చింది. తిరుచ్చి నిట్‌లో మెకానికల్
ఇంజనీరింగ్‌లో సీటు వచ్చింది. అక్కడే జాయిన్ అవుతాను.
ప్ర: ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలు రాశారా?
ఏఐఈఈఈ రాసాను.
ప్ర: మీ అకడమిక్ రికార్డు చెప్పండి?
పదోతరగతి నవోదయా స్కూల్లో చదివాను. సీబీఎస్‌ఈ సిలబస్ చదివాను. 9.6
గ్రేడ్ వచ్చింది. ఇంటర్ విశాఖపట్నంలోని నారాయణ కాలేజీలో చదివాను. 976
మార్కులు వచ్చాయి.
ప్ర: ఓ వైపు ఇంటర్మీడియెట్ పరీక్షలకు ప్రిపేరవుతూనే ఎంసెట్‌కు ఎలాంటి ప్రిపరేషన్‌ను అనుసరించారు?
రెండు కలిసే పేరలాల్‌గా చదివాను. కాలేజీలో సంవత్సరం ప్రారంభంలోనే
షెడ్యూల్ ఇస్తారు. దాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ఏ రోజు చెప్పింది ఆరోజే
చదువుకోవాలి.
ప్ర: కాలేజీలో బోధన, కోచింగ్ ఎంతవరకు ఉపకరించింది?
కాలేజీలో చెప్పిన అంశాలనే చదివాను. అదే నాకు చాలా ఉపయోగపడింది. కాలేజీలో అధ్యాపకులు వచ్చిన సందేహాలను వెంటనే తీరుస్తారు.
ప్ర: మీరు ప్రత్యేకంగా ఏవైనా బుక్స్ ప్రిపేరయ్యారా?
నారాయణ కాలేజీ మెటీరియల్ తప్ప ఎలాంటి పుస్తకాలు చదవలేదు.
ప్ర: అధ్యాపకులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం?
ఇంట్లో మామయ్య వాళ్లు, కాలేజీలో లెక్చరర్స్ అందరూ బాగా ప్రోత్సహించేవారు.
ప్ర: భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు?
ఇంజనీరింగ్ చేసిన తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను.
ప్ర: ఎంసెట్‌కు ప్రిపేరవుతున్న వారికి మీరిచ్చే సలహా?
అధ్యాపకులు చెప్పింది వినాలి. అయితే విన్నాం వదిలేసాం అని కాకుండా
చెప్పిన దానిపై దష్టి పెట్టాలి. ఏకాగ్రతతో చదవాలి. అప్పుడు కచ్చితంగా విజయం
సాధిస్తారు.
No comments:
Post a Comment