1. మాట్లాడే అలవాట్ల సంశిష్ట వ్యవస్థ భాష అన్నవారు?
1) సపీర్ 2) మాక్స్ ముల్లర్
3) రాస్ 4) హాకెట్
2. మనస్సులోని భావపరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారి కందిస్తామో ఆ పదాలు, వాక్యాలే భాష అన్నవారు?
1) రామచంద్రవర్మ 2) హాకెట్
3) బి.ఎన్.ఝా 4) రాస్
3. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినవారు?
1) రాస్ 2) బి.ఎన్.ఝా
3) మాక్స్ ముల్లర్ 4) హాకెట్
4. యోహె..హో వాదాన్ని సూచించినవారు?
1) న్వారే 2) మాక్స్‌ముల్లర్ 3) రాస్ 4) రైబర్న్
5. The Ape and the child రచయిత?
1) కిల్లాంగ్ దంపతులు 2) బి.ఎన్.ఝా
3) రాస్ 4) రైబర్‌న
6. }M>Mుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఏ భాషా మండలంలోనివి?
1) దక్షిణ 2) పూర్వ
3) ఉత్తర 4) మధ్య
7. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఏ భాషా మండలంలోనివి?
1) దక్షిణ 2) పూర్వ 3) ఉత్తర 4) మధ్య
8. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూ రు జిల్లాలు ఏ భాషా మండలంలోనివి?
1) పూర్వ 2) దక్షిణ
3) ఉత్తర 4) మధ్య
9. తొలిసారిగా పాత్రోచిత భాషను తన రచనల్లో ప్రవేశపెట్టినవారు?
1) వేదం. వెంకటరాయశాస్త్రి
2) కందుకూరి 3) చిలకమర్తి 4) శ్రీశ్రీ
10. ‘అనుభవమే విజ్ఞానానికి మూలం’ అని వివరించే భాషావాదం?
1) ధాతు 2) స్వతస్సిద్ధ
3) సంపాదన 4) డింగ్ డాంగ్
11. భాషకు మూలం ధాతువులే అన్నవారు?
1) పతంజలి 2) భాసుడు
3) యాస్కుడు 4) వాల్మీకి
12. మనిషి భావాల ఆధారంగా ప్రతిపాదించిన వాదం?
1) పూపూ 2) యోహెహో
3) ధాతు 4) డింగ్‌డాంగ్
13. ధ్వని, అర్థానికి అజ్ఞాత సంబంధం ఉందని తెలిపే వాదం?
1) ధాతు 2) డింగ్ డాంగ్
3) పూపూ 4) 1, 3
14. భాష మనిషికి శరీరం లాంటిదైతే భావం?
1) ప్రాణం 2) గుండె
3) ఆలోచన 4) మనసు
15. క్రియా పదాలతో అనేక పదాలు ఏర్పడి భాషలో చేరి ఉండొచ్చు అని చెప్పే వాదం?
1) ధాతు జన్య 2) డింగ్ డాంగ్
3) సమాజ 4) పూపూ
16. మానవ ప్రవర్తనను ఇతర జంతు ప్రవర్తనల నుంచి వేరుపరచుకోవడానికి ఉపయుక్తమ య్యే శక్తివంతమైన ఉపకరణం భాష అని తెలిపినవారు?
1) అలంకారికులు
2) పురాతత్వ శాస్త్రజ్ఞులు 3) ధ్వనికారులు
4) మనస్తత్వ శాస్త్రజ్ఞులు
17. హిబ్రూ భాషను దేవభాష అన్నవారు?
1) క్రైస్తవులు 2) పార్శీలు
3) మహమ్మదీయులు 4) అరబ్బులు
18. పారిభాషిక పదకోశం ఎవరి అధ్యక్షతన రూపొందించారు?
1) డా॥సి. నారాయణరెడ్డి
2) గజ్జెల మల్లారెడ్డి
3) వావిలాల గోపాలకృష్ణయ్య
4) అయ్యదేవర కాళేశ్వరరావు
19. గ్రియర్సన్ తెలుగు మాండలికాల గురించి దేనిలో పేర్కొన్నాడు?
1) టాక్సానమీ 2) లింగ్విస్టిక్ సర్వే
3) ది రిపబ్లిక్ 4) లాంగ్వేజ్ సర్వే
20. ‘అభినవాచార్యకీం’ పుస్తకం ఏ విషయం గురించి వివరిస్తుంది?
1) బోధనా పద్ధతులు 2) వ్యాకరణం 3) భాష 4) అలంకారాలు
21. తెలుగును అధికార భాషగా చేయడానికి కృషిచేసిన పత్రిక?
1) వివేకవర్ధిని 2) ఆంధ్రపత్రిక
3) కృష్ణాపత్రిక 4) ఆంధ్రప్రభ
22. రాష్ట్ర అధికార భాషా స్థానాన్ని తెలుగు భాష పొందిన సంవత్సరం?
1) 1967 2) 1966
3) 1970 4) 1974
23. తెలుగువాచకం ప్రధానంగా ఏ పఠనానికి ఉద్దేశించారు?
1) క్షుణ్న 2) మౌన
3) ప్రకాశ 4) విస్తార
24. ఆంగ్లం మాతృ, అధికారభాషగా ఉన్న రాష్ర్టమేది?
1) నాగాలాండ్ 2) గోవా
3) సిక్కిం 4) హర్యానా
25. ద్వితీయ భాషా బోధనోద్దేశం ప్రధానంగా?
1) ఆ భాషలోని ఉత్తమ రచనలు చేయడం
2) ఆ భాషలో విశేష పాండిత్యం సంపా దించడం
3) ఆ భాషలో సాహిత్యాన్ని చదివి ఆనందించడం
4) ఆ భాషలో చక్కగా రాయడం, మాట్లా డడం, నేర్చుకోవడం
26. గ్రాంథిక భాషావాదులకు అప్పట్లో నాయకులుగా వ్యవహరించినవారు?
1) గిడుగు రామమూర్తి 2) గురజాడ
3) కందుకూరి
4) జయంతి రామయ్య పంతులు
27. కరికులమ్‌కు సంబంధించిన ‘కర్రెరి’ ఏ భాషాపదం?
1) ఫ్రెంచ్ 2) లాటిన్
3) గ్రీక్ 4) ఆంగ్లం
28. ‘సాక్షి’ వ్యాసాల సంపుటి ఏ వ్యాసాల నేపథ్యంలో వెలువడింది?
1) స్పెక్టేటర్ 2) మాన్‌టైన్
3) టాట్లర్ 4) ది హిందూ
29. వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే- శ్లోకం రాసినవారు?
1) నన్నయ 2) తిక్కన
3) భారవి 4) కాళిదాసు
30. బేసిక్ విద్యా విధానం ముఖ్య ఉద్దేశం?
1) స్వీయ భాషణం 2) స్వయం లేఖనం
3) స్వయం పోషణం
4) స్వయం అభ్యసనం
31. వ్యాసరూప ప్రశ్నలద్వారా ప్రధానంగా పరీక్షించే అంశం?
1) విషయ నిష్టత 2) ఆచరణ యోగ్యత
3) ఔపయోగికత 4) లక్ష్యాత్మకత
32. డాల్టన్ పద్ధతికి ఉన్న పేర్లలో చేరని పద్ధతి?
1) నియోజన 2) వ్యష్ఠి
3) వ్యక్తి 4) వాక్య
33. ప్రపంచ సాహిత్యంలో తొలిసారిదిగా భావిస్తున్న వ్యాసం రాసినవారు?
1) మాన్‌టైన్ 2) స్టీల్
3) ఎడిసన్ 4) ఫ్రాన్సిస్ బేకన్
34. పర్యాయపదాలు అంటే?
1) ప్రకృతులు 2) సమానార్థకాలు
3) వికృతులు 4) వ్యతిరేకార్థకాలు
35. చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి?
1) కృత్యాధార 2) చర్చా
3) ఉపన్యాస 4) ప్రదర్శన
36. జాతీయాలను ఈ విధంగా కూడా పిలుస్తారు?
1) తత్సమాలు 2) తద్ధవాలు
3) సమాసాలు 4) పదబంధాలు
37. చూచిరాతకు మరోపేరు?
1) దృష్ట లేఖనం 2) మౌన పఠనం
3) ఉక్త లేఖనం 4) ఉన్ముఖీకరణం
38. బహుళైచ్చిక ప్రశ్నలు ఏ స్పష్టీకరణకు చెందుతాయి?
1) వివేచించడం 2) జ్ఞప్తికి తెచ్చుకోవడం
3) వర్గీకరించడం 4) గుర్తించగలగడం
39. శిశువుకు అతి సులభంగా అలవడే భాషానైపుణ్యం?
1) లేఖనం 2) పఠనం
3) భాషణం 4) శ్రవణం
40. మహా ప్రాణాక్షరాలు అంటే?
1) ఒత్తక్షరాలు 2) ఊష్మాలు
3) అచ్చులు 4) హల్లులు
41. ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండకూడనిది?
1) పాండిత్యం 2) అహంకారం
3) క్రమశిక్షణ 4) నిరాడంబరత
42. ఉపాధ్యాయుడికి మూల గ్రంథంగా ఉపయోగపడేది?
1) విద్యార్థి కల్పతరువు
2) సమగ్రాంధ్ర సాహిత్యం
3) విద్యార్థి నిఘంటువు
4) మహాభాగవతం
43. ఉత్తమ విద్యా విధానానికి ఆధారాలు?
1) ఉద్దేశాలు 2) లక్ష్యాలు
3) లక్ష్యాలు-స్పష్టీకరణలు
4) గమ్యాలు
44. విద్యార్థికి శబ్దరాశి ఏ పఠనం ద్వారా అభివృద్ధవుతుంది?
1) మౌన 2) విస్తార
3) క్షుణ్న 4) ప్రకాశ
45. విద్య ప్రధాన లక్ష్యం?
1) జీవనం ఆనందమయంగా గడప గలగడం
2) సృజనాత్మకతను పెంచడం
3) సంస్కృతీ సంప్రదాయాలు తెలపడం
4) పండిత కళలు తయారుచేయడం
46. ఆవు- పులి కథ ఏ పద్ధతి ద్వారా చక్కగా బోధించొచ్చు?
1) కథా 2) అభినయ
3) విశ్లేషణ 4) కథా కథన
47. ఉత్తమ పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు?
1) విశ్వసనీయత 2) సప్రమాణత
3) విషయ నిష్టత 4) పైవన్నీ
48. చాలా సులభమైన రచనలు ఏ పాకానికి చెందుతాయి?
1) ద్రాక్ష 2) కదళీ
3) నారికేళ 4) పాషాణ
49. వాక్యరూపంలోని సాధారణీకరణాలు?
1) పర్యాయపదాలు 2) నానార్థాలు
3) వ్యుత్పత్యర్థాలు 4) లోకోక్తులు
50. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు అకాడమీని ఏ సంఘం సిఫార్సుతో స్థాపించింది?
1) దవే 2) కొఠారి
3) రామమూర్తి 4) గ్విన్
51. విద్యార్థి రాతను మూల్యాంకనం చేసే సాధనం?
1) రేటింగ్ స్కేలు 2) రాత పరీక్ష
3) మనోవైఖరి 4) ప్రజ్ఞానికష
52. వ్యక్తికి లభించే ఉత్తమోత్తమ బహుమానం విద్య అని చెప్పినవారు?
1) జాన్సన్ 2) అరిస్టాటిల్
3) సిసిరో 4) గాంధీ
53. లేఖారచనకు చిన్న తరగతుల్లో మిక్కిలి ఉపయుక్తమైన పద్ధతి?
1) కథా 2) అనుకరణ
3) క్రీడా 4) విశ్లేషణ
54. క్రీడాపద్ధతిలో విద్యార్థులు?
1) నిర్బంధంగా ఉంటారు
2) సంపూర్ణ స్వేచ్ఛగా ఉంటారు
3) ఆడి ఆడి అలసిపోతారు
4) చదవరు
55. ఒక విద్యార్థి భారతాన్ని ‘బారతం’ అని చదివాడు. ఇది ఏ రకమైన దోషం?
1) ఉచ్చారణ 2) లేఖన
3) భావ 4) భాష
56. భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు నిర్వహించాలి?
1) నిరంతరం
2) యూనిట్ పాఠాలు పూర్తికాగానే
3) అన్ని పాఠాలూ విద్యార్థులు బాగా చదివిన తర్వాత
4) పాఠం అంతర్గతంగా
57. పాఠ్యపథకంలో వేటికి ప్రముఖ స్థానం ఉంది?
1) గమ్యాలు 2) లక్ష్యాలు
3) ఉద్దేశాలు 4) పద్ధతులు
58. ‘భారతదేశ సంస్కృతి అంతా సంస్కృతంలో ఉంద’ని అభిప్రాయపడిన పాశ్చాత్య పండితుడు ఎవరు?
1) మెకాలే 2) మాక్స్‌ముల్లర్
3) పాహియాన్ 4) దవే
59. విద్య పరిధి?
1) ప్రాథమిక దశ 2) మాధ్యమిక దశ
3) ఉన్నత దశ 4) జీవితాంతం
60. భాషానైపుణ్యాలు ఎలాంటివి?
1) ఔషధం 2) మూలకాల
3) అవయవాల 4) శక్తి
61. విద్యార్థుల ఉచ్చారణ దోషాన్ని సవరిం చడానికి ఏ పఠనాన్ని చేయించాలి?
1) బాహ్య 2) సాముదాయక
3) మౌన 4) విస్తార
62. ఆంధ్రప్రదేశ్‌లో రెండో అధికారభాషగా గుర్తింపు పొందింది?
1) హిందీ 2) తెలుగు
3) ఆంగ్లం 4) ఉర్దూ
63. విద్యాగమ్యాలు ఏ ప్రణాళిక నిర్మాణానికి ఉపకరిస్తాయి?
1) విషయ 2) పాఠ్య
3) విద్యా 4) యూనిట్
64. సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం కల్పించే పాఠ్య బోధన?
1) వ్యాకరణం 2) పద్యం
3) వ్యాసం 4) గద్యం
65. దేశంలో త్రిభాషా సూత్రం దేన్ని సాధించడానికి ఏర్పడింది?
1) భాషల పట్ల అభిమానం
2) భాషాభివృద్ధి
3) అంతర్జాతీయఖ్యాతి
4) జాతీయ సమైక్యత
66. రుణంకు బదులుగా రునం అని రాయడం ఏ దోషం కిందకు వస్తుంది?
1) భావ 2) పద
3) వాక్య 4) అక్షర
67. ‘కిందివాటిని జతపర్చండి’ అనే ప్రశ్న సాధించే లక్ష్యం?
1) జ్ఞానం 2) వినియోగం
3) అవగాహన 4) విశ్లేషణ
68. నిరక్షరాస్యులను పరీక్షించడానికి ఉపయోగపడే పరీక్షలు?
1) సామూహిక 2) వైయక్తిక 3) శాబ్దిక 4) పైవన్నీ
69. వీటిలో అన్నింటికంటే విస్తృతమైంది?
1) పాఠ్యపథకం
2) పాఠ్యవిభాగ పథకం
3) విద్యా ప్రణాళిక
4) బోధనా లక్ష్యాలు
70. బోధనా లక్ష్యాలు వేటిని నిర్దేశిస్తాయి?
1) విద్యా విలువలు
2) ప్రవర్తన మార్పులు
3) వాచక భావనలు
4) విద్యారంగ భావనలు
71. వైఖరి ఏ రంగానికి చెందింది?
1) జ్ఞానాత్మక 2) భావావేశ
3) మానసిక చలనాత్మక
4) పైవేవీ కావు
72. ఉపాధ్యాయుడు చెబుతుంటే వింటూ రాసే లేఖనం?
1) ఉత్త 2) సంక్షిప్త
3) దృష్ట 4) వివరణాత్మక
73. కత్తిగొప్పా? కలంగొప్పా? వంటి అంశాల పై చేసే వ్యాసరచన ఏ విభాగానికి చెందుతుంది?
1) కఠినాత్మక 2) ఊహాత్మక
3) సంవాదాత్మక 4) వర్ణనాత్మక
74. రాముడు: దశరథుడు అలాగే కృష్ణుడు: ? అని అడిగే ప్రశ్న పేరు?
1) బహుళావరణ
2) ఖాళీలు పూరించే
3) సంబంధ సామ్యసూచక 4) జతపర్చే
75. ‘నన్నయ ఉభయకవి మిత్రుడు’ అన్న భాషణ దోషం వీటిలో ఏ కోవకు చెందింది?
1) ఉచ్చారణ 2) భావ
3) వాగింద్రియ 4) భాషా
76. మౌనపఠనం ఏ పఠనానికి నాంది?
1) విస్తార 2) పరిమిత
3) బాహ్య 4) క్షుణ్న
77. ఆహార్యం అవసరమైన బోధన?
1) పద్య 2) గద్య
3) నాటక 4) వ్యాస
సమాధానాలు
1) 4 2) 1 3) 3 4) 1 5) 1
6) 2 7) 1 8) 4 9) 1 10) 2
11) 3 12) 1 13) 2 14) 1 15) 1
16) 4 17) 1 18) 4 19) 2 20) 1
21) 4 22) 2 23) 1 24) 1 25) 3
26) 4 27) 2 28) 1 29) 4 30) 3
31) 1 32) 4 33) 1 34) 2 35) 1
36) 4 37) 1 38) 4 39) 4 40) 1
41) 2 42) 4 43) 3 44) 2 45) 1
46) 2 47) 4 48) 1 49) 4 50) 4
51) 1 52) 3 53) 2 54) 2 55) 1
56) 1 57) 2 58) 2 59) 4 60) 2
61) 1 62) 4 63) 3 64) 3 65) 4
66) 2 67) 3 68) 1 69) 3 70) 2
71) 2 72) 1 73) 3 74) 3 75) 2
76) 1 77) 3
No comments:
Post a Comment