ఫోన్ నీళ్ళలొ తడిచిందా. ఇలా చేయండి !..
జేబులో పెట్టుకున్న ఫోన్ క్రిందికి వంగినప్పుడు నీళ్ళలో పడడం వంటి సంఘటనలు అనేకసార్లు
జరుగుతుంటాయి. మీ విషయంలోనూ ఇలా జరిగినట్లయితే వీలైనంత వరకూ ఒక నిముషం
లోపలే వేగంగా బ్యాటరిని తీసేయండి. బ్యాటరీకి తేమ కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే
ప్రమాదం ఉంది ఆ తర్వాత మీ దగ్గరలొ ఉన్న సెల్‍ఫోన్ టెక్నిషియన్ ఎవరైనా ఉన్నట్లయితే
మీ ఫోన్‍ని అతని వద్దకు తీసుకువెళ్ళి దానిని పూర్తిగా డీ అసెంబుల్ చేయించి లోపలి భాగాలు
ఆరేవరకు వేచి ఉండాలి. ఒకవేళ మీరే డీఅసెంబుల్ చేయగలిగిన నైపుణ్యం ఉన్నట్లయితే అలాగే
డీఅసెంబుల్ చేసి 60W లైట్ కాంతి నేరుగా ఆయా అంతర్గత భాగాలపై ప్రసరించేలా కొద్దిసేపు
ఉంచండి. దీంతో చిప్‍ల క్రిందకు చేరిన తేమ ఏదైనా ఉంటే ఆవిరైపోతుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని
భాగలను అసెంబుల్ చేసి బ్యాటరీని యధాస్థానంలో ఉంచేయవచ్చు.
మీ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోవాలంటే..
ఆనందకరమైన సందర్భాలను కెమెరాలో బంధించుకుని విదేశాల్లో
, సుదూర ప్రాంతాల్లో ఉన్న మీ ఆత్మీయులతో షేర్ చేసుకోవాలనిపించడం సహజం. దీనికి పెద్ద కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదు. ముందు మీ డిజిటల్ కెమెరాని మీ పిసికి కనెక్ట్ చేసి మీ కెమెరాలోని ఫోటోలన్నింటిని పిసిలోకి బదిలీ చేసుకోండి. ఇప్పుడు వాటిని ఇంటర్నెట్‍కి అప్‍లోడ్ చేయడం చాలా సులభం. ఇంటర్నెట్‍లో అనేక ఫోటోషేరింగ్ వెబ్‍సైట్లు లభిస్తున్నాయి. flickr అనే సైట్‍ని ఓపెన్ చేయండి. అందులోకి ప్రవేశించగానే Create your account అనే బటన్ ఉంటుంది . దాన్ని క్లిక్ చేయండి. ఈ వ్యాసం మొదట్లొ చెప్పిన ప్రకారం మీరు ఇప్పటికే యాహూ మెయిల్ అకౌంట్‍ని క్రియేట్ చేసుకున్నారు కదా ! ఆ యాహూ అకౌంట్‍తొ నేరుగా Flickr లో ఉచిత అకౌంట్ సృష్టించుకోవచ్చు. తర్వాత మీ కంఫ్యూటర్లో ఉన్న ఫోటోలను ఆ సైట్‍లోకి అప్‍లోడ్ చేసుకుని Send an invite to Flickr అనే బటన్‍ని ఉపయోగించి మీ ఆత్మీయులకు వారి మెయిల్ అడ్రస్‍కి ఇన్విటేషన్ పంపించవచ్చు. వారు మీ ఫోటోలను Flickr లోకి వచ్చి చూడగలుగుతారు. Flickr మాదిరిగానే Photobucket, Zommr, Phanfare, Snapfish, Webshots, Smugmug, Woophy వంటి అనేక ఫోటొ షేరింగ్ సర్వీసులు లభిస్తున్నాయి.
ఒక ఫార్మేట్ నుండి మరో ఫార్మేట్‍కి చాలా ఈజీ
VOB ఫైళ్లని 3GP ఫైళ్లుగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏ సాఫ్ట్ వేర్ వాడాలి, MOV to AVI కన్వర్షన్‍కి ఏమి వాడాలి అంటూ అందరికీ సందేహాలు వస్తుంటాయి. మీరు కన్వర్ట్ చేసుకోవలసిన ప్రతీదానికి వేర్వేరు సాఫ్ట్ వేర్లని ఇన్‍స్టాల్ చేసుకోవలసిన అవసరం లేకుండా zamzar అనే వెబ్‍సైట్‍లో మీరు ఒక ఫార్మేట్ నుండు మరో ఫార్మేట్‍కి మీ ఫైళ్ళు ఉచితంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మన ఫైళ్ళని అప్‍లోడ్ చేయాలి. అవి కన్వర్ట్ చేయబడి మన e-మెయిల్ అడ్రస్‍కి పంపబడతాయి. అయితే 100MB ఫైల్ సైజ్ దాటకూడదు. అదే ప్రీమియమ్ యూజర్లు 1GB సైజ్ గల ఫైళ్లని సైతం కన్వర్ట్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. ఓసారి మీరూ ప్రయత్నించండి.
పిసి నుండే ఫోన్‍ని నియంత్రించడానికి..
Nokia సంస్థ ఇటీవల Nokia PC Phone
అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.Symbian S60 శ్రేణికి చెందిన
Nokia ఫోన్ మీవద్ద ఉన్నట్లయితే దాన్ని USB డేటా కేబుల్ ద్వారా గానీ,
బ్లూటూత్ ద్వారా గానీ పిసికి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు.. Internet Explorer,
FireFox వంటి బ్రౌజర్ ద్వారా ఆ ఫోన్‌ని నియంత్రించుకోవడానికి ఈ అప్లికేషన్
ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఈ ప్రోగ్రామ్‌ని FireFox 2.x లేదా IE 7.x
బ్రౌజర్ల యొక్క బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌ని
ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫోన్‌ని మీ పిసికి కనెక్ట్ చేసిన వెంటనే మీ
ఫోన్‌లోని కాంటాక్ట్‌లను ఈ సాఫ్ట్‌వేర్ పిసిలోకి స్వీకరించడాన్ని మీరు
గమనించవచ్చు. అలాగే మీ ఫోన్‌లో ఇప్పటివరకు స్టోర్ చెయ్యబడి ఉన్న SMSలు,
Call list లో వచ్చిన ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలు సైతం పిసిలోకి
స్వీకరించబడతాయి. అలాగే SMS మేసేజ్‌లను పంపించదలుచుకున్నప్పుడు ఫోన్ యొక్క
చిన్న కీ ప్యాడ్ ద్వారా ఇబ్బందులు పడే బదులు, నేరుగా పిసి యొక్క కీబోర్డ్
నుండే టైప్ చేసి మెసేజ్‌లు పంపించుకోవచ్చు. అలాగే నేరుగా మీ పిసినుండే ఫోన్
కాల్స్‌ని చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్ లిస్టులొ కొత్త మెంబర్లని
జతచేయాలంటే నేరుగా పిసి నుండే సులభంగా జత చేయవచ్చు. మీ ఫోన్‌కి వచ్చిన
కాల్స్‌ని, పిసి నుండే లిఫ్ట్ చేయవచ్చు. కట్ చేయనూవచ్చు.
MP 3 పాటలన్నింటి జాబితాను పొందడానికి
మీ హార్డ్ డిస్క్ లో వేర్వేరు సినిమాలకు సంబంధించి వందలకొద్దీ MP3 పాటలు ఉన్నాయనుకోండి. వాటన్నింటి పేర్లతో ఒ జాబితా కావాలంటే ప్రతీ సాంగ్ టైటిల్ ని కష్టపడి మళ్ళీ టైప్ చేసుకునే అవసరం లేకుండా MP3 ListMaker
అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించండి. ఇది మనం ఎంచుకున్న డ్రైవ్ ని తనిఖీ చేసి
వెదికి పట్టుకున్న MP3 ఫైళ్ళని టెక్స్ట్ ఫైలుగా, లేదంటే వెబ్ పేజీగా
రూపొందిస్తుంది. ఒకవేళ ఆ వెబ్ పేజీలో రిజినల్ ఫైలు లొకేషన్ కి లింకులు సైతం
పొందుపరచ బడాలన్నా వీలవుతుంది. లేదా వెదికి పట్టుకున్న ఫైళ్ళతో Play List
నీ క్రియేట్ చేసుకోవచ్చు.
నోకియాని మింగేస్తున్న NOKIA
ప్రముఖ
సెల్‌ఫోన్ తయారీ సంస్థ Nokia ఫోన్లకు ఇప్పుడు Nokla పేరిట చైనాలో
తయారవుతున్న నకిలీ ఫోన్లు వచ్చేసాయి. అచ్చం ఒరిజినల్ మోడళ్ళని తలపించే
మాదిరిగానే ఉండే ఈ Nokla ఫోన్లలో నిశితంగా పరిశీలించి చూస్తే కొద్దిపాటి
వృత్యాసాలు కనిపిస్తాయి. ఉదా.కు.. Nokia N 95 ఒరిజినల్ ఫోన్‌లో
Menu/Multimedia Keys ఉండే ప్రదేశంలో నకిలీ ఫోన్‌లో ఒకవైపు Play బటన్,
మరోవైపు Stop బటన్ ఉంటాయి. అలాగే ఒరిజినల్ నోకియా ఫోన్లు 5 megapixel
కెమెరాని కలిగి ఉంటుంటే, నకిలీ ఫోన్ 2megapixel కెమెరాని కలిగి
ఉంటున్నాయి.ఇలా తెలియకుండా అనేక వృత్యాసాలు ఉన్నాయి. అయితే ఒరిజినల్ N95 ధర
40 వేలవరకు ఉంటే Nokla N95 మాత్రం కేవలం రూ.7,500లకే లభిస్తుంది. ఎంత చవకో
చూడండి. దాదాపు అన్ని నోకియా మోడళ్ళకు అతి తక్కువ ధర కలిగిన నకిలీలు
లభిస్తున్నాయి.