హార్డ్ డిస్క్ డ్రైవ్
హార్డ్ డిస్క్ డ్రైవును (Hard Disk Drive - HDD), సాధారణంగా హార్డుడ్రైవు అనో లేదా హార్డుడిస్కు అనో పిలుస్తూ ఉంటారు. కంప్యూటరులో
సమాచారాన్నంతటినీ ఈ హార్డుడిస్కులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో
నిక్షిప్తమైన సమాచారం కంప్యూటరుకు విద్యుత్తు సరఫరా నిలిపేసినా
చెరిగిపోకుండా ఉంటుంది. హార్డుడిస్కులలో సమాచారాన్ని గుండ్రంగా ఉండే అయస్కాంత
రేకులపై భద్రపరుస్తారు. ఈ అయస్కాంత రేకులు వేగంగా తిరగటం వలన అందులో ఉన్న
సమాచారాన్ని చదవచ్చు లేదా కొత్త సమాచారాన్ని భద్రపరచవచ్చు. ఒక్కో హార్డు
డిస్కు డ్రైవులో ఒకటికంటే ఎక్కువగా అయస్కాంత రేకులు(డిస్కులు) ఉండవచ్చు,
అందువలన హార్డుడిస్కులకూ హార్డుడ్రైవులకూ మధ్యన ఉన్న బేధాన్ని
గుర్తుంచుకోవాలి. ఒకప్పటి హార్డుడ్రైవులలో ఉండే డిస్కులను మార్చుకోగలిగే
సౌకర్యం ఉండేది, ఇప్పుడు వస్తున్న హార్డుడ్రైవులకు అటువంటి సౌకర్యం లేకుండా
పూర్తిగా మూసేస్తున్నారు.[1]
హార్డుడ్రైవులను మొదటగా కంప్యూటర్లలో ఉపయోగించటానికి తయారు చేసారు. 21వ శతాబ్దం వచ్చేసరికి హార్డుడ్రైవుల వాడకం కంప్యూటర్లలోనే కాకుండా కెమేరాలలోనూ, వీడియోగేములలోనూ, మొబైలు ఫోనులలోనూ, TVలలోనూ, TiVO వంటి పివిఆర్(PVR)లలోనూ, వీడియో ప్లేయర్లలోనూ(eg: hard disk Players) ఉపయోగించటం మొదలుపెట్టారు. భద్రపరచాల్సిన సమాచారం పెరిగిపోవటం, సమాచారం యొక్క విలువ కూడా పెరుగుతూ ఉండటం వలన హార్డుడ్రైవులను ఉపయోగించి రెయిడ్(RAID), నాస్(NAS), సాన్(SAN) వంటి వ్యవస్తల రూపకల్పనకు బాటలు వేసింది. ఈ వ్యవస్థలలో మామూలు హార్డుడ్రైవులనే సమీష్టిగా ఉపయోగించి ఎంత సమాచారాన్నయినా మరింత మన్నికగా భద్రపరచుకోగలిగే అవకాశం ఉంది.

No comments:
Post a Comment