ఫైర్ఫాక్స్ టాబ్‍ల క్రమాన్ని మార్చుకోవడం …….
Internet Explorer కన్నా స్థిరంగా పనిచేస్తుండడం మూలంగా చాలామంది పిసి యూజర్లు ఇటీవలి కాలంలో firefox బ్రౌజర్‍ని ఉపయోగిస్తున్నారు. ఫైర్‍ఫాక్స్ ని మన అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే బ్రౌజర్ ద్వారానే అన్ని పనులూ నెరవేర్చుకోగలిగేలా ఫైర్‍ఫాక్స్ విషయంలో అనేక ధర్డ్ పార్టీ ఉచిత add-on లూ లభిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్‍ని ఉపయోగిస్తూ, ఒకే విండోలో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఓ పదో పన్నెండో వెబ్‍సైట్లని ఓపెన్ చేశారనుకుందాం. ఇలా ఓపెన్ చేసేటప్పుడు మనం కొత్తగా వేరే టాబ్‍లో ఓపెన్ చేసే వెబ్‍సైట్ ప్రస్తుతం ఉన్న టాబ్‍కి ప్రక్కనే కొత్త టాబ్‍లొ ఓపెనవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ చేయబడి ఉన్న టాబ్‍లు మీకు నచ్చిన క్రమంలో అమర్చబడి లేకపోతే వాటిని ముందుకూ వెనుకకూ కూడా రీఅరేంజ్ చేసుకోవచ్చు. అదెలాగంటే ఏ టాబ్‍నైతే మీరు మూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి కావలసిన దిశలో డ్రాగ్ చేయండి.
ఫైర్‌ఫాక్స్ వేగంగా పనిచేయడానికి ఓ Add-on
ఇంటర్నెట్ బ్రౌజింగ్‍కి IE బదులుగా ఫైర్‌ఫాక్స్ వాడేవారు Network Pipelining వంటి కొన్ని సెట్టింగులను మార్చడం ద్వారా వేగంగా పనిచేస్తుంది. అయితే వాటిని మేన్యువల్‌గా కాన్ఫిగర్ చేయడం ఇబ్బంది అనుకున్నట్లయితే Fasterfox అనే add-on మీ ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో Prefetching, Cache, Rendering ,కనెక్షన్ స్పీడ్, పైప్ లైనింగులకు సంబంధించిన రెడీమేడ్ సెట్టింగులు లభిస్తుంటాయి. వాటిని మీరు కోరుకున్న విధంగా సెట్ చేసుకోవచ్చు.
అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..
ఆన్‌లైన్
ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి
వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్,
Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం
సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే
మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్ చేయగలిగేలా, ఇతర వెబ్‌సైట్ల నుండి రన్
అయ్యే స్క్రిప్ట్‌లు, ActiveX కంట్రోళ్ళు నిలుపుదల చేయబడేలా No Script అనే add-on లభిస్తుంది.
Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?
ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని Stop బటన్‌లోని X గుండ్రని ఆకారంలో కాకుండా
ప్రేమ చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనే
add-on ని వాడవచ్చు.
PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on
మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక ప్రక్క మనం వేరే సైట్లను బ్రౌజింగ్ చేసుకుంటూనే PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయవలసిన వెబ్ పేజీల లింకుల్ని add చేసి పెడితే బ్యాక్ గ్రౌండ్‌లో అవన్నీ మనకు ఇబ్బంది కలిగించకుండా PDF ఫార్మేట్ లోకి కర్వర్ట్ చేయబడుతుంటాయి.
ఫైర్ ఫాక్స్ ని వేగంగా పనిచేయించడానికి..
ఫైర్
ఫాక్స్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్‌లో about.config అనే కమాండ్ ద్వారా అనేక
అడ్వాన్స్డ్ సెట్టింగులను ఉపయోగించి ఫైర్‌ఫాక్స్ మరింత వేగంగా పనిచేసేటట్లు
కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే అందులోని ఏ సెట్టింగులను ఎలా మార్చాలో అవగాహన
లేని వారు సింపుల్‌గా FasterFox అనే add-on ని డౌన్ లోడ్ చేసుకుని
ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది simultaneous connections, pipelining, cache,
DNS cache, initial paint delay వంటి పలు సెట్టింగులను మెరుగు పరచడం ద్వారా
ఫైర్‌ఫాక్స్ పని తీరుని పెంచుతుంది.
ఫైర్ ఫాక్స్ స్క్రీన్ సేవర్ గా మారిపోతుంది..
కొద్దిసేపు
ఎలాంటి వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా ఖాళీగా ఉన్నామనుకోండి. వెంటనే ఫైర్
ఫాక్స్ విండో మాయమై ఆకర్షణీయమైన చిత్రాలతో కూడిన స్క్రీన్ సేవర్
ప్రత్యక్షమయ్యేలా Fox Saver అనే add-on సయామ్తో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతేరొజూ కొత్త చిత్రాలు అప్ డేట్ చేయబడతాయి.
ప్రతీ పదానికి సంబంధించి 200 పనులు
నెట్‍లో ప్రతీ వెబ్‍పేజీలోనూ వందలకొద్ది పదాలు పొందుపరచబడి ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకుని దానిని google వంటి సెర్చ్ ఇంజిన్లలో వెదకాలనుకోవచ్చు. దానికి సంబంధించిన రిఫరెన్సులు చూడాలనుకోవచ్చు. దాన్ని వేరే భాషలోకి అనువదించాలనుకోవచ్చు. లేదా లాప్‍టాప్ వంటి పదాలను సెలెక్ట్ చేసుకుని వాటిని ఆన్‍లైన్‍లో కొనుగోలు చేయాలనుకోవచ్చు. లేదా ఆ పదాన్ని మీ స్నేహితునికి మెయిల్ చేయాలనుకోవచ్చు. ఇలా ఒక పదాన్ని పట్టుకుని దాదాపు 200లకు పైగా వేర్వేరు పనులను నెరవేర్చిపెట్టే addon నే Make every word interactive with HyperWords.
మీ మేధస్సుకు పదును పెట్టే ప్రశ్నలు కావాలా?
మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా... ఎంత సేపు ఆ క్లాసు పుస్తకాలనే ఏమి చదువుతారు.. కొద్దిగా జనరల్ నాలెడ్జ్‌ని పెంచే ప్రయత్నాన్ని చేయండి. మీరు ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ని వాడుతుంటే https://addons.mozilla.org /en-US/firefox/addon/1311 అనే వెబ్ పేజ్‌లో లభించే Quiz Addicts Toolbar అనే చిన్న టూల్ బార్ addon ని మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రతీ పది నిముషాలకు ఓ సారి ఓ చక్కని ప్రశ్నని ఆన్సర్ చేయమని కోరుతుంది.తర్వాత సమాధానమూ చూపిస్తుందనుకోండి. మీ మేధస్సుని పెంచే వేలకొద్ది ప్రశ్నలు మీ ఫైర్‌ఫాక్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంటాయి.
కావలసిన సమాచారం కోసం వికీపీడియా సెర్చ్..
సమస్త విజ్ఞాన సర్వస్వం వికీపీడియాలో Search ఆప్షన్‌ని వెదికి పట్టుకోవడం కొద్దిగా కష్టం. మీరు ఎక్కువగా వికీపీడియాని వాడుతున్నట్లయితే ఆ వెబ్ సైట్‌లోని అన్ని వెబ్ పేజీల్లో Wikiseek పేరిట ఓ బాక్స్ పొందుపరచాడానికి Wikisearch Search Extension for Wikipedia అనే ఫైర్‌ఫాక్స్ addon ని https://addons.mozilla.org/en-US/firefox/addon/4355 సైడ్ నుండీ ఇన్‌స్టాల్ చేసుకోండి.
Orkut స్క్రాప్‌లు సులభంగా పంపడానికి
ఈ మధ్య కాలంలో చాలామంది Orkut Scrap ల రూపంలో ముచ్చటించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వేరే టాబ్‌లో orkutని ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా నేరుగా ఇతరుల స్క్రాప్ బుక్‌కి స్క్రాప్‌లను పోస్ట్ చేయడానికి OrkutScrapEasy అనే add on ఉపయోగపడుతుంది. దీనిని http://addons.mozilla.org/en-US/firefox/addon/2669 అనే వెబ్ పేజి నుండి పొందవచ్చు.
ఓపెన్ చేయకముందే లింక్‌ల ప్రివ్యూ
మీరొక వెబ్‌సైట్‌ని బ్రౌజ్ చేస్తున్నారనుకుందాం. అందులో వేరే వెబ్‌పేజికి ఒక లింక్ ఉంటే అందులో ఏముందో దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తేనే అర్ధమవుతుంది. అయితే లింక్‌ని ప్రత్యేకంగా ఓపెన్ చేయనవసరం లేకుండా సింపుల్‌గా లింక్‌పై మౌస్ పాయింటర్‌ని పెట్టిన వెంటనే ఆ లింక్ యొక్క ప్రివ్యూ చూపించబడేలా ఏదైనా సదుపాయం ఉంటే బాగుంటుంది కదూ! ఈ పనిని నెరవేర్చి పెట్టడానికి https://addons.mozilla.org/en-US/firefox/addon/2207 అనే వెబ్ పేజీలో Coolris Previews అనే add on లభిస్తోంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే లింక్‌పై మౌస్‌ని ఉంచినప్పుడు ప్రక్కనే బ్లూ బాక్స్ కనిపిస్తుంది. దానిపై మౌస్‌ని ఉంచితే ఆ లింక్ ప్రివ్యూ అక్కడే కనిపిస్తుంది.
ఫైర్‌ఫాక్స్ లో తెలుగు అక్షరాలు కనిపించడం లేదా?
కొన్ని తెలుగు వెబ్ సైట్లని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు పై చిత్రంలో విధంగా అక్షరాలు గజిబిజిగా కనిపిస్తుంటాయి.
ఈ పరిస్థితిని అధిగమించి తెలుగు సైట్లలోని సమాచారం ఫైర్ ఫాక్స్ లో సలక్షణంగా కనిపించాలంటే https://addons.mozilla.org/en-US/firefox/addon/873 అనే వెబ్‌పేజీలో కనిపించే Padma అనే add-on ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ add-on ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ,గుజరాతీ, బెంగాలీ,గుర్‌ముఖి వంటి వివిధ భాషల్లోని వెబ్‌పేజీల్లోని సమాచారం సవ్యంగా ఫైర్‌ఫాక్స్ విండోలో ప్రదర్శింపబడుతుంది. మీ సిస్టమ్ లోని ఫైర్ ఫాక్స్ లో తెలుగు సరిగ్గా కనిపించనప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
బ్‌లు ఆకర్షణీయమైన రంగుల్లోకి వచ్చేలా...
ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో మనం వేర్వేరు ట్యాబ్‌ల క్రింద వేర్వేరు వెబ్‌సైట్లని బ్రౌజ్
చేసుంటాము కదా!! అలా ఓపెన్ చేయబడిన ప్రతీ ట్యాబ్ ఆకర్షణీయమైన
రంగుల్లో చూపించబడితే కళ్లకు ఇంపుగా ఉంటుంది కదూ!! దీనిని సాధ్యం
చేసేదే colourful tabs డౌన్‌లోడ్ చేసుకుని ఆనందించండి.
No comments:
Post a Comment