కంప్యూటర్ చరిత్ర
- ఉపోద్గాతము
విషయ సూచిక |
కంప్యూటర్ అంటే ఏమిటి?
కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలు. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.- కన్సైజ్ ఆక్స్ఫర్డు ఇంగ్లీష్ డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.[1]
- వెబ్స్టర్స్ ఇంగ్లీష్ డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.[2]
- సురేశ్ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది.[3]
ఇది మనం ఇచ్చిన సమస్య యొక్క డేటా (INPUT) స్వీకరించి ముందుగా ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం డేటాను విశ్లేషించి ఫలితాలు (OUTPUT) అందజేస్తుంది.
- కంప్యూటర్ వివరణ
- లెక్కలు చేయడం కోసం కాలుక్యులేటర్
- ఉత్తరాలు టైప్ చేయడం కోసం టైపురైటర్
- ఉత్తరాలు దాచుకోవడం కోసం అలమర
- ఆటలు ఆడుకొనే వేడియోగేమ్ ప్లేయర్
- సంగీతం వినే టేపురికార్డర్
- సినిమాలు చూసే దూరదర్శిని ఇలా ఒకే సాధనం ద్వారా విస్త్రుత ఉపయోగాల సమ్మేళనం కంప్యూటర్. కేవలం ఇవేకాక ఫ్యాక్టరీలలో యంత్ర నిర్దేశకుడు, కార్యాలయలలో కాగితాల పని, శాటిలైట్ వ్యవస్థలలో నిపుణుడు, రోబోట్‌లను నడిపించే పనిమంతుడు ఇలా చాలా చాలా చేయగల సాధనం కంప్యూటర్.
- డేటా స్వీకరణ
- డేటా నియంత్రణ
- ఫలితాలు
కంప్యూటర్ నిర్మాణము
కంప్యూటర్లలో రకాలు ఉన్నప్పటికీ సాధారణంగా అందరూ వాడే 'పర్సనల్ కంప్యూటర్' నిర్మాణం ప్రకారం టైపురైటరు లాంటి కీ బోర్డ్ కలిగి ఉంటుంది. కీబోర్డ్ ద్వారా కంప్యూటరుకు అవసరమైన డేటా అందిస్తాము. అందుకొన్న డేటాను విశ్లేషించేందుకు సి పి యు (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్) అనేది ఒక బాక్సులో మదర్ బోర్డ్, పవర్ సప్లై బాక్స్, చిన్నప్యాన్స్, ప్లాపీ డిస్క్, డేటా డిస్క్(హార్డ్ డ్రైవ్) అనే వాటితో కలసి ఉంటుంది. సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ నుండి విశ్లేషించబడిన సమాచారమును చూడడం కోసం టెలివిజన్ మాదిరిగా ఉండే మానిటర్ అను సాధనం ఉండును. వీటన్నిటి కలయికనూ కంప్యూటర్ అనవచ్చు. దీనికి ప్రింటర్, స్కానర్ మొదలగువాటిని కలపవచ్చు.డేటా
కంప్యూటరులో ప్రోగ్రాము వ్రాయుటకు Cobol, Basic, Fortran, Pascal, C, C++లు కలవు. ప్రోగ్రాము రాయుటకు కొన్ని నియమ నిభంధనలు, ఆ భాషకు అనుకూలమైన డేటా రకాలను ఎన్నుకొని ప్రోగ్రాము వ్రాస్తారు. డేటాలో రెండురకములు కలవు.- న్యూమరికల్ డేటా(Numaric Data)
- పూర్ణ సంఖ్యలు(Integers)
- సహజ సంఖ్యలు(Real numbers)
- ఆల్ఫా న్యూమరిక్ డేటా(Alpha Numaric Data)
కంప్యూటర్ చేయు పనులు
- లెక్కలు(CALCULATOIN)
- విష్లేషణ(ANALYSIS)
- పోలిక(COMPARISION)
- జ్ఞాపకం(MEMORISATION)
- (RETRIVING)
- (UPDATING)
- (EDITING)
- (PRINTING)
- (TRANSFER)
- (PLAYER)
==హార్డ్ వేర్ గహ్షుక్త్యిద్యొ
సాప్ట్ వేర్
కంప్యూటర్ పనిచేయు విధానం
కంప్యూటర్ అభివృద్దిక్రమం
కంప్యూటర్ ముఖ్యంగా లెక్కలు చేసేందుకు ఉపయోగించుట కొరకు తయారు చేయబడినది. క్రీస్తు పూర్వం చైనీయులు అబాకస్ అనే సాధనాన్ని లెక్కలు చేసేందుకు వినియోగించేవారు. జాన్ నేపియర్ అను స్కాట్‌లాండ్ దేశ గణిత శాస్త్రజ్ఞుడు గుణకారములను సులభముగా చేయుటకు నేపియర్ బోన్స్ అనే ఎముకలతో తయారు చేయబడిన సాధనమును ఉపయోగించాడు. అదే జాన్ పియర్ తరువాత 1617లో లూగరిధమిక్ టేబుల్స్ను గుణకారములను భాగహారములను చేసేందుకు తయారు చేసి ఉపయోగించాడు. 1620వ సంవత్సరంలో లూగరిధమ్స్ టేబుల్ ద్వారా కొంత అభివృద్ది చేసి స్లైడ్ రూల్ కనుగొన్నాడు. అయితే ఇవన్నీ మానవ శక్తితో పనిచేసేవే.వీటి తదనాంతరం రూపుదిద్దుకొన్నదే పాస్కల్ ఇది గేర్లు ఇనుప చక్రములు వినియోగించి చేసిన మొదటి యంత్రమనవచ్చు. 1671వ సంవత్సరంలో గాట్ఫ్రెడ్ లైబెంజ్ అను అతడు పాస్కల్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి కూడికలు తీసివేతలతోపాటు గుణకారములు, భాగహారములు కూడా సులభముగా చేయగల్గే లీబ్ నిడ్జ్ అనే యంత్రమును తయారు చేసాడు. 1823వ సంవత్సరంలో కంప్యూటర్ పితామహుడుగా పిలవబడే చార్లెస్ బాబేజ్ అను గణిత శాస్త్రజ్ఞుడు ఆల్జీబ్రా ఈక్వేషన్స్ కూడా చేయగల డిఫరెన్సియల్ ఇంజన్ అనే యంత్రపరికరాన్ని తయారు చేసాడు.
ఇతని కాలంలోనే కావలసిన విడి భాగాలు లభించి ఉంటే కంప్యూటర్ తయారయ్యి ఉండేదని అంటారు. ఎందువలనంటే డిఫెన్సియల్ ఇంజనుపై గడించిన అనుభవంతో నిముషానికి అరవై కూడికలు చేయగలిగి విలువలను మెమొరీలో దాయగల అవకాసం గల ఎనలిటికల్ ఇంజన్ రూపకల్పన చేయగలిగాడు. కాని అతని అవసరానికి సరిపడు క్వాలిటీ గల విడిభాగాలు తయారు చేయగల సామర్ధ్యం కలిగిన పరిశ్రమలు ఆనాడు లేకపోవుటచే ఎనలిటికల్ ఇంజన్ తయారు చేయలేక పోయాడు. తరువాత కంప్యూటర్ అభివృద్దికి హార్మన్ హోల్ రీత్ కృషిచేసి తను తయారు చేసిన కంప్యూటర్లను అవసరం కలిగిన కొన్ని కంపెనీలకు విక్రయించగలిగాడు. ప్రసిద్ది గాంచిన కంప్యూటర్ల సంస్థ ఐ.బి.యమ్(I.B.M) హోల్ రీత్ స్థాపించినదే. మొదటి ఎనలాగ్ కంప్యూటర్ రకానికి చెందిన లార్డ్ కెల్విన్ అభివృద్ది చేసాడు. దీని తరువాత మార్క్-1 (MARK-1) అనే కంప్యూటర్ 1948లో ఐ.బి.యమ్. సంస్థ సహకారంతో రూపొందించాడు. ఈ కంప్యూటరునే అసలైన కంప్యూటరుగా పేర్కొంటారు. దీని తరువాత వాల్వులు ఉపయోగించి కంప్యూటర్లు తయారు చేయబడినాయి.
కంప్యూటర్ల వర్గీకరణ
కంప్యూటర్లు అవి పనిచేసే సూత్రము బట్టి కొన్ని వర్గాలుగా విభజించారు.- ఎన్లాగ్ కంప్యూటర్స్
- డిజిటల్ కంప్యూటర్స్
- హైబ్రీడ్ కంప్యూటర్స్
కంప్యూటర్ల సామర్ధ్యమును బట్టి మూడు రకాలుగానూ, వాడకమును బట్టి మూడు రకములుగాను విడగొట్టవచ్చు వాటిలో
- మొదటి రకం.
- మైక్రో కంప్యూటర్స్
- మెయిన్ ప్రేమ్ కంప్యూటర్స్
- సూపర్ కంప్యూటర్స్
- రెండవరకం
- హోమ్ కంప్యూటర్లు
- మల్టీ మీడియా కంప్యూటర్లు
- ఎడ్యుకేషనల్ కంప్యూటర్లు
కంప్యూటర్ తరాలు
మొదటి తరం కంప్యూటర్స్ (1945-1960)
మొదటి తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులను వాడి తయారు చేసేవారు. వీటిని వాడి తయారు చేసిన మొట్ట మొదటి ఎలెక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాక్ (ENIAC). ఇది రిలేలతో తయారయిన కంప్యూటర్ల కంటే వేగంగా పనిచేయగలదు. సెకనుకు 5000 కూడికలు చేయగలదు. 1946లో తయారయిన ఎనియాక్లో కంప్యూటర్లో మెమొరీ ఉండేదికాదు. దీని తయారీలో 18.000 వాక్యూం ట్యూబులు, 70.000 రెసిస్టర్లు, 1000 కెపాసిటర్లు, 6000 స్విచ్చులు వాడారు. దీనిని ఉంచేందుకు చాలా ఎక్కువ స్థలము అవసరమవడమే కాక దీనిని నడిపించేందుకు 150 కె,డబ్ల్యు ల విధ్యుత్ అవసరమయ్యేది. అధిక శక్తి వినియోగించుట వలన ఎక్కువ వేడి పుడుతుండేది. 1946లో జాన్ వాన్ న్యూమన్ కంప్యూటరులో ప్రోగ్రాములను దాచే విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ విధానంలో ఎడ్సాక్ (EDSAC), ఎడ్వాక్ (EDVAC), యునివాక్ (UNIVAC) అనే కంప్యూటర్లు తయారయినవి. మొదటి తరం కంప్యూటర్లు పంచ్ కార్డు ద్వారా డేటాను తీసుకొనేవి. ఐ,బి,యం - 650 (I B M - 650), మరియు ఐ,బి,యం - 701 (I B M - 701) మొదలగునవి మొదటి తరం కంప్యూటర్లు. "రెండవతరం కంప్యూటర్స్(1960-1965)
రెండవ తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులకు బదులు ట్రాన్సిస్టర్స్ వాడడం మొదలెట్టారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాక వేగంగా పని చేస్తూ తక్కువ వేడిని విడుదల చేస్తుండేది. ఈ కంప్యూటర్లను సాంకేతిక రంగాలలోనే కాక వ్యాపార అవసరములకు కూడా వినియోగించేవారు. ఈ కంప్యూటర్లను వాడుకొనుటకై ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గాల్, స్కోబాల్ అను భాషలు ప్రత్యేకంగా అభివృద్ది చేయబడినవి. ఇవి ఇంగ్లీషు భాష మాదిరిగా ఉపయోగించుటకు తేలికగా ఉండే భాషలు.మూడవతరం కంప్యూటర్స్(1965-1975)
మూడవ తరం కంప్యూటర్స్ చిప్ ఆధారంగా పనిచేయు కంప్యూటర్స్. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ద్వార 1000 కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లను, రెసిస్టర్లను, కెపాసిటర్లను కాప్స్యూల్ సైజుకు లేదా అంతకంటే చిన్నగా చిప్ లేదా ఐ సి(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్)గా తయరు చేయవచ్చు. ఇలాంటి చిప్పులను వాడడం ద్వారా కంప్యూటర్స్ పరిమాణం తగ్గించి మినీ కంప్యూటర్లుగా తయారు చేయడం మొదలైంది.ఈ చిప్పులను ఉపయోగించి తయారైన మెయిన్ ప్రేమ్ కంప్యూటర్లు మరింత శక్తివంతముగా మరాయి. వీటిని విద్యాసంస్థలలో, ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించుట మెదలెట్టారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన ప్రొసెసింగ్ యూనిట్లు, శక్తివంతమైన మెమొరీ, అధిక సామర్ధ్యం కలిగిన చిప్స్ అభివృద్ది చేయబడ్డాయి. ఈ కాలంలోనే అయస్కాంతత్వ టేపుల స్థానంలో డిస్కులు వినియోగంలోకి వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో చెప్పదగిన అభివృద్ది కలిగిన శక్తివంతమైన కంప్యూటర్లు రావడంతో వాటికి అనుసంధానంగా పి,యల్-1, ఫోర్ట్రాన్-4 మొదలగు భాషలు వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో కొన్ని ఐబియమ్ 360 (IBM-360), ఐబియమ్ 370 (IBM-370), ఐసిఎల్ 2900 (ICL-2900) మొదలగునవి.
నాలగవ తరం కంప్యూటర్స్(1976- ప్రస్తుతం)
మైక్రో ప్రొసెసరునుపయోగించి తయారు చేయబడిన వాఅటిని నాల్గవ తరం కంప్యూటర్లు అనవచ్చు. కంప్యూటరుకు అవసరమైన సర్క్యూట్ మొత్తమును ఒకే సిలికాన్ చిప్ మీద "పరీలార్జ్ ఇంటిగ్రేషన్" టెక్నాలజీ సహాయంతో సూక్ష్మీకరించి తయారు చేసిన వీటిని చిప్ లేదా 'ఐసిపి' మైక్రో ప్రొసెసరు అంటారు. ఇంటెల్ సంస్థవారిచే తయారు కాబడిన 8080 మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి ఎడ్వర్డ్ రాబర్ట్ మొదటి మైక్రో కంప్యూటరు తయారు చేసాడు. దీని పేరు ఆల్ టెయిరీ. ఐబియమ్ సంస్థ వారూ మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి 1981లో పర్సనల్ కంప్యూటర్ తయారు చేసారు. వీటి ధరలు తక్కువగా ఉండటంతో ఇవి ఎక్కువ ప్రజాధరణ పొందుతున్నాయి. వీటికి ఉదాహరణలు- జెడ్ ఎక్ష్ స్పెక్ట్రం, పిసి ఎట్ పెంటియం.ఐదవతరం రాబోవు కంప్యూటర్స్
ఆపరేటింగ్ సిస్టమ్స్
- ఎమ్.ఎస్,డాస్(M S-DOS)
- యునిక్స్(UNIX)
- విండోస్(WINDOS)
లాంగ్వేజీలు
మనుషుల మద్య సమచార ప్రసారానికి ఒక మాద్యమం అవసరం. భాష లేకపోతే సమాచర వ్యవస్థ స్థంభించి పోతుంది. అలాగే కంప్యూటర్లతో మాట్లాడలన్నా ఒక భాష అవసరం. కంప్యూటరు కోసం వాడే భాషలను ప్రోగ్రామింగ్ భాష అంటారు. అలాంటి భాషలలో కొన్ని.- బేసిక్
- ఫోర్ట్రాన్
- కోబాల్
- పాస్కల్
No comments:
Post a Comment