Saturday, 29 September 2012

29-09-2012 

కంప్యూటర్ హార్డ్ వేర్

కొంతమందికి కంప్యూటర్లంటే తెలియని భయం. ఏదో తప్పనిసరై వాటిని ఉపయోగిస్తారు కానీ క్యాబినెట్‌ని ముట్టుకోవాలన్నా , క్యాబినెట్ స్క్రూలను విప్పదీసి రేకుని తొలగించి లోపలికి చేయి పెట్టాలన్నా ఎక్కడ షాక్ కొడుతుందో… ఏం పాడవుతుందోనని హడలిపోతుంటారు. అయితే ఎంత రఫ్‌గా హ్యాండిల్ చేసినా మొండింగా పనిచేసేది కంప్యూటర్ మాత్రమే. కంప్యూటర్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. కంప్యూటర్‌లోని వివిధ భాగాలపై ఆవగాహన కలిగించడానికే రూపొందించబడినదే ఈ హార్డ్‌వేర్ పుస్తకం. ఇందులో మదర్‌బోర్డ్, ప్రాసెసర్, మేమరీ, IDE, SCSI వంటి ఇంటర్‌ఫేస్‌లు, రిమూవబుల్ స్టోరేజ్, ఫ్లాపీ డిస్క్ వంటి వివిధ కంప్యూటర్ భాగాల గురించి, అది ఎలా ఆవిర్భవించింది, దాని విషయంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న టెక్నాలజీలు , ఇతర సాంకేతికపరమైన వివరాలను సమగ్రంగా అందించడం జరిగింది. పిసి హార్డ్‌వేర్ గురించి ఇంత విస్తృతంగా ఇంతవరకూ తెలుగులోనే కాక ఇతర భారతీయ భాషల్లో వేటిలోనూ చర్చించిన పుస్తకాలు లేవు. హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగాల్లో స్థిరపడదలుచుకున్న వారికీ , హోమ్ పిసి యూజర్లకి ఎంతో ఉపయుక్తంగా ఉండే పుస్తకమిది. విషయం సులభంగా అర్ధం కావడం కోసం అవసరమైన చోట ఫోటోలను, స్క్రీన్‌షాట్లని, టేబుల్స్‌ని, డయాగ్రములను సైతం పొందుపరచబడడం జరిగింది. వాస్తవానికి పిసి హార్డ్‌వేర్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. అన్ని హార్డ్‌వేర్ భాగాల గురించి, టెక్నాలజీల గురించి ఒకే పుస్తకంలో ప్రచురించడం తలకు మించిన భారమే. అందుకే ఈ హార్డ్‌వేర్ పుస్తకాన్ని వేర్వేరు భాగాలుగా విఘజించడం జరిగింది. ఈ మొదటి భాగంలో మదర్‌బోర్డ్, రామ్, ప్రాసెసర్, రిమూవబుల్ స్టోరేజ్ వంటి అంశాల గురించి వివరించాం. తరలో విడుదల కాబోయే మరో భాగంలో మిగిలిన అంశాల గురించి సవివరంగా ప్రచురిస్తాం. MCSE వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇందులో చర్చించబడిన సాంకేతిక వివరాలు చాలా దోహదపడతాయి. అలాగే సాధారణ పిసి యూజర్లకి సైతం ఈ హార్డ్‌వేర్ పుస్తకం వివిధ సందర్భాల్లో మార్గదర్శకంగా ఉంటుంది

No comments:

Post a Comment