Saturday, 29 September 2012

కంప్యూటర్ అంటే ఏమిటి?

కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలు. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.
  • కన్సైజ్‌ ఆక్స్ఫర్డు ఇంగ్లీష్‌ డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.[1]
  • వెబ్స్టర్స్ ఇంగ్లీష్ డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.[2]
  • సురేశ్‌ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది.[3]

ఇది మనం ఇచ్చిన సమస్య యొక్క డేటా (INPUT) స్వీకరించి ముందుగా ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం డేటాను విశ్లేషించి ఫలితాలు (OUTPUT) అందజేస్తుంది.
కంప్యూటర్ వివరణ
  • లెక్కలు చేయడం కోసం కాలుక్యులేటర్
  • ఉత్తరాలు టైప్ చేయడం కోసం టైపురైటర్
  • ఉత్తరాలు దాచుకోవడం కోసం అలమర
  • ఆటలు ఆడుకొనే వేడియోగేమ్ ప్లేయర్
  • సంగీతం వినే టేపురికార్డర్
  • సినిమాలు చూసే దూరదర్శిని ఇలా ఒకే సాధనం ద్వారా విస్త్రుత ఉపయోగాల సమ్మేళనం కంప్యూటర్. కేవలం ఇవేకాక ఫ్యాక్టరీలలో యంత్ర నిర్దేశకుడు, కార్యాలయలలో కాగితాల పని, శాటిలైట్ వ్యవస్థలలో నిపుణుడు, రోబోట్‌లను నడిపించే పనిమంతుడు ఇలా చాలా చాలా చేయగల సాధనం కంప్యూటర్.
మనిషి విషయం గ్రహిస్తాడు. ఆలోచిస్తాడు. దానికి అనుకూలంగా స్పందిస్తాడు. కాని! కంప్యూటర్ డేటాని ఇన్ పుట్ గా తీసుకొని ప్రొసెస్ చేస్తుంది. అవుట్ పుట్ ఇస్తుంది. ఈ రెండు విషయాల ద్వారా మనిషి చేసే పనికి కంప్యూటర్ చేసే పనికి దగ్గర దగ్గర పోలికలున్నాయని చెప్పవచ్చు.
డేటా స్వీకరణ
కీబోర్డ్, మౌస్, స్కానర్ మొదలగు పరికరాలు డేటాను మన నుంచి తీసుకొని కంప్యూటరుకు అందించుటకు ఉపయోగపడతాయి. వీటిని ఇన్ పుట్ డివైసెస్ అంటారు. వీటిని మనిషి యొక్క కళ్ళు, చెవులుతో పోల్చవచ్చు.
డేటా నియంత్రణ
మనిషి యొక్క శరీర భాగాలను మెదడు ఏ విధంగా నియంత్రిస్తుందో అలాగే కంప్యూటర్లలో మైక్రో ప్రొసెసర్ కంప్యూటరు నందలి అన్ని భాగాలను నియంత్రిస్తుంది. ఇది ఇన్ పుట్ నుండి వచ్చిన డేటాను తీసుకొని ప్రోగ్రాముల సహాయంతో విశ్లేషించి ఫలితాలను తయారు చేస్తుంది.
ఫలితాలు
ప్రొసెసర్ నుండి సమాచారం గ్రహించి బయటకు అందించే ప్రింటరు మానిటరు మొదలగు భాగాలను అవుట్ పుట్ డివైసెస్ అంటారు. వీటిని మానవ శరీరంలోని మెదడు నుండి సమాచారం అందుకొని పని చేసే కాళ్ళు, చేతులు, నోరు లాంటి వాటితో పోల్చవచ్చు.

కంప్యూటర్ నిర్మాణము

కంప్యూటర్లలో రకాలు ఉన్నప్పటికీ సాధారణంగా అందరూ వాడే 'పర్సనల్ కంప్యూటర్' నిర్మాణం ప్రకారం టైపురైటరు లాంటి కీ బోర్డ్ కలిగి ఉంటుంది. కీబోర్డ్ ద్వారా కంప్యూటరుకు అవసరమైన డేటా అందిస్తాము. అందుకొన్న డేటాను విశ్లేషించేందుకు సి పి యు (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్) అనేది ఒక బాక్సులో మదర్ బోర్డ్, పవర్ సప్లై బాక్స్, చిన్నప్యాన్స్, ప్లాపీ డిస్క్, డేటా డిస్క్(హార్డ్ డ్రైవ్) అనే వాటితో కలసి ఉంటుంది. సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ నుండి విశ్లేషించబడిన సమాచారమును చూడడం కోసం టెలివిజన్ మాదిరిగా ఉండే మానిటర్ అను సాధనం ఉండును. వీటన్నిటి కలయికనూ కంప్యూటర్ అనవచ్చు. దీనికి ప్రింటర్, స్కానర్ మొదలగువాటిని కలపవచ్చు.

డేటా

కంప్యూటరులో ప్రోగ్రాము వ్రాయుటకు Cobol, Basic, Fortran, Pascal, C, C++లు కలవు. ప్రోగ్రాము రాయుటకు కొన్ని నియమ నిభంధనలు, ఆ భాషకు అనుకూలమైన డేటా రకాలను ఎన్నుకొని ప్రోగ్రాము వ్రాస్తారు. డేటాలో రెండురకములు కలవు.
న్యూమరికల్ డేటా(Numaric Data)
న్యూమరికల్ డేటా అంటే 0,1,2,3,4,5,6,7,8,9, నంబర్లతో ఏర్పాటవుతుంది. నుమరిక్ డేటాను మరలా పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలుగా వర్గీకరిస్తారు.
  • పూర్ణ సంఖ్యలు(Integers)
వీటిలో కేవలం Integer నంబర్స్ మాత్రమే ఉంటాయి. వీటిని వోల్ నంబర్స్(Whol numbers) అని కూడా అంటారు. ఉదాహరణ- 0,+16,+32,+24.
వీటిలో అన్ని సంఖ్యలూ ఉంటాయి. ఉదాహరణకు-0,+5,1/4,-9, ఇలా. న్యూమరిక్ డేటాను కంప్యూటర్ గుర్తించినపుడు ఆ అంకె ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ ఉంటుంది.
ఆల్ఫా న్యూమరిక్ డేటా(Alpha Numaric Data)

No comments:

Post a Comment