Saturday, 29 September 2012

స్పెషల్ బుక్స్ లేబుల్‌తో ఉన్న అన్ని పోస్ట్‌లు చూపించు



కంప్యూటర్ ఎరా స్పెషల్ బుక్స్



విద్యార్థులు, హోమ్ పిసి యూజర్లు,గృహిణులు, సాఫ్ట్‌వేర్/ హార్డ్‌వేర్ ఇంజనీర్లు వంటి ప్రతీ పిసి యూజర్‌కి ఉపకరించేలా కంప్యూటర్ ఎరా విభిన్నమైన టాపిక్స్ మీద స్పెషల్ బుక్స్‌ని విడుదల చేసింది. ప్రతీ పిసి యూజర్ వద్ద ఉండవలసిన పుస్తకాలు ఇవి.


1. కంప్యూటర్ హార్డ్‌వేర్....Rs.69

2. పిసి ట్రబుల్ షూటింగ్ ..Rs.79

3. కంప్యూటర్ టిప్స్ & ట్రిక్స్...Rs.119

4. కంప్యూటర్ సందేహాలు...Rs.69

5. కంప్యూటర్ A-Z - 1 .......Rs.109

6. కంప్యూటర్ A-Z - 2 .......Rs.109

7. విండోస్ రిజిస్ట్రీ,స్మాల్ థింగ్స్...........Rs.99

8. సెల్‌ఫోన్ చిట్కాలు.....Rs.39

9. ఏ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది...Rs.39



కాపీలు అన్ని ప్రధాన బుక్ స్టాల్స్‌లో లభ్యం లేదా పోస్టులో పొందగోరువారు పుస్తకం ఖరీదుతోపాటు రూ.10 అదనంగా క్రింది అడ్రస్‌కు ఎం.ఓ. చేయండి. ఎం.ఓ ఫారంలో ఏ పుస్తకం కావాలో తెలపండి.

Bandla Publications

2-2-1130/24/1/D/1

Behind Indian Bank, Shivam Road

New Nallakunta,

Hyderabad


ph: 27673494
cell:9963293399


















కంఫ్యూటర్ ఎరా స్పెషల్ - 1



కంప్యూటర్ హార్డ్ వేర్

కొంతమందికి కంప్యూటర్లంటే తెలియని భయం. ఏదో తప్పనిసరై వాటిని ఉపయోగిస్తారు కానీ క్యాబినెట్‌ని ముట్టుకోవాలన్నా , క్యాబినెట్ స్క్రూలను విప్పదీసి రేకుని తొలగించి లోపలికి చేయి పెట్టాలన్నా ఎక్కడ షాక్ కొడుతుందో... ఏం పాడవుతుందోనని హడలిపోతుంటారు. అయితే ఎంత రఫ్‌గా హ్యాండిల్ చేసినా మొండింగా పనిచేసేది కంప్యూటర్ మాత్రమే. కంప్యూటర్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. కంప్యూటర్‌లోని వివిధ భాగాలపై ఆవగాహన కలిగించడానికే రూపొందించబడినదే ఈ హార్డ్‌వేర్ పుస్తకం. ఇందులో మదర్‌బోర్డ్, ప్రాసెసర్, మేమరీ, IDE, SCSI వంటి ఇంటర్‌ఫేస్‌లు, రిమూవబుల్ స్టోరేజ్, ఫ్లాపీ డిస్క్ వంటి వివిధ కంప్యూటర్ భాగాల గురించి, అది ఎలా ఆవిర్భవించింది, దాని విషయంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న టెక్నాలజీలు , ఇతర సాంకేతికపరమైన వివరాలను సమగ్రంగా అందించడం జరిగింది. పిసి హార్డ్‌వేర్ గురించి ఇంత విస్తృతంగా ఇంతవరకూ తెలుగులోనే కాక ఇతర భారతీయ భాషల్లో వేటిలోనూ చర్చించిన పుస్తకాలు లేవు. హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగాల్లో స్థిరపడదలుచుకున్న వారికీ , హోమ్ పిసి యూజర్లకి ఎంతో ఉపయుక్తంగా ఉండే పుస్తకమిది. విషయం సులభంగా అర్ధం కావడం కోసం అవసరమైన చోట ఫోటోలను, స్క్రీన్‌షాట్లని, టేబుల్స్‌ని, డయాగ్రములను సైతం పొందుపరచబడడం జరిగింది. వాస్తవానికి పిసి హార్డ్‌వేర్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. అన్ని హార్డ్‌వేర్ భాగాల గురించి, టెక్నాలజీల గురించి ఒకే పుస్తకంలో ప్రచురించడం తలకు మించిన భారమే. అందుకే ఈ హార్డ్‌వేర్ పుస్తకాన్ని వేర్వేరు భాగాలుగా విఘజించడం జరిగింది. ఈ మొదటి భాగంలో మదర్‌బోర్డ్, రామ్, ప్రాసెసర్, రిమూవబుల్ స్టోరేజ్ వంటి అంశాల గురించి వివరించాం. తరలో విడుదల కాబోయే మరో భాగంలో మిగిలిన అంశాల గురించి సవివరంగా ప్రచురిస్తాం. MCSE వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇందులో చర్చించబడిన సాంకేతిక వివరాలు చాలా దోహదపడతాయి. అలాగే సాధారణ పిసి యూజర్లకి సైతం ఈ హార్డ్‌వేర్ పుస్తకం వివిధ సందర్భాల్లో మార్గదర్శకంగా ఉంటుంది.

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 2


పిసి ట్రబుల్‍షూటింగ్

ఇంట్లో టివి ఎంత అవసరం అయిపోయిందో ఈ మధ్య కాలంలో కంప్యూటర్ కూడా అంతే నిత్యావసరంగా మారింది. చదువుకుంటున్న పిల్లల కోసమైతేనేమి, లేదా విదేశాల్లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుకోవడం కోసమని, స్వతహాగా ఆసక్తి ఉండడం వల్లనైతేనేమి ఇళ్ళలొ కంప్యూటర్లు వడేవారు అధికమయ్యారు. కంప్యూటర్ అనేది ఒకటి ఉంటే దాని మూలంగానూ కొన్ని ఇబ్బందులు చీటికి మాటికీ తలెత్తుతుంటాయి. వైరస్, స్పైవేర్, బ్రౌజర్ హైజాకర్లు, కీలాగర్లు వంటివి మన కంప్యూటర్‌కి ఇన్‌ఫెక్ట్ అవడం మొదలుకుని అప్పటివరకూ సక్రమంగా పనిచేస్తున్న కంప్యూటర్ ఉన్న ఫళాన హ్యాంగ్ అయిపోవడం , అసలు కంప్యూటరే బూట్ అవకపోవడం, బీప్ సౌండ్‌లు రావడం, స్క్రీన్‌పై రకరకాల ఎర్రర మెసేజ్‌లు ప్రదర్శించబడడం, టాస్క్‌బార్,,ఫోల్డర్ ఆప్షన్లు, కమాండ్ ప్రాంప్ట్ వంటి వాటిని యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్‌లు రావడం, డెక్స్‌టాప్‌పై ఐకాన్లు మారిపోవడం, ఇల్లా చెప్పుకుంటూ పోతుంటే మనం కంప్యూటర్‌ని వాడే విధానాన్ని బట్టి, మన పిసిలో ఇన్‌స్టాల్ చేసుకున్న సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్ పరికరాలను బట్టి వేర్వేరు సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కంప్యూటర్ అయితే కొంటాం కానీ ఇలా చీటికి మాటికి ఇబ్బంది పెట్టే సమస్యలను ఎలా పరిష్కరించాలన్నది మాత్రం అంతుబట్టదు. దీంతో చాలామంది పిసి యూజర్లు హార్డ్‌వేర్ టెక్నీషియన్లని ఆశ్రయిస్తుంటారు. అయితే కొంతమంది హార్డ్‌వేర్ నిపుణులకు మాత్రమే ట్రబుల్‌షూటింగ్ పై పూర్తిస్థాయి ఆవగాహన ఉంటుంది. వారు మాత్రమే అసలు సమస్య ఎందుకు ఉత్పన్నాం అయిందో గుర్తించి దాన్ని సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు అధికశాతం మంది హార్డ్‌వేర్ నిపుణులుగా చలామణి అయ్యేవారికి హార్డ్‌డిస్క్‌ని ఫార్మేట్ చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్‌ని రీ్ఇన్‌స్టాల్ చేయడం ఒక్కటే అతను చేయగలిగింది. ఇలా ప్రతీ దానికీ ఫార్మేట్ చేయడం వల్ల ఎంత విలువైన సమచారాన్ని,సమయాన్ని వృధా చేస్తుంటామో ఒక్కసారి ఆలోచించండి? ప్రతీ కంప్యూటర్ సమస్యకీ ఒక పరిష్కారముంటుందీ. ఆయా పరిష్కారాలను తెలుసుకుంటే చిటికెలో పాడైన సిస్టమ్‌ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఇళ్ళలొ కంప్యూటర్లని వాడే ప్రతీ హోమ్ పిసి యూజర్లకి, పిసి ట్రబుల్‌షూటింగ్‌పై పెద్ద ఆవగాహన లేని హార్డ్‌వేర్ టెక్నీషియన్లకి ఉపయోగపడే విధంగా 'ట్రబుల్ షూటింగ్" పేరిట ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము... ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రోగ్రాములు, సెక్యూరిటీ లోపాలు, వైరస్‌లు, బగ్స్ వంటి అనేక అంశాల కారణంగా తరచుగా తలెత్తే పలు సమస్యలకు పరిష్కారాలను ప్రచురించడం జరిగింది. మీరు పిసిపై పనిచేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా ఒక్కసారి ఈ పుస్తకాన్ని రిఫర్ చేస్తే మీ సమస్యకి చాలావరకూ పరిష్కారం లభిస్తుంది.

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 3



కంప్యూటర్ ట్రిప్స్ & ట్రిక్స్

ఏదైనా పనిని సులువుగా చేసే మార్గముంటే అందరం దానిని ఇష్టపడతాం. కంప్యూటర్ల విషయంలోనూ మనకు తెలియకుండా అనేక పనుల్ని సులభంగా చేసే చిట్కాలు ఎన్నో ఉంటాయి.ఆ మెళకువలు తెలియకపోవడం వల్ల ప్రతీ పనికీ ఎంతో కష్టపడుతుంటాము. ఉదా.. మీరొక వీడియో సిడి తెచ్చుకుని మీ సిడిరైటర్‌లో కాపీ చేసుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నిస్తుంటే ఎర్రర్ మెసేజ్ వచ్చి ఆగిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే ఫలితం వస్తుంటే చిరాకు రాదూ! అదే సిడిలను కాపీ చేసే టెక్నిక్ ,సమస్యలు ఏదైనా మీకు తెలిసిఉంటే క్షణాల్లో మీ అవసరం నెరవేరిపోతుంది కదా? తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ కంప్యూటర్లపై పనిచేసేటప్పుడు ఎన్నో చిట్కాలను, నైపుణ్యతలను ప్రదర్శించి అందరికన్నా టెక్నికల్‌గా మనం ముందుండవచ్చు. అయితే చాలామంది ఏదో ఆ MS-WOrd లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలు, లేదా tally లోమా కంపెనీ ఎకౌంట్లని ప్రిపేర్ చేసుకోగలిగితే చాలు. ఇలా కొన్నికొన్ని ఉద్దేశ్యాలను, పరిమితులను విధించుకుని ఎప్పుడూ చేసే రొటీన్ పనులనే మళ్ళి మళ్ళీ కంప్యూటర్‌పై చేస్తుంటారు. అలాంటి వారు ఒక్కసారి తమ పరిధిని విస్తరించుకుని కొత్త విషయాలను నేర్చుకోవడానికి పూనుకుంటే ఈ పుస్తకం మీకు కంప్యూటర్ల గురించి తెలియని అద్భుతాలను పరిచయం చేస్తుంది. ఇందులో ప్రస్తావించిన చిట్కాలు ఒక్కో సందర్భంలో చాలా ఉపయోగకారకంగా ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్య చకితుల్ని చేయవచ్చు. నాలుగు మాటల్లో ఈ పుస్తకంలోని సమాచారం గురించి వివరించడం సాధ్యం కాని పని. ఆసక్తిగా చదువుతూ తెలుసుకున్న మెళకువలను మీ కంప్యూటర్స్‌పై ప్రయోగిస్తూ వెళ్ళండి . డివిడి డ్రైవ్‌లలో రీజిన్ లాకింగ్, గెస్ట్ ఎకౌంట్లని పాస్‌వర్డ్ ప్రొటేక్ట్ చేయడం, సర్వర్ సెక్యూరిటి మెరుగ్గా ఉంచుకోవడం. పొరబాటున ఫాంట్స్ ఫోల్డర్ తీసేస్తే, సింపుల్ షేరింగ్‌ని డిసేబుల్ చేయడం, ప్రాసెస్‌ల యొక్క ప్రాధాన్యతని పెంచడం, డౌన్‌లోడ్ మేనేజర్లలో వైరస్ స్కానర్‌ని ఇంటి్‌గ్రేట్ చేయడం, డివిడి రామ్ కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే చేయవలసిన పనులు .. ఇల రాసుకుంటూ పోతే ఎన్నో విభిన్నమైన అంశాల గురించి అందరు కంప్యూటర్ యూజర్లు తెలుసుకోవలసిన చిట్కాలు, మెళకువలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ప్రతీ చిట్కా టెక్నికల్‌గా మీకు ఎంతో నాలెడ్జ్‌ని అందించేదే...ప్రతీ టెక్నిక్ మిమ్మల్ని టెక్నికల్‌గా సమున్నత స్థానంలో నిలిపేదే.. ఇలాంటివి తెలిసి ఉంటేనే ఇతర పిసి యూజర్ల కన్నా మీరు టెక్నికల్‌గా ఎంతో ముందు ఉండగలుగుతారు. అంతే తప్ప ఏదో రొటీనుగా పని చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకు మీ పని పట్ల మీరు ఆసక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఈ పుస్తకంలో చర్చించిన ప్రతీ చిట్కాని మీ ఖాళీ సమయాలలో మనసుకు ఎక్కించుకుని అవసరం అయినపుడు ఆచరణలో పెట్టండి.

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 4


కంప్యూటర్ సందేహాలు

తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అంతవరకు మనకు తెలియని ప్రతీ అంశమూ ఒక సందేహమే ! మన సందేహాలను తీర్చాలంటే వాటిపై ఆవగాహన కలిగిన నిపుణులు ఉండాలి. అయితే అన్ని సందర్భాల్లో వారు అందుబాటులో ఉండరు. అలాగని కనపడిన వారినల్లా అడుగుతూ పోయామంటే మన సందేహాలకు అసంబద్ధమైన సమాధానాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో యూనికోడ్‌తో డిజైన్ చేయబడిన వెబ్‌సైట్లు తమ కంప్యూటర్లో ఓపెన్ కావడం లేదని ఒక పాఠకుడు అడిగిన ప్రశ్నకు పాపం ఆ ప్రశ్నలు జవాబులు శీర్షికను నిర్వహిస్తున్న మహానుభావుడు ఆ సైట్‌లో ఏ ఫాంట్‌నైతే వాడారో ఆ ఫాంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది అన్నట్లుగా సలహా ఇచ్చాడు. వాస్తవానికి ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో Encoding అనే విభాగంలో Unicode UTF-8 అని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా వివిధ సమస్యలపై, సందేహాలపై ఏమాత్రం ఆవగాహన లేనివారు ఇచ్చే సలహాలు సరైన పరిష్కారాలు అందించలేవు. ముఖ్యంగా పిసి యూజర్లకి నిపుణుల సలహాలు చాలా అవసరం. రీరైటబుల్ సిడిలు ఎరేజ్ అవడం లేదని కొందరు అడుగుతుంటారు. సిస్టమ్‌లో ఉన్న డూప్లికేట్ ఇమేజ్‌లను, అశ్లీలమైన ఇమేజ్‌లను గుర్తించడం వీలుపడుతుందా అని ఒకరు, మూవీ ప్లే అవుతుండగా స్క్రీన్ షాట్ తీయలేమా అని కొందరు, హార్డ్‌డిస్క్‌లో బేడ్ సెక్టార్లని తొలగించలేమా అని మరికొందరు.. ఇలా ప్రతీ పిసి యూజర్ ఎన్నో సందేహాల చిట్టాని ఎల్లప్పుడూ బుర్రలో మోస్తుంటాడు. అతనికి తగిన పరిష్కారాలు లభిస్తే ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతాడు. అందుకే పిసి యూజర్ల సందేహాలకు చక్కని పరిష్కరాలు, సమాధానాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించాం. ఇందులో పిసిపై పెద్దగా ఆవగాహన లేనివారిని వేధించే ప్రాధమిక స్థాయి సందేహాలతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అనిపించే అనేక రకాల సమస్యలనూ, కంప్యూటర్‌పై పూర్తిస్థాయి ఆవగాహాన కలిపించే సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివారంటే మీకు తరచుగా తలెత్తే ఎన్నో సందేహాలకు చిక్కు ముడులు వీడినట్లే ! పాఠకులకు తలెత్తే సందేహాలకు చాలా విశ్లేషాత్మకంగా సమాధానాలు ప్రచురించడం జరిగింది. ఇందులో ప్రస్తావించిన ప్రతీ సందేహమూ.. సమాధానమూ నూటికి నూరుశాతం వాస్తవిక దృక్పధంతో ఉంటుంది కాబట్టి ప్రతీ పిసి యూజర్ దీనిని ప్రామాణికంగా స్వీకరించవచ్చు.

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 5

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 6

కంఫ్యూటర్ ఎరా స్పెషల్ - 8


సెల్ ఫోన్ చిట్కాలు


ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళారు.. అక్కడ కంప్యూటర్ అనేదే అందుబాటులో లేదు. మీ వర్డ్ ఫైళ్ళని అర్జెంటుగా చదవవలసి వచ్చింది.. ఏం చేస్తారు? కంప్యూటర్ ఎటూ అందుబాటులో లేదు కదా అని ఊరకుండిపోతారు. కానీ మీ వద్ద ఉన్న అత్యాధునికమైన నోకియా 6600, N72, N75, Sony Erricson P910i వంటి ఫోన్లు మీ అవసరాలను చిటికెలో తీర్చగలుగుతాయి. ఇలాంటి PDA ఫోన్ల ఆవిర్భావంతో. కంప్యూటర్‌కీ సెల్‌ఫోన్‌కీ మధ్య అంతరాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం కొద్దిగా ఖరీదు ఎక్కవగా ఉండే ప్రతీ అత్యాధునిక ఫోనూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంటున్నాయి. మనం కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎలాగైతే వివిధ సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసుకుని వేర్వేరు పనుల్ని చక్కదిద్దుకోగలుగుతున్నామో అదే విధంగా సెల్‌ఫోన్లలోనూ వేర్వేరు అవసరాలకు వేర్వేరు సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎంచక్కా వాటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వాటి ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం పొందినప్పుడే మీ శక్తివంతమైన ఫోన్‌కి అర్ధం, పరమార్ధం లభిస్తాయి. అయితే చాలామంది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌లో అసలు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కూడా ఏమాత్రం ఆవగాహన లేకుండా ఉంటున్నారు. దాంతో శక్తివంతమైన ఫోన్లు కూడా కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అలాగే బ్లూటూత్ ద్వారా వేరే ఫోన్ నుండి మీ ఫోన్‌కి ఏదో వాల్‌పేపర్ ట్రాన్స్‌ఫర్ చేసుకోగానే మీ ఫోన్‌లోకి వైరస్ వచ్చి కూర్చుంటుంది. దాంతో ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటారు. ఫోన్లకి సైతం ఏంటీవైరస్ సాఫ్ట్‌వేర్లు ఉన్నాయని తెలిసినవారు చాలా తక్కువమందే ఉన్నారు . సెల్‌ఫోన్ యూజర్లకి పనికొచ్చే చిట్కాలను అందించడానికి మేము ప్రత్యేకంగా ప్రచురిస్తున్న ఈ పుస్తకంలో వివిధ రకాల సెల్‌ఫోన్ మోడళ్ళు, వాటిలో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ల వివరాలు, ఆయా సెల్‌ఫోన్ల వినియోగంలో ఎంతో ఉపయుక్తంగా ఉండే చిట్కాలు, అన్‌లాక్ కోడ్‌లు, ఫోన్ రివ్యూలు, ఆసక్తికరమైన సాఫ్ట్‌వేర్లు, ఫోన్ రేడియేషన్, మీ ఫోన్‌ని ఇతరులు దొంగిలించకుండా ఏం చేయాలి. ఇలా అనేక అంశాల గురించి చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. తెలుగులో ఈ తరహా పుస్తకం ప్రచురించబడడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకంలో చర్చించిన పలు చిట్కాలను ప్రాక్టికల్‌గా పాటించి మీ ఫోన్ ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందండి.

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 7



విండోస్ రిజిస్ట్రీ టిప్స్
స్మాల్ థింగ్స్


విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రిజిస్ట్రి అనేది కీలకభూమిక వహిస్తుంది. చాలామందికి రిజిస్ట్రీ అనేది ఒకటి ఉంది అన్న విషయమే తెలియదు. అందులో ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అనేక కీలకమైన సెట్టింగులు పొందుపరచబడి ఉంటాయని కొద్దిమంది హార్డ్‌వేర్ టెక్నిషియన్లు, ప్రొఫెషనల్స్‌కి మాత్రమే ఆవగాహన ఉంటుంది. విండోస్ రిజిస్ట్రీ పూర్వాపరాలలోకి వెళితే విండోస్ 95 విడుదల అయిన తొలినాళ్ళలో మైక్రోసాఫ్ట్ సంస్థ రిజిస్ట్రీని ఆపరేటింగ్ సిస్టమ్‌లో అంతర్భాగం చేసింది. అప్పట్లో కేవలం వివిధ రకాల ఫైల్ టైప్‌లను ఆపరేటింగ్ సిస్టమ్‌లో నిక్షిప్తం చెయ్యడానికి మాత్రమే రిజిస్ట్రీ ఉద్దేశించబడింది. ఉదా... BMP ఫైల్ టైప్‌ని ఆరేటింగ్ సిస్టమ్‌లో రిజిస్టర్ చేయడంతో పాటు ఆ ఫైల్ టైప్‌కి చెందిన ఫైళ్ళని డీఫాల్ట్‌గా ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్‌తో ఓపెన్ చెయ్యాలి అన్న అసోసియేషన్లు కూడా రిజిస్ట్రీలోనే పొందుపరచబడతాయి. ఇలా విండోస్ 95 ఆవిర్భవించిన తొలినాళ్ళలో కేవలం ఫైల్ అసోసియేషన్లు రిజిస్టర్ చెయ్యడానికి మాత్రమే పరిమితమైన విండోస్ రిజిస్ట్రీ తర్వాత కాలంలో మరింత పరిధిని పెంచుకుంది. విండోస్ 98 నుండి ఇటీవలి కాలంలో విడుదల అయిన విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ వరకూ విండోస్ రిజిస్ట్రీ అత్యంత కీలకమైన భాగంగా విస్తరించింది. ఇప్పుడు రిజిస్ట్రీలో డెస్క్‌టాప్, టాస్క్‌బార్ ,స్టార్ట్‌మెనూ సెట్టింగులూ, కంట్రోల్ పేనల్, ప్రింటర్స్, మోడెమ్స్ వంటి అంశాల సెట్టింగులు, సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిన ఫాంట్లు, ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ సెట్టింగులు ఇలా అనేక అంశాలు రిజిస్ట్రీలో భద్రపరచబడుతున్నాయి. కేవలం ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అంశాలే కాకుండా మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకునే పేజ్‌మేకర్, ఫోటొషాప్, రియల్ ప్లేయర్, అక్రోబాట్ వంటి పలు థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు సైతం తమ అప్లికేషన్లకి సంబంధించిన అనేక కాన్ఫిగరేషన్ సెట్టింగులను రిజిస్ట్రీలో స్టోర్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రిజిస్ట్రీపై ఆవగాహన కలిగి ఉండి కొద్దిపాటి చిన్న చిన్న మార్పులను చెయ్యడం ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్వరూపాన్నీ, అప్లికేషన్ ప్రోగ్రాముల పనితీరునూ మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అసలు రిజిస్ట్రీ అంటే ఏమిటి, దానిని ఎలా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్‌కి పూనుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రీ ఎడిటింగ్‌లో పొరబాట్లు జరిగితే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి వంటి ప్రాధమికమైన అంశాలను చర్చించడంతోపాటు రిజిస్ట్రీలో చేయదగ్గ పలురకాల మార్పుల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించడం జరిగింది. అలాగే ప్రతీ కంప్యూటర్ యూజర్‌కి వివిధ సందర్భాల్లో ఉపకరించే పలు సూచనలను ఇదే పుస్తకంలో "స్మాల్ థింగ్స్" అనే విభాగం క్రింద చర్చించడం జరిగింది. కంప్యూటర్ ఉన్న ప్రతీ వినియోగదారుడికీ ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోండి.

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 9


ఏ సాఫ్ట్ వేర్ ఎలా పని చేస్తుంది?

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 3.1, 95 దశలో ఉన్నప్పుడు కేవలం చాలా పరిమితమైన సాఫ్ట్‌వేర్లు మాత్రమే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి లభించేవి . విండోస్ 98 ఆవిర్భావం నుండి విండోస్ ఆధారంగా పనిచేసే ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు వెల్లువలా విడుదలవడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రతీ దైనందిక అవసరానికీ ఒక సాఫ్ట్‌వేర్ లభిస్తోందీ. మీ రోజువారీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం దగ్గర నుండి మీ కంప్యూటర్‌ని వేగంగా పనిచేసేలా చేయడం వరకూ, ఇంటర్‌నెట్‌లో మీకు నచ్చిన సమాచారాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసి పెట్టడం మొదలుకుని మీ కంప్యూటర్లో ఎవరు ఏం చేస్తున్నారు అన్నది సీక్రెట్‌గా రికార్డ్ చేసి మీకు రిపోర్ట్ చూపించే సాఫ్ట్‌వేర్లు అయితే ఉన్నాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది చాలామందికి ఆవగాహన లేక వాటి ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలొ ఈ పుస్తకంలో వేర్వేరు సాఫ్ట్‌వేర్లు గురించి, అవి ఏ ప్రయోజనాన్ని అందిస్తాయి అన్న ఆంశం మొదలుకుని వాటిని ఓపెన్ చేసిన తర్వాత ఏయే మెనూలో, ఏయే డైలాగ్ బాక్స్‌లో ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకోవాలి, ఎలాంటి ఫలితాలు పొందడానికి ఎలాంటి సెట్టింగులు చేయాలి వంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. పిసి యూజర్లకి తరచుగా ఉపయోగపడే వేర్వేరు సాఫ్ట్‌వేర్ల పనితీరు గురించి ఇందులో వివరంగా చర్చించాం. అలాగే ఇదే పుస్తకంలో కంప్యూటర్ రంగంలో అనేక అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చర్చించిన అనేక వ్యాసాలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రతీ కంప్యూటర్ యూజర్‌కి ఏదో రూపేణా ఇవి ఉపయుక్తంగా ఉండగలవు.

No comments:

Post a Comment