Saturday, 29 September 2012

Hard Ware Parts పర్చేస్ గైడ్



RAM కొనబోతున్నట్లయితే...





* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.

* మాడ్యూళ్ళకి రెండు వైపులా ప్లాస్టిక్ కేసింగ్ ఉన్న RAMని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోకండి. ఈ తరహా మాడ్యుళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నాయి.ఓపెన్‌గా ఉన్న మాడ్యుళ్ళనే కొనుగోలు చేయండి.

* SDRM అయితే 133MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యుళ్ళని, DDR అయితే 400 MHz బస్‌స్పీడ్ ఉన్న మాడ్యూళ్ళనే ఎంచుకోవడం వల్ల సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఒక వేళ మీ మదర్ బోర్డ్ సపోర్ట్ చెయ్యకపోతేనే తక్కువ బస్‌స్పీడ్‌ని ఎంచుకోండి.

* ఆల్రెడీ మీ సిస్టమ్‌లో పాత RAM మాడ్యూల్ ఉన్నట్లైతే దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కొత్త రామ్ కొంటున్నట్లయితే పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.పాత రామ్‌ని స్టాండ్‌బైగా ప్రక్కన పెట్తుకుని కేవలం కొత్తదాన్ని మాత్రమే వాడండి.

స్పీకర్లని కొనుగోలు చేయబోతున్నట్లయితే..



పవర్ రేటింగ్ :
మార్కెట్లో లభిస్తున్న అన్ని స్పీకర్లూ పవర్ రేటింగ్‌ని PMPO ప్రమాణంలో పేర్కొంటున్నారు. అయితే PMPO అర్ధం లేని స్పెసిఫికేషన్! దీనికి బదులు స్పీకర్ సిస్టమ్ యొక్క RMS పవర్‌ని పరిగణనలోకి తీసుకోండి. సరౌండ్ సౌండ్ స్పీకర్ల విషయంలో కనీసం 40 Watts RMS పవర్ ఉన్న స్పీకర్లని ఎంచుకోవడం మంచిది. నిరంతరాయంగా పవర్‌ని హ్యాండిల్ చెయ్యగల సమర్ధత స్పీకర్‌లో ఎంత ఉందో తెలుసుకోవడానికి RMS మాత్రమే సరైన ప్రమాణం.


ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్: మీరు కొనే స్పీకర్ యొక్క ఫ్రీక్వెన్సీ 16 KHz కంటే ఎక్కువ లభించనపుడు క్లాసిక్ మ్యూజిక్ వినేటప్పుడు high treble లభించదు. అలాగే 50 KHZ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీని మీ స్పీకర్ సపోర్ట్ చెయ్యకపోతే డ్రమ్ సౌండ్లు, సినిమాల్లో భారీ పేలుళ్ళ శబ్దాలను ఎఫెక్టివ్‌గా వినడానికి వీలుపడదు. ఈ నేపధ్యంలో మీ స్పీకర్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్‌ని సపోర్ట్ చేసేదై ఉండాలి.


ఆడియో ఇన్‌పుట్: 2.1 స్టీరియో స్పీకర్ సిస్టమ్‌ని ఎంచుకుంటే కేవలం అనలాగ్ లెఫ్ట్, రైట్ చానెళ్ళు మాత్రమే లభిస్తాయి. అదే 4 చానెల్ సరౌండ్‌సౌండ్ సిస్టమ్ విషయంలో స్పీకర్ సిస్టమ్‌కి మొత్తం నాలుగు అనలాగ్ ఆడియో ఇన్‌పుట్‌లు ఉండేలా చూసుకోవాలి.అదే 5.1 స్పీకర్స్ విషయంలో మొత్తం ఆరు సపరేట్ RCA ఇన్‌పుట్‌లు స్పీకర్‌కి లభించేలా జాగ్రత్త వహించాలి.

29-09-2012


హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు



ప్రస్తుతం 250GB వరకూ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఇంటర్నల్ హార్డ్ డిస్క్‌లు లభిస్తున్నాయి. వీటి కొనుగోలు సమయంలో చాలా మంది ఏమాత్రం శ్రద్ధ చూపించరు. హార్డ్ డిస్క్‌లను కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ అంశాల గురించి క్రింద డీటైల్డ్‌గా వివరించడం జరిగింది.

స్టోరేజ్ కెపాసిటీ...

సాధారణ అవసరాలకు 40GB హార్డ్‌డిస్క్ సరిపోతుంది. అయితే 40 GBకీ 80 GBకీ రెండు మూడు వందలకు మించి పెద్దగా వృత్యాసం లేకపోవడం వల్ల 80GBని ఎంచుకోండి.క్యాసెట్ -టు-సిడి/డివిడి కన్వర్షన్ వంటి కార్యకలాపాలు చేసేవారు స్టోరేజ్ అవసరాలు ఎక్కువగా ఉండడంవల్ల కనీసం 120/160GB హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయండి. అంతకన్నా ఎక్కువ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్క్‌లు అవసరం అయితే ఇంటర్నల్ డిస్క్‌ల కన్నా USB పోర్ట్‌కి కనెక్ట్ చేసుకోగలిగే ఎక్స్‌టర్నల్ డిస్క్‌లను కొనండి. ప్రస్తుతం ఎక్స్‌టర్నల్ డిస్క్‌లు 400GB స్టోరేజ్ కెపాసిటీవి ఉన్నాయి.


రోటేషనల్ స్పీడ్..


దాదాపు అన్ని ATA హార్డ్‌డిస్క్‌లు 5400 లేదా 7200 rpm (నిమిషానికి తిరిగే చుట్లు) కలిగి ఉంటున్నాయి. వాస్తవానికి హార్డ్‌డిస్క్ యొక్క rpm ఎక్కువగా ఉంటే హార్డ్‌డిస్క్ నుండి డేటా వేగంగా వెలిగితీయబడుతుంది. అయితే rpm ఒక్కటే హార్డ్‌డిస్క్ యొక్క పనితీరుని ప్రభావితం చేయదు. డ్రైవ్ జామెంట్రీ, డేటాని రిట్రీవ్ చెయ్యడానికి డ్రైవ్ అనుసరించే పద్ధతి వంటి పలు అంశాలు డ్రైవ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం కనబరుస్తాయి. ఏదేమైనా 7200rpm ఉన్న హార్డ్‌డిస్క్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి.






ఇంటర్‌ఫేస్..


ATA/133 కోవకు చెందిన డ్రైవ్‌లను ఎంపిక చేసుకోండి. ఈ హార్డ్‌డిస్క్‌లు సెకనుకు 133 MB వరకూ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాయి. కొన్ని మదర్‌బోర్డ్‌లు ATA/133 ఇంటర్‌ఫేస్‌ని సపోర్ట్ చేయవు. అలాంటి బోర్డ్‌లలో కూడా ATA/133 హార్డ్‌డిస్క్‌లను అమర్చుకోవచ్చు. అయితే డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ మాత్రం సెకనుకు 100MB మాత్రమే లభిస్తుంది. అలాంటి పాతతరం బోర్డ్‌లలో ATA/133 హార్డ్‌డిస్క్‌ల నుండి సెకనుకు 133MB ట్రాన్స్‌ఫర్ రేట్‌ని సాధించాలంటే add-in కార్డ్ ఒకటి అమర్చుకోవాలి.


బఫర్...



ప్రాసెసర్ కొంత డేటాని అందించమని హార్డ్‌డిస్క్‌ని కోరిందనుకుందాం. హార్డ్‌డిస్క్ ముందుగా ప్రాసెసర్ ఒక్కసారికి ఎంత మొత్తంలో సమాచారాన్ని ప్రాసెస్ చెయ్యగలుగుతుందో అంతమేరకే పంపించి కోరిన మొత్తం డేటాలో కొంత మొత్తాన్ని ప్లాటర్లలోనుండీ తనవద్దే టెంపరరీ స్టోరేజ్ ఏరియాగా ఉండే "బఫర్" లో స్టోర్ చేసుకుంటుంది.ప్రాసెసర్ మొదట పంపించిన డేటాని ప్రాసెస్ చేయడం పూర్తయిన వెంటనే బఫర్‌లోని డేటాని ప్రాసెసర్‌కి పంపించి తిరిగి బఫర్‌ని నింపుకుంటుంది. హార్డ్‌డిస్క్‌ని కొనేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 8MB బఫర్ ఉన్న డ్రైవ్‌లను కొనుగోలు చేయండి.


కొన్న వెంటనే తనిఖీ చేయండి..


హార్డ్‌డిస్క్‌ని కొని పార్టీషన్లు చేసి ఫార్మేట్ చేసిన వెంటనే డిస్క్‌లోని అన్ని పార్టీషన్లని Surface Test ద్వారా తనిఖీ చేయండి. మేన్యుఫాక్చరింగ్ లోపాల వల్ల, డీలర్స్ ఎలా పడితే అలా పడేయడం వల్ల కొన్ని డిస్క్‌లలో ఆల్రెడీ బాడ్ సెక్టార్లు ఉండే అవకాశం ఉంది. బాడ్ సెక్టర్స్ కనిపిస్తే వెంటనే డిస్క్‌ని గట్టిగా అమర్చండి. స్క్రూలు టైట్ చేయకపోవడం వల్ల డిస్క్‌రీడింగ్ సమయంలో క్యాబినెట్ కదలడం వల్ల డిస్క్ సైతం కదిలినట్లయితే మీడియా ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశం ఉంది.

29-09-2012


టాబ్లెట్ పిసి ... ఏమి దాని కథ?




Tablet PC.. దీనిని చూసిన వారికన్నా ఈ పదం విన్నవారే ఎక్కువుంటారు. కంప్యూటర్ల వినియోగం ఊపందుకున్న తర్వాత Laptops,Desktop,Tablet PC, Pocket PC వంటి వేర్వేరు రూపాల్లో కంప్యూటర్ లక్షణాలు కలిగున్న డివైజ్‌లు ఆవిర్భవించాయి. అలాంటి వాటిలో Tablet PC ఒకటి. దాని పేరుకు తగ్గట్టే పేపర్ టాబ్లెట్ పరిమాణంలో ఉంటుందీ పిసి. టాబ్లెట్ పిసి స్క్రీన్‌పై నేరుగా డిజిటల్ పెన్ సహాయంతో పేపర్‌పై ఎలా రాస్తామో అదే విధంగా రాయవచ్చు. నోట్‌బుక్ కంప్యూటర్ల కన్నా మరింత సులువుగా ఒక చోటి నుండి మరో చోటికి తీసుకు వెళ్ళగలిగేలా ఈ టాబ్లెట్ పిసిలను రూపొందించారు. వీటి కోసం అనేక మౄదులాంత్రాలు(Software) లభిస్తున్నాయి.


ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడవచ్చు?



Tablet PC కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని రూపొందించింది. Windows XP Pro Tablet PC Edition పేరిట విడుదల చేయబడిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఒక్క పైసా చెల్లించనవసరం లేకుండా వాడుకోవచ్చు. అంటే ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ కోసం సర్వీస్ ప్యాక్2 కూడా విడుదల చేయబడింది. SP2ని Tablet PCలో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ సదుపాయాలు, ఇన్‌పుట్ ప్యానెల్ మరింత మెరుగుపరచబడ్డాయి.

టాబ్లెట్ పిసినే ఎందుకు ఎంచుకోవాలి?

పోర్టబులిటీ, ప్రయోజనాల రీత్యా టాబ్లెట్ పిసి లాప్‌టాప్‌లు,PDA డివైజ్‌ల స్థానంలో ప్రత్యామ్నాయంగా వాడబడుతోంది. కీబోర్డ్ వాడడానికి వీల్లేని మీటింగ్‌లు, క్లాసులు వంటి ప్రదేశాల్లో TableT PCని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇందులో మన రాసే రాతల్ని అక్షరాలుగా మార్చే హ్యాండ్ రికగ్నిషన్ టెక్నాలజీ లభిస్తోంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ప్రొసెసర్ తక్కువ వేడికి గురవుతుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అనేక థర్డ్‌పార్టీ అప్లికేషన్లు లభిస్తున్నాయి. టాబ్లెట్ పిసితో పాటు అందించబడే పెన్‌ని ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్‌లోని, అప్లికేషన్లలోని మెనూలను యాక్సెస్ చేయవచ్చు. బరువు పరంగా కూడా నోట్‌బుక్‌లతో పోలిస్తే మూడు పౌండ్లకు మించి టాబ్లెట్ పిసిలు బరువు ఉండవు. డిజిటల్ పెన్‌ని సురక్షితంగా పెట్టుకోవడానికి Tablet PCలో అమరిక ఉంటుంది. టాబ్లెత్ పిసిలో కీబోర్డ్లను సైతం కనెక్ట్ చేసుకోగలిగే మోడళ్ళూ ఉన్నాయి.






ప్రాసెసర్ వేగం

టాబ్లెట్ పిసిల కోసం ఇంటెల్ Centrino, Dothan వంటి ప్రొసెసర్లు వాడుకలో ఉన్నాయి. క్లాక్‌స్పీడ్ విషయంలో ఆ ప్రొసెసర్లు నోట్‌బుక్‌ల్లో వాడబడే మొబైల్ ప్రొసెసర్ల కన్నా వేగంగా పనిచేస్తాయి. ఉదా.1.66GHz క్లాక్ స్పీడ్ కలిగిన టాబ్లెట్ పిసి ప్రొసెసర్ 2.4GHz క్లాక్ స్పీడ్ కలిగిన Pentium4-M ప్రొసెసర్ కన్నా వేగంగా పని చేయగలుగుతుంది. తక్కువ ఓల్టేజ్‌పై రన్ అవడమే దీనిక్కారణం. Tablet PCలోని మెమరీని కూడా అవసరాన్ని బట్టి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక హార్డ్‌డిస్క్ విషయానికి వస్తే 60GB నుండి 120GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్కులు వీటిలో వాడబడుతున్నాయి. కొన్ని అధునాతన టాబ్లెట్ పిసిల్లో సిడిలను, డివిడిలను రీడ్ చేస్తూ సిడిలను రైట్ చేయగల CDRW -DVD డ్రైవ్‌లు సైతం లభిస్తున్నాయి. కొన్ని పిసిల్లో USB,Firewire పోర్టులు కూడ అమర్చబడి ఉంటున్నాయి. విడిగా లభించే సిడి,డివిడి డ్రైవ్‌లను సైతం టాబ్లెట్ పిసికి కనెక్ట్ చేసుకోవచ్చు. అదనపు మోనిటర్, ప్రొజెక్టర్‌లకు కనెక్ట్ చేసుకోగలిగే వెసులుబాటు కూడా పొందుపరచబడి ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ విషయానికి వస్తే 1024x768 మొదలుకుని 1400x1050 వరకూ స్క్రీన్ రిజల్యూషన్‌ని అందించే టాబ్లెట్ పిసి మోడళ్ళు మార్కెట్లో లభిస్తున్నాయి. ఒకసారి చార్జ్ చేసిన తర్వాత 4 నుండి 12 గంటల వరకు బ్యాటరీ నిలిచి ఉంటుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌పై మనం రెగ్యులర్‌గా ఉపయోగించుకునే MS-Office, Pagemaker,Photoshop వంటి అన్ని అప్లికేషన్లూ టాబ్లెట్ పిసిపై నిస్సందేహంగా రన్ అవుతాయి. మరిన్ని థర్డ్ పార్టీ మృదులాంత్రాలు(Software) సైతం ప్రత్యేకంగా లభిస్తున్నాయి.

29-09-2012


సౌండ్ కార్డ్ కొనాలనుకుంటున్నారా?



సిస్టం ద్వారా సౌండ్ అందించడానికి మదర్‌బోర్డ్‌పైనే సౌండ్‌చిప్ ఉన్నప్పటికీ మ్యూజిక్ ఇష్టపడేవారు, సౌండ్ ఎడిటింగ్ రంగంలో పనిచేసేవారు నాణ్యమైన సౌండ్‌కార్డ్‌ని అదనంగా కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. మ్యూజిక్ వినడానికి సౌండ్‌కార్డ్ కొంటున్నట్లయితే 5.1 Surround వంటి మల్టిపుల్ చానెళ్ళని అందించే సౌండ్‌కార్డ్‌ని ఎంచుకోండి. ఒకవేళ గేములు ఆడేవారు గేముల నుండి క్వాలిటీ సౌండ్‌ని కోరుకుంటున్నట్లయితే Direct Sound, EAX, A3D, 13DL2 వంటి స్టాండర్డ్‌లను సపోర్ట్ చేసే సౌండ్‌కార్డ్‌ని ఎంపిక చేసుకోవడం వల్ల త్రీడీ క్వాలిటీ పొందవచ్చు. సౌండ్‌కార్డ్‌లు PCI, USB, ISA ఇంటర్‌ఫేస్ కలిగినవి లభిస్తుంటాయి. PCI, USB కార్డ్‌లను కొనుగోలు చేయండి. అలాగే సౌండ్‌కార్డుతోపాటు అందించబడే డివైజ్‌డ్రైవర్లు Windows అన్ని వెర్షన్లతోపాటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని సపోర్ట్ చేసేవి ఉండేలా జాగ్రత్త వహించండి. లినక్స్‌కి ఆదరణ పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తులో సౌండ్‌కార్డ్ డ్రైవర్లు లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సౌండ్‌కార్డ్ ద్వారా సిగ్నల్స్ నష్టపోకుండా ఉండాలంటే గోల్డ్ ప్లేటేడ్ కనెక్టరులు కలిగిన సౌండ్‌కార్డ్‌ని కొద్దిగా ధర ఎక్కువైనా ఎంపిక చేసుకోండి.

No comments:

Post a Comment