సంస్కృతి
అమ్మా...నాన్న..ఆత్మవిశ్వాసం
- లాలపోసి జోలపాడి అన్నీతామై పెంచిన అమ్మానాన్నలపై అశ్రద్ధ ఎందుకు?
-
-పిడికెడు ప్రేమను తల్లిదండ్రులకు పంచలేని దౌర్భాగ్యం మన సంస్కృతా?
-
-జన్మనిచ్చినవారిపై ఆజన్మ విరోధానికి కారణం ఏమిటి?
-
-ఆత్మవిశ్వాస లోపం అంత పనిచేస్తుందా?
-
-టివి, ఫ్రిజ్ ఇంట్లో....అమ్మానాన్న ఆరుబయట?
మాతృదేవోభవ , పితృదేవోభవ, ఆచార్య
దేవోభవ, అతిథి దేవోభవ.....మన సంస్కృతికి అద్దం పట్టే వాఖ్యలు ఇవి. ఇవే
కాదు, మన గురించి ఇంతకంటే ఘనంగా చెప్పుకునే ఆచారాలు, సంప్రదాయాలు ఎన్నో
ఉన్నాయి. అయితే వీటి మనుగడ ఎంతవరకు నిలబడుతుంది? అనేది ఇప్పుడు మనముందున్న
పెద్ద ప్రశ్న. అందరూ ఉన్నా ఎవరూ ఆదరించక రోడ్డున పడుతున్న వృద్ధులైన
తల్లిదండ్రుల గురించి మనం తరచుగా చదువుతున్నాం, వింటున్నాం.. నిజంగా అమ్మా
నాన్నలకు ఒక ముద్ద అన్నం పెట్టలేకే ఇలా పిల్లలు వారిని వదిలేస్తున్నారా?
గొప్ప సంస్కృతికి వారసులమని చెప్పుకునే మనం ఇంతటి హీనత్వానికి పడిపోవటం
వెనుక కారణాలేంటి?-
వివేకానందుడు పదేపదే భారతజాతిని ఆత్మవిశ్వాసంతో మెలగండి- అంటూ ఉద్భోదించాడు. నిస్సత్తువగా, నిర్జీవంగా, ఉత్సాహం లేకుండా నీరుగారిన మనసులతో జీవితాలను ముందుకు తోయకండి- అంటూ ఆయన ప్రభంజనంలా భారత ప్రజలను మేల్కొలిపే ప్రయత్నం చేశాడు. ఆత్మవిశ్వాసంతో మనలేకపోవటం అనేది ఆత్మహత్యా సదృశంగా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని జీవన్మరణ సమస్యగా భావించాడు. అయినా మన యువత (అప్పటి, ఇప్పటి)లో ఆత్మవిశ్వాసం ఎంతవరకు పెరిగింది- అంటే స్పష్టంగా సమాధానం చెప్పలేము- ఇంతకీ తల్లిదండ్రులను చూడలేకపోవడానికీ, ఆత్మవిశ్వాసానికి ఏమిటి సంబంధం అంటారా? చాలా ఉంది.
ముందు ఆత్మవిశ్వాసం అంటే అర్థం చెప్పుకుందాం. మనం చేస్తున్న పనుల్లో నమ్మకం, మన పట్ల మనకు విశ్వాసం, ప్రేమ. ఇవన్నీ కలిపితేనే ఆత్మవిశ్వాసం అవుతుంది. ఇన్ని రావాలంటే ముందు మనకు లభించిన ఈ జన్మని మనం గౌరవించాలి. మనం ఎక్కడ, ఎలా, ఎవరికి పుట్టినా...అంటే మతం, కుల గోత్రాలు, డబ్బు- వీటన్నింటితో సంబంధం లేకుండా మన జన్మని మనం గౌరవించుకోవాలి. దక్షిణాఫ్రికాలో మహాత్ముడు చూపించింది ఇలాంటి ఆత్మగౌరవాన్నే. ఒక్క వ్యక్తి ఆత్మగౌరవం ఎంతటి ఘనకార్యాన్ని సాధించిందో మనకు తెలుసు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం- అమ్మానాన్నల పట్ల ఇష్టం, అయిష్టాలు ఈ ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్నాయి. ఒక పల్లెటూరి వ్యక్తి ఎన్నో బాధలు పడి చివరికి మంచి ఉద్యోగం సంపాదించి నగరంలో చక్కగా సెటిలయ్యాడని అనుకుందాం. అప్పుడు అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇంత శ్రమకోర్చి ఆ స్థాయికి ఎదిగినందుకు తనపై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉండవచ్చు. తనకు అంతమంచి శక్తిని, తెలివితేటలను ఇచ్చినందుకు తల్లిదండ్రులమీద విపరీతమైన ప్రేమ, గౌరవం కలగవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఆనందంగా ఉండటమే కాకుండా, తనకోసం అప్పటివరకు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్న తల్లిదండ్రులను కూడా ఆనందంగా ఉంచాలి అనుకుంటాడు. ఆ వ్యక్తికి అప్పుడు అమ్మానాన్నలమీద ప్రేమ మరింతగా పెరుగుతుంది.
అలాకాకుండా అదే వ్యక్తి- ఉన్నతస్థితికి వచ్చాక తను పడిన కష్టాలను పదేపదే తలచుకుంటూ ఇన్ని బాధలకు ఈ అమ్మానాన్నలే కారణం అనుకుంటే అతనికి తనమీద తనకూ ప్రేమ ఉండదు- అమ్మానాన్నలనూ అభిమానించలేడు.
ఈమధ్య ఒక ఆధ్యాత్మికసంస్థ- తమ దగ్గరకు వచ్చిన వ్యక్తులకు మొట్టమొదటి మాటగా- 'అమ్మానాన్నలను పూజించండి, అన్ని సమస్యలు తీరతాయి' అని చెప్పటం మొదలుపెట్టింది. ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు. ఇందులో ఏ మహత్మ్యమూ లేదు. వాస్తవం ఉంది అంతే!
ఏదో ఒక సమస్యలో ఉండి తన వద్దకు వచ్చినవారి సమస్యలను తీర్చడానికి వారు ఎంచుకున్న మార్గం ఇది. ఎవరినైనా సమస్యలు ఎపుడు బాధిస్తాయి? మనకంటే అవి శక్తివంతంగా ఉన్నపుడు మనం సమస్యలను చూసి భయపడతాం. అంటే అపుడు మనం అల్పులం అన్నమాట. సరిపడా ఆత్మవిశ్వాసం లేదు. ఈ భావాల విషవలయమే మనిషిని బాధపెడుతుంది. దీంట్లోంచి బయటపడి- కష్టసుఖాలు సహజమే- వాటిని ఎదుర్కొనే శక్తి నాకుంది- అనే ధైర్యం మాత్రమే అపుడు కావాల్సిన మందు.
దానికి, అమ్మానాన్నల సేవకు ఏమిటి సంబంధం? మానసికశక్తి తీవ్రంగా లోపించినపుడు మాత్రమే మనం తల్లిదండ్రులను ప్రేమించలేని స్థితిలో ఉంటాము. మన రూపం, తెలివితేటలు, డబ్బు, సంపాదన, హోదా, భార్య లేదా భర్త అందం తెలివితేటలు, పిల్లల చదువులు, ఉద్యోగం....ఇన్ని విషయాల్లో తృప్తిగా ఉంటే గానీ మనకు సంతోషం రాదు. ఆ సంతోషం లోపించినపుడు, మనమీద మనకు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నపుడు ముందుగా మనకు కోపం వచ్చేది తల్లిదండ్రుల మీదే. ఎందుకంటే ఈ జన్మకి వారు మూలం కాబట్టి, వారు మనకి ఏదో తక్కువ చేయటం వల్లనే మన ఖర్మ ఇలా కాలింది- అనే ఫీలింగ్ లోలోపల ఉండటం వల్లనే - మనమీద మనకున్న కోపం వారిమీదకు కూడా మళ్లుతుంది.
మీరు ఎక్కడైనా గమనించండి. ఆత్మవిశ్వాసం బాగా తక్కువగా ఉన్నవాడే ఇతరులతో కలివిడిగా ఉండలేడు. ఇంట్లో భార్యాపిల్లలను బాధిస్తాడు. ఆత్మవిశ్వాసం మరీ అధమంగా ఉంటే అలాంటి వారు తల్లిదండ్రులను అసలు భరించలేరు. అలాగే తల్లిదండ్రులను ప్రేమించేవారు తమపట్ల తాము ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు.
అయితే ఈ రెండు విషయాలు మనకు ఒక సర్కిల్లా కనిపించవచ్చు. అమ్మానాన్నలను ప్రేమించగలిగితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదా ఆత్మవిశ్వాసం పెరిగితే కానీ అమ్మానాన్నలను ప్రేమించలేము. ఇవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న విషయాలు.
అందుకే వివేకానందుకు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని అంతగా తపించాడు.
అమ్మానాన్నలపట్ల అయిష్టత పెరుగుతుంటే, వారిపట్ల చిరాకు కోపం వస్తుంటే తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
-మనం వారినుంచే వచ్చాం. మనం నివసిస్తున్న ఇంటిపైనే ఎంతోమమకారం చూపుతాం. అలాంటిది మన జన్మకి మూలమైన మనుషులు విలువ తక్కువవారు ఎలా అవుతారు?
-అమ్మానాన్న అనవసరమైన విషయాలుగా భావిస్తున్నామంటే మన చిన్నతనం జ్ఞాపకాలో, పేదరికమో మనసుకి కలిగిన గాయాలో మనల్ని బాధిస్తున్నాయని అర్థం.
-ఇప్పుడు మనకి కావాల్సిన జీవితం దొరికి ఉండకపోవచ్చు. దానికి నూరుశాతం తల్లిదండ్రులే కారణం కాదు. వాళ్లు మామూలు మనుషులు. వారికీ ఎన్నో పరిమితులున్నాయి...బలహీనతలున్నాయి. వాటిని పట్టించుకుంటే మనల్ని మనం కించపరచుకున్నట్టే.
-తల్లిదండ్రులపై పెంచుకున్న ద్వేషం దీర్ఘకాలంలో చాలా చెడుఫలితాలను ఇస్తుంది.
-మన బాధ్యతను విస్మరిస్తున్నామనే విషయం పైకి మర్చిపోయినా అంతరంగపు లోతుల్లో ని క్షిప్తమై ఉంటుంది. దాన్నించి తప్పించుకోలేము.
- వి. దుర్గాంబ

No comments:
Post a Comment