ప్రస్తుతం 250GB వరకూ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఇంటర్నల్ హార్డ్
డిస్క్‌లు లభిస్తున్నాయి. వీటి కొనుగోలు సమయంలో చాలా మంది ఏమాత్రం శ్రద్ధ
చూపించరు. హార్డ్ డిస్క్‌లను కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన వివిధ
అంశాల గురించి క్రింద డీటైల్డ్‌గా వివరించడం జరిగింది. స్టోరేజ్ కెపాసిటీ…
సాధారణ అవసరాలకు 40GB హార్డ్‌డిస్క్ సరిపోతుంది. అయితే 40 GBకీ 80 GBకీ
రెండు మూడు వందలకు మించి పెద్దగా వృత్యాసం లేకపోవడం వల్ల 80GBని
ఎంచుకోండి.క్యాసెట్ -టు-సిడి/డివిడి కన్వర్షన్ వంటి కార్యకలాపాలు చేసేవారు
స్టోరేజ్ అవసరాలు ఎక్కువగా ఉండడంవల్ల కనీసం 120/160GB హార్డ్ డిస్క్‌లను
కొనుగోలు చేయండి. అంతకన్నా ఎక్కువ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్క్‌లు అవసరం
అయితే ఇంటర్నల్ డిస్క్‌ల కన్నా USB పోర్ట్‌కి కనెక్ట్ చేసుకోగలిగే
ఎక్స్‌టర్నల్ డిస్క్‌లను కొనండి. ప్రస్తుతం ఎక్స్‌టర్నల్ డిస్క్‌లు 400GB
స్టోరేజ్ కెపాసిటీవి ఉన్నాయి.
రోటేషనల్ స్పీడ్..
దాదాపు అన్ని ATA హార్డ్‌డిస్క్‌లు 5400 లేదా 7200 rpm (నిమిషానికి తిరిగే
చుట్లు) కలిగి ఉంటున్నాయి. వాస్తవానికి హార్డ్‌డిస్క్ యొక్క rpm ఎక్కువగా
ఉంటే హార్డ్‌డిస్క్ నుండి డేటా వేగంగా వెలిగితీయబడుతుంది. అయితే rpm
ఒక్కటే హార్డ్‌డిస్క్ యొక్క పనితీరుని ప్రభావితం చేయదు. డ్రైవ్ జామెంట్రీ,
డేటాని రిట్రీవ్ చెయ్యడానికి డ్రైవ్ అనుసరించే పద్ధతి వంటి పలు అంశాలు
డ్రైవ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం కనబరుస్తాయి. ఏదేమైనా 7200rpm ఉన్న
హార్డ్‌డిస్క్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. ఇంటర్‌ఫేస్..
ATA/133 కోవకు చెందిన డ్రైవ్‌లను ఎంపిక చేసుకోండి. ఈ హార్డ్‌డిస్క్‌లు
సెకనుకు 133 MB వరకూ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతాయి. కొన్ని
మదర్‌బోర్డ్‌లు ATA/133 ఇంటర్‌ఫేస్‌ని సపోర్ట్ చేయవు. అలాంటి బోర్డ్‌లలో
కూడా ATA/133 హార్డ్‌డిస్క్‌లను అమర్చుకోవచ్చు. అయితే డేటా ట్రాన్స్‌ఫర్
రేట్ మాత్రం సెకనుకు 100MB మాత్రమే లభిస్తుంది. అలాంటి పాతతరం బోర్డ్‌లలో
ATA/133 హార్డ్‌డిస్క్‌ల నుండి సెకనుకు 133MB ట్రాన్స్‌ఫర్ రేట్‌ని
సాధించాలంటే add-in కార్డ్ ఒకటి అమర్చుకోవాలి.
బఫర్…
ప్రాసెసర్ కొంత డేటాని అందించమని హార్డ్‌డిస్క్‌ని కోరిందనుకుందాం.
హార్డ్‌డిస్క్ ముందుగా ప్రాసెసర్ ఒక్కసారికి ఎంత మొత్తంలో సమాచారాన్ని
ప్రాసెస్ చెయ్యగలుగుతుందో అంతమేరకే పంపించి కోరిన మొత్తం డేటాలో కొంత
మొత్తాన్ని ప్లాటర్లలోనుండీ తనవద్దే టెంపరరీ స్టోరేజ్ ఏరియాగా ఉండే “బఫర్”
లో స్టోర్ చేసుకుంటుంది.ప్రాసెసర్ మొదట పంపించిన డేటాని ప్రాసెస్ చేయడం
పూర్తయిన వెంటనే బఫర్‌లోని డేటాని ప్రాసెసర్‌కి పంపించి తిరిగి బఫర్‌ని
నింపుకుంటుంది. హార్డ్‌డిస్క్‌ని కొనేటప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో
8MB బఫర్ ఉన్న డ్రైవ్‌లను కొనుగోలు చేయండి. కొన్న వెంటనే తనిఖీ చేయండి..
హార్డ్‌డిస్క్‌ని కొని పార్టీషన్లు చేసి ఫార్మేట్ చేసిన వెంటనే
డిస్క్‌లోని అన్ని పార్టీషన్లని Surface Test ద్వారా తనిఖీ చేయండి.
మేన్యుఫాక్చరింగ్ లోపాల వల్ల, డీలర్స్ ఎలా పడితే అలా పడేయడం వల్ల కొన్ని
డిస్క్‌లలో ఆల్రెడీ బాడ్ సెక్టార్లు ఉండే అవకాశం ఉంది. బాడ్ సెక్టర్స్
కనిపిస్తే వెంటనే డిస్క్‌ని గట్టిగా అమర్చండి. స్క్రూలు టైట్ చేయకపోవడం
వల్ల డిస్క్‌రీడింగ్ సమయంలో క్యాబినెట్ కదలడం వల్ల డిస్క్ సైతం
కదిలినట్లయితే మీడియా ప్రాబ్లెమ్స్ వచ్చే అవకాశం ఉంది.